తూగో జిల్లాలో వాలంటీర్ పై దాడి


*నిజానిర్దారణ రిపోర్టు*

29-5-20 ఉదయం 11గ:లకు తూర్పుగోదావరి జిల్లా కె. గంగవరం మండలం సుందరపల్లి గ్రామంలో చీకట్లవరిపాలెంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించగా ఆ భూమిని మట్టితో పూడ్చే క్రమంలో నేతల శ్రీనివాస్(sc మాల) వార్డ్ వాలంటీర్ ను ఎమ్మార్వో, ఎండీవో,విఆర్వో,ఏ ఎస్ ఐ సమక్షంలో అడపా నారాయణస్వామి అతని అనుచరులు పదిహేను మంది కులం పేరుతో తిడుతూ దాడి చేసి కొట్టారు.దాడిచేస్తుంటే అడ్డు వెళ్లిన సలాది తంబయ్య అలియాస్ సాధు ను కూడా కొట్టిన నేపద్యంలో పౌరహక్కుల సంఘం 1-6-20 న సుందరపల్లి గ్రామంలో వివిధ సెక్షన్ల ప్రజలను ,ఎమ్మార్వో ను కలువుగా వెల్లడైన నిజాలు.

సుందరపల్లి గ్రామంలో పెదలైన ఓసి,బీసీ, ఎస్సి,ఎస్టీ వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చుట కు ప్రభుత్వం ఎకరా ఇరవై సెంట్లు భూమిని మట్టితో పూడ్చుతున్న క్రమంలో అడపా నారాయణస్వామి అనుచరులు అడపా రామకృష్ణ, అడపా సత్యం , అడపా సూరిబాబు, అడపా వెంకటరావు,పసుపులేటి శ్రీనివాస్, గరగ శివగోపి,కొర్ల వెంకటేశ్వర్రావు,సలాది ఆంజనేయులు , తెలగాని గంగయ్య,తడల సురేష్ మొదలగువారు ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని దౌర్జన్యంగా అడ్డుకున్నారు, అప్పటికే స్థలాల వద్దకు చేరుకున్న ఎమ్మార్వో, ఎంపిడివో,విఆర్వో,ఏ ఎస్సై మొదలగు ప్రభుత్వ అధికారులు సాక్షిగా పై నిందితులు నేతల శ్రీనివాస్ పై దాడికి దిగారు.ఇళ్లస్థలాలకు ఆనుకొని  ఊట బోది ఇవ్వాలని, లేని పక్షాల్లో పని చేస్తున్న వారిని చెయ్యనివ్వమని మట్టిని తోలకుండా అడ్డుపడుతూ ధర్నాకు దిగారు.దాంతో ఎమ్మార్వో నిందితులను వారిస్తూ బోదు విషయం తరువాత చూద్దాం, రికార్డ్ ప్రకారం బోదు ఉంటే పరిశీలిస్తాం అని చెప్పి అడ్డు చెబుతున్న వారి పేర్లు నమోదు చేయమని స్థానిక గ్రామవలంటీర్ అయిన శ్రీను కు ఆదేశించారు.పేర్లు నమోదు చేస్తున్న నేతల శ్రీను ను కులంపేరుతో దూషిస్తూ మాలనాకొడిక్కీ ఇక్కడ పనేంటిరా అంటూ మూకుమ్మడి దాడి చేసారు. దాడిచేస్తున్నవారిని అడ్డుకో బోయిన సలాది తంబయ్య అలియాస్ సాధును కూడా తీవ్ర గాయాలు అయ్యేలా కొట్టారు.

ఈ నేపథ్యంలో కేసులు నమోదు చెయ్యడం లో అలసత్వం ప్రదర్శిస్తున్న పోలీసులపై  గ్రామస్తులు ధర్నాకు దిగటంతో సాయంత్రం ఎఫైఆర్ సెక్షన్ 353,323,506,R/w34 ఐపీసీ,3(1)(R)(S)3(2)(va)sc, st P O A amendment2016గా నమోదు చేశారు.కేసు నమోదు చేసి రోజులు గడుస్తున్నా నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చెయ్యలేదు.బాధితులను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి మెరుగైన వైద్యం నిమిత్తం తరలించారు.నిందితులను అరెస్టు చేయకపోవడంతో వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, మరలా బాధిత కుటుంబాలకు ప్రాణ హాని ఉందని దళిత వాడ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

నిజానిర్ధారణలో పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు వి. చిట్టిబాబు, తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు బి. ఆర్.అమలదాసు,కార్యదర్శి జె. మనోహర్, సిద్దార్ధ మొదలగువారు పాల్గొన్నారు.

*డిమాండ్స్*

1.నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.
2.భాదితులకు రక్షణ, పునరావాసం కప్పించాలి.
3ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
4.త్వరితగతిన పేదలకు ఇళ్ల స్థలాలు స్వాధీనం పరచాలి.

Comments

  1. Similar incidents are taking place not in Andhra Pradesh but even in odisha. On 25 th June Dr Ansari Majhi dragged and asselted Staff Nurse belonging to Dalit community . No action appeares to have been taken inspite of my repeated twet . unfortunately the victim victimised shifting her from Balimila hospital to Chitrakonda. All the officials became one and harishing her . It is one Exgimple . similar type many in odisha too.


    ReplyDelete

Post a Comment