కడప జిల్లా టి. సుండుపల్లి మండల కేంద్రము లో ఉన్న అప్పన్న కుంట ఆక్రమణల పై పౌరహక్కుల సంఘం కడప జిల్లా కమిటీ ఆక్రమణ జరిగిన అప్పన్న కుంటను పరిశీలించింది,స్థానిక ప్రజలను,మండల తహసీల్దార్ ను కలిసి వాస్తవాలను సేకరించడం జరిగింది.
సుండుపల్లి లో ఉన్న సర్వే నెంబర్ 2169 లో ఉన్న అప్పన్న కుంట 28.85 ఎకరాలలో అప్పన్న కుంట చెరువు రాయచోటి.. సుండు పల్లి రహదారికి అతి దగ్గరలో ఉన్న ఈ చెరువును అనది కారకంగా స్థానిక (రాజంపేట) యం.యల్. ఏ మేడా మల్లికార్జున రెడ్డి, అతని తమ్ముడు విజయ శేఖర్ రెడ్డి(బాబుల్ రెడ్డి) కనుసన్నులో తమకు అత్యంత సన్నిహితుడైన శివారెడ్డి @(మంత్రి శివారెడ్డి) ,స్థానిక వై.సి.పి. నాయకులు ఒక్కొకరు రెండు,మూడు ప్లాట్లుగా ఏర్పరచుకొని అక్రమ నిర్మాణాలు కట్టడాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ది.ఈ అక్రమ కట్టడాలను కూల్చి వేసి స్థలాన్ని ప్రజాప్రయోజ నాలకు వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అప్పన కుంట చెరువు ఆక్రమణ ల పై మండల తహసీల్దార్ గారిని కలసి వివరాలు అడుగగా అది అక్రమ కట్టడమేనని అంగీకరిస్తూ ,రాజకీయ నాయకుల వత్తిడి,బెదిరింపులతో ఏమి చెయ్య లేని నిస్సహాయత తన మాటలలోనే చెప్పకనే చెప్పాడు,,ఈ అక్రమనలపై ఉన్నతాధకారుల దృష్టికి తీసుకెళ్లి తొలగిస్తామని చెప్పటం చూస్తుంటే రెవెన్యూ అధకారుల పాత్ర కూడా ఉన్నదని అర్థ మవుతున్నది.
అప్పనకుంట రెవెన్యూ అధికారుల అధీనంలోనే కాక చిన్న నీటి పారుదల శాఖ వారి అధీనంలో ఉంటుంది ఇంత జరుగుతున్న వీరు కూడా మౌనంగా ఉండటం చూస్తుంటే ఈ ఆక్రమ నిర్మాణాల్లో వారి పాత్ర కూడా ఉన్నదని అర్థమవుతున్నది.
మండలంలో ఎక్కడ ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నా, ఏం. ఎల్. ఏ అనుచరుడైన మంత్రి శివారెడ్డి ,అతని అనుచరులు అధికారులను బెదిరించి పలుచోట్ల ఆక్రమించాడని పలు ఆరోపణలు ఉన్నాయి. అప్పన్న కుంటలో కడుతున్న అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి,మొత్తం మండల కేంద్రము లో భూముల ఆక్రమణల పై విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తునది.
అప్పన్న కుంట లో వెలసిన అక్రమ కట్టడాలను తొలగించి ప్రజాప్రయోజనా ల కొరకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ను నిర్మించాలి. అప్పన్న కుంట హద్దులను నిర్ధారించి ఆక్రమణలకు గురి కాకుండా కాపాడ వలెను. అక్రమ కట్టడాలకు పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.
ఈ నిజనిర్ధారణ కమిటీలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి రాయచోటి రవిశంకర్,సహాయ కార్యదర్శి ఏం.రవిశంకర్,ఉపాధ్యక్షుడు
పి. రెడ్డయ్య, జిల్లా కోశాధి కారి వంగిమల్ల రమణయ్య లు పాల్గొన్నారు..
Comments
Post a Comment