.మందుల మాఫియా విజృంభణ
.ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్న ప్రభుత్వాలు
.ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్న ప్రభుత్వాలు
.కరోనా మందుతో 2 లక్షల కోట్ల లాభం
.ప్రభుత్వ పెద్దల అండదండలతోనే మార్కెట్లోకి మందులు
.అమెరికాలో ఒప్పుకోని మందు భారత్ మార్కెట్లోకి
.పతంజలి మందుకు నో అన్న కేంద్రఆయిష్ శాఖ
ఫార్మారంగంలో రోగుల భయాన్ని, నిస్సహాయతను సొమ్ము చేసుకోవడం సర్వసాధారణమైన విషయం. కరోనా సంక్షోభంలో మెడిసెన్ ను తొందరగా కనుక్కుని ప్రజల దగ్గర నుండి పెద్ద ఎత్తున డబ్బులు దండుకోవడానికి చూస్తున్నాయి. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక వివేకవంతమైన చర్య తీసుకుంది. బాబా రామ్‌దేవ్ కు చెందిన పతంజలి ఆయుర్వేద్ సంస్థ ఇటీవల ప్రారంభించిన కోవిడ్ -19 చికిత్సా ఔషధాల గురించి ప్రకటనలను ఆపమని ఆదేశించింది. పతంజలి తన తాజా ఆయుర్వేద వుత్పత్తులు అయిన కరోనిల్ ను కోవిడ్‌కు ప్రపంచంలోనే మొదటి నివారిణిగా పేర్కొంది. క్లినికల్ ట్రయల్స్ జరిగాయనీ, కోవిడ్-పాజిటివ్ టెస్ట్ లలో 69% ప్రతికూల ఫలితాలు వచ్చాయని పతంజలి సంస్థ ప్రకటించింది. ఆ మందులు వాడితే కరోనా వ్యాధి వారంలో నయమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఏది ఏమయినప్పటికీ, పతంజలి వాదనలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. మందు సఫలతపై పంతజలి నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనం గురించి తమకు తెలియదు అని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అధ్యయనం, క్లినికల్ ట్రయల్ వివరాలను, ఫలితాలను అందించాలని మంత్రిత్వ శాఖ ఇప్పుడు పతంజలిని కోరింది. ఇటువంటి ధృవీకరించని నివారణలు ప్రజలకు శాస్త్రీయ చికిత్సను అదించలేవు. ఈ మేజిక్ పానీయాల వాళ్ళ ఏ మాత్రం ఉపయోగం వుండదు. భారతదేశంలో 4.5 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ వైరస్ అనేక మార్పులకు లోనైంది. ఎటువంటి లక్షణాలు మనిషిలో కనపడడం లేదు. కానీ వారిని టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తోంది.
వాస్తవానికి, కోవిడ్ నియంత్రణకు సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారం, నకిలీ వాదనలను కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఉత్పత్తులను తప్పుగా బ్రాండింగ్ చేసిన కంపెనీలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ జూన్ 2 న రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసింది. మరోవైపు ప్రత్యామ్నాయ ఔషధాల తయారీ వేగంగా జరగడం లేదు. చైనాలోకుడా ప్రకృతి పద్దతుల ద్వారా కరోనా కొంతమేరకు నయమైనట్టు వార్తలు వచ్చాయి. దీని పతంజలి సంస్థ అవకాశంగా తీసుకుని సంప్రదాయ పద్ధతుల ద్వారా మందును తయారు చేశామని చెప్తోంది. అటువంటప్పుడు మందు ధర చాలా తక్కువుగా వుండాలి. కానీ ఎక్కువ ధరను నిర్ణయించి ప్రజల దగ్గర దోచుకోవాలని చూస్తోంది.
1954, డ్రగ్స్ నియంత్రణ చట్టం ప్రకారం పతంజలి ఈ మందుకు సంబంధించి ప్రకటనలు జారీ చేయడం అభ్యంతరకరమని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పతంజలి తయారుచేసిన కొరోనిల్ వాడితే రెండు వారాల్లో కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకుంటారని రాందేవ్ బాబా ప్రకిటించారు. 150కి పైగా ఔషధ మొక్కలను ఈ మందును తయారుచేసేందుకు వాడినట్లు పతంజలి సంస్థ ప్రకటించింది. ఈ కరోనా కిట్ ధరను 545 రూపాయలుగా నిర్ణయించినట్లు పతంజలి సీఈవో ఆచార్య బాలక్రిష్ణ పేర్కొన్నారు.
ఆయుర్వేదం ప్రాచీన భారతీయ వైద్య జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. కానీ 21 వ శతాబ్దంలో దాని ఫలితాలు గుర్తించబడిన శాస్త్రీయ పరిశోధనలకు కట్టుబడి ఉండాలి. రసవాదానికి ఇది సమయం అయినప్పటికీ ఇది సామాన్య శాస్త్రానికి నిలవాలి.
భారతదేశంలో క్రోనీకాపిటలిజమ్ పుణ్యమా అని ఎటువంటి రీసెర్చ్ లేకపోయినా కొన్ని ఫార్మా కంపెనీలు మందులను మార్కెట్లోకి వదులుతున్నాయి. ఇప్పటికే వున్న కొన్ని యాంటీబయాటిక్ మందులకు కొన్ని కాంబినేషన్స్ చేర్చి మార్కెట్లోకి వదులుతున్నారు. వారంరోజుల కింద గ్లెన్‌మార్క్ కంపెనీ తన ఫావిపిరవిర్ మాత్రల్ని మార్కెట్‌లోకి వదిలింది. 14 రోజుల కోర్స్‌కు తగ్గట్టుగా మాత్రలు వాాడాలని కంపెనీ చెపుతోంది. అంటే ఇది వ్యాక్సిన్ కాదు. అలాఅని కోవిడ్ వచ్చిన వెంటనే ఒకరోజు ఈ మాత్రలు వేసుకున్నా తగ్గదు. ఒక్కో మాత్రకు 103 రూపాయలు. కంపెనీ చెప్పినట్టు 14 రోజులు వాడితే సగటు రోగి 14,000 ఖర్చుపెట్టాల్సి వస్తుంది. గ్లైన్ మార్క్ క్లినికల్ ట్రయల్స్ కేవలం 150 మంది రోగుల మీదే చేసింది. ఫలితాలను సరిగ్గా నమోదు చేయలేదు. పైపెచ్చు కరోనా తీవ్రంగా వుంటే ఈ మందులు పనిచేయదు. కరోనా సాధారణ లక్షణాలు వున్న రోగికి అసలు మందులే అవసరం లేదు. పోషకవిలువలు వున్న ఆహారం సరిపోతుందని ప్రభుత్వమే ప్రకటించింది.
ఇప్పటివరకు కరోనా రోగి జ్వరానికి పారసెటమాల్, జలుబుకు సిట్రజిన్ వాడుతున్నారు. కొంచెం తీవ్రమైతే హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడుతున్నారు. కొంతమందికి హైడ్రాక్సీక్లోరోక్విన్ ను అజిత్రోమైసిన్ కలిపి వాడుతున్నారు. ఆయా దేశాలను బట్టి కోవిడ్ రోగుల వ్యాధినిరోధక శక్తిని బట్టి మందలను మారుస్తున్నారు.
ఫావిపిరవిర్ మాత్రల్ని జపాన్ మొదట తయారుచేసింది. ఇన్‌ఫ్లుయెంజా వ్యాధికి దీన్ని వాడతారు. ఈ డ్రగ్ కి ఫాబిఫ్లూ అని పేరుపెట్టి గ్లెన్‌మార్క్ దోపిడీకి తెరతీసింది. దీన్ని చూసి హెటిరో, సిప్లా మందల కంపెనీ వాళ్లు దందా మోదలుపెట్టారు. వీళ్లు మార్కెట్లోకి తీసుకువచ్చిన రెండెసివర్ మెడిసెన్ ఎప్పుడో మార్కెట్లోకి వచ్చింది. అమెరికాకు చెందిన గిలియాడ్ కంపెనీ దీన్ని కనిపెట్టింది. దీనివల్ల అనేక సైడ్ఎఫెక్ట్స్ వున్నాయని కొన్ని దేశాలు ప్రకటించాయి. తమాషాగా అమెరికాలో కూడా ఈ మందును కరోనాకు అధికారికంగా ధృవీకరించలేదు.
డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఇంకా చాలా కంపెనీలకు అనుమతులు ఇచ్చే అవకాశాలు వున్నాయి. పోనీ మార్కెట్లోకి వచ్చే కోవిడ్ మందులు సామాన్య ప్రజలకు ఏ మాత్రం అందుబాటులో వుండేవి కావు. హెటిరో కోవిఫర్ పేరిట తెచ్చిన ఇంజక్షన్ ధర 5వేల రూపాయల పైమాటే. కోవిడ్‌కు సమర్థవంతమైన చికిత్సను కనుగొనడం ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద వ్యాపారం కాబట్టి కార్పొరేట్ మందుల కంపెనీలు ఈ పనిలో పడ్డాయి. అన్ని మందులు, టీకాలు కఠినమైన పరీక్షలు, శాస్త్రీయ ధ్రువీకరణ ప్రక్రియలకు లోనుకావాలి. అందువల్ల, ప్రభుత్వం ఆమోదించిన ప్రక్రియల ద్వారా వెళ్ళకుండా చాలామంది తప్పుడు ప్రకటనలను ఇస్తున్నారు. కోవిడ్ నివారణగా ప్రకటించబడే ఔషధాల పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎటువంటి శాస్త్రీయత లేకుండా, క్లినికల్ ట్రయల్స్ లో సరిఅయిన ఫలితాలు రాకుండా ప్రభుత్వాలు ఫార్మా కంపెనీల మందులకు అనుమతులు ఇవ్వడం ఆపేయాలి. ఆ విధంగా ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడటం ప్రభుత్వాలు చేయకూడదు. నిజంగానే కరోనా వ్యాధికి మందు కనిపెడితే అంతర్జాతీయ సమాజం కనీసం దాన్ని గుర్తించ లేదు. దేశంలోని డాక్టర్లు కూడా ఈ మందులపై పెదవి విరుస్తున్నారు. ప్రజల భయాన్ని సొమ్ముచేసుకోవాలనే ఫార్మా మాఫియాను ప్రభుత్వాలు అరికట్టాలి.
- అమన్
Comments
Post a Comment