
వైఎస్ఆర్ హౌసింగ్ పధకం కింద పేదలకు ఇల్లు లేదా స్ధలం కేటాయిస్తామని వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందర తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అందులో భాగంగా జూన్15వ తేదీ పేదలందరికీ ఇల్లు లేదా స్ధలాలు కేటాయించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలుచేయడానికి ప్రభుత్వం గ్రామ వాలంటీరు వ్యవస్ధపై ఆధారపడుతోంది. వాలంటీర్లలో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. వాలంటీర్లలో చాలామంది వైఎస్ఆర్ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలే వుంటున్నారు. అక్రమాలకు పాల్పడ్డ వాలంటీర్లలో కొంతమందిని ప్రభుత్వం తొలిగించి వేసింది. అయినప్పటికీ కొంతమంది వాలంటీర్ల తమ అక్రమదందాను కొనసాగిస్తూనే వున్నారు. అలా అక్రమాలకు, ఆశ్రితపాతానికి పాల్పడుతున్నవాడే నంద్యాల 13వ వార్డుకు చెందిన అజీజ్ అనే వాలంటీర్. ఇక విషయంలోకి వద్దాం.
పతంగే పార్వతిబాయి (62) నంద్యాల పట్టణంలో 13వ వార్డు, బాలాజీ కాంప్లెక్స్, ఇంటి నెం. 2-428-46 లో నివసిస్తోంది. ఆమె సెల్ నెంబరు 9110777428. ఆమె, వాళ్ల ఆయన రాంప్రసాద్, (వయస్సు 70 సంవత్సరాలు) ఇద్దరు ఇదే ఇంట్లో గత 15 సంవత్సరాల నుండి నివసిస్తున్నారు. వాళ్లకు తెల్ల రేషను కార్డు వుంది. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. వారు మొదట నుండి వైఎస్ఆర్ పార్టీ అభిమానులు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారి అభిమాన నాయకుడు.
వారికి ప్రభుత్వం ఇస్తున్న పెన్షనే జీవానాధారము. వారు బిసి-డి కులానికి చెందిన వారు. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పేదలకు ఇళ్ల స్ధలాలు ఇస్తానని మాట ఇచ్చారు. పేదలు అయిన వీరు నంద్యాల 13వ వార్డు సచివాలయంలో స్వంత ఇంటి కొరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఇంటి స్ధలం కేటాయించారు. ఆశ్చర్యంగా అందులో పార్వతమ్మ పేరు లేదు. ఇక్కడే వాలంటీరు అజీజ్ తన చాతుర్యాన్ని, అతి తెలివితేటలను ప్రదర్శించాడు. ఈ విషయంపై సచివాలయం, మునిసిపాలిటీ సిబ్బందిని సంప్రదిస్తే పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పతంగే పార్వతమ్మ యింటి పక్కనే వనజాక్షమ్మ నివసిస్తోంది. ఆమె కొడుకు రమేష్ కుమార్, కోడలు లావణ్యలతో అదే ఇంట్లో నివసిస్తోంది. పార్వతమ్మ ఇంటినెంబరు 2-428-46 అయితే వనజాక్షమ్మ ఇంటి నెం 2-428-48. ఈ ఇంటిలో నివసిస్తున్న అత్త వనజాక్షమ్మకు, కోడలు లావణ్యకు వాలంటీరు అజీజ్ ఒక ఇంటి స్ధలాన్ని, మరో ఇంటిని కేటాయింపజేశాడు. పేదల్లో వున్న ఆశను వాలంటీర్ అజీజ్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.
2-428-48 ఇంటి నెంబరుతో లావణ్య, రమేష్ కుమార్ పేరు మీద ఇంటి స్ధలం ప్రభుత్వం కేటాయించింది. లావణ్య అత్తగారైన వనజాక్షమ్మ గారు అదే ఇంటిలో నివసిస్తారు. తిరిగి వనజాక్షమ్మ గారికి ఇంటిని ప్రభుత్వం కేటాయించింది. అయితే ప్రభుత్వం వనజాక్షమ్మ ఇంటి నెంబరును 2-428-46గా పేర్కొంది. అంటే ఒకే ఇంటిలో (2-428-48)లో నివసిస్తున్న అత్త వనజాక్ష్మమ్మకు, కోడలు లావణ్యకు ఇంటి స్ధలాన్ని, ఇంటిని కేటాయించారు. కాని వనజాక్షమ్మ గారికి పతంగే పార్వతమ్మ ఇంటి నెంబరు (2-428-46) మీద కేటాయించారు. అందువల్ల పార్వతమ్మకు ఇల్లు రాలేదు. ఈ విషయాన్ని అధికారులే తెలియజేశారు.
అజీజ్ అక్రమాలపై పతంగే పార్వతమ్మ, ఆమె బంధువులు, 13వ వార్డు స్ధానికులు మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కేవలం అతన్ని మందలించి పంపేశారు. అయితే అజీజ్ తన సిఫారసు లేకుండా పార్వతమ్మకు ఇంటి స్ధలం ఎలా వస్తుందో చూస్తానని తొడగొట్టి సవాలు విసురుతున్నాడు. అంతేగాకుండా పార్వతమ్మ మరిదికి ప్రభుత్వ పెన్షను నెలకు 12,000 వస్తుందని వారికి ఇల్లు రాదని అబద్దపు ప్రచారం చేస్తున్నాడు. పార్వతమ్మ మరిదికి మానసిక పరిపక్వత లేదు. అందుకే అతనికి కేంద్ర ప్రభుత్వం పెన్షను ఇస్తోంది. అతనికి వివాహం కాలేదు. అందుకే అతను తన అన్న రాందాసు, ఒదిన పార్వతమ్మ దగ్గర వుంటున్నాడు. మానవతా దక్పధంతో వారు అతన్ని బాగానే చూసుకుంటున్నారు. దీన్ని ఆసరాగా తీసకుని వాలంటరీ అజీజ్ రెచ్చిపోతున్నాడు.
ఇప్పటికైనా అధికారులు మేల్కొని వాలంటీర్ అజీజ్ (సెల్ నెం. 6305169660)ను విధుల నుంచి తొలగించాలి. పేదరాలైన పతంగే పార్వతమ్మకు ప్రభుత్వం ఇంటిని కేటాయించాలి. లేనిపక్షంలో ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లే ప్రమాదముంది. పతంగే పార్వతమ్మ రేషన్ కార్డు నెంబరు జెఎపి 138413100040. ఇంటి నెం 2-428-46, బాలాజీ కాంప్లెక్స్, 13వ వార్డు, నంద్యాల. ఆమె ఆధార్ కార్డు నెంబరు. 6088 2528 1695. వీరు నంద్యాల మునిసిపల్ కమీషనర్ గారికి 3.7.20 వ తేదీన అర్జీ ఇచ్చారు. అలాగే స్పందన కార్య్రకమాంలోను అర్జీ ఇచ్చారు.
Comments
Post a Comment