మందలరాజిరెడ్డిని ప్రభుత్వమే హత్య చేసింది (కరీంనగర్ జిల్లా)

Former Lifeless In Front Of Revenue Office In kalva Srirampur - Sakshi

కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్, వీ ఆర్ ఓ మరియు వీ ఆర్ ఏ ల నిర్లక్ష వైఖరి వల్లనే మందలరాజిరెడ్డి ఆత్మహత్య. వారందరిపై హత్యానేరం నమోదుచేయ్యాలని పౌర హక్కుల సంఘం డిమాండ్.


మందలరాజిరెడ్డి s/o మల్లారెడ్డి, గ్రామం రెడ్డిపల్లి, మండలం వీణవంక, జిల్లా కరీంనగర్ గారి తాతల ఆస్తులకు సంబందించిన రాజిరెడ్డి పట్టా పాసుపుస్తకంలో ఒక ఎకరం22 గుంటల భూమి, పట్టపాసు పుస్తకాన్ని మందల రాజిరెడ్డి s/o మల్లారెడ్డి గారి పేరుమీద ఇవ్వవలసివుండగా కాల్వశ్రీరాంపూర్ M R O,VRO మరియు VRA ల నిర్లక్ష్యం కారణంగా పట్టాపాస్ పుస్తకంలో మందలరాజిరెడ్డి s/o మల్లారెడ్డి బదులు మందలరాజిరెడ్డి s/o నారాయణరెడ్డి పేరుమీద మీద తప్పుగా ఇవ్వడం జరిగిందని కుటుంబీకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం కు ఈరోజు 22 జన,2020 న రెడ్డిపల్లి గ్రామం లో నిజానిర్దారణలో వెల్లడించారు.

మందలరాజిరెడ్డి, కాల్వశ్రీరాంపూర్ MRO, VRO &VRA ల చుట్టూ 2018 సంవత్సరం నుండి పట్టా పాసు పుస్తకాన్ని సరిదిద్దాలని, కాల్వశ్రీరాంపూర్ ప్రజావాణిలో మరియు RDO గార్లకు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా సమస్యను పరిష్కరించకుండా, తిరుమలగిరిలో పనిచేస్తున్న MRO మందల మాధవి (మృతుని బంధువు) ఒత్తిడి మేరకు సరిచేయకుండా, వేలాది రూపాయలు తీసుకున్నారని తెలిపారు.గతారెండు సంవత్సరాలనుండి ఆర్థికంగా నష్టపోయి మానసికంగా మనశ్శాంతి కోల్పోయి, అధికారుల నిర్లక్ష్యం కారణంగా మందల రాజిరెడ్డి 20,జూన్,2020 న ఉదయం కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ ఆఫీస్ ముందు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మందల రాజిరెడ్డి, జిల్లా కలెక్టర్ గారికి రాసిన సూసైడ్ నోటులో, తనచావుకు FCI మందల రాజిరెడ్డి కూతురు అయిన తిరుమలగిరిలో MRO గా పనిచేస్తున్న మందల మాధవి,మందల రమేష్ రెడ్డి,మందల రాంరెడ్డి,కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్, VRO గురుమూర్తి, VRA స్వామి మరియు రెవెన్యూ సిబ్బంది వీరంతా నా చావుకు కారణం అని సూసైడ్ నోటులో వెల్లడించారు.ఒక ఎకరం 22 గుంటల భూమే కాకుండా, తన తాతల ఆస్తి నుండి 167/B,170,150,సర్వే నెంబర్ల లో తనకు భూభాగస్వామ్యం ఉందని ఆ భూమి తనపేరుమీద కాకుండా పై వారందరు కారణంగా ఉన్నారన్నారు. 

పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ మందల రాజిరెడ్డి ఆత్మహత్య కు కారకులైన పై వారందరిపై హత్యానేరం నమోదుచేసి, అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తున్నది.పెద్దపెల్లి జిల్లాకలెక్టర్ గారు మందలరాజిరెడ్డి కుటుంబానికి న్యాయంగా రావాల్సిన భూమిని అందజేయాలని, కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మరియు 20 లక్షల రూపాయల exgratia ఇవ్వాలని పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది.

1.GAV ప్రసాద్,అధ్యక్షుడు, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.

2.ఏనుగు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.

3.పొగుల రాజేశం, E C మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.

4.K. రాజన్న,E C మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.

సోమవారం,22,జూన్,2020
రెడ్డిపల్లి,గ్రామం,వీణవంక,మండలం
 కరీంనగర్,జిల్లా.

Comments