మంథని పోలీస్ స్టేషన్ లో హత్య

మంథని లో లాకప్ డెత్. పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ. విచారణకు ఆదేశించిన హైకోర్టు


మంథని


పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణకు ఆదేశించింది. శీలం రంగయ్య అనే వ్యక్తిని లాకప్ డెత్‌ చేశారంటూ న్యాయవాది నాగమణి రాసిన లేఖ ను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు రంగయ్య‌ మరణం పై విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఎంక్వయిరీ కమిషన్ అధికారిగా హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్‌ను నియమించింది. జూన్ 2 వరకు నిందితుడి అనుమానాస్పద మృతిపై సమగ్ర నివేదిక అందించాలని ఎంక్వయిరీ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా వేసింది.

మరో వైపు రంగయ్య మరణంపై పౌరహక్కుల సంఘం నిజనిర్దారణ నిర్వహింది. 27 మే 2020 బుధవారం న పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రంగయ్య కుటుంబ సభ్యులను రామయ్య పల్లె గ్రామస్తులను మరియు మంథని పోలీస్ అధికారులతో కలిసి వివరాలు సేకరించింది. ‌
దీనిపై పౌరహక్కుల సంఘం విడుదల చేసిన మీడియా ప్రకటన
రామయ్య పల్లె శీలం రంగయ్య ది మంథని పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య కాదు! మృతికి పోలీసులే బాధ్యత వహించాలి.
రామయ్య పల్లె గ్రామం రామగిరి మండలం పెద్దపెల్లి జిల్లా కు చెందిన శీలం రంగయ్య 26 మే 2020 మంగళవారం మంథని పోలీస్ స్టేషన్ టాయిలెట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడనే ఘటనపై ఈరోజు 27 మే 2020 బుధవారం న పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రంగయ్య కుటుంబ సభ్యులను రామయ్య పల్లె గ్రామస్తులను మరియు మంథని పోలీస్ అధికారులతో కలిసి సేకరించిన వివరాలు, ఈ ఘటనపై పౌర హక్కుల సంఘం నిజనిర్ధారణ లుగా వివరిస్తున్నాము.
23 మే 2020 శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో మంథని పోలీసులు గాజులపల్లె శివారులోని గుడిమెట్ట గుట్ట వద్ద శీలం రంగయ్యను మిగతా ముగ్గురు వ్యక్తులను వన్యప్రాణులను వేటాడడం కోసం హై వోల్టేజి లైన్లను పరిచారని అదుపులోకి తీసుకున్నారు.

శీలం రంగయ్య ది ఆత్మహత్య కాదు అని మా నిజ నిర్ధారణలో తేలింది. 52 గంటల పైన మంథని పోలీసులు శీలం రంగయ్యను అక్రమంగా మంథని పోలీస్స్టేషన్లో నిర్బంధించి వేధించడం వలన చనిపోయినట్లు మా నిజనిర్ధారణ లో తేలింది .పోలీసులు చెబుతున్నట్లు టాయిలెట్లో ఉరి వేసుకున్నట్లు ఆనవాళ్లు లేవు, అది కట్టుకథ. పోలీసుల కథనం లో వాస్తవం లేవు ,వాస్తవాలు బయటికి రావాలంటే ఈ లాకప్ డెత్ పై

1. జ్యుడిషియల్ ఎంక్వయిరీ మరియు సిబిసిఐడి ఎంక్వయిరీ జరిపించాలని పౌరహక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

2. సంబంధిత పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలి మరియు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి .(culpable homicide).శీలం రంగయ్య ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.

3. మృతుని కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మరియు ఒక ప్రభుత్వం ఉద్యోగం(పర్మనెంట్) ఇవ్వాలి.

4. ఈ కేసులో అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు పోలీసులు విధులు సక్రమంగా నిర్వర్తించకుండా శీలం రంగయ్య మృతికి కారణమయ్యారు.మరియు కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసిన పోలీసు అధికారులు మరియుఅధికార పార్టీ నాయకుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

1. మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2. జి వి ప్రసాద్ అధ్యక్షుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
3. మహమ్మద్ అక్బర్ ఉపాధ్యక్షుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
4. ఏనుగు మల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
5. పుల్ల సుచరిత సహాయ కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
6 వేల్పుల బాలయ్య సహాయ కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
7. పోగుల రాజేశం ఈసీ మెంబర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
మంథని
27 మే 2020, బుధవారం మధ్యాహ్నం

Comments