బొగ్గు గనులను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిద్దాం



బొగ్గుగనుల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జులై 2,3& 4,2020 తేదీలలో భారతదేశవ్యాప్తంగా మరియు సింగరేణి బొగ్గు గనుల్లో నాలుగున్నర లక్షల మంది బొగ్గుగని కార్మికులు చేస్తున్న72 గంటల సమ్మెకు పౌర హక్కుల సంఘం తెలంగాణ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది….

జాతీయకార్మికసంఘాలు మరియు జాతీయ ఫెడరేషన్ల పిలుపు మేరకు బొగ్గుగనుల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జులై 2,3& 4,2020 తేదీలలో భారతదేశవ్యాప్తంగా మరియు సింగరేణి బొగ్గు గనుల్లో నాలుగున్నర లక్షల మంది బొగ్గుగని కార్మికులు చేస్తున్న72 గంటల సమ్మెకు పౌర హక్కుల సంఘం తెలంగాణ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది……

దేశవ్యాప్తంగా సమ్మెలో బాగంగా ఇక్కడ మనతెలంగాణ రాష్ట్రంలోని
సింగరేణి బొగ్గుగనుల్లో జులై 2,3 &4 తేదీలలో కూడా 72 గంటల సమ్మెను విజయవంతం చేద్దాం.
దేశంలో BJP నరేంద్రమోదీ ప్రభుత్వం బొగ్గుగనులను ప్రైవేటుపరం చేయడానికి నిర్ణయం తీసుకుంది..50,000 కోట్ల రూపాయల ను మల్టీనేషనల్ కంపెనీలు,బడా కార్పొరేట్ కంపనీలకు మోడీ ప్రభుత్వం ధారాదత్తం చేస్తున్నది..
ఈనెల18 వతేదీన మొదటివిడతగా దేశంలోని41 బొగ్గుబ్లాక్ లను e ఆక్షన్ ద్వారా వేలంవేసింది.ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం, బొగ్గుగనుల్లో ప్రైవేటీకరణ మరియు కమర్షియల్ మైనింగ్ అనుమతించ డానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు లో పిల్ వేసింది. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ,ఈనిర్ణయాలను వ్యతిరేకిస్తూ ,ప్రధానమంత్రి నరేంద్రమోడీ కి లేఖరాసింది.సింగరేణి బొగ్గుగనుల్లో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ యూనియన్ (TRS) తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(TBGKS), 2 జులై ఒక్క రోజు సమ్మెకు స్వంతంగా పీలుపిచ్చింది ఈ ప్రైవేటీకరణ కు నిరసనగా. సమ్మెకు నాయకత్వం వహిస్తున్న దేశ వ్యాప్త జాతీయ కార్మిక సంఘాలు,ఇక్కడి విప్లవ కార్మిక సంఘాలు మరియు సింగరేణి కార్మికులు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ను మిగతా రెండు రోజులు కూడా కలుపుకొని జులై2,3,&4 మూడు రోజుల,మొత్తం72గంటల సమ్మెకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతున్నారు.విశాల కార్మిక ప్రయోజనాలు దృష్టి లో పెట్టుకొని TRS పార్టీ అనుబంధ యూనియన్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(TBGKS) కూడా చిత్తశుద్ధితో జులై2,3,&4, మూడు రోజుల72 గంటల దేశవ్యాప్త బొగ్గుగని కార్మికుల సమ్మెలో పాల్గొనాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ విజ్ఞప్తి చేస్తున్నది.

డిమాండ్లు

1 41 బొగ్గుబ్లాక్ లను వేలంపాటను రద్దుచేయాలి.

2 బొగ్గుగనుల్లో100%FDI (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)లకు ఇఛ్చిన అనుమతులు ఉపసంహరించుకోవాలి.

3  ఔట్సోర్సింగ్ పేరుతో బొగ్గుగనుల ప్రైవేటీకరణ మరియు కమర్షియల్ మైనింగ్ ను నిలిపివేయాలి.

4 CIL/SCCL లో కాంట్రక్టు కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించాలి.

5 క్లాజ్ 9.3.0,. ..,9.4.0….,, 9.5.0 లను జాతీయ బొగ్గుగని కార్మికుల వేజ్ బోర్డ్ అగ్రిమెంట్ లో అమలు చేయాలి.

ఇంకా 44 కార్మిక చట్టాలను 4 కార్మిక కోడ్ లుగా మార్చడాన్ని నిలిపి వేయాలని డిమాండ్లను అమలుకు పెట్టినారు.
ఈ దేశ సహజసంపద, వనరులను విచ్చలవిడిగా కార్పొరేట్లకు, బహుళజాతి కంపెనీలకు మన కేంద్రప్రభుత్వం అప్పగించకుండా మరియు మన ప్రభుత్వ రంగం లోని బొగ్గుగనులను కార్మికులను కాపాడడం కోసం మనందరం అండగా ఉండాలని కోరుతూ జులై 2,3 &4,,2020 తేదీలలో 72 గంటలు  దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు సంపూర్ణంగా పౌర హక్కుల సంఘం తెలంగాణ మద్దతు తెలియజేస్తున్నది..


1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షులు,
పౌరహక్కుల సంఘం  తెలంగాణ.
2.N. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శి,పౌరహక్కుల సంఘం  తెలంగాణ.
3మాదనకుమారస్వామి,రాష్ట్రసహాయకార్యదర్శి
పౌరహక్కుల సంఘం  తెలంగాణ.

సాయంత్రం 6:45,సోమవారం.
29-6-2020,హైదరాబాద్

Comments

Post a Comment