వరవరరావు ను విడుదల చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం (గోదావరి ఖని)



గోదావరి ఖని అంబెడ్కర్ భవన్ లో ఈ రోజు14 జులై,2020న తీవ్రమైన అనారోగ్యంగా ఉన్న కవి వరవరరావు& prof సాయిబాబా తో పాటు పది మంది మేధావులను భేషరతుగా విడుదల చేయాలని  జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం 

కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలది దుర్మార్గమైన పాలన.

పౌర హక్కుల సంఘం. కాంగ్రెస్.సిపిఎం. సిపిఐ. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం. ఎమ్మార్పీఎస్. మాల మహానాడు.

కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గమైన పాలనను కొనసాగిస్తున్నాయని. ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు. దళిత సంఘాల నాయకులు ఆరోపించారు.  భీమ్ కోరేగావ్ కుట్రకేసులో జైల్లో మగ్గుతున్న అనారోగ్య పీడితులై నా భారత దేశ మేధావులు.విప్లవ కవి వరవరరావు. అంబేద్కర్ మనవడు ఆనంద్ తో పాటు మరో పది మందిని బేషరతుగా విడుదల చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బొంకూరు మధు ఆధ్వర్యంలో. పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి అధ్యక్షతన తెలంగాణ అంబేద్కర్ భవన్లో మంగళవారం నాడు. రాజకీయ. ప్రజా. దళిత సంఘాల ఐక్యవేదిక నిర్వహణలో జరిగింది. 

జరిగిన సెమినార్లో. పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ మాదన కుమారస్వామి. సీనియర్ జర్నలిస్టు శ్రీ మాదాసు రామ్మూర్తి . సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీ వై యాకయ్య. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గుమ్మడి కుమారస్వామి. ఐ ఎఫ్ టి యు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ .కె విశ్వనాథ్. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు. శ్రీ వడ్డెపల్లి శంకర్. సిపిఐ జిల్లా నాయకులు. శ్రీ గౌతమ్ గోవర్ధన్. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు శ్రీ.ఇ నరేష్. . తెలంగాణ దళిత లిబరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. శ్రీ marwadi సుదర్శన్. రైతు సంఘం. జిల్లా అధ్యక్షులు. శ్రీ. ముడిమడుగుల ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం. రాష్ట్ర నాయకులు శ్రీ మంతెన లింగయ్య. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు. శ్రీ రాస పెళ్లి రవికుమార్. మాట్లాడారు. 2018 దళితులకు స్ఫూర్తి దాయకమైన భీమ్ కోరేగావ్ స్తూపం వద్ద అల్లర్లకు కారణం మైనర్ అంటూ. వరవరరావు తో పాటు అంబేద్కర్ మనవడు ఆనంద్. మరో పది మందిని అరెస్టు చేసి ఇ దేశంలోని వివిధ జైళ్ళలో నిర్బంధించారు. అని అన్నారు. భీమ్ కోరేగావ్ ఘటన తో ఎలాంటి సంబంధం లేని. ప్రజల. అనగారిన వర్గాల పక్షపాతి అయిన మేధావులను అక్రమంగా అరెస్టు చేసి జై లలో నిర్బంధించారని ఆరోపించారు. 

అనారోగ్య బారిన పడి వైద్యం కోసం మేధావులు అడుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదని వారిని జైల్లోనే అంతం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. కరోనా నేపథ్యంలో అనారోగ్య బాధితులైన అక్రమంగా కుట్ర కేసులో ఇరికించ బడ్డ  వరవరరావు తో పాటు భీమ్ కోరేగావ్ బాధితులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని దేశంలోని ప్రజలు ఆదివాసీలు దళితులు అనగారిన వర్గాలు తమ హక్కుల కోసం సమిష్టి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు. దళిత సంఘాలు. రాజకీయ పార్టీల నాయకులు .. శ్రీమతి పుల్ల సుచరిత.శ్రీ శనిగరపు రామస్వామి. శ్రీ పోగుల రంగయ్య. శ్రీ ఉప్పులేటి పర్వతాలు శ్రీ గడ్డం నారాయణ.. శ్రీ గొర్రె నరసింహారావు. శ్రీ గద్దల శశిభూషణ్. న్యాయవాది .శ్రీ అక్బర్ ఎలగందుల రమేష్. శ్రీ పెరిక రవి. శ్రీ. పి. రామస్వామి శ్రీ నక్క రాజేందర్. శ్రీ నల్ల శ్రీనివాస్. శ్రీ అల్లి గంటయ్య. శ్రీ కాదశి లచ్చులు . శ్రీ కాంపల్లి స్వామి. ఉప్పులేటి హనుమంతు.శ్రీ దశరథం. శ్రీ ఉప్పులేటి మల్లయ్య. లింగంపల్లి వెంకటేష్. కవిత.తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ.

కార్యక్రమానంతరం తెలంగాణ అంబేద్కర్ భవన్ నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది.

12:45 PM ,మంగళవారం.
14జులై,2020
గోదావరి ఖని.

Comments