కరోనా వైద్యం ఉచితంగా చేయించాలి....

Coronavirus numbers in India are low — but so is the testing rate ...

కరోనా వైద్యం ప్రజలకు ప్రభుత్వమే ఉచితంగా చేయించాలి.
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి.
కార్పొరేట్ ఆస్పత్రిలను జాతీయం చేయాలి
- పౌర హక్కుల సంఘం తెలంగాణ....

కరోనా విజృంభించడంతో రాష్ట్రంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.కరోనా వ్యాప్తి వలన ప్రజలు విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయితే 18 లక్షల రూపాయల వరకు బిల్లులు వేసి దోపిడీ చేస్తున్నారు. లక్షల రూపాయల వైద్యం చేసిన ప్రాణాలు పోతున్నాయి.కార్పొరేట్ ఆస్పత్రి యజమానులు శవాలు ఇవ్వకుండా అపి,బిల్లులు చెల్లిస్తేనే శవాలు ఇస్తున్నారు.ప్రజలు ఈ విపత్కర కాలంలో ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనావైద్యం కోసం అప్పులు చేసి జాయిన్ అవుతున్నారు. అన్ని లక్షల రూపాయల భరించలేక వైద్యం దొరకక పిట్టల్లా ప్రాణాలు కోల్పోతున్నారు.ఇటువంటి అమానవీయ వైఖరితో, దుర్మార్గంగా కార్పొరేట్ ఆస్పత్రి యజమానులు పీడిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తూ దోపిడీకి సహకరిస్తుంది. భయంతో కుటుంబీకులు కరోనా శవాలను ఆస్పత్రి నుండి తీసుకపోలేక పోవడంతో గుట్టలుగా  కరోనా శవాలు రోజుల తరబడి అమానవీయంగా ఆస్పత్రిలముందు పడిగాపులు పడుతున్నాయి అంత్యక్రియలు చేసేవారులేక.

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం రోమ్ నగరం తగలబడుతుంటే రాజు పిడేలు వాహించుకుంటు ఉండడం లాగా పాలన లేమికి నిదర్శనం.ఇతర దేశాల్లో ప్రైవేట్ రంగంలోని ఆస్పత్రి లను అక్కడి ప్రభుత్వాలు, ఆస్పత్రిలను తమ ఆధీనంలోకి తీసుకొని ప్రజలకు ఉచితంగా కరోనా వైద్యం అందిస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి,కరోనా ను ఆరోగ్యశ్రీ లో  చేర్పించి రోజుకు 70 వేలవరకు కరోనా టెస్టులు చేయిస్తున్నాడు.ఇక్కడ తెలంగాణ లో తక్కువ టెస్టులు చేయించుతూ, మరణాలపై తక్కువ సమాచారం ఇస్తున్నారు. కరోనా పై తెలంగాణ ప్రభుత్వం మాటను నమ్మాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైద్యం ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలిసిందే,వారి జీవించే హక్కుకు ప్రభుత్వానిదే బాధ్యత.కార్పొరేట్ ఆస్పత్రిలను జాతీయం చేయాలి.

 ఇక్కడ తెలంగాణ లో కరోనాను కూడా ఆరోగ్యశ్రీ లోకి తీసుకుని ప్రజలందరికీ ఉచితంగా  కరోనా వైద్యం ఇవ్వాలి. తక్షణమే KCR తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి,ప్రజలందరికీ ఉచితంగా కరోనా టెస్టులు చేయించి మెరుగైన వైద్యం అందించి,ఈ భయానక స్థితి నుంచి ప్రజలకు  ధైర్యాన్ని కల్పించి, జీవించే హక్కును హరించి వేయకుండా చిత్తశుద్ధితో వ్యవహరించాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ, ముఖ్యమంత్రి  KCR కు మరొక్కసారి డిమాండ్ చేస్తుంది.

1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షులు,
పౌరహక్కుల సంఘం  తెలంగాణ.

2.N. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శి,పౌరహక్కుల సంఘం  తెలంగాణ.

3.మాదన కుమారస్వామి ,సహాయకార్యదర్శి. పౌరహక్కుల సంఘం  తెలంగాణ.

గురువారం,జులై 30, 2020....
హైదరాబాద్.....
పౌర హక్కుల సంఘం,తెలంగాణ.

Comments