విశాఖ దుర్ఘటనకు ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యమే కారణం



*పౌరహక్కుల    సంఘం* 
 పత్రికాప్రకటన
--------------------------
*విశాఖపట్నం గ్యాస్ లీకేజీ దుర్ఘటనకు కారణమైన కంపెనీయాజమాన్యంపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి.*
*చనిపోయిన వారికి 50 లక్షలు, హాస్పిటల్ పాలైన వారికి 5లక్షల రూపాయలు ఎక్సగ్రేషియా ప్రకటించాలి*
  విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విషవాయువు స్టెరైన్ గ్యాస్ భారీ ఎత్తున లీక్ కావడంతో ఫ్యాక్టరీకి మూడు కిలోమీటర్ల దూరానికి పైగా నివాసం ఉంటున్న ప్రజలు త్రీవ్రంగా శ్యాసకోస ఇబ్బందులకు గురై 10 మంది చనిపోయారని, వందల మంది సృహ కోల్పోయారని, వేల మంది అస్వస్థతకు గురయ్యారని,ఈ మరణాలు ఇంకా పెరిగే అవకాశమున్నదని తెలుస్తున్నది. కర్మాగారం లోపల ఉద్యోగుల, కార్మికుల పరిస్థితి ఏమిటో విషయాలు బయటకు రాలేదు. స్టెరైన్ గ్యాస్ పీల్చడం వలన ఊపిరి తిత్త్తుల వ్యాధి, గుండె జబ్బు, తల తిరుగుడు, మానసిక వ్యాధులు, కాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల సంక్రమించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యనిపుణులు అంటున్నారు.     *కార్పొరేట్ శక్తుల లాభాలే ధ్యేయంగా* ఉత్తరాంధ్రను ఎస్.ఈ. జెడ్ ప్రాంతంగా మార్చి రసాయనిక పరిశ్రమల డంపింగ్ యార్డ్ గా మార్చిన నేపథ్యంలో *,పర్యావరణ విధ్వంసం తో పాటు అనేక పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతూ ప్రజల                *జీవించే హక్కు* ను హరించి వేస్తు న్నాయి. కానీ ప్రభుత్వాలు ఎలాంటి  చర్యలు తీసుకోవడంలేదు  ఈ కారణంగానే నేడు ఇంతటి పెద్ద ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదానికి కంపెనీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. పరిశ్రమలను తనిఖీ చేయాల్సిన చీఫ్ ఫ్యాక్టరీస్ శాఖలో పోస్టులు భర్తీ చేయకుండా ఫ్యాక్టరీస్ మరియు లేబర్ డిపార్ట్మెంట్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఫలితమే ఇలాంటి దుర్ఘటనలకు కారణం. లాభాపేక్ష తప్ప, ఉద్యోగుల, ప్రజల భద్రత పట్టని పరాశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలతో పాటు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ను పటిష్టం చేయాలి. ఈ ప్రమాదానికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి యజమాన్యం ద్వారా 50 లక్షల  చోప్పున చనిపోయిన  వారి ఒక్కొక్క కుటుంబానికి ఎక్సగ్రేషియా చెల్లించాలని,  అలాగే హాస్పిటల్ పాలైన వారికి పై పద్ధతుల్లో 5లక్షల పరిహారం ఇవ్వాలని,
కర్మాగారాన్ని అక్కడ నుండి జనావాసాలు లేని ప్రాంతాలకు తరలించాలనీ, భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని *పౌరహక్కుల సంఘం* డిమాండ్ చేస్తున్నది.

Comments