హైకోర్టు స్టేటస్ కో ఉత్తరవులు (తూర్పుగోదావరి జిల్లా)


AP High Court orders stay on govt GO over distribution of capital ...

21.7.20
తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ మండలం గాడాల గ్రామంలో మూడు తరాలుగా నివసిస్తున్న ఎరుకుల కుటుంబాలకు చెందిన సాల రూపులమ్మ, సాల శాంతికుమారి ల పందుల గుడిసెలను తొలగించాలని, వారికి చెందిన స్థలాన్ని గ్రామ పంచాయితీ అధికారులు, పెత్తందార్లు జులుం ప్రదర్శిస్తూ కబ్జా చేయాలని దాడి చేసిన నేపథ్యంలో ది. 29-6-20 న పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. చిట్టిబాబు, తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు అమలదాసు బాబురావు తదితరులు నిజానిర్దారణ జరిపి పోలీసు అధికారులు కు, జిల్లా కలెక్టర్ కు, రాష్ట్ర ముఖ్యమంత్రి కి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కి, వినతి పత్రాలు పంపడం జరిగింది, అంతే కాకుండ జిల్లా అర్బన్ sp కి కూడా sc, st అట్రాసిటీ చట్ట ప్రకారం కేసు నమోదు చేసి  నిందితులను అదుపులోకి తీసుకోవాలని వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది, 

ఇంతవరకూ అధికారులనుండి చర్యలు మొదలుకాలేదు దీనిపై మేధావులు, కులసంఘాలు నాయకులు, ప్రజాస్వామిక వాదులు స్పందించాలని కోరుతున్నాము, ఈ నేపథ్యంలో భాదితులు హైకోర్టు ను ఆశ్రయించగా ఈ రోజు స్టేటస్ కో విధిస్తూ ఉత్తరవులు జారీచేసింది, గడువు తేదీ విధిస్తూ పంచాయితీ రాజ్ శాఖ అధికారులు కు వివరణ కోరుతూ ఆర్డర్ విడుదల చేసింది. దీని ప్రకారం బాధితుల స్థలంలో ఏవిధమైన కట్టడాలను నిర్మించేందుకు వీలులేదని, విచారణ పూర్తియేవరకు ఇది వర్తిస్తుంది అని హై కోర్ట్ తెలియజేసింది.


Comments