Date. 8.6.20 బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన CPIML న్యూ డెమోక్రసీ. పౌర హక్కుల సంఘం CLC, PDSU , లోక్ జనశక్తి పార్టీ.
శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరిలో ఆదివారం విద్యుత్ తీగలు పట్టుకుని ప్రజాపతి అనే వలస కార్మికుడు మృతి చెందిన విషయం విదితమే. కడుపు మంటతో కరెంటు పట్టుకుని చనిపోయిన కార్మికుడికి చావు తరువాత కూడా కనీస మర్యాద దక్కలేదు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చిన ప్రజాపతి శ్రీకాళహస్తి పైప్స్ కర్మాగారంలో కూలీగా పనిచేయడం కోసం రాచగున్నేరిలో నివసించేవాడు. అటు తండ్రి మరణించడం... ఇటు పరిశ్రమలో పని ఒత్తిడి, వేధింపులు పెరగడంతో తీవ్రమనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాధారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి శవాన్ని కుటుంబసభ్యులు, సమీప బంధువులు వచ్చే వరకు ఏరియా ఆస్పత్రి మార్చురీలో పోలీసులు భద్రపరచాలి.
అయితే ప్రజాపతి మృతదేహానికి కుటుంబసభ్యులు రాకుండానే ఆదివారం రాత్రి పోస్టుమార్టం నిర్వహించడానికి ప్రయత్నించారు.ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో సాయంత్రం 5 నుంచి ఉదయం 8గంటల వరకు ఎలాంటి పోస్టుమార్టం నిర్వహించడానికి అనుమతి లేదు.దీంతో వైద్యులు నిబంధనల ప్రకారం ఉదయం 9గంటల తరువాత పోస్టుమార్టం నిర్వహిస్తామని చెప్పేశారు. ఉదయం 9.45గంటలకు వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేయగా పోలీసులు హడావుడిగా కర్మాగారంలో కార్మికుల కాంట్రాక్టరుగా పనిచేస్తున్న లాలు అనే వ్యక్తికి మృతదేహాన్ని అప్పగించి పంపేశారు. 11గంటలకు ఆస్పత్రి వద్దకు వచ్చిన ప్రజాసంఘాల నాయకులకు ఈ విషయం తెలియడంతో కనీసం కుటుంబసభ్యులు కూడా రాకుండానే శవపరీక్ష ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
ఈ విషయమై శ్రీకాళహస్తి రూరల్ ఎస్‌ఐ ఈశ్వర్‌ను వివరణ కోరగా ప్రజాపతి కుటుంబ సభ్యులను ఫోన్‌లో సంప్రదించామన్నారు. అయితే తమ ఆర్ధిక పరిస్థితి కారణంగా శ్రీకాళహస్తికి రాలేమని మృతదేహాన్ని కాంట్రాక్టరుకే అప్పగించాలని వారు చెప్పినట్లు ఎస్‌ఐ తెలిపారు.వలస కార్మికుడి కుటుంబంలో అంతులేని విషాదాన్ని నిలిపిన ఘటనగా ఇది నిలిచిపోయింది. ఇంటికి వెళ్లలేక.. తండ్రిని చివరిచూపు చూడలేక విలవిలలాడిపోయిన ప్రజాపతి జీవితం ఇలా ముగిసిపోయింది.
నిజనిర్దారణ కమిటీ నివేదిక
శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి పైప్సు (ల్యాంకో ) కర్మాగారంలో పనిచేసే కార్మికుడు భరత్ ప్రజాపతి(25) ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో కరెంటు తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన భరత్ ప్రజాపతి కాంట్రాక్టు కార్మికుడుగా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా కార్మికులు ఎక్కువగా విధులకు రాకపోవడంతో ఉన్న కొద్ది మంది కార్మికులు చేత ఎక్కువ పని చేయిస్తున్నారు. పని ఒత్తిడి ఎక్కువై మూడు షిప్టులు డ్యూటీలు వేయడం వలనే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రజా సంఘాలకు కార్మిక సంఘాలకు ఎవ్వరికి తెలియకుండా సోమవారం ఉదయం 8.45 నిమిషాల నుండి 9.40 నిమిషాల వరకు శవానికి పంచనామా చేయడం జరిగింది. శవాన్ని ఎక్కడికి తీసుకువెళ్లారో, ఏం చేశారో, ఎవ్వరికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రజాపతి శవాన్ని ఏం చేశారో, ఎవరికి అప్పగించారో తెలియపరచాలని డిమాండ్ చేశారు. అతని బలవంత మరణానికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని ధర్నా చేశారు. లేనియెడల ఆందోళన కార్యక్రమాలు వుదృతం చేస్తామని హెచ్చరించారు.
ధర్నా
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా జరిగింది. న్యూ డెమోక్రసీ, లోక్ జనశక్తి పార్టీ, పౌర హక్కుల సంఘం, యానాది సంఘం నాయకులు డిమాండ్ చేశారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రమేష్, పౌర హక్కలు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి ఎన్. హైమాద్రి, కార్యవర్గ సభ్యడు రఫీ, ఏపీ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షులు, చందమామలా కోటయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్. జాకీర్, లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర కార్యదర్శి పులి శ్రీకాంత్ ధర్నాలో పాల్గొన్నారు.
Comments
Post a Comment