మార్క్సిస్ట్ ధృకృదంలో చట్టాలు

 Unit 1.  Plato, Aristotle, Locke, Rousseau, and Marx disagreed ...

మార్క్స్ ‌ ఎప్పుడూ చట్ట సమస్యను క్రమపద్ధతిలో ప్రసావించలేదు. అయినప్పటికి, అతని రచనలలో అనేక విశ్లేషణలు ఆ కాలం నాటి చట్టాలపై ఉన్నాయి. బూర్జువా వ్యవస్థ స్వభావాన్ని, అవి ప్రజలకు రక్షణ పేరుతో రూపొందించే చట్టాలపై కొన్ని ఆలోచనలను ఆయన చేశాడు. మార్క్సిస్ట్ న్యాయ సిద్ధాంతంగా దీన్ని క్రోడీకరించే పని గతంలో కొంతమంది పాశ్చాత్య  హక్కుల ఉద్యమకారులు చేశారు. చట్టాలను మార్క్సిస్ట్ ధృక్పదంలో చూడటానికి మార్క్సిస్ట్ ప్రాధమిక సిద్దాంతాన్ని క్లుప్తంగా అర్దం చేసుకోవలసి వుంటుంది.

ఉపోద్గాతం

బూర్జువా సమాజం హక్కులను ఎప్పుడు తప్పుడు నిర్వచనంతోనే నిర్వచిస్తుంది. దాని వర్గ స్వభావం రీత్యా అది దానికి అవసరం. సామాజికంగా ఒక సమాజం యొక్క నిజమైన స్వభావాన్ని అది వక్రీకరిస్తుంది. ఆధునిక చట్టం పేరుతో అది తెచ్చేవన్నీ బూర్జువా ఉత్పత్తి శక్తుల పునాదిపైనే నిలబడతాయి. అందుకే చట్టం రూపొందిన పునాదిని అర్ధం చేసుకున్నప్పుడు అది స్వభావరీత్వా ఎవరికి ఉపయోగపడుతుందనే విషయం అర్ధమవుతుంది.

చట్టం, శ్రమశక్తి విలువను గుర్తించకుండా మార్కెట్‌ విలువను అంటే లాభాలను మాత్రమే గుర్తిస్తుంది. నిజమైన మానవ స్వేచ్చకు విరుద్ధంగా స్వేచ్చా వాణిజ్యాన్ని గుర్తిస్తుంది. వస్తువు స్వేచ్చగా ఎక్కదైనా ఉత్పత్తి అవ్వడానికి, అది ఎక్కడైనా మారకం జరగడానికి కావలసిన స్వేచ్చను బూర్జువా చట్టాలు ఇస్తాయి. మార్కెట్‌, మారకాన్ని అడ్డుకునే సామాజిక పరిస్థితులను ధ్వంసం చెయడానికి ఈ చట్టాలు బాగా ఉపయోగపడతాయి. మధ్యభారతంలోని దండకారణ్యంలో భూగర్భాన దాక్కున్న సహజ నిక్షేపాల విలువ భారత్‌ జిడిపి విలువకు పది రెట్లు ఎక్కువని అంచనా వేయబడింది. భారత్‌ జిడిపి ప్రస్తుతం 205 లక్షల కోట్లు. అంటే వాటి విలువ 2000 లక్షల కోట్లకు పై మాటే అన్నమాట. ఇంత విలువైన సంపదను పెట్టుబడిదారులు ఎట్టిపరిస్తితుల్లోను వదులుకోరు. దళారి స్వభావంలో వున్న భారత పాలకులు అందుకే ఎన్నో చట్టాలను పెట్టుబడికి అనుగుణంగా చేశారు.

అయినా స్థానికంగా వున్న ఆదివాసీలు తమ ప్రాణాలను తెగించి సహజనిక్షేపాల వెలికితీతను అడ్డుకుంటున్నారు. అందుకే అక్కడ సామాజిక, రాజకీయ పరిస్థితులను ధ్వంసం చేయడానికి రాజ్యం ప్రయత్నిస్తోంది. ఇది చట్టబద్ధంగా సాగుతుంది. మార్క్సిస్ట్ ఆలోచనకు నిజమైన సామాజిక లక్ష్యం వుండాలి. నిజమైన సామాజిక లక్ష్యం ఏందంటే అసమానతలు లేని సమాజం రావాలి. ప్రజలకు జీవించే హక్కు కల్పించబడాలి. కాని బూర్జువా చట్టాల సామాజిక లక్ష్యం పెట్టుబడిదారుల లాభాలను పెంచడం. ఆ దోపిడిలో భాగస్వాములు కావడం. తద్వారా వచ్చే ఆదాయంతో ప్రజలకు నగదు బదిలీ పథకాల సంఖ్యను పెంచడం. రాజ్యం-సంక్షేమం పేరుతో రాజ్యం- పెట్టుబడి కలిసి చేస్తున్న తాజా అభివృద్ధి ఇదే.

సమాజం యొక్క ఆర్ధిక ప్రాతిపదికలను సమూలంగా మార్పు చేయడమనేది సామాజిక వైర్యుద్యాల్లో భాగంగా జరుగుతుంది. ఆర్దిక, రాజకీయ, సామాజిక పునాదిని సమూలంగా మార్పు చేయడం ద్వారానే పెట్టుబడికి లాభాలు వస్తాయి. తదనుగుణంగా చట్టాలను రూపొందించడమే బూర్జువా ప్రజాస్వామ్యపు ప్రధాన లక్షణం. అంటే న్యాయవ్యవస్థ నిర్మాణం కేవలం ప్రస్తుత ఉత్పత్తి విధానం యొక్క వ్యక్తీకరణ మాత్రమే. అంతకు మించి దానికి వేరే ఉపయోగపు విలువ వుండదు.

హక్కులనేవి బూర్జువా ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వారికి మాత్రమే వుంటాయి. వారి దృష్టిలో వ్యక్తి అంటే అంతను కేవలం వినియోగదారుడు మాత్రమే. మరోవైపు ఉత్పత్తిని తన శ్రమశక్తితో సృష్టించి అదనపు విలువను ఇచ్చే శ్రామికుడు వేతనదారుడు అవుతాడు. ఇతనికి కూలీ నుండి సాఫ్ట్‌వెర్‌ ఇంజనీర్‌ వరకు అనేక పేర్లు వున్నాయి. వారి ఉద్దేశ్యంలో అదనపు విలువ కేవలం లాభం మాత్రమే. ఆ లాభం పూర్తిగా పెట్టుబడిదారుడికే చెందాలి. సహజ వ్యక్తి అనే వాడు వారి దృష్టిలో వుండడు. అతను పూర్తిగా మార్కెట్ సాలెగూడులో బందీ అయి వుంటాడు. వ్యక్తి పాత చారిత్రక సమాజానికి అనుగుణంగా నిలిచినప్పటికీ, పాత సామాజిక సంబంధాలను మార్కెట్‌ సంబంధాల్లోకి లాక్కోవడానికి నిరంతరంగా చట్టాలు పనిచేస్తుంటాయి. ప్రతి ఒక్కరికి తన సొంత శ్రమ యొక్క ఉత్పత్తులపై అర్హత వుంటుంది. 

ప్రతి ఒక్కరికి తన సొంత  శ్రమ ఉత్పత్తులపై అర్హత వుంటుంది. ఇదే బూర్జువా తాత్వికా-న్యాయ సూత్రంగా రూపంలో కనిపిస్తుంది. పెట్టుబడిదారి విధానంలో రాజ్యం ఆచరణ విలోమానికి దారితీస్తుంది. అంటే రైతు ఉత్తత్పి చెసే పంటలకు ఎప్పటికీ అతనికి గిట్టుబాటు ధర లభించదు. అతనికి గిట్టుబాటు ధర లభించాలంటే అతను పెట్టుబడిదారుడు చెప్పే  పంటలే పండించాలి. అతను చెప్పే స్థాయిలో పంటలు పండించాలంటే అతను ఎక్కువుగా రసాయనిక ఎరువులు వాడాలి. దీనిక ఒక ఉదాహరణ చూద్దాం.

పెప్సీ కంపేనీ వర్సెస్‌ రైతులు (2019)

లేస్‌ చిప్స్‌ యజమాని ఆదాయం 177 బిలియన్‌ డాలర్లు. సన్నకారు భారతీయ రైతులపై ఒక రకమైన బంగాళాదుంపను పండించినందుకు న్యాయస్థానంలో కేసు వేశారు. పెప్పి కంపెనీ 2016 నుండి భారతదేశంలో ఎఫ్‌ఎల్‌ -2027 బంగాళాదుంపకు “ప్రత్యేక హక్కులు” కలిగి ఉంది. వీరి అనుమతి లేకుండా నలుగురు రైతులు ఎఫ్‌ఎల్‌ - 2027 గాళదుంపలు పండించారు. పండించినందుకు ఒక్కొక్కరు 1,43,000 డాలర్లు చెల్లించాలని కంపెనీ న్యాయస్థానంలో కేసు వేసింది.

ఈ దావాను ఖండిస్తూ, పెప్పి కంపెనీ వాళ్లు బెదిరించారని ఆరోపిస్తూ డజన్ల కొద్ది కార్యకర్తలు, రైతు సంఘాలు భారత వ్యవసాయ శాఖకు లేఖ రాశాయి. ఎఫ్‌ఎల్‌ -202'7 బంగాళాదుంప రకం 2016 నుండి భారతదేశంలో ప్రత్యేక హక్కులను కలిగి ఉందని పెప్సి కంపెనీ  పేర్కొంది. ఏప్రిల్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని జిల్లా కోర్టుకు సమర్పించిన చట్టపరమైన పత్రాల లో ఇలా వుంది. “పెప్పికో భారతదేశపు అతిపెద్ద ప్రాసెస్‌ గ్రేడ్ ‌ బంగాళాదుంప కొనుగోలుదారు. వేలాది మంది. స్థానిక రైతులతో కలిసి ఒక నిర్దిష్ట రక్షిత రకాల బంగాళాదుంపలను పండించడానికి పనిచేసిన మొదటి సంస్థలలో ఒకటి”. నిజానికి పెప్పి కంపెనీ ప్రత్యేక బంగాళాదుంపను పండించడానికి అనేక వందల మంది భారతీయ రైతులకు అనుమతి ఇచ్చింది. అయితే దావాలో పేర్కొన్న రైతులకు కాదు. గుజరాత్‌లోని వాయువ్య ప్రాంతంలోని దీసా నగరానికి సమీపంలో ఉన్న ఇద్దరు రైతులు ఫుల్‌చంద్‌ కచ్చావా, సురేష్‌ కచ్చావా పెప్సీ కంపెనీ అనుమతి లేకుండా పంట పండించారు.

అనుమతి లేకుండా ఎఫ్‌ఎల్‌ -2027 పెరగడం మొక్కల రకాలు, రైతుల హక్కుల చట్టం 2001 లోని సెక్షన్‌ 64 ప్రకారం హక్కుల ఉల్లంఘన అని పెప్సి కంపెనీ పేర్కొంది. రైతుల రక్షణ కోసం న్యాయవాదులు, కార్యకర్తలు, రైతు సంఘాలు ర్యాలీ చేశాయి. న్యాయస్థానంలో పెప్సీ కంపెనీ నిజానికి గెలిచేది. కాని దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా ఆందోళన పెరిగింది. ఆ ఆందోళన లేస్‌ కంపెనీ చిప్స్‌ను అందరూ బహిష్మ్కరించాలనే స్థాయికి వెళ్లింది. దీంతో సదరు కంపెనీ మే  2, 2019న కేసును వెనక్కి తీసుకుంది.

ఇదే  కంపెనీ గుజరాత్‌ ప్రాంతంలోని కొంతమంది రైతులను లేస్‌ కంపెనీ బంగాళదుంపలు(ఆలుగడ్డలు)ను పండించమంది. వారికి కావలసిన విత్తనాలను సరఫరా చేసింది. తీరా పండించిన తర్వాత ఆ పంట తమ చిప్స్‌ తయారీకి ఉపయోగపడటం లేదని కంపెనీ వాదించి న్యాయ స్థానానికి వెళ్లింది. న్యాయన్వానం లోపాయికారిగా ఏదో ఒక ధరకు రైతుల దగ్గర పంటను కొనుక్కోమని తీర్పు ఇచ్చింది. ఇది రైతు విజయంగా పెట్టుబడిదారి మేధావులు పెర్కొన్నారు. అంటే లేస్‌ కంపెనీ సదరు పంటను కొని చిప్స్‌ అమ్మితే నష్టాలు వసాయి కాబట్టి, ఆ నష్టాల్ని  రైతులు భరించాల్సిందే అని న్యాయవ్యవస్ట అధర్మవాదన. దీనికి పెట్టుబడి మేధావులు పెట్టన ముద్దు పేరు సోషలైజెషన్‌ ఆఫ్‌ లాసెస్‌. నష్టాలను సామాజీకరించడం. పెట్టుబడిదారి లాభాలను సామాజీకరించమని వీరు చెప్పరు. అందుకే బ్యాంకులు ప్రజల డబ్బులను పారిశ్రామిక వేత్తలకు రుణాలను ఇస్తాయి. వారు ఆ రుణాలతో లాభాలను గడిస్తే, ఆ లాభాల్లో వాటా ప్రజలకు వుండదు. వారు రుణాలను ఎగవేస్తే, భారత పార్లమెంట్‌ ఆ రుణాలను మొండి బకాయిల పేరా  రద్దు చేస్తుంది. అంటే బ్యాంకులకు ఆర్‌బిఐ ద్వారా ప్రభుత్వమే ఆ లోటు  మేరకు  ప్రజల నిధులనే సమకూరుస్తుంది. దీనికోసం పార్లమెంట్‌ చట్టాలను రూపొందిస్తుంది. 2019 లో పార్లమెంట్ 160000 కోట్లు రద్దు చేసింది. 2020 లో కరోనా కల్లోలం లో కూడా 68607 కోట్లు భారత్ ప్రభుత్వం రద్దు చేసింది.   బూర్జువా చట్టం ద్వారా అందరికీ సమాన హక్కులు అనేవి రాజ్యాంగానికి మాత్రమే పరిమితమౌతాయి. “ప్రతి ఒక్కరి నుండి అతని  సామర్ధ్యాల  ప్రకారం, ప్రతి ఒక్కరికి అతని అవసరాలకు అనుగుణంగా అనే మార్స్కిస్టు  న్యాయ సూత్రం ప్రస్తుత ప్రజాస్వామ్య దేశంలో వర్తించబడదు.

చరిత్రను గతి తార్మిక పద్ధతిలో విశ్లేషించినప్పుడు  మార్క్స్ ఆలోచనలు అభివృద్ది చెందాయి. అయితే పాత  సమాజాలకు వున్న క్రమరహిత స్వభావం కారణంగా, వాటి వైరుధ్యాలను వివిధ మార్స్కిస్టు  సిద్ధాంతంలో వ్యక్తికరించబడింది. మార్క్స్ మార్స్కిస్టు  కావడానికి  ముందే  హక్కులు, చట్టంపై అవగాహనను పెంచుకునే ప్రయత్నం చేసాడు. రినిస్పే జైటంగ్‌ వార్తాపత్రిక (1842-1843) కు సంపాదకుడిగా పనిచేస్తున్నప్పుడు ఉదారవాదం, నిజమైన ప్రజాస్వామ్యంపై అనేక వ్యాసాలు అతని పత్రికలో ప్రచురించబడ్డాయి. మార్క్స్ ను మార్స్కిస్టు గా మార్చడానికి అప్పటి స్టల, కాల పరిస్థితులు బాగా పనిచేశాయి. అప్పుడే ప్రజాస్వామ్యం పేరుతో చేస్తున్న చట్టాలు అంతిమంగా ఎవరి ప్రయోజనాల కోసం ఉపయోగపడతాయనే అంశంపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాశాడు.

రాడికల్‌ ప్రజాస్వామ్యాన్ని స్వీకరించే స్థానానికి వ్యవస్థ రావడానికి కావలసిన నిర్దిష్ట ఆర్థిక పునాదిని ఎలా నిర్మించాలనే అంశాలు ఈ పత్రికలో విశ్లేషించబడ్డాయి. ఉదారవాద ప్రజాన్వామ్యం, అనివార్యంగా దాని న్యాయ వ్యవస్థ యొక్క పక్షపాత సార్వత్రికతను, ఫార్మలిజాన్ని వ్యక్తికరిస్తుంది.

కలప దొంగతనం (1842)

ఆ కాలంలో అడవుల్లో జరిగే కలప దొంగతనాల అంశంపై మార్చ్‌ తన మార్చ్శిస్టు వైఖరిని చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. ప్రస్సియాలోని అడవుల్లో పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. వీటి  కొమ్మలు అప్పుడప్పుడు విరిగి కిందపడి పోయి, ఎండిపోయెవి. వీటిని వంటచెరుకుగా వినియోగించడానికి అటవీ సమీప ప్రాంత ప్రజలు ఆ కలపను ఇళ్లకు తెచ్చుకునెవారు. వీరిని కలప దొంగలుగా స్థానిక ప్రభుత్వం చిత్రీకరించింది. నిజానికి అడవుల్లోని కలపను తీసుకురావడం నేరమని ఆ ప్రాంత చట్టాలు చెపుతున్నాయి.

కలప పునరావృత దొంగతనంలోని చట్టపరమైన, నైతిక అంశాలను చర్చిస్తూ మార్క్‌ అనేక  వ్యాసాలు రాశాడు. ఈ వ్యాసాల పరంపరలో కలప దొంగతనం పర్యవసానంగా అధికారులు ప్రజలుపై ఎలా అణచివేత ధోరణిని అమలు చేస్తారో చెప్పాడు. సార్వత్రిక హక్కు, ప్రైవేట్‌ ఆస్తి ఈ రెండిటి మధ్య శత్రుపూరిత వైఖరిని మార్క్స్ ‌ గ్రహించాడు. ప్రజల జీవించే హక్కును సైతం కాలరాస్తూ, చివరికి చట్టాలు రాష్ట్ర అధికారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని చెప్పాడు. అంతే గాకుండా చట్టాలు ప్రభుత్వాలను ప్రైవేటీకరణకు మల్లించేస్తాయని సూత్రీకరించాడు.   సమాజంలో  విభిన్న తరగతులు వున్నాయి. వంట చెరుకు కోసం అడవుల్లో పడిపోయిన కొమ్మలను సేకరించుకునె పద్ధతి సంప్రదాయంగా వస్తోంది. కాని అడువుల యజమానులు స్థానికులను కలప దొంగలను చేశారు. ఆ కలపను తామే తీసుకునె చట్టాలను రాజ్యం అండతో రూపొందించారు. అంటే కలపను స్థానికులు తీసుకుంటే దొంగతనం అయింది. అదే  అడవులను  పలుకబడితో స్వంతం చేసుకున్న యజమాని తీసుకుంటే హక్కు అయింది. చట్టం ఇచ్చే హక్కును ప్రజలు గౌరవించాలా, లేదా ప్రకృతిపై తమకుందే హక్కును ప్రజలు  కోల్పోవాలా. అడవుల సంపదను ప్రవెటీకరించే చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రజల సంప్రదాయం అటవీ యజమానులచె చట్టవిరుద్ధం చేయబడింది.

ప్రభుత్వం సమాజానికి చెందాల్సిన ప్రకృతి వనరులను ప్రాథమికంగా చట్టం ద్వారా ప్రైవేటీకరించింది. ఏదేమైనా, ఈ ప్రవేటీకరణ  ప్రజలకు ప్రకృతి వనరులపై వున్న సార్వత్రిక హక్కును రద్దు చెస్తుంది. ప్రవేటు ‌ ఆస్తిని రక్షణ చెయడానికి పార్లమెంట్‌ వుంటుంది. ప్రవైటు వ్యక్తుల ఆస్థుల రక్షణ కోసమె చట్టాలు చేయబడతాయని మార్క్స్ పేర్కొన్నాడు. ‌  రాజ్యాంగబద్ధంగా ప్రవేట్ ‌ ఆస్తి రక్షణలో భాగంగా కలప దొంగ చెక్కను అటవీ యజమానిని దోచుకున్నాడు. దీనికోసం అటవీ యజమాని రాజ్యాన్ని పార్లమెంట్‌ను స్వచ్చంగా ఉపయోగించుకున్నాడు. 'చెక్కదొంగతనాల విషయంలో, సార్వత్రిక “పేదల సంప్రదాయ హక్షులు” కాలరాయబద్దాయి. ప్రస్తుత చట్టపరమైన చట్రంలో ప్రజల హక్కులు కాలరాయబడ్డాయని మార్చ్‌ పేర్కొన్నాడు. అంటే అటవీ సంపదపై హక్కు ప్రైవెటు వ్యక్తులకే వుంటుందని తేలిపోయింది.

2019 సంవత్సరంలో సుప్రీంకోర్టు కూడా కార్పొరెట్‌ శక్తులకు మద్దతుగా ఒక తీర్పు ఇచ్చింది. తద్వారా 30 లక్షల మంది ఆదివాసీలు అడవుల నుండి గెంటివేయబడ్డారు. ఫారెస్టు చట్టంలో తీసుకొచ్చిన సవరణలు ప్రజల కుండే సంప్రదాయ హక్కులను కాలరాస్తాయి. చట్టాలు అడవులపై పెత్తనాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడతాయి. అందుకే జల్‌, జమీన్‌, జంగిల్‌పై హక్కులు న్ధానిక ఆదివాసీలకే చెందాలనే ఉద్యమాలు ఊపందుకున్నాయి.

చట్టాలు పేదల సంప్రదాయ హక్కులను నియంత్రిస్తాయి. వారి ఆచారాలను, సంస్కృతిని అదుపు చేసె ప్రయత్నం చేస్తాయి. నైతికతకు సంబంధించిన చర్చను మార్క్స్  లేవదీశాడు. ఫ్యూడల్‌ ఉత్పత్తి సంబంధాలు పునాదిగా వున్నప్పుడు ఉపరితలంలో ఫ్యూడలిస్టులకు మద్దతుగానే  చట్టాలు చేయబదతాయి. బూర్జువా హక్కులు మాత్రమే చెలామణిలో వుంటాయి. నిబంధనల ప్రకారం ఒకరు తన సొంత శ్రమ ఉత్పత్తులకు అర్హులు. పెట్టుబడిదారి విధానంలో, ఈ హక్కు పూర్తిగా విలోమానికి దారితీస్తుంది. ఎందుకంటే ఆ హక్కు రూపంలో అందరికీ చెందినదిగా వుంటుంది. సారంలో ఉత్తత్తి శక్తులపై పెత్తనం వున్న వారికే ఉపయోగపడుతుంది.

వస్తువుల ఉత్పత్తి, వాటిపై హక్కులును అధికార ఆధిపత్యాన్ని చెలాయించే వ్యక్తులే కలిగివుంటారు. నిజమైన ఉత్పత్తిని శ్రమశక్తి ద్వారా చేసిన మెజారిటీ ప్రజలు ఉత్పత్తిపై హక్కులనే కాకుండా, సంప్రదాయ హక్కులను కోల్పోతారు. ఉత్పత్తి విధానంలో వున్న అంతర్జత వైరుధ్యాలు, సారంలో ప్రత్యక్ష విరుద్ధంగా మార్చబదతాయి. వాస్తవానికి ఆస్తి హక్కులు వుండాల్సిందేనని అనిపిస్తుంది. అయితే ప్రకృతి వనరులపై ఎవరికి ఆధిపత్యం వుంటుందో, వారే స్వంత ఆస్టిని నిర్మించుకోగలుగుతారు. ప్రజలకు ప్రకృతి వనరులపై పెత్తనం లేనప్పుడు అతను ఎప్పటికీ జీతగాడు గానే వుంటాడు గాని, స్వంత ఆస్టిని సంపాదించుకోలేడు. కొంతమంది పేద వర్గంనుండి దోపిడీ వర్గానికి ఎగబడేవారికి ఆస్తి  హక్కు వుంటుంది. ఇతరుల శ్రమ, ఉత్పత్తిని స్వాధీనం చేసుకోవడం అసాధ్యమని సాంత ఆస్థి  హక్కు చెపుతుంటుంది. ఆచరణలో విరుద్ధంగా జరుగుతుంటుంది. శ్రమ నుండి ఆస్తిని వెరుచెయడం అసాధ్యం అని చట్టం చెపుతుంది. అందువల్ల, మరోసారి, హక్కు ఉదారవాద ఆలోచనలకు సాధనంగా మారుతుంది.

సమాజంలో భౌతిక పరిస్థితుల ప్రాతిపదిక మీద పెరుగుతున్న ప్రజాస్వామ్యీకరణ, వాటిని న్యాయమైన విలువలను వ్యతిరేకించకూడదు. ఆర్థిక ప్రక్రియ నిరంతరం వాటిని ఉల్లంఘిస్తుంది. అందుకే ఇది అన్యాయమైన వ్యవస్థ అని చెప్పబడుతుంది.

హెగెల్‌ ఫిలాసఫి ఆఫ్‌ రైట్‌ పై విమర్శ (1843)

హెగెల్‌ ఫిలాసఫీ ఆఫ్‌ రైట్‌ను మార్క్స్ ‌ విమర్శించాడు. ఆదర్భ్శవాద తాత్విక వ్యవస్థను హెగెల్‌ ప్రతిపాదించాడు. హెగెల్‌ హక్కుల సిద్దాంతాన్ని తల్లకిందులుగా అర్ధం చేసుకున్నాడని మార్క్స్ ‌ చెప్పాడు. రాజ్యాంగ బద్దంగా రాజ్యం వుండాలని హెగెల్‌ ప్రతివాదించాడు. భౌతిక పరిస్థితులకు, వ్యక్తుల స్వీయ భావనల మధ్య సంబంధం వుందని చెపుతూనె హెగెల్‌ లక్ష్యాన్ని సరిగ్గా నిర్దశించలెదు. మనిషి ఆలోచనను లక్ష్యం మాత్రమే  అభివృద్ది చేయదు. భౌతిక పరిస్థితులకు అనుగుణంగానే మనిషి లక్ష్యాన్ని ఏర్పాటు చెసుకుంటాడని మార్క్స్ ‌ అన్నాడు. తర్కం మూలాన్ని కనుగొనే  ప్రయత్నం చేయాలి. తర్కం  నిర్ణయాత్మక ఆలోచనను అభివృద్ధి చెసే విధంగా వుండాలి.

అందువల్ల, హెగెల్‌ హక్కుల దృక్పధం సమస్యాత్మక అంశాలను విశ్లేషించడంలో వెనుకడగు వేసింది. ప్రస్తుత సామాజిక పద్ధతుల నుండి సరైన తాత్విక భావనను వ్యక్తికరించడానికి బదులుగా రాజకీయ రాజ్యాంగం, సార్వత్రిక హక్కు తాత్విక భావనను ఎక్కువుగా చెప్పడం హెగెల్‌ చేశాడు. ఈ నైరూప్య చట్రానికి ఇప్పటికే  ఉన్న సామాజిక సంబంధాలను గుర్తించ నిరాకరించడం జరిగింది.  సామాజిక కంటెంట్‌ (కుటుంబం, పౌర సమాజం) దాని స్వంత నిర్దిష్ట న్యాయ రూవాన్ని రూవొందిస్తుందని మార్క్స్ ‌ అభిప్రాయపడ్డాడు. వ్యక్తిత్వం లేని న్యాయ వ్యవస్థ అసమాన వ్యవస్థ ప్రతిరూపం. ఉదార ప్రజాన్వామ్యం పూర్తిగా ఆధిపత్య వర్గాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకే చారిత్రక, తాత్విక ప్రాముఖ్యతలను కనుగొనాలి.

యూదుల ప్రశ్న (1844)

ఆన్‌ ది జ్యూయిష్‌ క్వశ్చన్‌ అనేది కార్లమార్క్స్ ‌ రాసిన రచన. ఇది 1843 లో వ్రాయబడింది. 1844 లో పారిస్‌లో మొదటిసారిగా జర్మన్‌ టైటిల్‌ జుర్‌ జుడెన్‌ (ఫేజ్‌ కింద డ్యూచ్‌-ఫ్రాంజిసిస్‌ జహర్‌బాచర్‌లో ప్రచురించబడింది. మార్క్సిజం  అభివృద్ధి చెందడానికి మార్క్స్  చేసిన మొదటి ప్రయత్నాల్లో ఇది ఒకటి. చారిత్రక భౌతికవాద భావనను మార్క్స్ ‌ ఈ రచనలో బాగా అభివృద్ధి చేశాడు.

ప్రస్సియాలో రాజకీయ విముక్తి సాధించడానికి యూదులు చేసిన ప్రయత్నంపై మార్క్స్ ‌ తోటి యంగ్‌ హెగెలియన్‌ బ్రూనో బాయర్‌ చేసిన రెండు అధ్యయనాలను విమర్శించాడు. రాజకీయ విముక్తికి లౌకిక రాజ్యం అవసరం కాబట్టి, యూదులు తమ ప్రత్యేకమైన మత చైతన్యాన్ని వదులుకోవడం ద్వారా మాత్రమే రాజకీయ విముక్తిని సాధించగలరని బాయర్‌ వాదించాడు. ఇది మతం వంటి సామాజిక గుర్తింపులకు ఎటువంటి ప్రాతిపదికను వదలదని అతను భావించాడు. బాయర్‌ ప్రకారం, ఇటువంటి మతపరమైన డిమాండ్లు మనిషి హక్కులు ఆలోచనకు విరుద్ధంగా లేవు. నిజమైన రాజకీయ విముక్తికి, మతాన్ని రద్దు చేయడం అవసరమని అతను భావించాడు.

మార్క్స్ ‌, బాయర్‌ వ్యాసాన్ని ఉదార హక్కుల విశ్లేషణకు ఒక సందర్భంగా ఉపయోగిస్తాడు. లౌకిక స్థితిలో మతం ఇకపై సామాజిక జీవితంలో ప్రముఖ పాత్ర పోషించదని బాయర్‌ తప్పుగా వాదించాడు. మార్క్స్ విశ్లేషణలో, లౌకిక రాజ్యం మతానికి వ్యతిరేకం కాదు. పౌరులకు మతపరమైన, ఆస్తి అర్హతలను తొలగించడం కాదు. మతం, ఆస్తిని రద్దు చేయడం కాదు. మత స్వేచ్చ ప్రశ్నకు మించి రాజకీయ విముక్తి గురించి బాయర్‌ విశ్లేషించాడు. లౌకిక దేశంలో వ్యక్తులు ఆధ్యాత్మికంగా, రాజకీయంగా స్వేచ్ఛగా ఉండగలిగినప్పటికి, వారు ఆర్థిక అసమానతను కలిగివుంటారు. తద్వారా వారి స్వేచ్చ భౌతిక పరిమితులకు కట్టుబడి  ఉంటుందని మార్క్స్  తేల్చి చెప్పాడు. ఈ వాదన పెట్టుబడిదారి విధానంపై ఆయన చేసిన విమర్శలకు ప్రధాన ఆధారంగా మారింది.

బ్రూనో బాయర్‌కు వ్యతిరేకంగా వ్రాస్తూ, మార్క్స్ హక్కుల గురించి చాలా శాశ్వతమైన ఆలోచనలను పరిచయం చేశాడు. బూర్జువా ప్రజాస్వామ్యంలో హక్కులను విమర్శనాత్మకంగా చూడాలి. రాజకీయ విముక్తి, మానవ విముక్తి మధ్య వ్యత్యాసం వుంది. వ్యక్తి యొక్క అసంపూర్ణ స్వభావం, వ్యవస్థలో క్రమానుగతంగా వస్తున్న తిరస్కరించలేని  పురోగతిని అవగాహన చేసుకోవాలి. ఉదార హక్కులు, స్వేచ్చలను ఇవ్వడం వల్ల పనిచేసే పౌరులకు మతపరమైన, ఆస్తి సంబంధిత అర్హతలను తొలగించవు. రాజకీయ, ప్రజా రంగాలు వాస్తవానికి మతం, ఆస్తిని రద్దు చేయవు.

రాజకీయ ఆలోచనలో భాగంగా ఒక ప్రత్యేకమైన వ్యవస్థలో వ్యక్తులను పౌరులను చేయవచ్చు. వారి ఆర్ధిక స్థితిగతుల ద్వారా వారి స్వేచ్చపై భౌతిక పరిమితులను పరిగణనలోకి తీసుకోవాలి. వారి భౌతిక పరిమితుల్లో అవసరమైన ఎదుగదల లేకుండా వారు రాజకీయంగా విముక్తి పొందలేరు. నిజానికి రాజకీయ విముక్తి ఒక్కటే సరిపోదు. మానవుడు మరింత ఉన్నతంగా మారడానికి అది అడ్డంకిగా మారుతుంది. అంటే వ్యక్తి నిరంతరం అబివృద్ధికరమైన ఆలోచనలు చేస్తూనే  వుండాలి.

విముక్తి, ఉదార హక్కులు, న్యాయం ఇవన్నీ కూడా పౌరుల ఎదుగుదలకు ఎంతోకొంత మేరకు తోడ్పడేవే. అట్లని  ఇవే అంతిమ ప్రజాస్వామిక లక్షణాలు కాబోవు. ప్రతి ఒక్కరికి ఇతర మానవుల నుండి రక్షణ అవసరం అనే ఆలోచన నుండి పుట్టినవే భూర్జువా హక్కులు. మనుషుల మధ్య వున్న భౌతిక, మానసిక విభజన, ఆధిపత్య శక్తుల నుండి ప్రజలను రక్షించడానికి రూపొందించబడింది. స్వేచ్చ జోక్యం నుండి ఉద్భవించిన ఉదారవాద ప్రజాస్వామ్యాలు  రాజకీయ విముక్తికి అడ్డంకిగా మారతాయి. సమాజంలో ప్రత్యేక వ్యక్తి అనే వాడు వుండడు. సమాజంలో ప్రత్యేకమైన వ్యక్తులు సృష్టించబడుతున్నారు. వారికే హక్కులు ప్రసాదించబడుతున్నాయి. వీళ్లంతా బూర్జువా సమాజపు దోపిడివర్గంలో వుండటం వల్లే వారికి ఆ స్థానం దక్కుతుంది.

ప్రైవేట్‌ ఆస్తి సమాజాన్ని సాంఘికీకరణ చేయలేదు. అందువల్ల, మానవ విముక్తి ప్రైవేటు ఆస్తి ద్వారా సాధించబడదు. ఉదార హక్కుల రంగాన్ని క్రమంగా విస్తరించడానికి స్వంత ఆస్తే ప్రధాన కారణంగా వుంటుంది. రాజకీయ స్వేచ్చ కూడా స్వంత ఆస్తి పునాది మీద నిర్మించబడుతుంది. అందుకే చైతన్యవంతమైన వ్యక్తి రాజకీయ విభజనను కోరుకోవాలి. బూర్జువా వ్యవస్థ పునాది మీద నిర్మించబడ్డ రాజాకీయానికి ప్రత్యేకమైన రాజకీయ ఆలోచన చేయాలి. రాజకీయ స్వేచ్చ మొదట భౌతిక పరిమితుల మధ్యనే విముక్తిని సాధించే ప్రక్రియను కొనసాగిస్తుంది. తద్వారా సమాజాన్ని తిరిగి సాంఘీకరించడం సాధ్యమవుతుంది. ఆధిపత్య శక్తుల మధ్య అధికార మార్చిడి జరిగినట్టుగా హఠాత్తుగా ఈ పరిణామం జరగదు. దీనికి మానవుడు విశేషమైన కృషి చేయాల్సి వుంటుంది.

కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో (1848)

ఈ ప్రకటన ప్రారంభంతో మ్యానిఫెస్టో వ్రారంభమవుతుంది. “ఒక భూతం ఐరోపాను వెంటాడుతోంది. అది కమ్యూనిజమనే భూతం. పాత ఐరోపాలోని అన్ని శక్తులు ఈ భూతానికి భూతవైద్యం చేయడానికి పవిత్ర కూటమిలోకి ప్రవేశించాయి”. ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న పార్టిలు అన్ని దేశాలలోను కమ్యూనిజంను అంతం చేయడానికి తమ కాలాన్ని శక్తిని వినియోగిస్తున్నాయి. ఇదే కమ్యూనిజానికి వున్న శక్తిని ప్రపంచానికి తెలియజేస్తోంది.

మ్యానిఫెస్టో యొక్క మొదటి విభాగం, బూర్జువా మరియు శ్రామికులు, చరిత్ర యొక్క భౌతికవాద భావనను వివరిస్తుంది. ఇప్పటివరకు ఉన్న అన్ని సమాజాల చరిత్ర వర్గ  పోరాటాల చరిత్ర అని మార్క్స్ సూత్రీకరించాడు. సమాజాలు ఎల్లప్పుడూ అణచివేతను ఎదుర్కొంటాయి. మైనారిటీలు మెజారిటీ కింద అణచివేయబడతాయి. ఆ అణచివేత నుండే మైనారిటీలు మెజారిటీగా ఉద్భవిస్తాయని మార్క్స్‌ చెప్తాడు. పెట్టుబడిదారీ విధానంలో, పారిశ్రామిక కార్మికవర్గం, లేదా శ్రామికులు, ఉత్పత్తి సాధనాల యజమానులైన బూర్జువాకు వ్యతిరేకంగా వర్గ పోరాటంలో పాల్గొంటారు. మునుపటిలాగే, ఈ పోరాటం సమాజాన్ని పునర్నిర్మించే విప్లవంలో లేదా పోటీపడుతున్న వర్గాల నాశనంతో ముగుస్తుంది. ఉత్పత్తి యొక్క నిరంతర విష్లవాత్మకత, అన్ని సామాజిక పరిస్థితుల యొక్క నిరంతరాయ భంగం ద్వారా సమాజంలో బూర్జువా వర్గం సుప్రీం వర్గంగా ఉద్భవిస్తుంది. ఫ్యూడలిజం యొక్క పాత శక్తులన్నింటిని స్థానభ్రంశం చేస్తుంది. బూర్జువా వర్షం శ్రామిక వర్గపు శ్రమశక్తిని లాభాల కోసం నిరంతరం దోపిడీ చేస్తుంది.

పెద్ద ఎత్తున లాభాలను సృష్టించుకుంటూ, మూలధనాన్ని కూడబెట్టుకుంటుంది. ఏదేమైనా, బూర్జువా దాని స్వంత సమాధిని తానే తవ్వుకునె పనిని ప్రారంభిస్తుంది. శ్రామికులు అనివార్యంగా తమ సొంత సామర్ద్యాన్నితెలుసుకుని, విప్లవం ద్వారా అధికారంలోకి వసారు, బూర్జువా వర్గాన్ని పడగొడతారు.

రెండవ భాగంలో “శ్రామికులు మరియు కమ్యూనిస్టులు” గురించి వివరణ వుంటుంది. కార్మికవర్గానికి, చైతన్యవంతులైన కమ్యూనిస్టులకు వున్న సంబంధాన్ని పేర్కోనడం ద్వారా ఈ భాగం ప్రారంభమవుతుంది. కమ్యూనిస్టుల పార్టీ ఇతర కార్మికవర్గ పార్టీలను వ్యతిరేకించదు. కానీ వాటిలా కాకుండా, ఇది విష్లవ ఆవశ్యకతను గుర్తిస్తూ, కార్మికుల్లో విప్లవ చైతన్యాన్ని నిరంతరం నింపడానికి కృషి చేస్తుంది. ప్రపంచ శ్రామికుల ఉమ్మడి ప్రయోజనాలను రక్షించే ప్రయత్నం చేస్తుంది. అదే క్రమంలో కార్మికుల జాతీయ ఐక్యతకు కృషి చేస్తుంది. కమ్యూనిజం పై వస్తున్న విమర్శలకు మార్క్స్ ఘాటుగా సమాధానం చెపుతాడు. కమ్యూనిజం ప్రజలను పని చేయకుండా ప్రోత్సహిస్తుందనే వాదనలు తప్పని మార్క్స్‌ చెప్తాడు. కార్మికవర్గ తన పోరాటంలో భాగంగా బూర్జువా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి కొన్ని డిమాండ్లను సాధించు కోవాలి.

వారసత్వపు హక్కు ప్రైవేటు ఆస్తిని రద్దు చేయడం లాంటివి కమ్యూనిజం ముఖ్య లక్షణాలని చెప్తాడు. బాల కార్మిక వ్యవస్ధ రద్దు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, రవాణా, కమ్యూనికేషన్‌ వ్యవస్థల జాతీయం, బ్యాంకులను జాతీయం చేయడం, ప్రభుత్వ భూమిని పేదలకు పంచడం లాంటి లక్ష్యాల కోసం కమ్యూనిజం పనిచేస్తుందని వివరిస్తాడు. మూడవ విభాగం, “సోషలిస్ట్ మరియు కమ్యూనిస్ట్‌ సాహిత్యం”పై దృష్టి పెడుతుంది. ప్రత్యర్థి దృక్పథాలలో వస్తున్న మార్పులను గమనిస్తూ, ఎప్పటికప్పుడు విమర్శనాత్మకమైన సాహిత్య సృష్టి చేయాలని మార్క్స్ చెపుతాడు.

పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌, పోలాండ్, జర్మనీ వంటి నిర్దిష్ట దేశాలలో పోరాటాలపై కమ్యూనిస్ట్‌ స్ధానం గురించి నాలుగొవ భాగం క్లుప్తంగా చర్చిస్తుంది. ప్రజాన్వామ్య సోషలిస్టులతో పొత్తును ప్రకటించడం ద్వారా, ఇతర కమ్యూనిస్ట్‌ విప్లవాలకు ధైర్యంగా మద్దతు ఇవ్వడం, ఐక్య అంతర్జాతీయ శ్రామికుల విప్లవ చర్యకు పిలుపునివ్వడం ద్వారా మెనిఫెస్టో ముగుస్తుంది. చట్టానికి సంబంధించి చాలా శాశ్వతమైన, ప్రసిద్దమైన మార్క్స్‌ ఆలోచనల మూలం కమ్యూనిస్టు మెనిఫెస్టోలో వున్నాయి. 1848 లో మార్క్స్ ఎంగెల్స్‌తో కలిసి కమ్యూనిస్ట్‌ మానిఫెస్టో రాశాడు. బూర్జువా న్యాయ వ్యవస్థ కేవలం పెట్టుబడిదారి ఉత్పత్తి విధానాన్ని వాటి సంబంధాలను అభివృద్ధి చేస్తుంది. పాలకవర్గపు ఆలోచనలు బూర్జువా ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడుతాయి. స్వంత ఆస్తిని (బూర్జువా ఆస్తి) కాపాడుకోవడం కోసం న్యాయవ్యవస్థ, పాలకవర్గం రూపొందించిన చట్టాలు ఉపయోగపడతాయి. బూర్జువా పాలకులు ఇష్టమే అందరీ ఇష్టంగా రుద్దబడుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించే చట్టాలే ప్రజలందరికీ సమానత్వాన్ని, స్వేచ్చను ఇస్తాయనే భావనను ప్రజల మీద బలవంతంగా రుద్దుతారు.

వ్వవస్టలో వర్గాలు వున్నాయని, మెజారిటీ ప్రజలు తమను తాము ఒక వర్గంగా చూసుకునే, మలుచుకునే ఆలోచనలు చట్ట వ్యతిరేకం కాబడతాయని మార్క్స్‌ చెప్పాడు. వర్గ ఉనికి కేవలం ఆర్థిక పరిస్థితుల ద్వారా నిర్ణయించబడతాయి. బూర్జువా చట్టానికి వర్గ స్వభావం వుంటుంది. బూర్జువా న్యాయ శాస్త్రం, పెట్టుబడిదారుల హక్కులను కాపాడుకునే దానికే రూపొందించబడింది. ఉత్పత్తి సంబంధాల మార్పును ఈ చట్టాలు ఆమోదించవు. చట్టాలు పాలకవర్గపు ఆధిపత్యాన్ని స్థిరీకరించడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా బూర్జువా చట్టం మెజారిటీ ప్రజల హక్కులను కాలరాస్తుంది. సామాజిక ఆధిపత్యాన్ని కొనసాగించడానికి, ఉద్దేశపూర్వక వ్యూహమే చట్టాల రూపకల్పన. కానీ చట్టాలను అందిరికీ సమానత్వ ప్రాతిపదికన రూపొందించనట్టు పాలకవర్షం నమ్మకమైన వ్యక్తీకరణ చేస్తుంది. కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో నుండి ఆధునిక పాలన, దాని ఆలోచన ఉద్భవించింది. చట్టం పాలకవర్గానికి ఆధిపత్యం యొక్క సాధనం తప్ప మరొకటి కాదు.

చట్టాన్ని అర్ధం చేసుకోవడంలో మార్క్స్‌ విమర్శనాత్మకమైన వైఖరిని అవలంభించాడు. చట్టాలు ఎంతమేరకు ప్రజల హక్కులకు ఉపయోగపడతాయో అంతమేరకు వినియోగించాలి. అలాగే చట్టాల నేపధ్యాన్ని చట్టాల రూపకల్పనలో పాలక వర్గాల వైఖరిని విమర్శనాత్మక దృష్టితో చూడాలి.

ఎకనామిక్‌ ఆఫ్‌ ది క్రిటిక్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ఎకానమీ” (1859) లో ‌ చట్టంపై మార్క్స్ అభిప్రాయం

అలెక్సిస్‌ డి టోక్సిల్లె పరిశీలనలను అభివృద్ధి చేయడంలో, మార్క్స్‌ పొర సమాజాన్ని ఆర్ధిక ప్రాతిపదికగా, రాజకీయ సమాజాన్ని రాజకీయ సూపర్‌ (స్టక్చర్‌గా గుర్తించాడు. ఎ కాంట్రిబ్యూషన్‌ టు ది క్రిటిక్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ఎకానమీ (1859) కు తన ముందుమాటలో బేస్‌-సూపర్‌ స్ట్రక్చర్‌ భావన లోని ముఖ్యమైన అంశాలను మార్క్స్ ‌
ప్రతిపాదించాడు.

సాంఘీక ఉత్పత్తిలో భాగంగా ప్రజలు సంబంధాలలో వుంటారు. ప్రజలు అనివార్యంగా వారి ఇష్టానికి వ్యతిరెకమైన,  స్వతంత్రమైన ఖచ్చితమైన సంబంధాలలోకి ఉత్పత్తి లేదా పనిలో భాగంగా ప్రవేశిస్తారు. అనగా ఉత్పత్తి సంబంధాలు ఉత్పత్తి శక్తుల అభివృద్ధిలో ఒక నిర్దిష్ట దశకు చేరుకుంటాయి. ఉత్పత్తి సంబంధాలు, వాటి ఆర్ధిక నిర్మాణం పునాదిగా వుంటాయి. దీనిపై చట్టపరమైన, రాజకీయ సూపర్‌ స్ట్రక్చర్‌ పుడుతుంది. సామాజిక స్పృహ, మిగిలిన ఉపరితల రూపాలన్నీ పునాదిపైన ఆధారపడి వుంటాయి. భౌతిక జీవితాల ఉత్పత్తి విధానమే సామాజిక, రాజకీయ, మేధో ఆలోచలను నియంత్రిస్తుంది. ప్రజలు తమ చైతన్యం ద్వారా ఉనికిలో వుంటారు. అలాగే వారి సామాజిక ఉనికి వారి చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. అభివృద్ధి యొక్క ఒక నిర్దిష్ట దశలో, సమాజంలోని భౌతిక ఉత్పాదక శక్తులు ప్రస్తుతమున్న ఉత్పత్తి సంబంధాలతో విఖేదిస్తాయి.

పునాది, ఉపరితలం పరస్పర ఆధారితాలుగా వుంటాయి. చట్టాలు ప్రజల విబేధపు చర్యలను నేరపూరితం చేస్తాయి. వారు ఇప్పటివరకు పనిచేసిన చట్రంలో ఉన్న ఆస్తి సంబంధాలతో ఘర్షణ పడతారు. ఉత్పాదక శక్తుల అభివృద్ధి రూపాల నుండి, ఉపరితల సంబంధాల్లో మార్పు వస్తుంది. అప్పుడు సామాజిక విప్లవం యొక్క శకం ప్రారంభమవుతుంది. ఆర్థిక పునాదిలో మార్పులు మొత్తం సూపర్‌ స్టక్చర్‌ పరివర్తనకు దారితీస్తాయి. ఇటువంటి పరివర్తనలను అధ్యయనం చేసేటప్పుడు, సహజ విజ్ఞాన శాస్తం ఖచ్చితత్వంతో ఉత్పత్తి సంబంధాలను పరిశీలించగలగాలి. పునాదిలోని ఉత్పత్తి సంబంధాలు, ఆర్ధిక పరిస్టితులను అలాగే ఉపరితలంలోని చట్టబద్ధమైన, రాజకీయ, మత, కళాత్మక, తాత్వికత, సైద్దాంతిక
మధ్య తేడాలను గుర్తించడం ఎల్లప్పుడూ అవసరం.

ఈ సంఘర్షణ భౌతిక జీవిత వైరుధ్యాల నుండి వివరించబడాలి. ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల మధ్య ఘర్షణ వ్యవస్ధ మార్పులకు దారి తీస్తుంది. దీనికి మానవ ప్రయత్నం తప్పనిసరి. ఇది ఈ ఘర్షణను తీవ్రతరం చేసి విప్లవ దశకు తొందరగా తీసుకెళుతుంది. చట్టాలు పూర్తిగా ఆ వ్యవస్థ ఉత్పత్తి సంబంధాల మీద ఆధారపడి వుంటాయి. ఉపరితలంలోని అంశాలు పునాదిలోని అంశాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఉపరితలంలో చేసే పోరాటాలు పునాదిలోని అంశాలను మార్చే అవకాశం వుంటుంది. అందుకే ఉద్యమించే హక్కుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. దీనికోసం కొత్త చట్టాలను తీసుకురావడానికి లేదా ఉద్యమించే హక్కును రాజ్యంగంలో పొందుపరిచెదానికి నిరంతరం ప్రయత్నం చేయాలి.

హక్కుల పోరాటానికి స్వతంత్రత వుండదు. ఆయా సమాజపు అభ్యుదయ పోరాటాలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా హక్కుల పోరాటాలు తమ విస్త్రుతిని పెంచుకోవాలి. తమ దిశను మలుచుకోవాలి. లేనిపక్షంలో వాటిలో హక్కుల చైతన్యం కొరవడి, చివరకు తన ఉనికినే కోల్పోయే ప్రమాదముంది. సామాజిక పరివర్తనకు దారితీసే భౌతిక పరిస్థితులను గుర్తించాలి. పరివర్తన కోసం పోరాడుతున్న ఉద్యమాలలో వున్న ప్రజాస్వామిక లక్షణాలను గుర్తించాలి. అటువంటి హక్కుల చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించాలి. అలా లేనిపక్షంలో హక్కుల పోరాటం ఎట్టి పరిస్థితుల్లోను ప్రజా పక్షం వహించదు.

జనరల్‌ లా ఆఫ్‌ థియరీని, మార్చిస్టు దృష్టి కోణంలో చూడటానికి అనేక అంశాలను పరిశీలించాల్సి వుంటుంది. సాధారణ న్యాయ సిద్దాంతాన్ని రూపొందించే ప్రధాన వర్గాల క్లిష్టమైన విశ్లేషణను కొనసాగించడానికి మార్క్స్ ఒక క్రమాన్ని అనుసరించాడు. ఇది చట్ట రూపం, వ్యవస్థ రూపం మధ్య వున్న సారూపత్యలను తెలియజేస్తుంది. మౌలిక సదుపాయాలు, సూపర్‌ స్టక్చర్‌ మధ్య సంబంధాల సాపేక్షికతను, దాని విశ్లేషణను తెలుసుకోవాలి. చట్టాన్ని కేవలం సైద్ధాంతిక వ్యక్తీకరణగా అర్ధం చేసుకోవడం సరైనది కాదు. న్యాయపరమైన రూపాన్ని ప్రవేశపెట్టబడినంత మాత్రాన న్యాయం ప్రజలకు అందదు. మార్క్స్ చట్టాన్ని సరుకుగానే చూడమంటాడు. అంటే పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో సంపద యొక్క ప్రాథమిక రూపాన్ని తెలుసుకోవాలి. సృష్టించిన సంపదను కాపాడటానికే చట్టాలు ఉపయోగపడతాయి. దీనితో అతను చట్టపరమైన అంశాలు కేవలం రూపంలోనే సమాజానికి కనిపిస్తాయి. సాధారణ న్యాయ సిద్దాంతానికి కేంద్ర మూలకం వ్యవస్థ ఉత్పత్తి సంబంధాలలో వుంటుంది.సరుకుల సంరక్షకులే చట్టాలను, న్యాయాలను రూపొందిస్తారు.

వ్యవస్టను, అది రూపొందించిన న్యాయవ్యవస్ధను అర్ధం చేసుకోవడానికి కొన్ని విషయాలను పరిశీలించాలి. సాధారణ నుండి సంక్షిష్టంగా, రూపం నుండి దాని సారంలోకి, మరింత లోతుగా అధ్యయనం చేయాలి. న్యాయశాస్త్రం విషయంలో అధికారశక్తులను బిందువుగా చేసి పరిశీలించాలి. సమాజంలో వున్న భావనలకు ఒక చరిత్ర వుంటుంది. అంటే అవి మానవ మేధస్సు సష్టించిన ఆలోచనలుగా బయటకి కనిపిస్తాయి. కానీ అవి ఖచ్చితమైన, చారిత్రాత్మకంగా వేరు చేయబడిన సామాజిక సంబంధాలకు అనుగుణంగా ఉంటాయి. ఉదాహరణకు,విలువ, చట్టం ఈ రెండు భావనలు, గత సాంఘిక నిర్మాణాల సంక్లిష్టత నుండే పుడతాయి. జనరల్‌ థియరీ ఆఫ్‌ లా, మార్చిజం నేపథ్యంలో ఏర్పడిన మార్క్సిజంపై సంప్రదాయ పద్దతి కూడా గణనీయమైన పురోగతి సాధించడంలో విఫలమైందని విమర్శకులు అంటారు.

మార్క్స్‌ కాపిటల్‌

సహజంగానే, కాపిటల్‌ పుస్తకంలో ఉన్న పద్దతి, సమస్యలకు సంబంధించిన విషయాలు సంక్షిష్టమైనవి. వీటిని అర్ధంచేసుకోవడానికి కృషి చేయాలి. చట్ట కోణంలో భాగంగా, కాపిటల్‌లోని కొన్ని భాగాలతోనే వ్యాసాన్ని విస్తరించడం జరిగింది. అందులో ముఖ్యంగా ది ప్రాసెస్‌ ఆఫ్‌ క్యాపిటల్‌ అక్యుమ్యులేషన్‌, సింపుల్‌ రిప్రోడక్షన్‌, మిగులు విలువను మూలధనంగా మార్చడం లాంటి అంశాలనే వ్యాసంలో చర్చించడం జరిగింది. ఇవి చట్టాల ద్వరా వస్తువుల ఉత్పత్తిని నియంత్రించే అంశాలను తెలియజేస్తుంది. ఆస్తి చట్టం ఎలా పాలకవర్గాలకు ఉపయోగపడుతుందో తెలియజేయడానికి పనికివస్తాయి. అలాగే చట్టాలు, న్యాయశాస్త్రం పెట్టుబడిదారి సముపార్జనకే కట్టుబడివుంటాయి.

మిగులు విలువను అదనపు మూలధనంగా పెట్టుబడిదారుడు ఎలా మార్చుతాడో అనే అంశాన్ని పరిశీలించాలి. దీనివల్ల ఉపరితలంలోని చట్టాల అసలు పరమార్ధం బట్టబయలు అవుతుంది. మూలధనం శ్రమశక్తిని కొనుగోలు చేయడం వలన సంభవించింది. వస్తువుల మార్పిడి, కొనుగోలు, కార్మికుడి జీతాలు, కార్మికుని స్వంత సామర్ద్వం,వస్తువుల సరఫరా, వస్తువులను వినియోగదారుడు కొనడం లాంటి అంశాలు ఇందులో ఇమిడి వుంటాయి. వీటిలోని ప్రతి అంశానికి ఒక నిర్దిష్టమైన చట్టం వుంటుంది. శ్రామికుడి శ్రమశక్తి విలువకు పూర్తి మొత్తం, జీతాల రూపంలో అతనికి చెల్లించబడువు.

శ్రమ, ఆస్తి

చట్టాల ప్రకారమే పెట్టుబడిదారుడు ఎల్లప్పుడూ శ్రమ శక్తిని కొనుగోలు చేస్తాడు. కార్మికుడు దానిని ఎల్లప్పుడూ అమ్ముతాడు. అందువల్ల చట్టాలు కేవలంవపెట్టుబడిదారులు స్వంత ఆస్టిని కూడబెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే అతను శ్రామికులు సృష్టించిన అదనపు విలువను లాభాల రూపంలో పొందుతాడు. ఈ లాభాలు శ్రామికుడు సృష్టించినవే. అయినా ఇది శ్రామికుడు స్వంతఆస్థిని సృష్టించడానికి ఉపయోగపడదు. ఎందుకంటే, మొదటగా, శ్రమశక్తి ద్వారా మార్పిడి చేయబడిన మూలధనం ఇతర వ్యక్తుల ఉత్పత్తిలో భాగం. దాని నిర్మాత కార్మికుడు. ఒకసారి మిగులును యజమానికి ఇవ్వడం కాదు. పాత మిగులుతో, కొత్త మిగులుతో కూడా అతను అదనపు విలువను నిరంతరం సృష్టిస్తూనే వుండాలి.

శ్రామికశక్తి నిరంతర కొనుగోలు, అమ్మకానికి ప్రధానమైన రూపం. ఎందుకంటే శ్రామికుడు తన శ్రమశక్తిలో కొంతభాగం అమ్ముకుని వేతనం తీసుకుంటాడు. ఆ వేతనంతో బతకడానికి, అవసరానికి సరుకులు కొంటాడు. పెట్టుబడిదారుడు ఇప్పటికే ఇతరుల నిష్పాక్షికమైన పనిలో కొంత భాగాన్ని నిరంతరం మార్పిడి చేస్తాడు. ఇది ఇతరుల జీవన శ్రమ మొత్తానికి సమానంగా వుండదు. వాస్తవానికి, ఆస్తిపై హక్కు శ్రామికుని పని మీదనే స్థాపించబడింది. కనీసం, దీనిని బూర్జువా వ్యవస్ధ అంగీకరించవలసి ఉంది. ఎందుకంటే సమాన హక్కులతో వస్తువులను కలిగి ఉన్నవారు మాత్రమే ఒకరినోకరు ఎదుర్కొంటారు. పెట్టుబడిదారుడు, కార్మికుడు ఘర్షణ రూపంలో దీనిని మనం గమనించవచ్చు. కాని ఇతరుల వస్తువులను స్వాధీనం చెసుకునే సాధనాలు వారి స్వంత సరుకుల పరాయీకరణ మాత్రమే. దీనిని కేవలం శ్రమ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు, దీనికి విరుద్ధంగా, ఆస్తి పెట్టుబడిదారుల పక్షాన కనిపిస్తుంది. ఇతర వ్యక్తుల చెల్లించని శ్రమకు, ఉత్పత్తికి తగిన హక్కుగా తన సోంత ఉత్పత్తిని స్వాధీనం చేసుకోవడం కార్మికుడికి అసాధ్యమవుతుంది. ఆస్తి, శ్రమ మధ్య విభజనను సృష్టించడానికే చట్టాలు చేయబడ్డాయని మార్క్స కాపిటల్‌ రుజువుచేస్తుంది. చట్టం ఆస్తి, శ్రమ రెండింటి యొక్క గుర్తింపు నుండి స్పష్టంగా ఉద్భవించింది.

అందువల్ల, పెట్టుబడిదారి విధానం వస్తువుల ఉత్పత్తి యొక్క సాధారణ చట్టాలను ఉల్లంఘించినట్లు కనిపిస్తుంది. ఇది ఉల్లంఘన నుండి ఉదృవించదు. కానీ, ఈ చట్టాలను పాటించడం వల్ల ఉద్భవిస్తుంది. మూలధనం పునరుత్పత్తి అంటే ఉత్పత్తి ప్రక్రియ పునరావృతం తప్ప మరేమీ కాదు. ఉత్పత్తి మొదటి చర్య ఫలితంగా వచ్చిన వస్తువులు నగదుగా మార్చబడ్డాయి. పెట్టుబదిదారుడు చేతిలో ఆ మొత్తాన్ని మొదటి పెట్టుబడి అంటారు. అదనంగా మిగులు విలువను కలిగి ఉంటుంది. ఈ ఉత్పత్తి కొనసాగింపు అంటే “క్రొత్త” ఉత్పత్తిని ఇస్తుంది. ఈ విధంగా మూలధనం యొక్క పునరుత్పత్తి స్థిరీకరించబడుతుంది. ఉత్పత్తి చేయబడిన మిగులు విలువకు సంబంధించిన మొత్తాన్ని పూర్తిగా 'పెట్టుబదిదారుడు వినియోగిస్తే, ఉత్పాదక సర్క్యూట్‌కు తిరిగి రాకపోతే, మార్క్స్‌ దానిని సాధారణ పునరుత్పత్తి అని పిలుస్తాడు. మరోవైపు, ఈ మిగులు విలువ లేదా దానిలో కొంత భాగాన్ని ఉత్పత్తి ప్రక్రియలో తిరిగి ప్రవేశపెడితే, పునరుత్పత్తి విస్తరించబడుతుంది. లాభాలు మూలధనానికి చేరుతూనే వుంటాయి.

పెట్టుబడిదారి చేతిలో ఉత్తత్తి సాధనాలు వుంటాయి. అంటే ప్రైవేట్‌ యాజమాన్యం ఉత్పత్తి సాధనాలను, కార్మికుడి శ్రమశక్తిని రెండింటిని అజమాయిషీ  చేస్తుంది. కార్మికుడి స్వేచ్చ, ఉత్పత్తి సాధనాలను ఉపయోగించి అతని శ్రమ శక్తి ఉచిత లభ్యతను యజమానికి ఇవ్వడం వరకే పరిమితమై వుంటుంది. చట్టాల ఒప్పందం ద్వారానే కార్చికుడిని ఉత్పత్తి మార్తాల్లోకి చేర్చడం, స్వేచ్చగా అదనపు విలువను సృష్టించడం, పెట్టుబడిదారుడు లాభాలు పొందదం జరుగుతుంది.

 ఇది పెట్టుబడిదారుడు, కార్మికుడు స్వేచ్చగా మార్కెట్లో కనిపిస్తుంది. సమానమైన మార్పిడి చేసుకోవచ్చు. అసలు సర్దుబాటులో పనిని శ్రామికుడు మాత్రమే చేస్తాడు. స్థానాల సమానత్వం ఆధారంగా పరిపూర్ణ, న్యాయపరమైన లావాదేవీగా మార్కెట్‌ సంబంధాలు కనబడతాయి. ఉత్పత్తి యొక్క పునరావృతం, మిగులు విలువను నిరంతరం వెలికితీస్తుంది. ఒక నిర్దిష్ట సమయం నుండి, చట్రంలో చొప్పించిన మొత్తం విలువ నుండి వచ్చిన లాభాలలో శ్రామికుడికి వాటా వుండదు. దోపిడీ సంబంధం వర్గీకరించబడుతుంది.

చట్టం యొక్క ప్రాథమిక మార్క్సిస్టు భావన క్యాపిటల్‌ లో స్పష్టంగా కనబడుతుంది. వస్తువులు మార్కెట్‌కు వెళ్లి తమ సొంత ఖాతా మార్పిడి చేసుకోలేవు. అందువల్ల మనిషికి వ్యతిరేకంగా ప్రతిఘటన శక్తి లేకుండా ఉంటుంది. ప్రతిఘటన శక్తి వుంటే, అతను శక్తిని ఉపయోగించవచ్చు. మరో మాటలో చెప్పాలంటే, అతను వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. ఈ వస్తువులు ఒకదానితో ఒకటి సరుకుగా ప్రవేశించాలంటే, వారి సంరక్షకులు ఒకరికొకరు సంబంధం కలిగి ఉండాలి. స్వంత ఆస్టిపైన బూర్జువా వ్యవస్ద ఆధారపడి వుంటుంది. అందుకే వ్యవస్ధ ప్రైవేటు  యజమానుల హక్కును గుర్తిస్తుంది. ఈ న్యాయవ్యవస్థ సంబంధం, ఆర్ధిక పరమైన ఒప్పందంలో తనను తాను వ్యక్తపరుస్తుంది. అటువంటి ఒప్పందం, అభివృద్ధి చెందిన న్యాయ వ్యవస్థలో భాగంగానే వుంటుంది. పెట్టుబడిదారుడు, కార్మికుడు ఈ రెండింటి మధ్య నిజమైన ఆర్థిక సంబంధపు ప్రతిబింబంబమే న్యాయవ్యనస్ట. ఆర్థిక సంబంధమే ప్రధానంగా న్యాయవ్యవస్థలో ఉన్న ప్రతి అంశాన్ని నిర్ణయిస్తుంది.

మార్క్స్ ప్రకారం, చట్టం అనేది స్ధానాల మార్కెట్‌లో వినియోగదారులందరి స్వేచ్చ , సమానత్వంతో వర్గీకరించబడిన ఒక సామాజిక సంబంధం.  అనగా, సమానత్వం, స్వేచ్చ, ఆస్ధి వీటి పరిశీలన ద్వారా, మార్కెట్లో ఉన్నప్పుడు వస్తువులను కొనడానికి, అమ్మడానికి ప్రతి ఒక్కరు అర్హత కలిగవుంటారు. మార్పిడి సందర్భంగా వారి సంకల్పం, సేకరించే సాపేక్ష యంప్రతిపత్తి, ధరలు,  చెల్లింపు రూపాలు మొదలైనవాటిని మార్కెట్‌ సంబంధాల్లో భాగంగానే చర్చించగలం 
ఇవన్నీ వర్తక సర్క్యూట్ ను కదిలిస్తున్నట్లు కనిపిస్తాయి. వాస్తవానికి, మార్కెట్‌ వ్యవస్థలో యజమానులు కేవలం వ్యక్తులుగా కనిపిస్తారు. సహజ హక్కులు కలిగిన జీవులుగా వుంటారు. స్వేచ్చ, సమానత్వం, సంకల్పం యొక్క స్వయంప్రతిపత్తి, సమాన విలువలు ఇవన్నీ ప్రైవేట్‌ ఆస్తి, మార్కెట్‌ వ్యవస్థ ఆధారితంగా తీసుకోబడినవి. యజమాని దోపిడీ సంబంధాలు ఫ్యాక్టరీలోనే కనిపిస్తుంది. మార్కెట్‌ లో కనిపించదు.

సరుకును కలిగి ఉన్న వ్యక్తికి చట్టం, చట్టానికి సంబంధించిన సాంప్రదాయ సిద్దాంతాలు కేంద్రంగా వుంటాయి. ఉదాహరణకు సహజ హక్కు, సమాజం నుండి వచ్చిన కట్టుబాటు, చట్టం ఇచ్చిన హక్కు ఇవన్నీ ఆ న్యాయవ్యవస్థ క్రమానుగతంగా ఎదిగిన చారిత్రక సంబంధాలను వ్యక్తీకరిస్తుంది.

ఈ విధంగా, ఉత్పత్తి ప్రక్రియలో వ్యక్తుల మధ్య ఉన్న సామాజిక బంధం, శ్రమ ఉత్పత్తులలో ధృవీకరించబడింది. ఇది ఒక ప్రాథమిక సూత్ర రూపాన్ని తీసుకుంటుంది. ఉత్పత్తులను కలిగి ఉన్న వ్యక్తులుగా, వ్యక్తుల మధ్య వున్న నిర్దిష్ట సంబంధాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి, అదే సమయంలో, శ్రమను దోచుకున్న వ్వక్తి ఆస్థిని సంపాదిస్తాడు. ఆస్తిని సంపాదించి, విలువ వున్న వ్యక్తిగా చెలామణి అవుతాడు. అతను మాత్రమే హక్కు విలువను పొందుతాడు. అతనికే చట్టం ఇచ్చిన హక్కులు వర్తిస్తాయి.

ఏదేమైనా, మార్క్సిస్టు  పరిశోధనల రంగంలో విభేదాలు ఉన్నప్పటికీ, మార్స్క్  చేసిన చట్టం యొక్క భావన చాలా మేరకు అభివృద్ధి చెందుతుందని ధృవీకరించవచ్చు. వాస్తవానికి, ఉత్పత్తి, పెట్టుబడి సంబంధాలు పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు, న్యాయపరమైన చట్టాలు అనేకం వచ్చాయి. అంటే ప్రతి వ్యవస్ధ అభివృద్ధి చెందుతున్న దశలోనే హక్కులు, భద్రత పేరుతో ఎక్కువ చట్టాలు వచ్చాయి. మిగులు విలువను ఎవరూ, ఎలా పొందుతున్నారనే అంశాన్ని ఆర్ధికశాస్త్రవెత్తల అందరిలోను ఒక్క మార్క్స్  మాత్రమే స్పష్టంగా చెప్పాడు. కానీ న్యాయవ్వవస్థ, ఆడమ్‌స్మిత్‌, రికార్డో ‌ లాంటి పెట్టుబడిదారి మేధావుల ఆలోచనలకు అనుగణంగా రూపొందించబడింది.

వాణిజ్య చట్టాలు పెట్టుబడిదారి సముపార్జన చట్టాలుగా మారాయి. అందుకే వర్తకుడు ఆస్ధిని సంపాయించుకోవడానికి కావలవసిన పరిస్థితులను చట్టం ద్వారా కల్పించారు. ఉత్పత్తి జరిగే క్షణం నుండి మార్కెట్‌లో సరుకు అమ్మకం వరకు పెట్టుబడిదారుడి అభీష్టం మేరకే జరుగుతుంది. చట్టాలు పెట్టుబడికి మద్దతు ఇచ్చే వ్యవస్థను తయారుచేశాయి. నిజానికి పెట్టుబడిదారులు చాలామంది రాజకీయ నాయకులు అవుతున్నారు. కాబట్టి,  పెట్టుబడిదారులే చట్టాలు తయారుచేస్తున్నారు అని చెప్పడం సముచితంగా వుంటుంది. చట్టాల విషయంలో
విమర్శనాత్మక ధోరణి అవసరం అని గ్రహించాలి.

ది క్రిటిక్‌ ఆఫ్‌ ది గోధా ముసాయిదా తీర్మానం (1875)

ది క్రిటిక్‌ ఆఫ్‌ ది గోథా ప్రోగ్రాం కార్ల్‌ మార్క్స్ మే 1875 ప్రారంభంలో సోషల్‌ డెమోక్రటిక్‌ వర్సెస్ ‌ పార్టి ఆఫ్‌ జర్శనికు రాసిన లేఖ ఆధారంగా ఈ పత్రం తయారుచేయబడింది. విప్లవాత్మక వ్యూహంపై ప్రణాళికాబద్ద విషయాలపై మార్క్స్‌ అత్యంత వివరణాత్మక ప్రకటనను అందించాడు. పెట్టుబడిదారి విధానం నుండి కమ్యూనిజంలోకి మారడంలో రెండు దశల సిద్దాంతాన్ని ఈ పత్రంలో పేర్కోన్నారు. ఈ పత్రం పెట్టుబడిదారి విధానం, శ్రామికుల నియంతృత్వం, కమ్యూనిజం అనే దశలను ప్రస్తావించింది. శ్రామికుల అంతర్జాతీయవాదం కార్మికవర్గ  పార్టీకి పరివర్తన చెందుతున్న కాలం గురించి చర్చిస్తుంది. పెట్టుబడిదారీ విధానం నుండి పరివర్తనను కమ్యూనిస్ట్‌ సమాజం కాంక్షిస్తుంది. “ప్రతి ఒక్కరి నుండి అతని సామర్థ్యం ప్రకారం, ప్రతి ఒక్కరికి తన అవసరాలకు అనుగుణంగా” “తన సహకారం ప్రకారం ప్రతి ఒక్కరికి సూత్రాలను మార్క్స్‌ వివరించాడు. కమ్యూనిస్టు సమాజం భవిష్యత్తు ఉన్నతదశకు ఆధారం. దిగువ దశను వివరించడంలో, “వ్యక్తి సమాజానికి తాను ఇచ్చేదానిని అందుకుంటాడు” అని మార్క్స్ పేర్కోన్నాడు. 

మార్క్స్‌ మరణం తరువాత ప్రచురించబడిన ది క్రిటిక్‌ ఆఫ్‌ ది గోథా ప్రోగ్రాం, మార్క్స్‌ చివరి ప్రధాన రచనలలో ఒకటి. గోథా పట్టణంలో జరగబోయే పార్టి కాంగ్రెస్‌ కోసం ప్రతిపాదిత పార్టి వేదిక మ్యానిఫెస్టో అయిన గోథా ప్రోగ్రాం పేరే ఈ లేఖకు పెట్టారు. కార్మికుల ఐక్య పార్టి కోసం ముసాయిదా కార్యక్రమాన్ని మార్క్స్ కు వ్యాఖ్య కోసం పంపారు. ఈ కార్యక్రమం లాస్సాల్లే కు ప్రతికూలంగా ఆయన గుర్తించాడు. ప్రభుత్వం డి రాయితీలకు బదులుగా కార్మికుల ఉద్యమ డిమాండ్లను పరిమితం చెయడానికి సిద్ధంగా ఉన్న అవకాశవాదిగా మార్క్స్ భావించాడు. ఏదేమైనా, మే 1875 చివరలో గోథాలో జరిగిన కాంగ్రెస్‌లో, శక్తివంతమైన సోషల్‌ దెమోక్రటిక్‌ పార్టి ఆఫ్‌ జర్మని (ఎస్‌పిడి) గా మారడం ద్వారా ముసాయిదా కార్యక్రమాన్ని చిన్న మార్పులతో మాత్రమే అంగీకరించారు. మార్క్స్‌ లేఖను ఎంగెల్స్‌ చాలా కాలం తరువాత ప్రచురించాడు.

సనాతన మార్క్సిస్టుల విప్లవాత్మక విధానానికి విరుద్ధంగా గోథా కార్యక్రమం సోషలిజానికి మితమైన, పరిణామ మార్గాన్ని అందించింది. ఈ సిద్ధాంతం ప్రకారం, కమ్యూనిజానికి పరివర్తనలో, బూర్జువా హక్కును వెంటనే రద్దు చేయలేము. కానీ మధ్యవర్తిత్వ దశ అవసరం. ఇది శ్రామికుల నియంతృత్వ దశ. దీనిలో రాజకీయ, న్యాయ, పెట్టుబడిదారీ సంబంధాలతో వున్న ఉపరితలం వుంటుంది.  రాజ్యం, న్వాయ వ్వవస్థ పూర్తిగా రద్దు కావు. ఇవన్నీ శ్రామికులచే
నిర్వహించబడతాయి. ఈ మధ్యవర్తిత్వ దశ మంచి పంపిణీని నిర్ధారిస్తుంది. శ్రామికుడి ఉత్పత్తులు, ప్రతి కార్మికుడు తన పని యొక్క పూర్తి విలువకు అర్హులు అనే ప్రాతిపదికగా పంపిణీ వుంటుంది. బూర్జువాలకు హక్కులుంటాయి. అయితే వ్యక్తిగత నిర్మాతల మధ్య పంపిణీకి సంబంధించినంతవరకు, అదే వస్తువుకు సమానమైన మార్పిడి ఉంటుంది. ఒక రూపంలో ఇచ్చిన శ్రమ మొత్తం మరొక రూపంలో సమానమైన శ్రమ కోసం మార్పిడి. అందువల్ల, ఇక్కడ సమాన హక్కు సూత్రప్రాయంగా ఉంటుంది.

ఈ సమాన హక్కు అసమాన శ్రమకు అసమాన హక్కు ఇది వర్గ  భేదాలను గుర్తించదు. ఎందుకంటే అందరూ అందరిలాగే కార్మికులు మాత్రమే. కానీ ఇది అసమాన వ్యక్తిగత యోగ్యతను నిశ్ళబ్దంగా గుర్తిస్తుంది. ఉత్పాదక సామర్ధ్యం, సహజ హక్కుగా వుంటుంది. ఏదేమైనా, సమాన హక్కులు మరింత అభివృద్ధి కరమైన న్యాయమైన వ్యవస్థకు వెళ్ళడం ద్వారా మాత్రమే సాధించబడుతుంది.

మార్క్స్‌ తరువాత

ఈ మార్క్సిస్టు‌ ఆలోచనలు చాలావరకు మరింత అభివృద్ధి చెందాయి. తరువాతి చరిత్రలో ఆచరణ పరీక్షకు కూడా నిలబడ్డాయి. మార్క్సిజం యొక్క సోషలిస్టు శిబిరంలో దీర్హకాలిక విభజన జరిగింది. మార్క్సిస్టుల, ఇతరులు మధ్య వ్యతిరేకత ఎక్కువైంది. అరాచకవాదులు, సంస్కరణవాదులు బయలుదేరారు. ఈ ఇద్దరు ప్రత్యర్దులు ఒకే లక్ష్యాన్ని ఎంచుకున్నప్పటికీ, తుది లక్ష్యం వైపు వెళ్లే క్రమాన్ని విభేదించారు. రాజకీయ, సామాజిక లక్ష్యాలు, వివాదం యొక్క రెండు ప్రధాన అంశాలు. ఈ అంశం పై విభిన్న దృక్పథాలు ప్రకటించబడ్డాయి. మొదట, అరాచకవాదులు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని పట్టుబట్టారు. మార్క్సిస్టులు ఒక ఇంటర్మీడియట్‌ దశ అవసరాన్ని గుర్తించారు. శ్రామికవర్గం యొక్క నియంతృత్వం వచ్చే వరకు చట్టాలు వుండాలని, అవి ఎంతో కొంత మేరకు ప్రజలకు మేలు చేస్తాయని చెప్పారు.

తరువాత 20వ శతాబ్దంలో, కమ్యూనిస్టులను వ్యతిరేకించే రాజకీయ ఆచరణ పెరిగింది. దీన్ని మార్క్సిస్టులు విమర్శించారు. సహజ హక్కుల ఉనికి, ప్రస్తుత ఆర్థిక నిర్మాణం పెరుగుదలలో భాగంగానే వస్తుంది. న్యాయం గురించి సమాజం విభిన్న ఆలోచనతో ప్రేరణ పొందింది. చట్టాలపై క్రమబద్ధమైన చర్య లేకపోవడం వల్ల, అనేక అంతర్దృష్టులు అభివృద్ధి చెందాయి. మార్క్సిజం చరిత్ర చాలా భిన్నమైన దశలలో పయనించింది. 20వ శతాబ్దం ప్రారంభంలో విప్లవాత్మక కాలంలో, మార్క్సస్ట్‌ శిబిరంలోనే కనీసం మూడు వేర్వేరు సిద్దాంతాలు ఉన్నాయి.

మొదట, ఆన్రో-మార్క్సిస్టు సిద్ధాంతం, కెల్సెన్‌ చేత ప్రభావితమైంది. ఇతరులతో పాటు ఒట్టో చేత వ్యక్తీకరించబడింది. రాజ్యం, దాని న్యాయ వ్యవస్థ తటస్థ సాధనాలు అని పేర్కోన్న బాయర్‌ అవసరమైతే విముక్తి సాధన కోసం సరిగ్గా ఉపయోగించాలన్నాడు. ఈ అభిప్రాయానికి ప్రత్యక్ష వ్యతిరేకంగా,  పశుకానిస్‌ సిద్ధాంతం వచ్చింది. ఇది చట్టం, హక్కుల వ్యవస్థ కేవలం సూపర్‌ స్ట్రక్చరల్‌ వ్యక్తీకరణలు అని పెర్కొంది. విలువలు, చట్టం అప్రధానమైన విషయాలు, అందువల్ల వాటిని ఏ సోషలిస్టుదశలోనైనా తుడిచిపెట్టాలనే నినాదం వీళ్లు ఇచ్చారు.

చివరగా లెనిన్‌, రాజ్యం, దాని చట్టాలు కేవలం పాలకర్గాల ప్రయోజనాల కోసం మాత్రమే సృష్టించబడ్డాయని చెప్పాడు. హింసను ప్రేరేపించే సంస్ధే రాజ్యం. పాలకవర్గం, నిరంతర నిర్భంధాన్ని ప్రయోగిస్తూ, తన శక్తి సామర్ధ్యాలను క్రమంగా కోల్పోతుంది. భౌతిక పరిస్థితులు రాజ్యానికి ఇంక ఎంత మాత్రం మద్దతుగా వుండపు. ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు సంభవిస్తాయి. శ్రామికుల నియంతృత్వపు పరివర్తన దశకు విప్లవకారులు చేరుకోవాలి. ఈ మధ్యవర్తి దశ అత్యంత సమస్యాత్మక స్వభావంతో వుంటుంది. దీన్ని సాధించడంలో విప్లవశక్తులు విపరీతమైన త్వాగాలకు సిద్ధపడాలి అని చెప్పాడు. 

పోస్ట్‌ మాడర్నిజంలో చట్టాలు

పోస్ట్‌-స్టక్చరల్‌, పోస్ట్‌ మాడర్న్‌ సిద్దాంతాలు ఉనికిలోకి రావడానికి చాలా కాలం ముందు సహజ హక్కుల సిద్దాంతం దాని ప్రాముఖ్యతను కోల్పోయింది. హక్కులు పొందడంలో, అంతర్జాతీయ చట్టం వలె దేశీయ చట్టం చారిత్రకమని అంగీకరించబడింది. మతపరమైన, లౌకిక, మెటాఫిజికల్‌ రెండింటినీ విస్తరించే విజయాలే వీటికి పునాదులు. ‌ చారిత్రక స్వభావం వాటికి అనుగుణంగా అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుంది. కాల పరిణామంలో భాగంగా, తాత్కాలిక అర్ధంలో మాత్రమే పురోగతిని, తరాల మానవ హక్కులను సూచించడం ఇప్పటికి సాధ్యమే. అంతర్గత విలువ పరంగా ఎటువంటి తేడా లేకుండా, రెండవ తరం ఆర్ధిక, సామాజిక హక్కులు చారిత్రాత్మకంగా న్యాయ పరిధిలో చేర్చబడ్డాయి. పౌర, రాజకీయ హక్కుల సిద్ధాంతాలు మొదటి
తరానికి చెందినవి. ఏదేమైనా, అవన్నీ సార్వత్రిక ప్రకటనలో పొందుపరచబడ్డాయి. మానవ హక్కులు ఈ సిద్దాంత పరిణామ దృష్టిని కోల్పోకుండా, ప్రపంచంలో జరిగిన చారిత్రక సంఘటనలను దృష్టిలో ఉంచుకుని 1986లో  అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన వెలువడింది. ఐక్యరాజ్యసమితి, ఇప్పటికి అర్ధ శతాబ్దం పాటు హక్కుల చరిత్రలో వచ్చిన మార్పులను గుర్తించింది. ఇటాలియన్‌ రాజకీయ శాస్త్రవేత్త నార్చెర్టో బొబ్బియో 1964 లో  మానవ హక్కులతో ప్రాధమిక సమస్య ఒకటి వుందని చెప్పాడు.  వాటిని ఈ రోజుల్లో ఎలా సమర్థించాలో కాదు, వాటిని, ఎలా రక్షించాలనేదే అని అన్నాడు.

ఏదేమైనా, పోస్ట్‌ మాడర్నిటి సమస్య తాత్విక స్థానాల నుండి పుడుతుంది. పోస్ట్‌ మాడర్న్‌ ఆలోచనాపరుల వాదనలు, సమర్థించటానికి కష్టంగా వుంటాయి. యూనివర్సల్‌ డిక్లరేషన్లో ప్రాథమిక మానవ హక్కులను పవిత్రమైనదిగా గుర్తించారు. రాజకీయ, సిద్ధాంత మద్దతు కోసం హక్కులకు చట్టబద్ధత అవసరం.

మూడవ తరంలో సంఘీభావ హక్కులు, స్వయం నిర్ణయాధికారం హక్కు వంటివి అభివృద్ధి చెందాయి. అందువల్ల మొదటి రెండింటికి వివరణాత్మక పూరకాలుగా ఇవి వచ్చాయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులు అవసరం. మత పెద్దలు పోస్ట్‌ మాడర్నిస్తులను వ్యతిరేకించారు. ఎందుకంటే, హక్కులు మార్చలేనివని వారి అభిప్రాయం.  అవి పాశ్చాత్య సంస్కృతి సృష్టి అని వారి భావన. పోస్ట్‌ మాడర్నిస్టులు సౌందర్య స్వేచ్చావాదులని కొంతమంది విమర్శించారు. అయితే వీళ్లు ఉద్యమకార్యాచరణను హక్కుల రంగంలోకి తీసుకురాకూడదంటారు. పెట్టుబడి, స్వేచ్చా వాణిజ్యానికి మద్దతుగానే  చట్టాల ప్రతిపాదనలు వుంటాయని చాలామంది వాదించారు.

యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ప్రకటించిన తరువాత, మానవ హక్కులను అన్ని దేశాలు గుర్తించాయి. అయితే ఆచరణలో మాత్రం విఫలమయ్యాయి. దేశీయ చట్టంలో కూడా వాటిని స్వీకరించారు. సామ్రాజ్యవాద దేశాలు మానవహక్కులను అంగీకరించాలని వత్తిడి తెచ్చాయి. ఎందుకంటే ప్రజలు విప్లవాల వైపు ఆకర్షితులు కాకుండా, ప్రస్తుత వ్యవస్త అందరికి సమాన హక్కులు కల్పిస్తుందని చెప్పడానికి అంతర్జాతీయ మానవహక్కుల ప్రకటనను వారు ఉపయోగించుకున్నారు. ఎందుకంటే వారు తమ కోసం మాత్రమే యూనివర్సల్‌ డిక్లరేషన్‌ యొక్క ప్రాముఖ్యతను గుర్తించారు.

ముగింపు

మార్క్‌ భౌతికవాది. హెగెల్‌ ఆదర్శవాది అయినందున మార్క్స్ అభివృద్ధి పద్ధతి హెగెలియన్‌ పద్ధతి కాదు. హెగెల్‌ డైలెక్టిక్స్‌, అన్ని డైలెక్టిక్స్‌కు ప్రాధమిక రూపం. అది ఆధ్యాత్మిక రూపం. చట్టం యొక్క విమర్శను మార్క్స్ మరొక స్థాయికి పెంచాడు. చాలామంది నిస్సందేహంగా మార్క్సిస్టు వెలుగులో పనిచేస్తున్నారు. అందువల్ల, మార్క్స్‌ దైలెక్టిక్స్‌ నుండి, ఏది ఏమయినప్పటికీ, జనరల్‌ లా ఆఫ్‌ లా 1920లలో కొంతమేరకు నిర్వచించబడింది. మార్చిజం ఒక నిర్దిష్ట ఆర్థికవెత్త అయిన హెగెల్‌ సంప్రదాయం నుండి విడిపోవటం ప్రారంభించింది. తద్వారా మార్క్సిజంలోని “గతితార్మిక పద్ధతి” పై చర్చ జరిగింది. మరింత గణనీయమైన అభివృద్ది వైపు మార్క్సిజం పయనిస్తోంది.

వలస వ్యతిరేక పోరాటాలను దేశీయ బూర్జువా వర్గం సమర్ధించింది. రాజకీయ స్వయంప్రతిపత్తికి మాత్రమే కాకుండా, సామాజిక, ఆర్ధిక హక్కులకు కూడా అంగీకరించ వలసి వచ్చింది. హిందూ ధర్మం పట్ల కూడా సామాజికవాదులు తమ మద్దతును ప్రకటించారు. ఎందుకంటే మతం మనుగడలో నిరంతరం వుండటం వారికి కావాలి. మనిషికే మతం కాని, సరుకుకు మతం వుండదని పెట్టుబడి వాదన. స్వతంత్ర భారతదేశంలో ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థను అనుభవించకుండా పాలకవర్గం అనేక చట్టాలను తీసుకువచ్చింది. ప్రభుత్వం, కులాలను చట్టబద్ధంగా రద్దు చేయడం జరగదు. అంతేగాకుండా మత, కుల భావనలను మరింత ఉత్తేజపరుస్తుంది. భారతీయ లౌకిక సమాజంలో మానవ హక్కులు ఎడారిలో ఒయాసిస్‌ లాంటివి. ఎందుకంటే ఈ వ్వవస్ధలో 25 శాతం ప్రజలు ఇప్పటికి కులపరంగా వివక్షకు గురౌతున్నారు. అలాగే 65 కోట్ల మంది ప్రజలు పేదరికమనే వివక్షకు గురౌతున్నారు. వీరికి ఆత్మాభిమానం వుండకూడదని పాలకవర్గ భావన. ఎందుకంటే వీరు 10 కిలోల బియ్యం కోసం రేషన్‌ షాపుల ముందర క్యూలో నిల్చుంటారు. గౌరవంగా బ్రతకడం వీరికి కలలో కూడా రాని ఆలోచన. వీళ్లను సంక్షేమ పధకాల ద్వారా బిక్షగాలను చేయడంలో పాలకవర్గం విజయం సాధించింది. వీరి రాజకీయ ఆలోచనలను కేవలం సంక్షేమ పధకాలకే పరిమితమం చేసింది.

 ఏ రాజకీయ పార్టి వచ్చినా ఏ మేరకు నగదు బదిలీ పథకాలను, సంక్షేమ పధకాలను ప్రజలకు ఇస్తుందోనని వీరు ఆశగా ఎదురుచూస్తారు.అందిరికీ పని కల్పించలేమనే, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. అందుకే ప్రజల్లో చట్టాల పట్ల చైతన్యాన్ని నింపడానికి కృషి చేయడంలో అభ్యుదయ వాదులు వెనుకబడి వున్నారు. సామాజిక సేవ అనేది కేవలం డబ్బున్నవాడు చేసే ఒక రొమాంటిసిజం అయిపోయింది. ప్రభుత్వాలు అన్నీ చేయలేవని, అవి లక్షల కోట్లు అప్పుల్లో వున్నాయని మధ్యతరగతి వర్గ బలంగా విశ్వసిస్తోంది. కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా ధనవంతులు దానం చేయాలని వీరు కోరుకుంటారు. భారతదేశపు వ్యవస్థకున్న సంక్లిష్టత, విభిన్నత వల్ల చట్టాలను అమలు చేయకుండా ప్రజల్లోని చాలా బృందాలు అడ్డుపడుతున్నాయి. ఈ పరిస్థితులు మొత్తంగా హక్కుల ఉద్యమాలను పోస్ట్‌ మాడర్నిజం వైపు నెట్టివేేస్తున్నాయి.

- అమన్‌

(రచయిత అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి)


Comments