దళిత యువతి స్వప్న ను వేధించిన వారిపై SC,ST attrrocity కేసు కిందా అరెస్ట్ చేయాలి..
బెల్లంపల్లి కి చెందిన దళిత యువతి శనిగరపు స్వప్న మొన్న శనివారం 6,జూన్,2020 ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన పై పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఈరోజు,8జూన్,2020 స్థానిక ప్రైవేట్ ఆసుపత్రి మంచిర్యాల లో స్వప్నను ,ఆమె తల్లిదండ్రులను కలిసి సేకరించిన నిజనిర్ధారణ వివరాలు. బస్తీలోని బొంతల కుమారస్వామి, బొంతల శ్రీనివాస్ ,నిజాము మరియు హోంగార్డు రమేషులు కులం పేరుతో స్వప్న దూషించడం , తమ పైనే పోలీసులకు కంప్లైంట్ ఇస్తావని హెచ్చరించడం వల్లన, తమ ఇంటి నల్లా కనెక్షన్ కరెంట్ కనెక్షన్ తొలగించి మాదిగ కులం పేరు చెప్పి స్వప్నను తీవ్రంగా తిట్టడం వల్లనే మనస్థాపానికి గురైన స్వప్న శనివారం 6 జూన్ 2020 రాత్రి హెయిర్ డై దాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పౌర హక్కుల సంఘం దళిత కుటుంబం పైఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోంది. వేధించిన ఆ నలుగురు వ్యక్తుల పై ఎస్సీ ఎస్టీ attrocity కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించాలని,స్వప్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ,ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.స్థానిక సింగరేణి ,మున్సిపాలిటీ పోలీసులు సకాలంలో స్పందించి లేకపోవడం స్వప్న ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వెంటనే ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని,స్వప్నకు మెరుగైన వైద్యం అందించాలని దళితులపై దాడి చేసే వారి పట్లవేధించే వారిని కట్టడి చేయడానికి వెంటనే స్పందించాలని ,చట్టప్రకారం వ్యవహరించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.
మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పౌర హక్కుల సంఘం తెలంగాణ.
బుద్దే సత్యం కన్వీనర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ .
ఏ సారయ్య కో కన్వీనర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ
జె పోచం కో కన్వీనర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ .
సాయంత్రం5:30,మంచిర్యాల.
8 జూన్ 2020 .
Comments
Post a Comment