భీమా కొరేగావ్ అక్రమ కేసులను ఎత్తివేయాలి ( కడప జిల్లా)


దేశవ్యాప్తంగా భీమా..కోరే గావ్ కేసులో అక్రమ అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించిన రచయితలను,కవులను,హక్కుల కార్య కర్తల కు బెయిల్ రాకుండా అడ్డుకుంటూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న రాజ్య ఫాసిజాన్ని నిరసిస్తూ ,అలాగే అంగ వికలుడైన ప్రొఫెసర్ సాయి బాబా, వయోవృద్ధుడైన వరవరరావు తదితర మేధావుల ను జైళ్లలో కరోన వ్యాప్తి చెంది మరణాలు సంభవిస్తున్న దృష్ట్యా అరెస్ట్ చేయబడ్డ రాజకీయ ఖైదీలందరిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ  కడప కలెక్టరేట్ వద్ద 09/06/2020 న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి కలెక్టర్ కు మెమోరాండం ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్య వర్గ సభ్యురాలు పి.వరలక్ష్మి,రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి,పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి రాయచోటి రవిశంకర్,సహాయ కార్యదర్శి ఎం.రవిశంకర్,జిల్లా ఉపాధ్యక్షుడు పి.రెడ్డయ్య, చైతన్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.ఝాన్షి లక్ష్మీ,రాయలసీమ విద్యా వంతుల వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు ఏ. హమీద్,ఓ.పి.డి.ఆర్.నుండి శివారెడ్డి,కొండారెడ్డి,సి.పి.ఐ నగర కార్యదర్శి వెంకట శివ,రాయలసీమ విద్యార్థి యూనియన్ నుండి సుబ్బారాయుడు ,డి.టి.ఎఫ్ నుండి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు....

Comments