అంబేద్కర్ ఆలోచనల్లో మార్క్స్

Marx in Ambedkar's thoughts | Forward Press

అంబేద్కర్ ఆలోచనలలో మార్క్స్ వున్నాడు. అంబేడ్కర్, మార్క్స్ మధ్య సిద్ధాంత వైరుధ్యాలు వున్నాయి. ఏదేమైనా, అంబేద్కర్ భారతీయ సమాజంలో వర్తించని మార్క్సిజపు అనేక అంశాలను కూడా ఎత్తి చూపారు. అంబేద్కర్ రచనలు  భారతదేశ వ్యవస్థ మీద కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, ఆయన ఆలోచనలు వాస్తవానికి సార్వత్రికమైనవి.

"శ్రామిక తరగతుల నుండి ప్రతి ఒక్కరూ రూసో సామాజిక ఒప్పందం, మార్క్స్ కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో, పోప్ లియో XIII  కార్మిక పరిస్థితులపై అధ్యయనం, జాన్ స్టువర్ట్ మిల్స్ లిబర్టీ గురించి తెలుసుకోవాలి" అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఇది డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్   సెప్టెంబర్ 8-17, 1943 న జరిగిన అఖిల భారత ట్రేడ్ యూనియన్ కార్మికుల అధ్యయన శిబిరంలో అంబేద్కర్ ప్రసంగపు ముందుమాట. డాక్టర్ అంబేద్కర్ మార్క్స్ వ్యతిరేకి కాదని ఆయన మాటలు రుజువు చేస్తున్నాయి.

సోషలిస్ట్ ఉద్యమంలో అంబేద్కర్ పాత్రను అభినందించిన మొదటి వ్యక్తి మధు లిమాయే. అతను కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టోతో సమానంగా డాక్టర్ అంబేద్కర్ రాసిన కుల నిర్మూలన ను  పరిగణించాడు. డాక్టర్ అంబేద్కర్ కుల వినాశనం కోసం పట్టుబట్టారని, అది లేకుండా, కుల పోరాటం జరగదు అని ఆయన రాశారు.

డాక్టర్ అంబేద్కర్ మార్క్సిజాన్ని లోతుగా అధ్యయనం చేశారు. అతను భారతీయ, పాశ్చాత్య సోషలిస్టుల సిద్ధాంతాలను కూడా అధ్యయనం చేశాడు. ఐరోపాలో ఉన్న సమయంలో, అతను పెట్టుబడిదారీ విధానం,  దాని అణచివేత మార్గాలను చూసాడు. యంత్రాలను దగ్గరి నుండి చూశాడు. దళితుడిగా జన్మించిన ఆయన కుల వ్యవస్థ  క్రూరత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. అణగారిన, అంటరాని, దోపిడీకి గురైన లక్షలాది మంది పేదల కోసమే అతను కుల నిర్మూలన సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు.

 అందుకే ఆయన సోషలిజం భావన ఇతరులకన్నా కాస్త భిన్నంగా ఉండేది. అతను ఒకసారి ఇలా అన్నాడు, "కార్ల్ మార్క్స్ భారతదేశంలో జన్మించి, తన ప్రసిద్ధ గ్రంథం దాస్ కాపిటల్ భారతదేశంలో కూర్చుని రాసి ఉంటే, అతను దానిని పూర్తిగా భిన్నమైన పద్ధతిలో వ్రాయవలసి ఉంటుంది." అతను మార్క్స్ ను ఎంత తీవ్రంగా,  శ్రద్ధగా అధ్యయనం చేశాడో ఈ మాటల ద్వారా తెలుస్తుంది. కమ్యూనిజం అనేది శ్రామికవర్గ  విముక్తి సిద్ధాంతం అని డాక్టర్ అంబేద్కర్ అంగీకరించారు. శ్రామికవర్గం దాని నుదుటి  చెమట ద్వారా మాత్రమే జీవించే ఒక వర్గంగా నిర్వచించబడింది.

 భారతదేశంలో అణగారిన కులాలు ఖచ్చితంగా శ్రామికులు.  గత శతాబ్దం చివరలో ఇంగ్లాండ్‌లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం నుండి పుట్టిన తరగతి శ్రామికవర్గం అని ఫ్రెడరిక్ ఎంగెల్స్ సూత్రీకరించడం భారతదేశానికి వర్తించదని అంబేద్కర్ అభిప్రాయం.  అయితే ఇది ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, పారిశ్రామిక పశ్చిమ దేశాల విషయంలో నిజం కావచ్చు.  భారతీయ శ్రామికులు అంటే పేదలు. ఈ  శ్రామిక తరగతి వర్ణ వ్యవస్థ నుండి పుట్టింది. శ్రామికవర్గం భారతదేశంలో వర్ణ వ్యవస్థతోనే ఉనికిలోకి వచ్చింది. ఇది ఏ పారిశ్రామిక విప్లవం యొక్క ఉత్పత్తి కాదు. వీరు  పుట్టుకతో శ్రామికులు. పుట్టుకతో అంటారానివారు. మరో మాటలో చెప్పాలంటే పుట్టుకతో బానిసలు.

మార్క్సిజం కొత్త సామాజిక వ్యవస్థ లోని పరిశ్రమ వర్గాల ప్రైవేట్ యాజమాన్యాన్ని అంతం చేయాలని కోరుకుంటుంది. ఉత్పత్తి సాధనాలు సమాజం మొత్తంగా శ్రామికుల యాజమాన్యంలో వుండాలని అంటుంది. అటువంటి  ఒక సమాజాన్ని నిర్మించాలని ఇది కోరుకుంటుంది.  శ్రమ ఫలాలు అందరి కి సమంగా,వారి పనికి తగ్గట్టు,  వారి సమ్మతితో పంపిణీ చేయ బడాలని కోరుకుంటుంది.

అంబేద్కర్ ఆలోచనలు

పరిశ్రమల్లో ప్రైవేట్ యాజమాన్యాన్ని తొలగించడం చాలా అవసరం అనే అంశంతో అంబేద్కర్ అంగీకరించారు. కానీ దాని గురించి ఎలా వెళ్ళాలనే అంశంలో అంబేద్కరుకు, మార్క్స్ తో ఏకాభిపాయంలేదు.  శ్రామికవర్గం చేసిన విప్లవం క్రమంగా దాన్ని సాధిస్తుందనే కమ్యూనిస్ట్ అభిప్రాయంతో డాక్టర్ అంబేద్కర్ ఏకీభవించలేదు.

భారతదేశంలో న్యాయవ్యవస్ద  బూర్జువా ప్రజాస్వామ్యంలో ఒక భాగం. ఈ వ్యవస్ధ మతానికి గౌరవం ఇస్తుంది. ఇక్కడ, ప్రైవేట్ యాజమాన్యపు  భావన మార్క్స్ , ఎంగెల్స్ చూసిన దానికి భిన్నంగా వుంటుంది. భారతదేశంలో వర్ణ వ్యవస్థ పరిశ్రమలు,  వ్యాపారాలను స్వంతంగా నడుపుకునే హక్కును వైశ్య కులానికి   మాత్రమే ఇస్తుంది. ఈ విధంగా మూలధనపు కేంద్రీకరణ, హిందూ ఆర్థిక వ్యవస్థపై పట్టు కేవలం వైశ్య కులానికే వుంటుంది.

ఇది వర్ణ వ్యవస్థ యొక్క ఉత్పత్తి. హిందూ మతం యొక్క ఆత్మ. వర్ణ వ్యవస్థను నిర్మూలించకపోతే, ప్రైవేట్ యాజమాన్యాన్ని తొలగించలేరు. అందుకే పెట్టుబడిదారులు వర్ణ వ్యవస్థను పరిరక్షించడానికి, శాశ్వతం చేయడానికి వారు చేయగలిగినదంతా భారత్ లో  చేస్తున్నారు. ప్రైవేట్ యాజమాన్యాన్ని అంతం చేయడానికి, శ్రామికులను బలోపేతం చేయడానికి మార్క్సిజం ఈ క్రింది వాటిని చేయాలనుకుంటుంది.

ప్రవేట్ యాజమాన్యం తొలగించబడే వరకు, సమాజంలోని ప్రదలందరూ పనిచేయడం తప్పనిసరి. ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేయాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలి. ప్రభుత్వ రంగ కర్మాగారాలు, వర్క్‌షాపులు, రైల్వే నెట్‌వర్క్‌లు, నౌకలు మొదలైన వాటి సంఖ్య, పరిమాణాన్ని పెంచాలి. సాగు చేయని భూమిని సాగులోకి తీసుకురావాలి. సాగులో ఉన్న భూమిని మరింత మెరుగుపరచాలి. అందరికీ ఉచిత విద్య,వైద్యం అందించాలి. అన్ని రవాణా మార్గాలను జాతీయం చేయాలి.

ప్రైవేటు యాజమాన్యంపై సమగ్ర దాడి ప్రారంభించిన తర్వాత, ప్రైవేట్ యజమానులు తమ మొత్తం మూలధనం, వ్యవసాయ భూమి, పరిశ్రమలు దేశ ప్రజలకు ఇవ్వాలి. మొత్తం మూలధనం, ఉత్పత్తి సాధనాలు, ప్రవైటు ఆస్ధి ప్రజల చేతుల్లోకి వచ్చిన తర్వాత, ప్రైవేట్ యాజమాన్యం స్వయంచాలకంగా తొలగించబడుతుంది. ఇది మార్క్సిస్టులు చెప్తున్న విషయాలు.

దీనికి అంబేద్కర్ చేసిన వాదన చూద్దాం. పాశ్చాత్య దేశాలలో ఇటువంటి ప్రజా ఆధారిత వ్యవస్థను నిర్మించడం సాధ్యమే. కాని కుల వ్యవస్థను పరిగణలోనికి తీసుకోకుండా భారతదేశంలో  పెట్టుబడిదారీ తర్వాత దశ విజయవంతం కావాలని కోరుకోవడం నిరాశను మిగులుస్తుంది. ఏదేమైనా, వర్ణ వ్యవస్థపై నమ్మకం ఉన్నవారి ఆస్తిని, కుల ఆధారిత వివక్షను పైన పేర్కొన్న ప్రతిపాదిత చర్యల జాబితాలో చేర్చినట్లయితే, భారతదేశంలో  విప్లవం జరగవచ్చు.

సోవియట్ విప్లవం పైశ్నలు

డాక్టర్ అంబేద్కర్ సోవియట్ విప్లవానికి సంబంధించి కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు. భారతదేశంలో కమ్యూనిస్టులు తమ పాలనను స్థాపించడంలో విజయవంతమైతే, దేశాన్ని నడపడానికి, పరిపాలనా, పరిశ్రమలు, సైనిక, కార్మికుల వ్యవహారాలను నిర్వహించడానికి పౌర సేవకులు అవసరం. సవర్ణ హిందువులు పరిపాలన, మిలిటరీపై ఆధిపత్యం చెలాయిస్తే,వారు దేశ కార్యకలాపాలను సైనికులు, ఉపాధిలో ఉన్న కార్మికులతో నిర్వహించవలసి వుంటుంది. ఈ సవర్ణ హిందువులు బ్రిటిష్ రాజ్ కాలంలో అధికారాన్ని వినియోగించుకున్నారు. కాంగ్రెస్ రాజ్ కాలంలో అధికారాన్ని వినియోగించుకున్నారు. వారు కమ్యూనిస్ట్ రాజ్యంలోను అధికారాన్ని వినియోగించుకుంటారు. అంటరానివారు, గిరిజనులు, శూద్రులు గతంలో అధికారాన్ని కోల్పోయారు. అణగదోక్క బడ్డారు. ఇదే తరహా విధానం కమ్యూనిస్ట్ పాలనలో కూడా జరిగే అవకాశం వుంది.

డాక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ, ధనిక-పేద వర్గాలతో పాటు భారతదేశంలో మూడవ తరగతి వుంది. వారే దళితులు, బహుజనులు.   రోడ్లు తుడుచుకోవడం, చెత్తను ఎత్తడం, పొలాలు, కర్మాగారాల్లో శ్రమించడం, చిన్న చేతివృత్తులవారు, మురికిశ్రమలు చేయడం ఇవన్నీ మూడవ తరగతి వారే చాయాల్సి వస్తుంది. కమ్యూనిస్ట్ పాలనలో, వారు ఖచ్చితంగా మంచి వేతనాలు, మెరుగైన గృహాలను పొందుతారు. కాని పరిపాలన, ఆర్మీలపై వారికి ఎటువంటి పెత్తనం వుండదు.  వారి ఆర్థిక స్థితి మెరుగుపడినా,  వారు గత సమాజంలో చేస్తున్న శ్రమలనే    కొనసాగిస్తారు. ఈ మూడవ తరగతిలోని ఏ సభ్యుడైనా తమ పిల్లలకు అధికారంలో వాటా ఇవ్వమని కోరినప్పుడు, కమ్యూనిస్ట్ ప్రభుత్వం చాలా ఊదారంతో  పరిపాలనా అధికారి, వీధులను తుడుచుకునే వ్యక్తి ఇద్దరు సమానమని సమాధానం ఇస్తారు.  రహదారులను తుడిచిపెట్టిన అనుభవం ఉన్నవారు ఆ శ్రమలో నైపుణ్యం సాధించారు అని అంటారు. వారు అలా చేయడం శ్రమైక సౌందర్యం అంటారు. పైపెచ్చు పరిపాలనా అధికారంలో వారు కూడా కోన్నిరోజులు రోడ్లు ఊడ్చే పని చేస్తారు. అయినా పరిపాలనా, సైనిక రంగాలపై పెత్తనం వారికే వుంటుంది.  అంతిమ పతనం ఏమిటంటే, అంటరానివారు, ఇతర అణగారిన కులాలు సమాజంలో మూడవ స్థానంలో కొనసాగుతూనే ఉంటాయి. వర్ణ వ్యవస్థ యొక్క సవర్ణ అనుచరులు అధికారాన్ని వినియోగించుకుంటూనే ఉంటారు. అంటరానితనం కమ్యూనిస్ట్ పాలనలో వాడిపోతుంది. కాని అంటరానివారి చీపురును (మురికి శ్రమ) సమర్థిస్తూనే ఉంటారు.

అంబేద్కర్ తన అభిప్రాయాన్ని వివరించడానికి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉటంకించారు. తెలంగాణలో, అంటరాని వ్యవసాయ కూలీలు పెద్ద భూస్వాముల నుండి భూమిని లాక్కోవడంలో కమ్యూనిస్టులతో కలిసి పోరాడారు. ఈ పోరాటంలో వందలాది అంటరాని కార్మికులు మరణించారు. కానీ భూమిని విభజించాల్సిన సమయం వచ్చినప్పుడు, ఉన్నత-కుల కమ్యూనిస్టులు అంటరానివారితో, మేము మీ వేతనాలను రెట్టింపు చేస్తాము, కాని మిమ్మల్ని భూమి యజమానులుగా చేయలేము‌‌ అన్నారు. అప్పుడు భూమి రెడ్డి, కమ్మ భూస్వాముల మధ్య విభజించబడింది. కమ్యూనిస్టులు భారతదేశాన్ని పాలించినట్లయితే ఇది పునరావృతం అవ్వదా అని అంబేద్కర్ ప్రశ్నించారు.

డాక్టర్ అంబేద్కర్ సమకాలీనులుగా వున్న కమ్యూనిస్టులు  విప్లవం గురించి ఆలోచించారు. కాని రిజర్వేషన్ల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు కూడా, వాటిని పరిగణలోకి తీసుకునేందుకు వారు సిద్ధంగా లేరు. ప్రపంచంలోని పురాతన సామ్రాజ్యవాద వ్యవస్థపై, చతుర్వర్ణ వ్యవస్థపై దాడి చేసి, కుల వినాశనాన్ని వారి ఉద్యమానికి ప్రధానమైనదిగా కమ్యూనిస్టులు నిర్ణయించాలి. చైనా, రష్యా తరహా విప్లవాలను భారత్ లో ఆశించడం సరికాదని అంబేద్కర్ భావించారు.

కమ్యూనిస్టు పార్టీలు అగ్ర కుల నాయకత్వంలో వున్నాయి. పేదలు, రైతులు,  కార్మికుల విముక్తి కోసం ఒక విప్లవాత్మక ఉద్యమం  అగ్రకుల చేతుల్లో ఉన్నందున బలహీనంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మార్క్స్ ప్రభావం

వాస్తవానికి డాక్టర్ అంబేద్కర్ పై కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో ప్రభావం ఎక్కువుగా వుంది. పెట్టుబడిదారీ సమాజంలో, మూలధనాన్ని కలిగివున్న వ్యక్తులకే ప్రభుత్వం అనుకూలంగా వుంటుంది. కాని సజీవంగా శ్రమ చేస్తుూ ఉత్పత్తిని వృద్ది చేస్తున్న కార్మికుడికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం లభించదు. ఈ సూత్రీకరణతో అంబేద్కర్ ఏకీభవించారు. పెట్టుబడిదారీ వ్యక్తిత్వాన్ని, పెట్టుబడిదారీ స్వేచ్ఛను,  నిర్మూలించడానికి ఆయన అనుకూలంగా ఉన్నారు. అతను మార్క్స్ నినాదాన్ని మెచ్చుకున్నాడు. “శ్రామికులు పోరాడితే వారి బానిస సంకెళ్లు తప్ప ఏమీ కోల్పోరు. అన్ని దేశాల శ్రామికులు ఐక్యంగా ఉండండి ” అనే నినాదాన్ని అంబేద్కర్ సమర్దించారు.   భారతదేశంలో వర్ణ, కుల భేదాలు కార్మికులను ఏకం చేయడానికి అనుమతించవని అంబేద్కర్ నిశ్చయించుకున్నారు.  

అంబేద్కర్ పై కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో ప్రభావం కార్మికుల విముక్తిపై ఆయన అభిప్రాయాలలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అతను స్వేచ్ఛ వంటి శాశ్వతమైన విలువలు విప్లవంతో సాధ్యమనే అంశంపై అతనికి బేధాభిప్రాయం వుంది.  శ్రామికులు మొదట రాజకీయ ఆధిపత్యాన్ని సాధించాలి. దేశంలో ఆధిపత్య వర్గంగా ఎదగాలి. ఆయన మాట్లాడుతూ, “దేశానికి నాయకత్వం అవసరం. ఈ నాయకత్వం ఎవరు ఇవ్వగలరనేది ప్రశ్న. దళితులు, శూద్రులు దేశానికి అవసరమైన నాయకత్వాన్ని ఇవ్వగలరని చెప్పడానికి నేను సాహసించాను. సరైన నాయకత్వంతో పాటు ఆదర్శవాదం, స్వేచ్ఛా ఆలోచన అవసరం. అరిస్టోక్రసీ(కులీనవర్గాని)కి ఆదర్శవాదం మాత్రమే సాధ్యం.  ఆదర్శవాదం, స్వేచ్ఛా ఆలోచన రెండూ అణగారిన వర్గానికి సాధ్యమే. కానీ ఆదర్శవాదం, స్వేచ్ఛా ఆలోచన రెండూ మధ్యతరగతికి సాధ్యం కాదు. మధ్యతరగతికి,  అరిస్టోక్రసీకి ఒక ఆదర్శాన్ని స్వాగతించడానికి, వ్యవస్దలను పోషించడం చాలా అవసరం. శ్రామిక తరగతులకు భవిష్యత్తు పై నమ్మకం కల్గించడానికి వారు పెట్టే ఆశ ఇది. భారతీయులకు అణగారిన వర్గం నాయకత్వం అవసరం. అందుకోసం వారు ఐక్యంగా ఉండటం అవసరం.”

ఫ్రెంచ్ విప్లవ ప్రభావం

ఫ్రెంచ్ విప్లవం డాక్టర్ అంబేద్కర్‌ను విశేషంగా ఆకట్టుకుంది. అతను ఫ్రెంచ్ విప్లవం నుండి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం (సోభ్రాతృత్వం) అనే నినాదాన్ని తీసుకున్నాడు. 1942 లో ఆల్ ఇండియా రేడియోలో ఒక ప్రసారంలో, వై ఇండియన్ లేబర్ ఈజ్ డిటర్నిన్డ్ టు ది వార్ అనే శీర్షికలో ఆయన భావాలను ప్రస్తావించారు. శ్రమకు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అవసరం అని అన్నారు. అతను ఈ మూడు సూత్రాలను కార్మికుల కోణం నుండి చూశాడు. ఈ సూత్రాలకు సంబంధించి కార్మికుల ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి. లిబర్టీ అనేది ప్రజల  ఆలోచనను కలిగి ఉంటుంది. కార్మికుల అభిప్రాయం ప్రకారం ప్రజల ప్రభుత్వం అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వ రూపం మాత్రమే. దీనిలో ప్రజల పని వారి యజమానులకు ఓటు వేయడం, వారిని పాలించటానికి వదిలివేయడం. శ్రామిక ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన వుండాలని కోరుకుంటున్నారు. శ్రమ ద్వారా ఉద్భవించిన స్వేచ్ఛలో సమాన అవకాశ హక్కు వుంటుంది. ప్రతి వ్యక్తికి వారి అవసరాలకు అనుగుణంగా వృద్ధికి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది.”

అదేవిధంగా, "సమానత్వం ద్వారా, చట్టంలో, పౌర సేవలో, సైన్యంలో, పన్ను విధించడంలో, వాణిజ్యంలో, పరిశ్రమలలోని అసమాన చట్టాలను  రద్దు చేయడం, వాస్తవానికి అసమానతకు దారితీసే అన్ని ప్రక్రియలను రద్దు చేయడం. " అని ఆయన అన్నారు.

శ్రమకు సోదరభావం అంటే ఏమిటి? అంబేద్కర్ ఇలా అంటారు. దీని అర్థం మానవ సోదరభావం, అన్ని వర్గాలను, అన్ని దేశాలను ఏకం చేయడం, భూమిపై శాంతి, మనిషి పట్ల సద్భావన దాని నినాదంగా వుంటుంది.

అంబేద్కర్ ఈ ప్రసంగం చేసినప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం ఉధృతంగా ఉంది. మార్క్సిస్టులు ఈ సత్యాన్ని  అంగీకరించినప్పటికీ, అంబేద్కర్ ఈ యుద్ధాన్ని "ప్రజా యుద్ధం" గా అభివర్ణించారు. “ఇది ఓల్డ్ ఆర్డర్, నాజీ ఆర్డర్ రెండింటిపై యుద్ధం. ఈ యుద్ధ వ్యయానికి పరిహారం క్రొత్త ఆర్డర్‌ను స్థాపించడమేనని, ఇందులో స్వేచ్ఛ, సమానత్వం,  సోదరభావం కేవలం నినాదాలు కాదని, జీవిత వాస్తవాలుగా మారుతాయని అణగారిన ప్రజలకు తెలుసు. ” అని ఆయన అన్నారు.

ఫ్రెంచ్ విప్లవాన్ని గుర్తుచేసుకుంటూ, “శ్రమకు అనువైన న్యూ ఆర్డర్ కి ఫ్రెంచ్ విప్లవంలోే మూలాలు ఉన్నాయి. ఫ్రెంచ్ విప్లవం రెండు సూత్రాలను ముందు వుంచింది. స్వయం పాలన సూత్రం, స్వీయ-నిర్ణయ సూత్రం. పాలకులు, సంపూర్ణ చక్రవర్తులు, నియంతలు, కులీనులు  పరిపాలించకుండా ప్రజలు తమను తాముే పరిపాలించాలనే కోరికను స్వపరిపాలన సూత్రం వ్యక్తపరుస్తుంది. స్వయం నిర్ణయాత్మక సూత్రం బాహ్య నిర్బంధం,  రాజకీయ స్థితి, స్వాతంత్య్రం,  పరస్పర ఆధారపడటం, ప్రపంచంలోని ఇతర ప్రజలతో ఐక్యత లాంటి అంశాలను పరిశీలిస్తుంది. తద్వారా ప్రజాపాలనను నిర్ణయిస్తుంది.  కొత్త సామాజిక క్రమం కోసం ప్రపంచ ప్రజల ఐక్యత అత్యవసరం. అలాంటి విజయం కోసం అందరూ పోరాడాలి.

అందుకే, 1947 లో అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య తరపున రాజ్యాంగ అసెంబ్లీకి సమర్పించిన మెమోరాండంలో, డాక్టర్ అంబేద్కర్ భారతదేశాన్ని వేగంగా పారిశ్రామికీకరణ చేయాలని, వ్యవసాయం కోసం "రాష్ట్ర పరిశ్రమ" హోదాను డిమాండ్ చేశారు. "రాష్ట్రాలు మరియు మైనారిటీలు" అనే మెమోరాండం రాష్ట్ర సోషలిజం, భూమిని జాతీయం చేయడం, ప్రత్యేక ఓటర్లు అనే అంశాలను వివరిస్తుంది. అతను రాజ్యాంగంలో భాగం కావాలని కోరుకున్నాడు. ఏదేమైనా, రాజ్యాంగ అసెంబ్లీ సభ్యునిగా, దాని ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా ఉన్నప్పటికీ, యథాతథవాదుల వ్యతిరేకత కారణంగా అతను దానిలో విజయం సాధించలేకపోయాడు.

ముసాయిదా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2, సెక్షన్ 2, క్లాజ్ 4 [i] ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా రక్షణ కోసం, రాజ్యాంగంలో  కోన్ని నిబంధనలను అంబేద్కరం ప్రవేశపెట్టారు. అయినా ఆయన ప్రతిపాదించిన చాలా అంశాలు రాజ్యాంగంలో పోందుపరచ బడలేదు.

ఈ మెమోరాండంలో సోషలిస్ట్ అంబేద్కర్ పూర్తిగా, స్పష్టంగా కనిపిస్తాడు. దళిత రాజకీయాలు, దళిత ఉద్యమాలు ఆయన సోషలిస్టు భావజాలాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లకపోవడం విచారకరం. అంబేద్కర్ సోషలిస్ట్ భావజాలాన్ని అవలంబించడంలో దళిత ఉద్యమం విఫలం కావడం వల్ల అది దారి తప్పింది.
(the views expressed are personnel)

- అమన్

Comments