ప్రభుత్వ డాక్టర్ ఎజాజ్ అహ్మద్ ఖాన్ ను అరెస్టు చేయాలి ( చిత్తూరు జిల్లా)



దళితుడు పై దాడి చేసిన ప్రభుత్వ డాక్టర్ ఎజాజ్  అహ్మద్ ఖాన్ అరెస్టు చేయాలి. ప్రజాసంఘాల ఐక్యవేదిక డిమాండ్.

 స్థానిక కె.వి పల్లి మండలం మహల్ క్రాస్ లో ప్రభుత్వ డాక్టర్ నిర్వహిస్తున్న ప్రైవేట్ క్లినిక్ లో దళితులపై డాక్టర్ అతని కుమారుడు దాడి చేసిన సంఘటన గత ఆదివారం జరిగింది ఈ నేపథ్యంలో వివిధ ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే దాడి చేసిన డాక్టర్ సస్పెండ్ చేసి అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు ఈ కేసులో ఉన్నతాధికారులు స్పందించి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి నిందితున్ని అరెస్టు చేయాలన్నారు అదేవిధంగా ప్రభుత్వ వైద్య అధికారులు డాక్టర్ చేసిన నిర్వాకం పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు లేనిపక్షంలో ఈనెల 12 తారీఖున మదనపల్లి డీస్పీ కార్యలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు క్రాంతి చైతన్య, నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి tl వెంకటేష్ సి ఐ టి యు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు సిపిఐ జిల్లా నాయకులు సాంబ, మాలమహానాడు రాష్ట్ర నాయకులు యమాల  సుదర్శన్, ధరణీ, బాస్ జిల్లా నాయకులు ముల్లంగి చంద్ర,  శ్రీనివాసులు ఎమ్మార్పీఎస్ నాయకులు సురేష్,  రామకృష్ణ సి ఆర్ డి ఎస్ నాయకులు గట్టు అప్ప, రాజమ్మ బహుజన సమాజ్ వాది పార్టీ నాయకులు ఎం సి రమణ, శ్రీనివాసులు, దళిత బాబు దళిత బహుజన పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బండి ఈశ్వర్, నవసమాజ ఫెడరేషన్ నీరు గుట్టు నగేష్ ఆర్ ఎస్ ఎఫ్ ఉత్తన్నా, ప్రగతిశీల కార్మిక సంఘం ఆంజనేయులు, రాయలసీమ జేఏసీ విద్యార్థి నాయకుడు శ్రీనివాస్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు

Comments