చైనా వస్తువుల నిషేదం సరే, మేక్ ఇన్ ఇండియా ఎప్పుడు



అందరు చాల గమ్మత్తుగా మాట్లాడుతున్నారు. చైనా వస్తువులు వద్దని. ఓకే, ఎవరికీ అభ్యంతరం లేదు. మనం మన దేశాన్ని ప్రేమించాలి. మన దేశం పట్ల అభిమానం, భక్తి ఉండాలి.  సంతోషం. మనందరం గౌరవిద్దాం. కానీ, మనకు అర్థం కానీ విషయం ఒక్కటుంది. అదే మన దేశంలోని కార్పొరేట్ల సంగతీ. విదేశీ కార్పొరేట్ల సంగతీ. వారే కదా మన ప్రభుత్వాలను నడిపేది. వారు చెప్పినట్లే కదా మన పాలకులు నడిచేది, నడుచుకునేది. మన గామీణ ఆర్ధిక స్వయం సమృద్ధి గల వ్యవస్థని నాశనం చేసిరి. వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేసిరి. మందులు చల్లందే పంట పండాదాయే. పురుగు మందులు పంటలపై చల్లేవి, మనుషులకు రోగాలస్తే వాటిని నయం కావడానికి వాడేవి చాలామట్టుకు విదేశాల్లో నిషేధించినవే. పంట పొలాల్లో ఇప్పటికే మందుల వలన సహజ జీవులు, భ్యాక్టీరియా పంటలకు మేలు చేసేవి చనిపోయి భూమి సారాన్ని కోల్పోయింది. భూమి మాత్రమే మనది. భూమిలోని సకల సంపద కార్పొరేట్లకు మన ప్రభుత్వాలు అప్పచెప్పిరి. అప్పుడు మనం కళ్లప్పజెప్పి చూస్తిమి.

ఈరోజు మన సంపద వేల లక్షల కోట్లు దేశం సరిహద్దులు దాటి పోతుంటే కడుపు కరాక్కు పోతుంది. నాడు బ్రిటిష్ వాడొక్కడే సకల సంపద దోచే. నేడు అభివృద్ధి చెందిన దేశాలు కార్పొరేట్లు దోచేస్తున్నారే. మన దేశంలోని అన్ని రకాల ఖనిజ సంపద భూగర్భం నుండి తీయడానికి బహుళజాతి కంపెనీలతో ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఖనిజ సంపద మన దేశంలో పరిశ్రమలు పెట్టి మన దేశ ప్రజల అవసరాలు తీర్చడానికి మాత్రం కాదందోయ్. విదేశాలకు ముడిసరుకుగా తరలి పోతుందని గమనంలో ఉంచుకోవాలి. మన దేశంలో వేల కిలోమీటర్ల పొడవునా దేశం చుట్టు సముద్రం ఉంది. దానిలో చమురు నిక్షేపాలున్నాయి. పెట్రోల్ డీజిల్ ఇతర చమురు ఉత్పత్తులు వెలికి తీయవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం మేధో సంపత్తి మన వద్ద ఉంది. దీని కోసం మన ప్రభుత్వాలు శ్రద్ధ వహించి నిధులు కేటాయిస్తే విదేశాలపై ఆధార పడే పనేలేదు. కానీ భహుళ జాతి కంపెనీస్ మన ప్రభుత్వాలను ఉండనిస్తాయా? అమేరికోడు వాడి కార్పొరేట్లు మనపై యుద్ధం చేస్తారు. నాకో విషయం గుర్తుకువస్తుంది. మనం అంతర్జాతీయ వాణిజ్య సంస్థలో సభ్యులం కదా? మన దేశ పౌరులు వద్దంటే షరతులకు తలొగ్గి సంతకాలు మన పాలకులేగా పెట్టింది. గ్లోబలైజేషన్ వద్దురా అంటే గమ్మత్తుగా ఉంటుందన్నారు. అదిగో అక్కడే మొదలయ్యింది మన దేశంలోకి విదేశీ వస్తువుల వరద. వద్దంటే దిగుమతి, కాదంటే అమేరికోడి తుపాకీ ఉండనే ఉండే.

మన ఉత్పత్తులు విదేశాల్లో మన పాలకులు అమ్మిపెట్టరాయే! విదేశాల ఉత్పత్తులు మన మార్కెట్లో మనకు అవసరం లేకున్న దిగుమతులయే. మన పరిశ్రమలు మూలపడున్నాయయే. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలనీ వాటిల్లోని ప్రభుత్వ వాటాను ఉపసంవరించుకోవాలని అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందమాయే. వీటిల్లోకి ప్రైవేట్ పెట్టుబడులకు ద్వారాలు తెరిస్తిమి. మనం పొద్దున్నే లేవగానే మన పళ్ళు తోమడానికి వాడే పేస్టూ విదేశీ, బ్రష్ విదేశీ. మన టివి పరదేశ ఉత్పత్తులే. ఏసీలు, ఫ్రిడ్జిలు, కమ్మగా తీయ్యగా త్రాగే శీతల పానీయాలు, వైన్స్, మన యచ్ యం టి వాచ్ మాయం చేసి జపాన్ చైనా వాచ్ లు తెస్తివాయే.  నవ రత్నాలను భోంద పెట్టిరి. ఇలా చెప్పుకుంటే హనుమంతుని తోకవలె అంతంలేని లిస్ట్. అంతర్జాతీయ ఒప్పందాలను కాదనే శక్తి, కొంగ జపం చేస్తున్న దేశ భక్తులకు ఉన్నదా? లేనే లేదు! కానీ చైనా వస్తువులను బహిష్కరించండి అని పిలుపు ఎందుకో??? ప్రజలని మోసం చేసే పిలుపులు మేకపోతు గాంభీర్యం. ప్రపంచంలో యుద్ధాలు ప్రజలకోసం రాలేదు.

పాలకుల రాజ్యాలు కూలిపోతుంటేనో, సంక్షోభంలో కూరుకుపోతేనో ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో పేయిల్ ఐతేనో, ప్రజలను ప్రక్కదోవ పట్టించడానికే అంతర్గత ఘర్షణలు లేదా సరిహద్దు యుద్ధాల కొరకు విద్వేషాలు రెచ్చగొడుతారు. నేడు అమెరికా తన సంక్షోభం నుండి బయట పడటానికి ట్రoప్ ఇమేజి పడిపోతున్న దాన్ని కాపాడుకోవడానికి చైనా అమెరికా మధ్య వ్యాపార వాణిజ్య యుద్ధమును, ఇండియా చైనా సరిహద్దు ఘర్షణగా మలచిన అమెరికా గొప్పతనము ఎరుకలేక ఇరుక్కుపోయిన ఇండియాది రాజకీయ చాణక్యమా? ఏది గొప్ప లేక అమెరికాకు ఇండియా పావుగా ఉపయోగ పడుతున్నదా? ఏది వాస్తవం??? ఏది ఏమైనా యుద్ధాలు అన్నింటిలో బలి పశువులు పేద సైనికులే. పాలకుల కార్పొరేట్ల కుట్రలో సమిధలు సామాన్యులే.

అందుకే పాలకులకు కార్పొరేట్ల ఆటలో ప్రజలు పావులు కారాదు. యుద్ధాలు వినాశకరమైనవి. మానవాళి మనుగడకు ఉపయోగం కాదు. శాంతి యుతంగా చర్చల ద్వారా సమస్యలను పరిస్కారం చేసుకోవాలి. మన పెద్దలు చెప్పిన నీతి. దేశాల మధ్య వివాదాలు పరిష్కారానికి అంతర్జాతీయ వేదికలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు భద్రత మండలిలో మనం తాత్కలిక సభ్యులం. యుద్ధం వద్దు శాంతి కావాలి.      .

అల్గోట్ రవిందర్ న్యాయవాది నిజామాబాదు

Comments