దళితులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన
మే 31న కెవి పల్లి మండలం మహల్ క్రాస్ లో బియస్ ఎ హాస్పిటల్ నిర్వాహకుడు ప్రభుత్వ డాక్టర్ ఏజాజ్ అహ్మద్ ఖాన్ వైద్యం కోసం వచ్చిన దళితులపై దాడి చేసిన కేసులో తక్షణమే వారిని అరెస్టు చేయాలని,వి.కోట పోలీస్ స్టేషన్ లో దళిత నాయకులను తిట్టి అవమానపరిచిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి వి.నాగేశ్వరరావు,మాలమహానాడు జాతీయ నాయకులు యమలా సుదర్శనం,సీపీఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ,బాస్ నాయకులు శ్రీచందు,బియస్పీ నాయకుడు బిందెల గౌతమ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఆ మేరకు సోమవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహల్ లో బియస్ ఎ హాస్పిటల్ నిర్వాహకుడు ప్రభుత్వ డాక్టర్ అయినప్పటికీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే మందులను తన ప్రైవేటు ఆసుపత్రిలో అమ్ముకుంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పేషెంటు పట్ల దురుసుగా ప్రవర్తించి వారిపై దాడిచేసి గాయపరిచిన వారికి న్యాయం చేయాలని డాక్టర్ ఏజాజ్ అహ్మద్ ఖాన్ అతని కుమారుడును తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు
వి.కోట పోలీస్ స్టేషన్ లో సిఐ,ఏయస్ఐ సమస్య పై వచ్చిన దళిత సమస్యపై,దళిత నాయకులపై పోలీసులు పోలీస్ స్టేషన్ లో అవమానించడం సిగ్గు చేటన్నారు తక్షణమే సిఐ,ఏయస్ఐ లను విదులనుండి తొలగించి,దళిత బాదితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో NSF నాయకుడు నగేష్,SFI నాయకులు టి.ఎల్ వెంకటేష్,RSF నాయకులు ఉత్తన్న, TNSF నాయకులు ప్రభాకర్,మాలమహానాడు నాయకులు భాస్కర్, DBP నాయకులు ఈశ్వర్,PKS నాయకులు ఆంజినేయులు,PKM నాయకులు సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment