హక్కుల దారిలో నాయకులు



మే 14, 2020న ఆంధ్రజ్యోతి ఎడిట్‌ పేజీలో వచ్చిన వ్యాసానికి ప్రతిస్పందనగా

కరోనా, నియో లిబరలిజం రెండిటి మధ్య వున్న సారూప్యతపై ప్రొ.హరగోపాల్‌ రాసిన వ్యాసం  మే 6, 2020న ఆంధ్రజ్యోతి ఎడిట్‌ పేజీలో వచ్చింది. ఈ వ్యాసం నిరుపయోగంగా, నిరాశాకరంగా వుందని కరోనాకు కులమతాలున్నాయి అనే టైటిల్‌ తో పి. విక్టర్‌ విజయ్‌ కుమార్‌ గారు ఒక వ్యాసం రాశారు. ఈ వ్యాసం మే 14, 2020న ఆంధ్రజ్యోతి ఎడిట్‌ పేజీలో వచ్చింది. అందులో ఆయన ప్రధానంగా కొన్ని విమర్శలు చేశారు.

 1. 90 శాతం కోరిలేషన్‌ వున్న ఒక విషయాన్ని వదిలేసి, 10 శాతం కోరిలేషన్‌ వున్న విషయాన్ని చెప్పాడన్నారు. 2. విరసం సభలో రోహిత్‌ చావుకు సామ్రాజ్యవాదం కారణమని ఒక వక్త చెప్పాడన్నారు. 3. సామాజిక దూరాన్ని, భౌతికదూరంగా చూడమని నియోలిబరలిజం చెప్తుందని, ఇదే విషయాన్ని ఏప్రెల్‌ 17న ప్రపంచ ఆరోగ్య సంస్ధ స్పష్టం చేసిందని, ఇందులో కొత్త విషయం లేదని విజయ్‌ అన్నారు. 4. మోడీ ఆర్ధిక విధానాలైన డీమానిటైజేషన్‌, హఠాత్తుగా లాక్‌డౌన్‌  ప్రకటన లాంటి అంశాను హరగోపాల్‌ చెప్పలేదన్నారు 5. ప్రకృతిని పూజించడాన్ని గ్లోరియస్‌గా హరగోపాల్‌ కీర్తించాడాని చెప్పారు. 6. కరోనాకు కులం, మతం వుందని విజయ్‌ కుమార్‌ చెప్పారు. 7. హరగోపాల్‌ వ్యాసం ప్రీమెచ్యూర్‌గా వుందని విజయ్‌ కుమార్‌ గారు అభిప్రాయ పడ్డారు. 

ప్రొ. జి. హరగోపాల్‌ పౌరహక్కుల నాయకుడుగా 4 దశాబ్దాలకు  పైగా వున్నారు. ఆయన అనేక ఉద్యమాల్లోను, ఆందోళనల్లోను పాల్గొన్నారు. అనేక దీర్ఘకాలిక ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారు. పౌరహక్కుల సంఘాన్ని ముందుకు తీసుకెళడంలో ఆయన వంతు కృషి చేస్తున్నారు.

1 విజయ్‌ గారి ఉద్దేశ్యంలో 90 శాతం కోరిలేషన్‌ వున్న విషయం ఏందనే స్పష్టత ఇవ్వలేదు. కరోనాకు నియోలిబరలిజానికి సారూప్యత వుందని ఆయనా ఒప్పుకుంటున్నారు. అయితే 10 శాతం మాత్రమే కోరిలేషన్‌ వున్న అంశంగా నియోలిబరిలిజం ఆయనకు కనిపించింది.  అయినా ప్రపంచంలో కరోనా 210 దేశాకు పాకిందని మీడియా చెపుతోంది. గూగుల్‌ మాత్రం ప్రపంచంలో 195 దేశాలు మాత్రమే వున్నాయని చెపుతోంది. ఒక వేళ విజయ్‌ గారి ఉద్దేశ్యంలో 90 శాతం కోరిలేషన్‌ అంశాలు కులం, మతం, మోడీ ఆర్ధిక విధానాలు అయితే వాటి గురించి అనేక సందర్భాల్లో హక్కుల నాయకులు  మాట్లాడారు. హరగోపాల్‌ ఆయా సందర్భాలో మాట్లాడారు. 

ఆ అంశాలపై దేశవ్యాప్త్య ఉద్యమాలకు సంఫీుభావంగా నిలిచారు. కరోనాకు జాతి, కుల, మత, ప్రాంత, వర్ణ, ఆర్ధిక, దేశ విచక్షణ లేకపోయినా పాలకులకు అవి వుంటాయని హక్కుల నాయకులు చెప్పారు. దానిపై విస్తృతంగా రాశారు. కరోనా కాంలో తబ్లిక్‌ మర్కజ్‌ పేరుతో ఇస్లోమోఫియాను మోడీ సేన వ్యాప్తి చెస్తుందని పౌరహక్కుల నాయకుల మాట్లాడారు. వ్యాసాలు రాశారు. అలాగే జీనోఫోబియాను పాలకులు, ప్రజలు విడనాడాలని సంఘం పిలుపు నిచ్చింది. డీమానిటైజేషన్‌, పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి విధింపు, ఆర్టికల్‌ 370 రద్దుకు వ్యతిరేకంగా, ఊపా చట్టానికి వ్యతిరేకంగా, సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా పౌరహక్కుల సంఘం మాట్లాడింది. అనేక ఉద్యమాలను చేసింది. ఐక్య సంఘటనను కట్టింది. ఇప్పటికీ వాటిపై పోరాటం చేస్తోంది.  పునాదిలో వర్గం, కులం వున్నాయని హక్కుల సంఘం భావిస్తోంది. కులనిర్మూనలకు పౌరహక్కుల సంఘం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. 

బారతదేశంలోనే జిల్లాస్ధాయి నిర్మాణం కలిగి, క్షేత్రస్ధాయిలో వివిధ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది ఒక్క పౌరహక్కుల సంఘం మాత్రమే. ఈ కారణంగానే పౌరహక్కుల సంఘంపై తీవ్రమైన నిర్భంధాన్ని ప్రభుత్వాలు ప్రయోగించినప్పటికీ, ప్రజలు సంఘాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.

2. వేముల రోహిత్‌ మరణానికి సామ్రాజ్యవాదం కారణంగా వుందని విరసం సభలో వక్త చెప్పారని విజయ్ చెప్పారు. అకడమిక్‌ బ్రాహ్మనిజమే వేముల రోహిత్‌ను హత్య చేసిందని పౌరహక్కుల సంఘం కరపత్రం వేసింది. రోహిత్ చదివే యూనివర్శిటీలో వేముల రోహిత్ మరణానికి కారకులైన వారిని శిక్షించాలని జరిగిన అనేక ఆందోళనల్లో హరగోపాల్ పలుమార్లు పాల్గోన్నారు. సంఘం జిల్లా స్ధాయిలో ఆందోళనలను జరిపింది. సామ్రాజ్యవాదం వల్లే యూనివర్శిటీలు హిందూ మతోన్మాద నిలయాలుగా మారుతున్నాయి. 

విద్య కాషాయూకరణ చెందుతోంది. భారత్‌లో హిందూ మతోన్మాదంతో పెట్టుబడి రాజీపడిందని, పెట్టుబడీదారీ సంబంధాలు భారత్‌లో నెలకొన్నాయని  హక్కుల సంఘాలు భావిస్తున్నాయి. రోహిత్‌ హత్యలో కుల దురహంకారంతో పాటు సామ్రాజ్యవాద కారణాన్ని విస్మరించలేం. ఇంపిరీలియజం, కులం రెండూ కూడా భారత్‌ సగటు పౌరుడికి శత్రువులే. రెండూ వ్యక్తులను పరాయీకరణ చేస్తున్నాయి. కుల వివక్షను పెంపొందిస్తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్ధ అభివృద్దికి హిందూ మతోన్మాదంతో పాటు, స్ధానిక ఫ్యూడల్‌ శక్తులు భారత్ లో అడ్డుపడుతున్నాయి. పెట్టుబడి తన మార్కెట్ కోసం వీటితో దోస్తీ కట్టింది. 

ఈ నేపథ్యంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత వుంది. సామాజ్య్రవాద దశలోనే కరోనా లాంటి అంటువ్యాధులు ప్రబలుతున్న అంశాన్ని గుర్తించాలి.

3. ప్రపంచ ఆరోగ్య సంస్ధ సామాజిక దూరాన్ని భౌతిక దూరమని ఎప్పుడో చెప్పిందని విజయ్‌ చెప్పారు. సామాజిక దూరాన్ని, భౌతిక దూరమని చెప్పాని హక్కు సంఘాతో పాటు ఎన్నో ప్రజా సంఘాు, కు సంఘాు మాట్లాడాయి. అయినా కార్పొరేట్‌ మీడియా, పత్రికు సామాజిక దూరమనే చెప్తున్నాయి. అందుకే హరగోపాల్‌ మరోసారి ఆ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది. కోవిడ్‌ను మహమ్మారి అనడం సరికాదని, ఆ పదం స్త్రీను, దళితును కించపరిచే విధంగా వుందని పౌరహక్కు సంఘం తెలిపింది.

4. మోడీ అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో పౌరహక్కుల సంఘం ముందుంది. డిమానిటైజేషన్‌ గురించే కాదు, ఇంకా అనేక మోడీ విధానాలకు వ్యతిరేకంగా సంఘం పోరాడుతూనే వుంది. వలస కూలీ సమస్యను దృష్టిలో పెట్టుకోకుండా హఠాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించడం అహేతుక చర్య అని పౌరహక్కుల సంఘం చెప్పింది. తన స్వేచ్ఛ పత్రికను (మార్చి, ఏప్రెల్‌, 2020)  పూర్తిగా వలస కూలీల హక్కుల కోసం అనేక వ్యాసాలతో తీసుకుని వచ్చింది.

5. ప్రకృతిని పూజించడాన్ని హరగోపాల్‌ గ్లోరిఫై చేయలేదు. ప్రకృతిని పూజించడమనేది వేల సంవత్సరాల నుండి వస్తోంది. ఇప్పటికీ అది కొనసాగుతోంది. ప్రకృతిని పూజించడంలో భాగంగానే ప్రజలు పండగలు, జాతరలు చేసుకుంటున్నారు. అందులో చాలా విషయాలు మూఢత్వానికి సంబంధించి వుండచ్చు. ఒక చారిత్రక వాస్తవాన్ని చెప్పడంలో గ్లోరిఫై చేయడం వుండదు. అదే ప్రకృతిని పెట్టుబడి తన అదుపులో పెట్టుకోవాడానికి ప్రయత్నిస్తోంది. అందుకే కరోనా లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి.  

ప్రకృతి నియమాలను గౌరవించే పనిని కార్పొరేట్లు, పాలకులు, ప్రజలు చేయాలి.

6. కరోనా వ్యాధిని ధనవంతులు విదేశాల నుండి తీసుకుని వచ్చారు. అది ఎక్కడ పుట్టినప్పటికీ, మానవతప్పిదం వల్ల లేదా ప్రకృతిలో మార్పుల వల్ల కరోనా వ్యాధి వ్యాప్తి చెందినప్పటికీ దానికి కుల, మత, ప్రాంత, జాతి, మత, వర్ణ, దేశ వివక్షలు లేవు. అయితే పాలకులు కరోనా కాలంలో కూడా ఆ వివక్షను చూపించారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత కూడా విదేశాల్లోని భారత్‌ పౌరులను దేశానికి రప్పించారు. డిసెంబర్‌లోనే కరోనా గురించి తెలిసినప్పటికీ, విదేశాల నుండి వచ్చే వాళ్లకి ఎటువంటి టెస్టులను చేయలేదు. 

అదే పాలకులు వలస కూలీలను మాత్రం కరోనా కారియర్స్‌ అని చెప్పి, వారు ఎక్కడికీ కదల కూడదన్నారు. సుమారు 20 కోట్ల మంది వలస కార్మికులకు రేషన్‌కార్డులు లేవని వారికి నిత్యావసర సరుకులను ఇవ్వలేదు. సమాజంలోని మెజారిటీ ప్రజలు తమకు తోచిన సహాయం వారికి చేశారు. ప్రభుత్వాలు ధనవంతులు, పేదలు పట్ల చూపించే  వివక్ష కరోనా కాంలోను కొనసాగింది.

7 ప్రొ. జి. హరగోపాల్‌ వ్యాసం ప్రీ మెచ్యూర్‌గా వుందని విజయ్‌ గారు అభిప్రాయపడ్డారు. అది ఆయన వ్యక్తిగతం. ఎవరి వ్యాసాన్నైనా నచ్చలేదని చెప్పవచ్చు.

సమస్య ఎక్కడ వస్తుందంటే, పౌరహక్కుల నాయకుడైన హరగోపాల్‌ ఇలాంటి నిరాశజనక వ్యాసం రాశాడని నిజంగానే బాధపడి ఈ వ్యాసం రాసినట్టుగా  విజయ్‌ గారి వ్యాసం అగుపించలేదు. ఎందుకంటే హర్‌గోపాల్‌ గారు ఎక్కడా ప్రభుత్వాలకు మద్దతుగా మాట్లాడలేదు. సామాజ్య్రవాదులకు, హిందూ మతోన్మాదులకు మద్దతుగా  మాట్లాడలేదు. ఆయన రాసిన వ్యాసాన్ని, ఆంధ్రజ్యోతి సంపాదక వర్గం తనకు తోచిన రీతిలో ఎడిట్‌ చేసే ప్రచురిస్తుంది. విజయ్‌ గారి వ్యాసాన్ని  ఎడిట్‌ చేసే ప్రచురిస్తారు. కరోనా కాలంలో ప్రభుత్వాల అప్రజాస్వామిక వైఖరిని అందరూ ఖండించాలి. అదే హరగోపాల్‌ చేశారు.

 ప్రజాస్వామిక వాదులు అందరూ ఐక్యంగా ప్రభుత్వాల మెడలు వంచి ప్రజల జీవించే హక్కు కోసం పోరాడాల్సిన అవసరం వుంది. 20 లక్షల కోట్ల ప్యాకేజీలోను సామాన్యుడికి వొరిగేదేమి లేదని కేంద్ర ప్రభుత్వం ప్రెస్‌మీట్‌లో చెపుతూనే వుంది. ఈ తరుణంలో                   సామాజ్య్రవాద, హిందూ మతోన్మాద వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి. ఐక్యంగా వుండి కరోనా వ్యాధిని, పాలకవర్గ అప్రజాస్వామ్య వైఖరిని ఎండగట్టాలి. అది మాని వ్యాసాలు నిరాశాజనకంగా వున్నాయని వ్యాసాలు రాయడం సమంజసం అవుతుందా. 

సాయిబాబా నుండి ఖాసీం వరకు ప్రశ్నించే వారందరూ ఉపా, దోశద్రోహం లాంటి అక్రమ కేసులను ఎదుర్కుంటున్నారు. తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై ఊపా కేసు పెడుతున్నారు. ఇప్పటికే 15 మంది పౌరహక్కుల సంఘం నాయకులను  అక్రమంగా ఊపా కేసుల్లో ఇరికించారు. న్యాయవాదులు, విద్యార్ధులు, జర్నలిస్టులు, బుద్దిస్టులు, అంబేద్కరిస్టులు, దళిత నాయకులు, గాంధేయవాదులు ఎవరైనా మోడీే విధానాలను విమర్శిస్తే వారు దేశద్రోహలు అవుతున్నారు. ఇలాంటి తరుణంలో సంయమనం పాటించడం,  ఐక్యంగా వుండటం అవసరం. లేని పక్షంలో పాలకవర్గాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రజాస్వామిక వాదులు వ్యాఖ్యలను ఉపయోగించుకునే ప్రమాదముంది.

- అమన్‌

( views expressed are personal)

Comments