తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణ పై NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) పోలీసుల అక్రమనిర్బంధాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ ఖండిస్తుంది. వెంటనే బేషరతుగా విడుదల చేయాలి.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) పోలీసులు ఈరోజుఆదివారం 14-6-2020 సాయంత్రం 5.00 గంటలకు ఖమ్మం లోని కిమ్స్ హాస్పిటల్ లో తీవ్ర అనారోగ్య సమస్యలకు చికిత్స పొందుతున్న నలమాస కృష్ణ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పై దాడి చేసి అదుపులోకి తీసుకొని హాస్పిటల్లోనే ప్రశ్నిస్తున్నారు.ఈ అక్రమ నిర్బంధాన్ని, అప్రజాస్వామిక వైఖరిని పౌర హక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తున్నది.
ప్రక్కనే ఉన్న నలమాస కృష్ణ బంధువులు, కూతురు సెల్ ఫోన్స్ లాక్కున్నారు.ఈ దుశ్చర్యకు నలమాస కృష్ణ కూతురు వెన్నెల స్పృహతప్పి పడిపోయింది.
ఊపా (UAPA) కేసుల్లో బెయిల్ పొంది వారం క్రితమే జైలు నుండి బయటికి వచ్చిన నలమాస కృష్ణను ఇబ్బంది పాలుచేయవద్దని తీవ్ర అనారోగ్యం రీత్యా అరెస్ట్ చేయవద్దని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) పోలీసులు,ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా,అప్రజాస్వామికంగా ఉద్యమకారులపై తప్పుడుకేసులు నమోదుచేసి దుర్మార్గంగా ఎమర్జెన్సీని మించిన నిర్బంధాన్ని అమలుచేస్తుంటే, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాల పై విరుచక పడుతుంటే KCR తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండడం సరికాదు. ఈ నిర్బంధాలను ఆపివేయుటకు KCR ప్రభుత్వం స్పందించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.
1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షులు,
పౌరహక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శి,పౌరహక్కుల సంఘం తెలంగాణ.
ఆదివారం రాత్రి 7:30 గంటలు.
14,జూన్,2020.
హైదరాబాద్..
Comments
Post a Comment