పత్రికా ప్రకటన
వరంగల్ అర్బన్ జిల్లా TPF అధ్యక్షుడు G.ప్రవీణ్ కుమార్,రైతాంగ సమితి రాష్ట్ర నాయకుడు ఇంద్రసేన,ఉగ్గే శేఖర్ ఉగ్గే చంద్రమౌళి(అక్రమంగా అరెస్ట్ చేసి చత్తీస్గఢ్ జైయిలో నిర్బంధించ బడ్డ OU విద్యార్థి నాయకుడు ఉగ్గే భరత్ తండ్రి మరియు పెద్దనాన్నలు ), లను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసినారు, వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తుంది.
ఈరోజు ఉదయము 10 గంటలకు వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్య పూర్ గ్రామంపై వరంగల్ అర్బన్ జిల్లా ఏసీపీ తో సహా వంద మంది పోలీసులు దాడి చేసిTPF జిల్లా అధ్యక్షుడు జి. ప్రవీణ్ కుమార్ తో సహా ఉగ్గే శేఖర్, ఉగ్గే చంద్రమౌళి(అక్రమంగా అరెస్ట్ చేసి చత్తీస్గఢ్ జైయిలో నిర్బంధించ బడ్డ OU విద్యార్థి నాయకుడు ఉగ్గే భరత్ తండ్రి మరియు పెద్దనాన్నలు )లను అరెస్టు చేశారు. చట్ట ప్రకారము అరెస్టు చేస్తున్నట్టు అరెస్టు మెమో గాని ఏమీ ఇవ్వకుండా ఏ పోలీస్ స్టేషన్కు తీసుకెళుతున్నారో చెప్పకుండా బలవంతంగా పోలీసులు తీసుకెళ్లారు. వారి జాడ తెలియక కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు
గత పది రోజులుగా స్థానిక పోలీసులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన ట్లు వారు తెలియజేశారు. చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యక్రమాలలో వీరు పాల్గొంటున్నారు. అంతేగాక ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలోని నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు ననుసరించి వరవరరావు, సాయిబాబా తదితరులను విడుదల చేయాలని పత్రికా ప్రకటన చేసి ఉన్నారు. ప్రశ్నించే గొంతులను అఱచి వేయడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఇలాంటి భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు పాల్పడడం మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. వెంటనే వారిని విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తుంది.....
1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షులు,
పౌరహక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శి,పౌరహక్కుల సంఘం తెలంగాణ.
11:30 ఉదయం
6,జూన్,2020,శనివారం
హైదరాబాద్...
Comments
Post a Comment