ముంబై రిటైర్డ్ జడ్జ్ హోస్బేట్ సురేష్ గారికి నివాళి



హక్కుల కార్యకర్త, ముంబై రిటైర్డ్ జడ్జ్ హోస్బేట్ సురేష్ గారికి పౌర హక్కుల సంఘం తెలంగాణ వినమ్ర నివాళి.

11,జూన్,2020 న ముంబైలో అనారోగ్యంతో మరణించిన ,ముంబై హైకోర్టు రిటైర్డ్ జడ్జి హోస్బేట్ సురేష్ కు పౌర హక్కుల సంఘం తెలంగాణ నివాళి తెలుపుతుంది.  సురేష్ గారు కర్ణాటకలోని హోస్పేట్ లో 20 జూలై 1929లో జన్మించారు.మంగళూరు యూనివర్సిటీ నుంచి,B.A, విష్వేశ్వరయ్య techonologocal యూనివర్సిటీ బెల్గామ్ యూనివర్సిటీ నుంచి M.A , బాంబే యూనివర్సిటీలో L L M పాసయ్యాడు .30 నవంబర్ 1953లో బాంబే హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు. 1960 నుంచి 65 వరకు  గవర్నమెంట్ లా కాలేజీలో పార్ట్ టైం ప్రొఫెసర్ గా పనిచేశారు. 1965  నుంచి 1968 వరకు లా కాలేజ్ K C Law  కాలేజీ బాంబే లో ప్రొఫెసర్ గా పని చేశాడు. 1967 68 మధ్యకాలంలో సురేష్ గారు బాంబే సిటీ సివిల్ సెషన్స్ కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా పనిచేసిండు. 29 నవంబర్ 1968లో బాంబే  సిటీ కోర్టులో జడ్జిగా పదవి బాధ్యతలు చేపట్టిండు. బాంబే హైకోర్టు నుండి  19 జూలై 1991లో  రిటైర్ అయ్యాడు .సురేష్ గారు పౌరహక్కుల కార్యాచరణలో న్యాయ కమిషన్ లలో చాలా గుణాత్మకమైన పరిశీలనతో పాల్గొన్నాడు.  కావేరీ జలాలపై  ఎంక్విరీ commissiner గా 1992 డిసెంబర్ మరియు జనవరి1993 బాంబే అల్లర్లపై నిజనిర్ధారణ చేసి
 తీర్పులు పుస్తకాల ద్వారా ప్రభుత్వం నకు, ప్రజలకు వెలుగులోకి తెచ్చిండు.బొంబాయి లోని మురికివాడలలో పేదల ఇండ్ల కూల్చివేతల పై  నిజనిర్ధారణలు చేసి రిపోర్టులు బయటపెట్టిండు. అట్లాగే మార్చి మరియు ఏప్రిల్ 2002 గుజరాత్ రాష్ట్రంలో గోద్రా రైలు దహనం తర్వాత జరిగిన మత కల్లోల్లాలపై నిజనిర్ధారణ గా జస్టిస్ V R కృష్ణయ్యర్  ఆధ్వర్యంలో సురేష్ ,జస్టిస్ బిబి సామంతుల తో కలిసి ఇండియన్ పీపుల్స్ క్రిమినల్ గా 2094 మంది వ్యక్తులను, సాక్షులను , పోలీస్ అధికారులను ,ప్రభుత్వ అధికారులను కలిసిసేకరించిన నిజానిర్దారణ వివరాలపై  మానవత్వం పై నేరము (Crime Against Humanity ) అనే రిపోర్టును వెలువరించారు. అప్పటి  గుజరాత్ హోం శాఖ మంత్రి హరేన్ పాండ్యా ను కలిసి గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న నరేంద్ర మోడీ  ఆదేశాల మేరకే గోద్రా అనంతరం జరిగిన దాడులలో హిందువులు ముస్లింల పై చేసిన దాడులను అరి కట్టవద్దని,అడ్డుకోకూడదని అన్నాడు అనే నిర్ణయాన్ని సురేష్ జడ్జి  బయట సమాజానికి  తెలిపినారు. ప్రజలకు ఆహార పథకం (డిస్ట్రిబ్యూషన్) ముంబైలో అమలు గురించి, కాశ్మీర్లో సైనికులు అక్కడి కాశ్మీర్ ముస్లింలపై చేస్తున్నా దాడులు (ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ 958 దుర్వినియోగం) గురించి అక్కడ సైన్యం ఎక్కువగా మోహరించి ప్రజలపై చేస్తున్న రాజ్య హింస గురించి వెలుగులోకి తీసుకువచ్చాడు.జడ్జ్ గా ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరించి ,పేద ప్రజలకు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డాడు. ప్రశ్నించే గొంతుకలకు అండగా నిలబడి హక్కుల ఉద్యమానికి ,ఇండియన్ పీపుల్స్ ట్రిబ్యూన్లకు సారధ్యం వహించిన యోధుడు హోస్బేట్ సురేష్ గారు. పౌర హక్కుల కార్యకర్త,ముంబై రిటైర్డ్ జడ్జ్ సురేష్ గారికి పౌర హక్కుల సంఘం తెలంగాణ వినమ్రంగా నివాళి అర్పిస్తున్నది...

1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షులు,
పౌరహక్కుల సంఘం  తెలంగాణ.

2.N. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శి,పౌరహక్కుల సంఘం  తెలంగాణ.

3.మాదన కుమారస్వామి,
రాష్ట్రసహాయకార్యదర్శి
పౌరహక్కుల సంఘం  తెలంగాణ.

13,జూన్,2020,శనివారం.
హైదరాబాద్..

Comments