ప్రొఫెసర్ హనిబాబు అరెస్టు అక్రమం - పౌరహక్కుల సంఘం


Was scared they'd come back to take my books: DU professor Hany ...

భీమా కోరేగావ్‌ కేసులో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హని బాబు ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం ఈ నెల 23 న ముంబాయ్ లోని NIA ఆఫీసుకు పిలిచిన ఆయన్ని ఇవాళ అరెస్ట్ చేసిన్నట్లు మీడియాకు ప్రకటించారు.

ప్రొఫెసర్ హానిబాబు ఢీల్లీ యూనివర్సిటీ లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ లో అధ్యాపకుడుగా పనిచేస్తున్నాడు.  భీమా కోరేగావ్ కేసులో సంబంధాలు ఉన్నాయనే సాకుతో 2019 అక్టోబర్ లో ప్రొఫెసర్ హాని బాబు ఇంటిపై దాడిచేసి సోదాలు నిర్వహించి పుస్తకాలను, తనకు సంబంధించిన విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను పట్టుకెళ్లారు. జూలై 15 వ తేదీలోపు ముంబై లోని NIA ముందు హాజరు కావాలని 11వ తేదీన సమన్స్ పంపించారు. ముంబైలో కరోనా విలయతాండవం చేస్తున్నా  నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు మాత్రం హానిబాబు ను హాజరు కావాలసిందే అంటూ ఒత్తిడి ఆయన ఢిల్లీ నుండి వెళ్ళి విచారణ కోసం హాజరయ్యాడు.

ఈ నెల 23 నుండి ప్రొఫెసర్ హానిబాబును విచారణ నిమిత్తం తమ అదుపులో ఉంచుకున్న పోలీసులు ఇవాళ అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. హానిబాబు నక్సల్స్ కార్యకలపాలను, మావోయిస్టు సిద్దాంతాన్ని వ్యాప్తి చేస్తున్నాడనే ఆరోపనతో అరెస్టు చూపిస్తున్నారు. ప్రొఫెసర్ హానిబాబు అరెస్టు తో ఇప్పటి వరకు బీమా కోరేగావ్ కేసులో మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. అయితే ఇదే కేసులో హనిబాబు తో పాటు విరసం కార్యవర్గ సభ్యులు, జర్నలిస్ట్  Kran Ti ని కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ముంబై కి పిలిచారు. 24వ తేదీ నుండి తమ అదుపులో ఉంచుకొని విచారణ పేరుతో  ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

మహారాష్ట్రలోని కోరెగావ్ భీమాలో 2018 హింసాకాండపై దర్యాప్తుకు సంబంధించి Delhi ిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 54 ఏళ్ల అసోసియేట్ ప్రొఫెసర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం అరెస్టు చేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్‌లో నివసిస్తున్న హనీ బాబు ముసలియర్‌వెట్టిల్ తారైల్ ఇంగ్లీష్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రతినిధి తెలిపారు. అనేక మంది ప్రముఖ కార్యకర్తలు, పండితులు మరియు న్యాయవాదులు విచారణ కోసం ఎదురుచూస్తున్నప్పుడు రెండేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన ఈ కేసులో ఇది 12 వ అరెస్టు. ఈ కేసు 2017 డిసెంబర్ 31 న పూణేలో జరిగిన సంఘటనకు సంబంధించినది, దాని తరువాత మహారాష్ట్రలో హింస మరియు కాల్పులు జరిగాయి, ఒకరు మరణించారు.

ఎల్గర్ పరిషత్ సమావేశంలో కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రసంగాలు, రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని పరిశోధకులు ఆరోపించారు, ఇది మరుసటి రోజు హింసను ప్రేరేపించింది.
చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం కింద నిషేధించబడిన సంస్థ అయిన సిపిఐ (మావోయిస్ట్)  సీనియర్ నాయకులు ఎల్గర్ పరిషత్ ఈవెంట్ నిర్వాహకులతో పాటు అరెస్టు చేసిన నిందితులతో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో ఎన్ఐఏ తెలిపింది. మావోయిస్ట్, నక్సల్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించిన దానికి ఈ కేసును పెట్టినట్టు ఎన్ఐఎ తెలిపింది
ఈ కేసులో పూణే పోలీసులు వరుసగా నవంబర్ 15, 2018 మరియు ఫిబ్రవరి 21, 2019 న చార్జిషీట్ మరియు అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరి 24 న ఎన్‌ఐఏ ఈ కేసు దర్యాప్తును చేపట్టి కార్యకర్తలు ఆనంద్ టెల్తుంబే, గౌతమ్ నవలాఖలను ఏప్రిల్ 14 న అరెస్టు చేసినట్లు  తెలిపారు.
దర్యాప్తులో, హనీ బాబు నక్సల్ కార్యకలాపాలు మరియు మావోయిస్ట్ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నాడని మరియు అరెస్టు చేసిన ఇతర నిందితులతో "సహ కుట్రదారుడు" అని NIA తెలిపింది.
బుధవారం ఆయనను ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టుకు హాజరుపరుస్తారని, అతన్ని కస్టడీలో ప్రశ్నించడానికి అతని అధికారులు అనుమతి అడుగుతారని ఎన్‌ఐఏ తెలిపింది.
పౌరహక్కుల సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి.


 మానవ హక్కుల కార్యకర్తలపై   NIA చేస్తున్న కుటిల దాడులను  ఆపివేయాలి! * * రాజకీయ ఖైదీలందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలి.
భీమా కోరేగావ్-ఎల్గార్ పరిషత్ కేసులో ప్రొఫెసర్ హనీ బాబును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ముంబయిలో  అరెస్టు చేయడాన్నిరాజ్య అణచివేత వ్యతిరేక కేంపెయిన్ (సిఎఎస్ఆర్) ఖండిస్తూంది.
ఢిల్లీ, ముంబైలలో COVID-19 కేసులు పెరుగుతున్నప్పటికీ, NIA ఢిల్లీ విశ్వవిద్యాలయ ఇంగ్లీష్ విభాగం  ప్రొఫెసర్ బాబును సాక్షిగా రమ్మని పిలవడంతో, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడే అవకాశాన్ని తిరస్కరించడంతో ముంబైకి వెళ్ళక తప్పలేదు. 2020 జూలై 24 నుండి ఎన్ఐఏతో సహకరిస్తున్న ప్రొఫెసర్ బాబుకు, ప్రశ్నించడం అంటే కేవలం ఇతరులపై  తప్పుడు సాక్ష్యాలను ఇవ్వమనీ, తాను మావోయిస్టుల కోసం పని చేస్తున్నాననే అబద్ధపు ఆరోపణలను ఒప్పించడానికి చేసే ప్రయత్నం మాత్రమేనని త్వరలోనే స్పష్టమైంది. 
ప్రొఫెసర్ బాబు ఈ  అసంబద్ధమైన అబద్ధాలను తీవ్రంగానూ, ఖచ్చితంగానూ నిరాకరించారు. ఈ కారణంగానే, విచారణ పేరిట ఐదు రోజుల నిరంతర వేధింపుల తరువాత, తన కార్యాలయంలోనే ఉన్నప్పటికీ, అతన్ని నిందితుడిగా మార్చి, అధికారికంగా అరెస్టు చేసి, విచారణ కోసం ఎన్‌ఐఏ తిరిగి కస్టడీకి యివ్వాలని కోరడం ఎంతో అసంబద్ధమైన విషయం. 2019 సెప్టెంబర్‌లో ప్రొఫెసర్ బాబు ఇంటిపైని మహారాష్ట్ర పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా దాడి చేశారు. అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, పుస్తకాలను స్వాధీనం చేసుకుని, జప్తు చేసిన పరికరాల హాష్ విలువ ఇవ్వలేదు. ఈ నియమ ఉల్లంఘన వల్ల స్వాధీనం చేసుకున్న పరికరాలను ట్యాంపరింగ్ చేసే అవకాశం వుంటుంది.
జప్తు చేసిన పరికరాల హాష్ విలువను యివ్వడానికి దర్యాప్తు సంస్థలు పదేపదే నిరాకరించాయి. ఈ విలువల వల్ల  పరికరంలో జరిగిన కార్యకలాపాల సమయాన్ని తెలుసుకోవచ్చు. అయితే వాస్తవానికి, పరికరాలను జప్తు చేయడం, వాటిలో కల్పిత సాక్ష్యాలను పెట్టడం, ఆ ప్రాతిపదికన మీడియా ట్రయల్ నిర్వహించడం వంటి విధానాలు అమలుచేస్తున్నారని స్పష్టమైపోయింది. అయినా దురదృష్టవశాత్తు, కోర్టులు కూడా ఈ అక్రమాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. 
ఇది రాజ్యాన్ని ప్రశ్నిస్తున్న, అట్టడుగు, అణగారిన కులాలు, సముదాయాలు, వర్గాల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తులను క్రూర వేధింపులకు గురిచేయడం, బెదిరించడం తప్ప మరొకటి కాదు. ప్రొఫెసర్ బాబు కుల వ్యతిరేక కార్యకర్త, విశ్వవిద్యాలయం లోపలా, బయటా కూడా సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్నారు. డాక్టర్ జి.ఎన్. సాయిబాబా రక్షణ- విడుదల కమిటీ, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సిఆర్‌పిపి) లో కూడా పనిచేస్తున్నారు. ఉన్నత విద్యాసంస్థలలో కుల వివక్ష, మరణశిక్షలకు వ్యతిరేకంగానూ, రాజకీయ ఖైదీల హక్కుల కోసమూ ఆయన మాట్లాడుతున్నారు.
రాజ్య ప్రజా వ్యతిరేక విధానాల గురించి మాట్లాడుతున్న కార్యకర్తలను నిర్బంధించి, నిశ్శబ్దం చేయటానికి భీమా కోరెగావ్ వద్ద జరిగిన హింసాకాండ తరువాత చేస్తున్న కుట్ర అని హనీ బాబును ఎన్ఐఏ అరెస్ట్ చేయడంలో  తెలుస్తోంది. హింసకు నిజమైన కారకులు, ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలు ఉన్న సంభాజీ భిడే, మిలింద్ ఎక్బోటేల నుండి దృష్టిని మళ్ళించడానికి కూడా ఇది జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్య, ప్రగతిశీల విద్యావేత్తలు, కార్యకర్తలు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కవులు, కార్మిక సంఘాల్లో భయాన్ని వ్యాప్తి చేయడానికి ఉద్దేశించబడింది. ఈ అరెస్ట్ తరువాత ప్రొఫెసర్ బాబును అర్బన్ నక్సల్ గా ముద్ర వేసే అవకాశం వున్నదని వూహించవచ్చు. కల్పిత సాక్ష్యాలను సృష్టించడం తప్ప ఈ ఆరోపణలు నిరూపించలేనివిగా, ఆధారాలు లేనివిగా ఉంటాయి, ఇవి ఎలాగూ న్యాయమైన విచారణ పరిశీలనలో నిలబడవు.
ఏదేమైనా, అనేక సందర్భాల్లో చూసినట్లుగా, అపరాధాన్ని నిరూపించడం కాదు, రాజ్య ప్రాయోజిత మీడియా వేటాడుతూ రాక్షసంగా చిత్రిస్తుంటే, సుదీర్ఘకాల ఒంటరితనం నిర్బంధాల ద్వారా శిక్షించడమే ఇందులోని ఉద్దేశ్యం. విప్లవకవి వరవరరావు, డాక్టర్ జి.ఎన్. సాయిబాబా, ప్రొఫెసర్ ఆనంద్ తేటెల్తుంబ్డే తదితరుల విషయంలో చూసినట్లుగా లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తుల జీవన హక్కును పరిగణనలోకి తీసుకోకుండా ఈ వ్యూహాలను అమలు చేస్తున్నారు.
మన సమాజంలోని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తులన్నీ  ఏకమై ప్రొఫెసర్ హనీ బాబు అరెస్టును, మరింకెంతోమంది కార్యకర్తలు, కళాకారులు, జర్నలిస్టులపై జరుగుతున్న అరెస్టు బెదిరింపులను ఖండించాలని పౌర హక్కుల సంఘం.
 డిమాండ్స్:
1. కల్పిత భీమా కోరేగావ్ కేసులో అభియోగాలు మోపిన కార్యకర్తలు, మేధావులందరినీ వెంటనే విడుదల చేయాలి!
2. CAA, NRC, NPR వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చేయాలి!
3. రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి! రియు జైళ్ళలో రద్దీని తగ్గించాలి! 
4. UAPA, PSA, NSA సహా అన్ని ఇతర కఠినమైన చట్టాలను రద్దు చేయాలి!


1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షులు,
పౌరహక్కుల సంఘం  తెలంగాణ.
2.N. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శి,పౌరహక్కుల సంఘం  తెలంగాణ.

పౌర హక్కుల సంఘం,తెలంగాణ.
జులై 28, 2020....
హైదరాబాద్...

Comments