మహల్ బియస్ ఎ హాస్పిటల్ నిర్వాహకుడు ప్రభుత్వ డాక్టర్ ఏజాజ్ అహ్మద్ ఖాన్ ను తక్షణమే అరెస్టు చేయాలని,అలాగే వి.కోట పోలీస్ స్టేషన్ లో దళిత నాయకుడు వినోద్ కుమార్ మీద సిఐ,ఏయస్ఐ అవమానించడాన్ని నిరసిస్తూ ఈ రెండు అంశాలపై ఈరోజు మదనపల్లి ప్రెస్ క్లబ్ లో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దాదాపు 17 సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం లో పాల్గొనడం జరిగింది. ఈ రెండు అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం లో పలు తీర్మానాలు చేశారు
1.డాక్టర్ ఏజాజ్ అహ్మద్ ఖాన్ ను తక్షణమే అరెస్టు చేయాలి
2.వి.కోట సిఐ,ఏయస్ఐ పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలి
3.సోమవారం ఉదయం 10 గంటలకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపాలి .ఈ నిరసనలో ప్రజా సంఘాల ప్రతినిధులు భౌతిక దూరం పాటించి పాల్గొనాలని తీర్మానాలు చేశారు
ఈ రౌండ్ టేబుల్ సమావేశం లో పౌరహక్కుల సంఘం నుండి వి. నాగేశ్వరరావు బాస్ సంఘం నుండి ptm శివప్రసాద్,సీపీఐ సాంబశివ,బియస్పీ నుండి బిందెల గౌతమ్ కుమార్,రాష్ట్ర జరిగిన సమాఖ్య నుండి కోనేటి దివాకర్,మాలమహానాడు నుండి కోన భాస్కర్,mrps నుండి మనోహర్,రాయలసీమ విద్యార్థి సంఘం నుండి ఉత్తన్న,పోర్డు స్వచ్ఛంద సంస్థ రాద,ఉమెన్ డెవలప్ మెంట్ నుండి మేరి,aituc నుండి ముబారక్ తదితర సంఘాల నుండి ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు
మహల్ బి యస్ ఎ హాస్పిటల్ నిర్వాహకుడు ప్రభుత్వ డాక్టర్ ఏజాజ్ అహ్మద్ ఖాన్ 'అతని కుమారుడు ఓ దళిత యువకుడిని కొట్టి గాయపరిచిన కేసులో వారిని తక్షణమే అరెస్టు చేయాలని కోరుతూ సోమవారం 15.6.20 ఉదయం10 గంటలకు మదనపల్లి సబ్-కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన జరుగుతుంది. కావున మీరు సమయానికి హజరు కావాలి.
ఉద్యమవందనాలతో
వి.నాగేశ్వరరావు
పౌరహక్కుల సంఘం
చిత్తూరు జిల్లా కార్యదర్శి
Comments
Post a Comment