వంగిపురం వెంకటరమణ (45) మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి (కడప జిల్లా)



వంగి పురం  వెంకటరమణ (45) అనుమానాస్పద మరణం పై సీబీఐ విచారణ జరిపించాలి
             
      కడప జిల్లా వీరబల్లి మండలం వంగి పురం  వాండ్ల పల్లి మాదిగ పల్లి లో కాపురం ఉన్న వెంకటరమణ@ టాగూర్ అనుమానాస్పద మరణం పట్ల పౌరహక్కుల సంఘం 01/07/2020 న మృతుని గ్రామాన్ని ,సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించినాం ,మృతుని కుటుంబ సభ్యుల ను,గ్రామస్తులను, పోలీస్ వారిని కలసి విచారించగా మా నిజనిర్ధారణ లో వాస్తవాలు ఇలా ఉన్నాయి.

   మృతునికి భార్య, నల్గురు ఆడపిల్లలు, (సివజ్యోతి 18,శ్రావణి 16,పవిత్ర 14, గౌరీ 05)ఒక అబ్బాయి (రామ్ చరణ్ 12) ఉన్నారు.వెంకట రమణ హైదరాబాద్ నందు జీవనోపాధి కెళ్ళి అక్కడ రాజారెడ్డి అనే అతని వద్ద పని చేస్తూ ఉండేవాడు. అపుడపుడూ సొంత గ్రామమైన వంగి పురం వస్తూ ఉండేవాడు పిబ్రవరీ నెలలో స్థానికంగా జరిగేజాతరకు వచ్చాడు.లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఉంటూ గ్రామంలోనే ఉపాధి హామీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గతంలో గ్రామ నాయకుడు శ్రీరాముల రెడ్డి కి మృతుడు వెంకట రమణ కు రెండు సార్లు గొడవలు జరిగాయని ,ఇరువురు కొట్టుకున్నారు అని కుటుంబసభ్యులు కమిటీ దృష్టికి తెచ్చారు.అంతే గాక అదే గ్రామానికి చెందిన విజయ్ తో చిన్నపాటి ఘర్షణ జరిగిందని కూడా గ్రామస్థులు తెలిపారు.

   ఈ క్రమంలోనే 25/06/2020 న రాత్రి శ్రీ రాముల రెడ్డి తన అనుచరులు అయిన మల్లికార్జున నాయుడు,రామమోహన్ నాయుడు,విజయ్ లతో వెంకట రమణ కు పదే,ప దే ఫోన్ చెయ్యి చి పిలిపించుకు న్నాడని కుటుంబ సభ్యులు కమిటీకి చెప్పారు.వీరందరూ కలసి పొలాల దగ్గర ఉన్న  నల్ల చెరువు వద్ద నాటు సారా కాంచి తాగి వెంకటరమణను కొట్టి హత్యచేశారు అని మృతుని భార్య  తెలిపారు.అర్దరాత్రి వెంకటరమణ ఫోన్ కు ఇంటి నుండి ఫోన్ చేయగా ఫోన్ ఎత్తి రాంగ్ నెంబర్ అని స్విచ్ ఆఫ్ చేశారని వాపోయారు...తెల్ల వారి(05.30am) శ్రీరాముల రెడ్డి మృతుని అన్న రెద్దయ్యకు ఫోన్ చేసి మీ తమ్ముడు పాము కాటుతో చని పోయాడని చేపాడని కమిటీ దృష్టికి తెచ్చారు..అంతే గాక శ్రీ రాముల రెడ్డి వెంకట రమణ పాము కాటు తో చనిపోయాడని చూసి నట్లు ప్రచారం చేయడంలో నే అనుమానాస్పదంగా ఉంది..ఒకవేళ పంపు కాటుతో చనిపోతే  రెండు రోజుల తరువాత పోస్ట్ మార్టం జరిగింది..శరీరం రంగు మారాలి.రంగు మారలేదు,శరీరం పై పెనుగు లాడినట్లు చిన్న,చిన్న గోకుడు గాయాలున్నయి,శ్రీ రాముల రెడ్డి మృతుని కుటుంబీకుల వద్దకు తన అనుచరులను పంపి పాము కాటు తో చనిపోయి నట్లు చెప్పమని ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి5 లక్షలు నష్ట పరిహారం ఇప్పిస్తామని రాయబారం పంపాడని ,బెదిరించాడని కుటుంబ సభ్యులు కమిటీకి చెప్పారు.రాయచోటి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కలసి వివరణ అడగగా కేసు విచారణలో ఉంది బాధితులకు న్యాయం చేస్తాం అని చెప్పాడు.అధికార పార్టీ అండదండలు ఉన్న శ్రీరాముల రెడ్డి రాజకీయ ఒత్తి డిలు తెచ్చి కేసును తప్పు దోవ పట్టించాలని చూస్తున్నదని అర్థమవుతుంది.

బాధితులకు న్యాయం జరగాలంటే వెంటనే  1.కేసును సీబీఐ కి అప్పగించాలి.
 డిమాండ్ చేస్తున్నాం.
2.ఐపిసి 302 ప్రకారం కేసు నమోదు చేసి దోషులను వెంటనే అరెస్ట్ చెయ్యాలి.
3.మృతుని కాల్ లిస్ట్ ను బయట పెట్టి విచారించా లి.
4.మృతుని కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి.
పి. రెడ్డయ్య,జిల్లా ఉపాధ్యక్షులు
యం.రవిశంకర్,జిల్లా సహాయ కార్యదర్శి
పౌరహక్కుల సంఘం,కడప జిల్లా
03/07/2020

Comments