సుప్పీంకోర్టు అధర్మ తీర్పు

SC quashes order providing 100% reservation to ST candidates in ...

కోర్టులు మనుధర్మశాస్త్రాన్ని అనుసరించి తీర్పులు ఇస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు.  ఈ కోవకు చెందినదే 22-4-20వ తేదీన భారత  సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు. ఈ తీర్పు ప్రకారం షెడ్యూలు ఏరియాలోని టీచర్ ఉద్యోగాలు నూటికి నూరుశాతం ఆదివాసీలకు కేటాయించడం తప్పు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెరో 5 లక్షల జరిమానని విధించడం,  ఇటీవల అత్యున్నత న్యాయస్థానాలు  సామాజిక అంశాన్ని పక్కనపెట్టి కేవలం సాంకేతికతను ఆధారం చేసుకుని తీర్పులను వెలువరిస్తున్నాయి. భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని పక్కనపెట్టి న్యాయస్ధానాలు తీర్పులను వెలువరిస్తున్నాయి. 

ఈ తీర్పు రాజ్యాంగం వ్యతిరేకం. ఆదివాసి ప్రజలు పోరాడి సాధించుకున్న 1/70 లాంటి చట్టాలను కూడా పరోక్షంగా తూట్లు పొడుస్తాయి. సమాజంలో ఉన్న వివిధ సంఘాల సాంకేతిక అధ్యయనం, కృషి, ఆందోళనలు, కోరికలు, డిమాండ్లను న్యాయస్ధానాలు పట్టించుకోవడం లేదు.   ఆ కోర్టు తీర్పులు ఎగ్జిక్యూటివ్   ఆర్డర్ గానే ఉంటున్నాయి. వీటిలో ప్రజల జీవన విధానం, సగటు మైదాన ప్రాంత  ప్రజల స్థితిగతులు పై అవగాహన కోర్టులకు వున్నట్టు కనిపించవు. అందుకే ఈ తీర్పను సుప్రీంకోర్టు పునసమీక్షించాలి.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆదివాసీల, ప్రజాస్వామిక వాదుల పోరాటం ఫలితంగా కోన్ని చట్టాలను సాధించారు. ప్రభుత్వ మెడలు వంచి  నూటికి నూరుశాతం ఆదివాసుల ప్రాంతంలో టీచర్ పోస్టులు ఆదివాసీలకే దక్కేవిధంగా చట్టం తెచ్చుకున్నారు. అసలీ పరిస్థితులు రావడానికి చాలా కారణాలు వున్నాయి. అందులో ప్రధానమైనవి. ఆదివాసీ ప్రాంతాలలో చదువుకునే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆదివాసీ ప్రాంతాలలో పనిచేసే మైదాన ప్రాంతాల ఉద్యోగులు సక్రమంగా పాఠశాలకు హాజరు కావడం లేదు.
ఆదివాసీలకు కనీస విద్యను అందించడానికి, టీచర్లకు అర్హతలను సడలించి ఆదివాసులనే ఆ ప్రాంతంలో ఉపాధ్యాయులుగా ప్రభుత్వం నియమించింది. 

 ఆదివాసీ ప్రాంతాలలో టీచర్లు కాలినడకన మైళ్ళ కొద్దీ ప్రయాణించాల్సి వుంటుంది. మరికొంతమంది ఆదివాసీ గ్రామాలకు గుర్రాల పైన వస్తున్నారు. ఎందుకంటే స్వ్రాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఆదివాసీ ప్రాంతాల్లో రహదారుల వసతి ఇంకా ఏర్పడలేదు. మైదాన ప్రాంతవాసులు  అటవీ ప్రాంతంలో వసతుల కొరత వల్ల స్థానికంగా ఉండలేకపోతున్నారు. దూర ప్రాంతాల నుండి రోజువారి ప్రయాణించడానికి తగిన ప్రయాణ సౌకర్యాలు లేవు. వచ్చినా సకాలంలో రాలేకపోతున్నారు.  అందులో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో టీచర్ సకాలంలో రాకపోతే  విద్యార్థులు పాఠశాలకు రారు. వరద వచ్చినా, వాన వచ్చిన, రవాణా సౌకర్యాలు లేకపోయినా ఆదివాసీలలో పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువుగా వుంది. మధ్యలోనే విద్యను ఆపివేసే వారి సంఖ్య మరింత పెరిగింది. కనీసం ప్రాధమిక విద్య కూడా ఆదివాసీలకు అందడం లేదు. అటువంటి సమయంలో 1986లో ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీలకే చదువు చెప్పే టీచర్ల అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాయి. నూటికి నూరు శాతం ఉద్యోగాలు ఆదివాసీలకే ఇవ్వాలని జీవో విడుదల చేయబడింది. ఆదివాసీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హతను సడలించింది.  10వ తరగతి పాస్ కాని వారికి కూడా టీచర్ ట్రైనింగ్ ఇచ్చి ఎలిమెంటరీ టీచర్లుగా  నియమించింది.  ముందు నియామకాలు జరిపి తర్వతా ప్రభుత్వం ట్రైనింగం ఇచ్చింది.  

 నిర్దిష్ట కాలపరిమితి లోపు అర్హత సాధించాలని జీవోలో ప్రభుత్వం పేర్కోంది.  ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నం ఆదివాసీ ప్రాంతాలలో  మంచి ఫలితాలను ఇచ్చింది.  దీన్ని వ్యతిరేకిస్తుూ  మైదాన ప్రాంతంల్లో టీచర్ అర్హత కలిగిన నిరుద్యోగులు కోర్టుకు వెళ్లారు. వీరి అభ్యర్దనను 1998లో  కోర్ట్ తిరస్కరించింది. ఏప్రిల్ 2000లో  ప్రభుత్వం ఈ విషయంలో  గవర్నర్ కు ఉన్న ప్రత్యేకాధికారాలు ద్వారా జీవో నంబర్ 3 ని తీసుకు వచ్చింది. ఇదే ఉత్తర్వులపై నియామకాలు ఇప్పటి వరకూ కొనసాగుతూనే వున్నాయి. ఈ జోవో  పై కూడా ఆదివాసేతర టీచర్ అర్హత ఉన్న నిరుద్యోగులు కోర్టులను  ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు 22.4. 2020 తేది తీర్పు వెలువరించింది.

 ప్రభుత్వ టీచర్లు వారు పని చేసే  ప్రాంతంలోనే నివసించాలి. అదేవిధంగా నివసించడానికి తగిన వసతులు ఆదిలవాసీ ప్రాంతాల్లో వుండవు.  వారి పిల్లలు పట్టణంలో కార్పొరేట్ స్కూళ్లలో చదువుకోవాలంటే వారు పట్టణాలలో నివసించాలి.  అన్ని వసతులు ఆదివాసీ ప్రాంతాలలో మైదానప్రాంత టీచర్లకు కల్పించడం అసాధ్యమవుతుంది. 


 సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఆదివాసీ ప్రాంతాలలో  పాఠశాలలు సరిగ్గా నడవవు. షెడ్యూల్ ఏరియాలో సొంత గృహం, సొంత స్థలంలో నిర్మించుకోవడానికి మైదాలప్రాంత టీచర్లకు కష్టం అవుతుంది. దీనికి 1/70 చట్టం అడ్డం వస్తుంది. 

 ప్రభుత్వం నిరుద్యోగ యువత ప్రక్కదారి పట్టకుండా ఉండేందుకు ఉపాధ్యాయిల పోస్టులను ఆదివాసీ ప్రాంతాల్లో కల్పించింది. ఆనాటి ప్రభుత్వాలు ఇన్ని విధాలుగా ఆలోచించి తెచ్చిన GO ను సుప్రీంకోర్టు ఓక్క కలం పోటుతో కొట్టేసింది. పోలీసు వ్యవస్థలో గిరిజన బెటాలియన్ ను కూడా ప్రభుత్వం ఇదే పద్ధతిలో ఏర్పాటు చేసింది.    ఆ మేరకు  కానిస్టేబుల్ అర్హతలను కూడా ప్రభుత్వం సడలించింది. మరి ఈ తీర్పు పోలీసు నియామకాలకు సుప్రీంకోర్టు వర్తింపజేస్తుందా.

  
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం ఏ ప్రభుత్వం అయినా ఒక సెక్షన్ ప్రజానికం అభివృద్ధి చెందలేదని భావించినట్లయితే వారిని మిగిలిన సమాజంతో పాటు సమాన స్థాయికి తీసుకు వచ్చే విధంగా నిబంధనలను రూపోందించు కోవచ్చు. వెనుకబడిన ప్రాంతాల వారికి కొన్ని ప్రత్యేక వసతులు, సౌకర్యాలు, మినహాయింపులు కల్పించవచ్చు. అదేవిధంగా ఆదేశిక సూత్రాలు 46 లో కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. అయినా ఆయా రాష్ట్రాల గవర్నర్లకు 10 రాష్ట్రాలలో ఆదివాసుల అభివృద్ధి విషయంలో ప్రత్యేక అధికారాలను మన రాజ్యాంగం ప్రసాదించింది. వీటన్నింటినీ కాదని సుప్రీంకోర్టు ఇంద్రాసహనీ కేసులో 50%  మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్పిందని పెర్కోంది. ఇది రాజ్యాంగం మూల సూత్రాలను, ప్రజాస్వామ్యాన్ని, అవహేళన చేయడమే.

 దేశంలోని 85%  ప్రజానీకం కేవలం 50% రిజర్వేషన్ మాత్రమే పోందడం అప్రజాస్వామికం.  సాంఘిక సమానత్వానికి, ఆర్థిక సమానత్వానికి  తేడా గ్రహించలేని తీర్పులు మనువాద తీర్పులు అవుతాయి. ఇవి మానవీయమైనవి తీర్పులు కావు. ఈ తీర్పును ప్రజలు, ప్రజాస్వామిక వాదులు అందరూ వ్యతిరేకించాలి. సామాజిక అవిటి తనంతో తరతరాలుగా ఆదివాసీలు విద్యకు దూరం చేయబడ్డారు. ఈ అనంత ఉద్యోగ వేటలో అందరూ సమానమే అనటం కౌటిల్యనీతి. పళ్లెంలో పాయసం పోసి కడుపారా భుజించమనే నక్క జిత్తుల తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వడం అన్యాయమైన విషయం.


Comments