వరవరరావు, సాయిబాబాల జీవించే హక్కును కాపాడండి (చిత్తూరు జిల్లా)


వరవరరావు, సాయిబాబా ల జీవించే హక్కును కాపాడండి.
వరవరరావు తో పాటు ప్రొఫెసర్ జి ఎం సాయిబాబా లతో పాటు వివిధ రాష్ట్రాల జైల్ లో ఉన్నటువంటి రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మదనపల్లె 


ఎస్టిభవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి నాగేశ్వర రావు అధ్యక్షత వహించారు.

నాగేశ్వరరావు మాట్లాడుతూ భీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేసి అందులో ప్రధాన మంత్రి మోడీ ని హత్య చేయడానికి కుట్ర పన్నాడని అభియోగం మోపి ఇరవై తొమ్మిది నెలలుగా కనీసం విచారణ కూడా జరపకుండా మహారాష్ట్ర జైల్లో నిర్బంధించారు.అయితే కరోనా వైరస్ సోకిందని అక్కడి పోలీసులు వరవర రావు గారి కుటుంబీకులకు తెలియజేశారు ఈ పరిస్థితుల్లో విడుదల చేసి తెలంగాణ ప్రభుత్వమే వైద్యం అందించాలి అన్నారు అలాగే 90 శాతం వికలాంగులు ప్రొఫెసర్ జిఎం సాయిబాబా పెరోల్పై విడుదల చేయాలి అలాగే వివిధ ప్రాంతాలు ప్రాంతాల్లో జైల్లో అరెస్టయిన రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాలు పాల్గొనీ అందరూ ప్రసంగించారు. అందులో సిపిఐ నాయకులు సాంబశివ, దళిత హక్కుల పోరాట సమితి కృష్ణ ప్ప, బహుజన సమాజ్ పార్టీ నాయకులు బందెల గౌతమ్ కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు నరేంద్ర, బాస్ నాయకులు శ్రీ చందు, మాలమహానాడు నాయకులు చంద్ర, రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు ఉత్పన్న, ఏ ఐ టి యు సి నాయకులు ముబారక్, రాయలసీమ జేఏసీ విద్యార్థి నాయకులు లక్ష్మీపతి, ఇంకా సానుభూతులు పాల్గొన్నారు.

Comments

Post a Comment