ముగ్గురు ఆదివాసీలను వెంటనే విడుదల చేయాలి


పోలీసుల అక్రమ నిర్బంధం లో ఉన్న టొక్కిగూడా ముగ్గురు ఆదివాసీ గ్రామస్తులను విడుదల చేయాలి.

టొక్కిగూడా,గ్రామం, తిర్యాణి మండలం, కొంరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న ఉదయం14జులై,2020,మంగళవారం  తెలంగాణ సాయుదపోలీసులు మకాం వేసి ఆ ఆదివాసీ గూడ పటేల్ ఇంటిలో అన్నం వండుకొని తిని ,మీ గ్రామంలోకి అన్నలు వస్తున్నారంటూ ,వారి ఆచూకి చూపాలంటూ, పటేల్ ను,గ్రామస్తులను కొట్టి, గ్రామ పటేల్ ఇంటిముందు తుపాకులతో కాల్పులు జరిపి,ఆయన కొడుకు మరి యొక ఆదివాసీ యువకునికి తో పాటు ముగ్గురిని పోలీసులు తమవెంట తీసుక పోయారు.నిన్నటి నుండి పోలీసుల నిర్బంధంలో ఉన్న ముగ్గురు ఆదివాసులను చిత్రహింసలకు గురిచేస్తున్న పోలీసులు,వెంటనే టొక్కిగూడా ముగ్గురు ఆదివాసులని ,ఎలాంటి హాని తలపెట్టకుండా పోలీసులు విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తుంది.

1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షులు,
పౌరహక్కుల సంఘం  తెలంగాణ.
2.N. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శి,పౌరహక్కుల సంఘం  తెలంగాణ.

రాత్రి 8:30 గంటలు
బుధవారం,15,జులై,2020.

Comments