అప్పన్నకుంట చెరువు అన్యాక్రాంతానికి వ్యతిరేకంగా నిరసన (కడప జిల్లా)


     
                                                  
      టి. సుండుపల్లి మండల కేంద్రంలో సర్వే. నెం 2169, అప్పన్నకుంట చెరువు ను కొంత మంది రాజకీయ నాయకులు ఆక్రమించి అక్రమ ఇళ్ళ నిర్మాణాలను చేపట్టడాని నిలిపి వేయుట గురించి.
             
 టి. సుండుపల్లీ మండల కేంద్రంలో ఉన్న అప్పన్న కుంట,సర్వే నేం.2169 విస్తరించి ఉన్న 28.85 ఎకరాలలో  సుందుపల్లీ మండలానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు ఆక్రమించి అక్రమ ఇళ్ళ నిర్మాణాలు చేప ట్టు చున్నారని ఈ మధ్య కాలంలో వరుసగా దినపత్రికలలో కథనాలు రావడం  మీకు విధితమే.ఈ కథనాల ప్రకారం వాస్తవాలు తెలుసుకొనుటకు పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ 17/06/2020 న అక్ర మాలకు గురి అయిన అప్పన్న కుంట చెరువును క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగినది.అక్కడ సర్వే నెంబర్ 2169 లో అక్రమ ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్న విషయం మా పరిశీలనలో కూడా వాస్తవం.అక్కడ స్థానిక అధి కార పార్టీ నాయకులు ఒకొక్కరు 2 లేదా 3 ఇళ్ళ నిర్మాణాలు బినామీ పేర్లతో నిర్మాణం జరుగుతున్న వాస్త వాన్నికూడా మీ దృష్టికి తెస్తున్నాం.అంతే కాకుండా స్థానిక మండల ప్రజలను కూడా ఈ అక్రమ కట్టడాల పై విచారించడం జరిగినది.ప్రజలు కూడా అక్రమ ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్న ది వాస్తవం అని మా దృష్టికి తెచ్చారు.జరుగుతున్న అక్రమ ఇళ్ళ నిర్మాణాల ను గురించి అదే రోజు మీ కార్యాలయానికి మేము వచ్చి మీ దృష్టికి తేవడం జరిగినది.మేమే కాక గతంలో సుండుపళ్ళీ గ్రామానికి చెందిన శ్రీ.పి.చరణ్ రెడ్డి.తండ్రి జనార్దనరెడ్డి కూడా ఈ అక్రమ ఇళ్ళ నిర్మాణాల గురించి నిలుపుదల చేయమని పిటిషన్ పెట్టాడు.మీరు పిటిషన్ ప్రకారం రెప రెన్స్ నెంబర్. ఏ/72/2020 తేది 18/05/2030 ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ (మైనర్ ఇరిగేషన్) రాయచోటి వారికి,మండల అభివృద్ధి అధికారి సుండుపల్లే వారికి ఈ అక్రమ ఇళ్ళ నిర్మాణాలను గురించి వారికి కూడా తగు చర్యల నిమిత్తం అయి సమాచారం ఇచ్చారు.అంతే గాక "డయల్ యువర్ కలెక్టర్ ప్రోగ్రాం నందు పై రెప రేన్స్ ల ప్రకారం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కడప వారికి సర్వే నెంబర్ 2169 extent 28.85 ఎకరాల అప్పన్న కుంట చెరువు ఆక్రమణ నిర్మాణాల గురించి ఆర్డీవో ,కడప వారికి తెలిపి యున్నారు.

        పై రెప రెన్స్ ప్రకారం మీరు ఉన్నతాధకారులకు గత 15 సం.. క్రితం గృహాల నిర్మించుకొని నివాసమున్న వ్యక్తులను చూపిస్తూ ప్రస్తుతం మరికొంత మందికి సర్వే నెంబర్2169 లో పట్టాలు ఇవ్వడానికి అవకాశముందని పై అధికారులను తప్పుదోవ పట్టించేందుకు అని నమ్ముతున్నాం .సర్వే నెంబర్ 2169 లో గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం దక్షిణ భాగాన కొంత మంది ఆక్రమించడాన్ని మీరెలా గైతే అడ్డుకొని అక్కడ ఇది ప్రభుత్వ భూమి అతిక్రమించిన చో శిక్ష కు గురి అవుదురని సూచిక బోర్డ్ పెట్టారో,అదేవిధంగా గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం ఉత్తర భాగాన ప్రస్తుతం అక్రమ ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశంలో అతిక్రమణలు జరగకుండా హెచ్చరిస్తూ ఉన్న సూచిక బోర్డ్ నుతొలగించి సర్వే నెంబర్ 2169 లో అక్రమ ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్న మీరు ఎందుకు అడ్డు కొలేదో ప్రశ్నారథకమవుతున్నది, ఇందులో మీ రు ప్రత్యక్షంగానో,పరోక్షంగానో అక్రమ దారులకు సహాయ,సహకారాలు ఉంటాయని  ప్రజలు మా దృష్టికి తెచ్చారు,మేము కూడా భావిస్తున్నాం..దీనికి పూర్తిగా మండల రెవెన్యూ అధికారి గా మీరే భాద్యత వహించాల్సి ఉంటుంది.

     ఇంతజరుగుతున్న తమరు పట్టీ పట్ట నట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది.ప్రజలకు ఉపయో గ పడాల్సిన ,ప్రజలకు చెందిన అప్పన్న కుంట చెరువును కాపాడాల్సిన బాధ్యత మండల తహశీల్దారు గా మీపై ఉంది.టి.సుందుపల్లి ప్రజలు వేసవి కాలంలో దాహార్తితో అలమటిస్తున్నారు.ఈ చెరువును అభి వృద్ధి పరచి వర్షాదారమైన నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంపొందించే అవకాశం ఎంతైనా ఉంది.ఈ విషయం పట్ల ఉదాసీన వైఖరి తో ఉండడం శోచనీయం.ఇప్పటికైనా మీరు ఈ అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్ళ నిర్మాణాలను తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం..  
  డిమాండ్స్:

1.అప్పన్న కుంట చెరువు హద్దులను నిర్ధారించి  ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలి
2.ప్రజాప్రయోజనా ల కొరకు అప్పన్న కుంట లో సమ్మర్ స్టోరేజ్ టాంక్ కు ను నిర్మించాలి
3.అక్రమ ఇళ్ళ నిర్మాణాలను నిర్మిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
            __పౌర హక్కుల సంఘం,.       
                          (CLC) a.p
                 కడప జిల్లా కమిటీ.
 ఇందు నకలు::
.      రాష్ట్ర సంభందిత రెవెన్యూ అధి కారు లకు,
    జిల్లా సంభందిత అధికారులకు
తేదీ.22/ 06/2020

Comments