మహిళలకు మిలటరీలో శాశ్వత కమిషన్ అర్హత ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు ఇచ్చిన ఐదు నెలల తరువాత, కేంద్రం ఎట్టకేలకు ఈ ఉత్తర్వును అంగీకరించింది. ఈ కేసు ఆర్మీ ఎయిర్ డిఫెన్సు, సిగ్నల్సు, ఇంజనీర్లు, సర్వీస్, ఇంటెలిజెన్సు వంటి పది విభాగాలలో పనిచేస్తున్న మహిళలు ఈ శాశ్వత కమీషన్ కిందకి వస్తారు. సమాన పనికి సమాన హాదా విషయంలో ఇప్పటికీ మహిళలు డిఫెన్సు రంగంలో విజయం సాధించారు. మిలిటరీలో లింగ సమానత్వానికి కొనసాగిన ప్రయాణంలో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇప్పటివరకు భారత సైన్యంలో మహిళలు 3.89%, నావికాదళంలో 6.7%, వైమానిక దళంలో 13.2% మాత్రమే ఉన్నారు.
ప్రత్యక్ష పోరాట పాత్రలలో మహిళల ఇంకా రిక్రూట్ కావలసిన అవసరం ఎంతైనా వుంది. ఆకాశంలో సగం మాదే అని నినదిస్తున్న మహిళ మిలటరీ రంగంలో ఇప్పటకీ తన ఉద్యోగ వాటా సాధించలేక పోతోంది. స్త్రీలు మిలటరీ రంగంలో తమను తాము నిరూపించుకోవటానికి ఖచ్చితమైన ప్రమాణాలను పూర్తి చేయవలసి ఉంటుంది. పురుషుల మాదిరిగానే, యూనిట్ సమైక్యత గురించి, గౌరవం, రక్షణతో పాటు పితృస్వామ్య ఆలోచనల గురించి ఆందోళన చెందడానికి చోటు లేకుండా ఈ మహిళా కమీషన్ చూసుకుంటుంది. విధి నిర్వహణలో శారీరక, మానసిక ప్రమాణాలు ఏకరీతిగా, లింగ-తటస్థంగా ఉండాలి. మహిళలు, పురుషులు మిలటరీ రంగంలో పోటీ పడటానికి స్వేచ్ఛ ఉండాలి.
మైండ్‌సెట్‌లు మారాలి. ఈ రోజు యువకులు మహిళలను తోటివారిగా చూడటం అలవాటు చేసుకుంటున్నారు. అయినా మహిళలలై లైంగిక హింస, పురుషుల పెత్తనం కొనసాగుతూనే వుంది. యుద్ధంలో పురషులను ఆజ్ఞాపించే స్త్రీ పట్ల కింది స్ధాయి పురుష సిబ్బంది ఎలా మసలుకుంటారో అనే ప్రశ్న వుంటూనే వుంది. మహిళలకు ప్రత్యేక బ్యారక్సు, మరుగుదొడ్లు అవసరం. స్పష్టమైన వేధింపుల వ్యతిరేక విధానాలు మిలటరీ అమలుపరచాలి. కుటంబాన్నే కాదు దేశాన్ని కాపాడటానికి మహిళ పురుషుల కన్నా ముందు వరుసలో వుంది.
Comments
Post a Comment