వైజాగ్ గ్యాస్ లీక్ మే 7 న భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం శివార్లలోని ఆర్.ఆర్.వంకటపురం గ్రామంలో (గోపాలపట్నం సమీపంలో) జరిగిన పారిశ్రామిక ప్రమాదం. లీకైన గ్యాస్ వ్యాప్తిపై సుమారు 5 కిలోమీటర్లు రేడియేషన్, ఇది పరిసర ప్రాంతాలను, గ్రామాలను ప్రభావితం చేసింది. మే 7 సాయంత్రం 5 గంటల నాటికి, అధికారిక మరణాల సంఖ్య 11. 1,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.
నేపథ్యం
హిందూస్తాన్ పాలిమర్స్ 1961 లో వెంకటపురం గ్రామం దగ్గర స్థాపించబడింది. ఇది పాలీస్టైరిన్, దాని కో-పాలిమర్ ఉత్పత్తులతో పాటు ఇంజనీరింగ్ ప్లాస్టిక్ సమ్మేళనాలను తయారు చేస్తుంది. 1978 లో, దీనిని మెక్‌డోవెల్ & కోలో విలీనం చేశారు. తరువాత దీనిని దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జి కెమికల్స్ స్వాధీనం చేసుకుంది. దీనిని 1997 లో ఎల్‌జి పాలిమర్స్ ఇండియాగా మార్చారు.
లీకేజ్ ప్రభావాలు
మే 7, 2020 న, COVID-19 నేపధ్యంలో లాక్డౌన్ తరువాత ప్లాంట్ తిరిగి ప్రారంభించబడింది. ఈ ప్లాంట్లో 2,000 మెట్రిక్ టన్నులు స్టైరిన్ నిల్వ చేసిన ట్యాంకులు 12 ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో ట్యాంకులు అన్‌లాక్ చేయబడ్డాయి. గది ఉష్ణోగ్రత (20–22 ° C) వద్ద స్టైరిన్ మోనోమర్ ద్రవ రూపంలో ఉంటుంది. గది ఉష్ణోగ్రత కంటే ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ సులభంగా ఆవిరైపోతుంది. శీతలీకరణ విభాగంలో సాంకేతిక లోపం వల్ల ట్యాంకులు ప్రమాదానికి కారణమవుతాయి. ఈ ట్యాంకులు అధిక ఉష్ణోగ్రత వల్ల ఆవిరి పీడనం పెరగడానికి కారణమైంది. తెల్లవారుజామున 2:30 మరియు 3:00 మధ్య, నిర్వహణ కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు, ప్లాంట్ నుండి గ్యాస్ లీక్ అయి సమీప గ్రామాలు, ప్రాంతాలకు వ్యాపించింది.
తీవ్రమైన ప్రభావాలు
ఆర్. ఆర్. వెంకటపురం, పద్మపురం, బిసి కాలనీ, గోపాలపట్నం, కంచరపాలెం లు ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్ళలో మంటతో వందలాది మందిని ఆసుపత్రులకు తరలించారు. వాయువు ప్రభావాల వల్ల చాలా మంది అపస్మారక స్థితిలో నేలమీద పడి ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం, కనీసం 11 మంది మరణించారు. 20-25 మంది పరిస్థితి విషమంగా ఉంది. 1000 మందికి పైగా ప్రజలు వాయువుకు గురైనట్లు తెలిసింది.
భారత్ లో 5 పెద్ద ప్రమాదాలు
విశాఖ విషాదం భారత దేశ చరిత్రలో జరిగిన ముఖ్యమైన ఐదు పారిశ్రామిక వైపరీత్యాలను గుర్తు చేస్తోంది.
1. ముంబయి డాక్స్ పేలుళ్లు 1944
రెండో ప్రపంచ యుద్ద కాలంలో జరిగిన ఈ విషాదంలో దాదాపు 1300 మంది మరణించారు. 1400 టన్నుల పేలుడు పదార్ధాలతోపాటు పత్తి బేళ్లను, బంగారాన్ని లోడ్ చేసి ఉన్న నౌకకు నిప్పంటుకోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది. దీంతో 500 మంది పౌరులు చనిపోయారు. 80వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మంటలను ఆర్పే క్రమంలో 71 మంది అగ్నిమాపక సిబ్బంది కూడా మరణించారు.
2. చాస్‌నాల బొగ్గుగని ప్రమాదం 1975
చాస్‌నాల బొగ్గుగని ప్రమాదం జార్ఖండ్‌లోని ధనబాద్ దగ్గరలో కల చాస్‌నాల బొగ్గుగనిలో 1975 డిసెంబర్ 27వ తేదీన జరిగింది. భూగర్భ బొగ్గుగనిలో పని చేస్తున్న కార్మికులు బొగ్గు తీసేందుకు పేలుడు జరపడంతో నీటి ధార యమపాశంలా మీదకు వచ్చింది. పెద్దఎత్తున నీళ్లతో బొగ్గుగని అంతా మునిగిపోవడంతో దాదాపు 380 మంది కార్మికులు చనిపోయారు.
3. భోపాల్ గ్యాస్ విషాదం 1984
భోపాల్‌లో పురుగు మందులను తయారు చేసే యునైటెడ్ కార్బయిడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి విషవాయువు పెద్ద ఎత్తున లీక్ అవ్వడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ లీకేజ్ ఘటనగా దీన్ని పేర్కొంటారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ నష్ట పరిహారం చెల్లించిన ప్రకారం 3,787 మంది చనిపోయాగా, 5,74,336 మంది గాయాల పాలయ్యారు.
4. కోబ్రా చిమ్ని ప్రమాదం 2009
కోబ్రా చిమ్ని ప్రమాదం
చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కోబ్రా నగరంలో 2009 సెప్టెంబర్ 23వ తేదీన జరిగింది. భారత్ అల్యూమినియం లిమిటెడ్ కోసం వేదాంత సోర్సెస్ కంపెని ఓ పెద్ద చిమ్నిని నిర్మిస్తోంది. దాదాపు 780 అడుగుల ఎత్తులో నిర్మాణం కొనసాగుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా చిమ్ని విరిగిపడడంతో దాదాపు 45 మంది కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత ఒక్కొ కార్మిక కుటుం బానికి లక్ష రూపాయలను నష్టపరిహారంగా ఇచ్చారు. చిమ్ని నిర్మాణంలో నాణ్యత పాటించలేదని విచారణ చేసిన కమిటీ తేల్చింది.
చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కోబ్రా నగరంలో 2009 సెప్టెంబర్ 23వ తేదీన జరిగింది. భారత్ అల్యూమినియం లిమిటెడ్ కోసం వేదాంత సోర్సెస్ కంపెని ఓ పెద్ద చిమ్నిని నిర్మిస్తోంది. దాదాపు 780 అడుగుల ఎత్తులో నిర్మాణం కొనసాగుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా చిమ్ని విరిగిపడడంతో దాదాపు 45 మంది కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత ఒక్కొ కార్మిక కుటుం బానికి లక్ష రూపాయలను నష్టపరిహారంగా ఇచ్చారు. చిమ్ని నిర్మాణంలో నాణ్యత పాటించలేదని విచారణ చేసిన కమిటీ తేల్చింది.
5. జైపూర్ అయిల్ డిపో మంటలు 2009
జైపూర్ శివార్లలో ఇండియన్ అయిల్ కార్పొరేషన్‌కు సంబంధించిన డిపోలో 8 వేల లీటర్ల పెట్రోలు గల ట్యాంక్‌లో ఒక్కసారిగా మంటలు రేగాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 300 మంది గాయపడ్డారు.
సేఫ్టీ ప్రొసీజర్ ఉల్లంఘనలు
స్టైరీన్ మోనోమోర్ ద్రావకం స్టోర్ చేసినప్పుడు భద్రత అత్యంత కీలకం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, డైరెక్టర్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్స్ సర్టిఫి కెట్లు కూడా ఉండాల్సి ఉన్నా అవేవీ లేవన్నది స్పష్టంగా తెలు స్తోంది. యాజ మాన్యం హడావుడిగా ఎందుకు ట్రయల్ రన్‌కు సిద్ధపడిందన్నది ఎవ రికీ అర్థం కాని విషయం.
మెషినరీ కూడా పాతదే
సేఫ్టీ డిపార్టుమెంట్‌ను కూడా ఎల్‌జి యాజమాన్యం నిర్వహించడం లేదని దీంట్లో పనిచేస్తున్న కార్మికులే బాహాటంగా చెబుతున్నారు.
ఎల్‌జి పాలిమర్స్ యాజమాన్యానికి ఈ స్టైరీన్ గ్యాస్ లీక్ అయితే వచ్చే రియాక్షన్ గురించి ఏ మాత్రమూ తెలియదని కొంత మంది సీనియర్ కాలుష్య నిపుణులే చెబుతున్నారు.
చట్టాలేం చెపుతున్నాయి
పర్యావరణ (రక్షణ) చట్టం 1986లో రూపొందించారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి విశేషాధికారాలు ఉన్నాయి. వీటి ప్రకారం కాలుష్యాన్ని నియంత్రించడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి, వాయు, జల కాలుష్యాలను తగ్గించడానికి కేంద్రం ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకురావచ్చు. పర్యావరణ (రక్షణ) చట్టం 1986లో రూపొందించారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి విశేషాధికారాలు ఉన్నాయి. వీటి ప్రకారం కాలుష్యాన్ని నియంత్రించడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి, వాయు, జల కాలుష్యాలను తగ్గించడానికి కేంద్రం ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకురావచ్చు. 1989లో విష పూరిత వ్యర్థాల నియంత్రణ, విషపూరిత రసాయ నాల తయారీ, నిల్వ, దిగుమతుల నిబంధనలను రూపొందించింది. వీటి ప్రకారం అధికార యంత్రాంగం తరచు ఈ తరహా ఫ్యాక్టరీలను సంద ర్శించి, అవసరమైన చర్యలు తీసుకోవాలి. 1996లో రసాయన ప్రమాదాలు చోటు చేసుకుంటే ఎలా స్పందించాలో వివరిస్తూ కొన్ని నిబంధనలను రూపొందించింది. దీని ప్రకారం కేంద్రం సెంట్రల్ క్రైసిస్ గ్రూపును ఏర్పాటు చేస్తుంది. అదే విధంగా రాష్ట్ర స్థాయిలోనూ రాష్ట్ర ప్రభుత్వం క్రైసిస్ గ్రూపును ఏర్పాటు చేయాలి. ఫ్యాక్టరీల సవరణ చట్టం (1987) విషపూరిత రసాయనాలు తయారు చేసే ఫ్యాక్టరీలు విపత్తు సమయంలో ఎలా స్పందించాలో, కార్మికుల, స్థానికుల భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకోవాల న్నది దీనిలో సవివరంగా పేర్కొన్నారు. ఆ ప్రమాణాల మేరకు నిబంధనలు పాటిస్తున్నారో లేదో అధికారయంత్రాంగం ఎప్పటికప్పుడు తనఖీ చేయాలి. పబ్లిక్ లయబిలిటీ యాక్ట్ ఇన్సూరెన్స్ యాక్ట్ (1997) నిర్ల క్ష్యం కారణంగా ప్రమాదం జరిగితే దానికి ఫ్యాక్టరీ యజమానే బాధ్యత వహించాలి. బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించాలి. దీనికోసం యజమానికి బీమా తీసుకునే అవకాశం కల్పించారు.
స్టైరీన్ వల్ల నష్టాలు
స్టైరీన్ ప్రాధమికంగా సేంద్రీయ సమ్మే ళనం. ద్రవరూపంలో ఉండేవాయువు. వాతావరణంలో ఇది చాలా తక్కువగా లభిస్తుంది. మిగిలిన వాటితో పోలిస్తే ఇది భారమైన వాయువు. కొన్ని రకాల చెట్ల బెరడు నుండి ఇది చాలా తక్కువగా లభిస్తుంది.అందువల్ల పెట్రోకెమికల్ రీఫైనరీస్‌లో దీనిని తయారుచేసి పాలిమార్స్, ప్లాస్టిక్, రెజిన్ తయారీలో వినియోగిస్తున్నారు. ఇది గాలిలో కలిసినప్పుడు ప్రాణాంతకమైన స్టైరీన్ డయాక్సైడ్‌గా మారుతుంది. 1989వ సంవత్సరంలో మనదేశంలో దీనిని విషపూరిత రసాయనంగా గుర్తించారు. ఆ ఏడాదే రూపొందించిన నిబంధనల్లో స్టైరీన్ తయారీ,నిల్వ, దిగుమతులకు సంబంధించి అనేక ఆంక్షలు పెట్టారు.
పీలిస్తే ఏమవుతుంది?
దీనిని తక్కువ సమయం మాత్రమే పీలిస్తే కళ్లు, చర్మం మండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంత మందికి ఆయాసం కూడా వస్తుంది. ఎక్కువ సమయం పీల్చాల్సిన పరిస్థితి ఏర్పడితే తలనొప్పి, వాంతులు, కుంగు బాటు, కళ్లు కనిపించకపోవడం, చెవులు వినిపించకపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు వస్తాయి. ఒక ప్రాంతంలో 800 పిపిఎం కన్నా ఎక్కువ మోతాదులో ఇది గాలిలో కలిస్తే దానిని పీల్చిన వ్యక్తి కొన్ని నిమిషాల్లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లి పోతాడు. ఇవి తక్షణం కనిపించే లక్షణాలు కాగా, దీర్ఘకాలంలో నాడి వ్యవస్థపైన తీవ్ర ప్రభావం చూపుతుందని, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు. కొందరిలో పక్షవాతం కూడా కనిపించే అవకాశం ఉంది. క్యాన్సరం బారిన పడే అవకాశం వుంది.
కొత్త సమస్యలు
554 మంది బాధితుల్లో 52 మంది చిన్నారులే ఉన్నారు. తాజాగా, బాధితుల్లో శరీరం కమిలిపోతుంది. కొందరికి ఒంటిపై బబ్బలు వస్తుండగా, చిన్నారుల్లో జ్వరం, న్యూమోనియా వంటి లక్షణాలు బయటపడుతోంది. తొలుత శరీరంపై దురద, మంట ఏర్పడుతోంది. అనంతరం చర్మం కమిలిపోయి బబ్బలు వస్తున్నాయి. బాధితులు తాము ఆహారం తీసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. కిడ్నీ, కాలేయ పనితీరు బాగాలేదని వైద్యులు చెపుతున్నారు.
నష్టపరిహారం విడుదుల
విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం విడుదల చేసింది. ఈ మేరకు రూ.30 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం జిఒ విడుదల చేసింది. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.కోటి, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నారు. ప్రథమ చికిత్స పొందిన వారికి రూ.25 వేలు, ఎల్‌జి కంపెనీ పరిసర గ్రామాల్లో ఉన్న వారికి రూ.10 వేల చొప్పున సాయం అందించనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.
గాలి దశ మారి వుంటే ఏం జరిగేది
ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని సురక్షిత ప్రదేశాల వైపు పరుగులు తీశారు.
ఈ విష వాయువు (స్టైరీన్) లీకైనప్పుడు- గాలి తూర్పు నుంచి పశ్చిమానికి వీస్తోంది. ఆ వైపున వెంకటాపురం, పద్మనాభపురం, కంపరపాలెం, కొత్తపాలెం, వెంకటాద్రి నగర్ గ్రామాలు ఉన్నాయి. ఈ ఐదు గ్రామాల్లో పదివేల మంది జనాభా ఉంటారు. దగ్గరగా ఉన్న వెంకటాపురంపై విష వాయువు ప్రభావం ఎక్కువ కనిపించింది. ఎక్కువ మంది అస్వస్థతకు గురవ్వడం, ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అక్కడే జరిగింది. పశువుల, కోళ్లు పెద్దసంఖ్యలో చనిపోయాయి. అయితే, ఇవి పొలాలూ, చెట్లు చేమలతో నిండిన గ్రామాలు కావటం చేత, గాలి ధారాళంగా ప్రసరించి, తొందరగా పలచబడడం చేత ప్రమాద తీవ్రత తక్కువగా ఉందని పరిశీల కులు భావిస్తున్నారు. ఎక్కువమంది మేఘాద్రిగెడ్డ వైపు వెళ్లిపోయారు.
ఒకవేళ విషవాయువు లీకైనప్పుడు గాలివాటం పశ్చిమం నుంచి తూర్పు వైపు ఉండి ఉంటే- ప్రమాద నష్టం ఇంకా తీవ్రంగా ఉండేది. తూర్పు వైపున పెద్ద పట్టణమే విస్తరించి ఉంది. జనసాంద్రత చాలా ఎక్కువ. ప్రహ్లాదపురం, ఇందిరా నగర్, టైలర్స్ కాలనీ, గోపాలపట్నం, గణేష్ కాలనీ, సంతోష నగర్, వేపగుంట వంటివన్నీ ఒకదానికొకటి ఆనుకొనే ఉన్నాయి. విషవాయువు మూడు నుంచి ఐదు కిలోమీటర్ల మేర విస్తరించింది. ఇది తూర్పు వైపున ప్రసరించి ఉంటే లక్షలాది మంది దాని ప్రభావానికి గురై ఉండేవారు. గాలివాటం పెద్ద నష్టాన్ని తప్పించిందని స్థానికులు పేర్కొంటున్నారు.
2018, 19 సంవత్సరాల్లో మాత్రమే ఆ సంస్థ పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. ఆ సందర్భంగా 4.5 లక్షల రూపాయలు కడుతూ దాఖలు చేసిన అఫిడవిట్లలో ఇంతకాలం అనుమతులు లేకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
అరెస్ట్ చేయాలి
పర్యావరణ, ఫ్యాక్టరీ నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా ఇంతటి ఘోరానికి కారణమైన ఎల్‌జి పాలిమర్స్ యజమానులను తక్షణం అరెస్ట్ చేసి విచారణ జరపాలని విశాఖకు చెందిన పర్యావరణ వేత్త జెవి రత్నం డిమాండ్ చేశారు. ప్రజాశక్తితో మాట్లాడుతూ ఆయన జనావాసాలు ఉన్న ప్రాంతంలోనే ఫ్యాక్టరీ ఏర్పాటైందని చెప్పారు. సంస్థ ఏర్పాటైన 1961లో కూడా గ్రామాలున్నాయని, అప్పటి నుండి ఇప్పటి వరకు అధికారుల అనుమతితోనే ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయని చెప్పారు. ఎల్‌జి పాలిమర్స్ సంస్థ కూడా ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని తెలిపారు. జనావాసాల మధ్య ఉన్న విషపు కంపెనీని తక్షణం మూసివేయాలని, వేరే ప్రాంతానికి తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ తరహా ప్రమాదాలు జరిగినప్పుడల్లా ప్రజలను ఊర్లను ఖాళీ చేసి, పారిపోవాలని అధికారులు చెబుతున్నారని, దానికి బదులుగా ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు.
1961 నాటి ట్యాంకులు
12 మంది మరణానికి, వేలాది మంది అస్వస్థతకు గురికావడానికి కారణమైన విషం రూపొందిన ట్యాంకులు (కంటైనర్లు) 1961లో నిర్మాణమైనాయి. ఆ తరువాత ఫ్యాక్టరీ రెండు సార్లు చేతులు మారింది. కొంతకాలం విజయమాల్య గ్రూపు నిర్వహించింది. 1997లో దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జి పాలిమర్స్ సంస్థ కొనుగోలు చేసింది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు సంస్థ ఉత్పత్తి సామర్ధ్యం గణనీయంగా పెరిగింది. యంత్రాలు మారాయి. అయితే, స్టైరీన్‌ను నిలువ చేసే కంటైనర్లు మాత్రం 1961లో హిందుస్థాన్ పాలిమర్స్ యాజమాన్యం నిర్మించినవే! 2004లో రోజుకు 45 టన్నుల ఉన్న ఎక్స్‌పాండబుల్ పాలిస్ట్రీన్ ఉత్పత్తి 2018 నాటికి 103 టన్నులకు చేరింది. పాలిస్ట్రీన్ ఉత్పతి రోజుకు 235 టన్నుల నుండి 313 టన్నులకు చేరింది. 208లో రోజుకు 36.67 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఇంజినీరింగ్ ప్లాస్టిక్స్ విభాగాన్ని కూడా ఆ సంస్థ ప్రారంభించింది. వీటన్నింటికి స్టైరీన్ వినియోగం తప్పనిసరి. ప్రమాదం జరిగిన రోజు మీడియాతో మాట్లాడిన ఆ సంస్థ జనరల్ మేనేజర్ మోహన్‌రావు రెండు కంటైనర్లలో ఒక దానిలో సమస్య ఉందని చెప్పడం గమనార్హం. 5వేల టన్నుల సామర్ధ్యంతో రెండు కంటైనర్లు ఉన్నాయని, వీటిలో ఒకదానిలో కొంత ఇబ్బంది ఉన్న విషయాన్ని తాము గతంలోనే గుర్తించామని, అయితే, దానివల్ల ఏ రోజూ సమస్య రాలేదని ఆయన అన్నారు. '20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద స్టైరీన్‌ను నిలువచేయాలి. ఒక ట్యాంకులో కొంత సమస్య ఉన్నందువల్ల దిగువ భాగంలో ఆ ఉష్ణోగ్రతే ఉండేది. పై భాగంలో మాత్రం తెట్టుగా పేరుకునేది. అది హైడ్రో కార్బన్‌గా మారి కంటైనర్ పై భాగం నుండి దిగువకు వేలాడేది' అని ఆయనే చెప్పాడు.
ప్రభుత్వ నిర్లక్ష్యం
జనావాసాల మధ్య విషపు ఫ్యాక్టరీలను ఎలా పెడతారు. వెంటనే మూసివేయండి. అవసరమైతే వేరే ప్రాంతానికి తరలించండి అంటూ అన్ని పాార్టి, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. భోపాల్ విషవాయువు దుర్ఘటన తరువాత దేశంలో రూపొందిన చట్టాల్లో ఏ ఒక్క చట్టం కూడా ఎల్‌జి పాలిమర్స్‌లో అమలు కావడం లేదు. చట్టాల ప్రకారం నడుచుకోవాలని ఏ ప్రభుత్వమూ ఆదేశించలేదు. పర్యావరణ అనుమతులు లేకుండానే ఈ సంస్థ కార్యక్రమాలు ఇన్ని సంవత్సరాలు నిరాటంకంగా జరుగుతున్నాయి.
అరెస్ట్ చేయాలి. ఫ్యాక్టరీని మూసివేయాలి
పర్యావరణ, ఫ్యాక్టరీ నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా ఇంతటి ఘోరానికి కారణమైన ఎల్‌జి పాలిమర్స్ యజమానులను తక్షణం అరెస్ట్ చేసి విచారణ జరపాలి. ఫ్యాక్టరినీ మూసివేయాలి. సంస్థ ఏర్పాటైన 1961లో కూడా గ్రామాలు వున్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు అధికారుల అనుమతితోనే ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ఎల్‌జి పాలిమర్స్ సంస్థ కూడా ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని తెలిపారు.
తూగో జిల్లాలో ప్రమాదకర కంపెనీలు
ప్రస్తుతం జిల్లాలో పారిశ్రామికీకరణ శరవేగంగా దూసుకెళుతోంది. భారీ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు 2,500 వరకు ఉన్నాయి. సహజ నిక్షేపాలను వెలికితీస్తున్న ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థ లు, చమురుశుద్ధి కర్మాగారాలున్నాయి. వీటిలో ప్రత్యక్ష, పరోక్షంగా సుమారు 3.60 లక్షల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. .
తూర్పు గోదావరి జిల్లాలో 23 పరిశ్రమల్లో ప్రమాదకర టాక్సిక్ గ్యాస్ అర్‌సెంటిక్ పెంటా ఫ్లూరైడ్, అర్‌సైన్, బిస్, బోరాన్, బోరాన్ ట్రైక్లోరైడ్, బోరాన్ ట్రై క్లోరైడ్, బోరాన్ నైట్రో బ్రోమైడ్, ట్రైఫ్లోరైడ్, బ్రోమైన్, కార్బన్ మోనాక్షైడ్, క్లోరిన్... ఇలా 56 రకాలకుపైగా విష వాయువులను పరిశ్రమల్లో వాడుతున్నారు. వీటిని ఆయా పరిశ్రమల్లో ఐఎస్‌వో రక్షణ ప్రమాణాలతోనే స్టోరేజీ ట్యాంకుల్లో భద్రపరుస్తు న్నారు. అయితే ఈ టాక్సిస్‌లన్నీ అధిక పీడన సామర్థ్యం కలిగి ఉంటాయి. అలాగే హజార్డ్ కెమికల్స్ (ప్రమాదకర రసాయనాలు) వాడుతున్న పరి శ్రమలు, కర్మాగారాలు జిల్లాలో 700కు పైగానే ఉన్నాయి. అయితే వీటిలో ఎప్పుడూ ఎటువంటి ప్రమాదాలు సంభవించలేదు.
కాలుష్య కోరల్లో విశాఖ
1997లో హెచ్‌పీసీఎల్ గ్యాస్ ట్యాంకులు పేలినప్పుడు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు కొండలు, గుట్టలు ఎక్కి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. నాలుగేళ్ల కిందట అదే కంపెనీలో కూలింగ్ టవర్ కూలిపోయి 38 మంది చనిపోయారు. స్టీల్‌ప్లాంట్‌లో 2012లో గ్యాస్ లీకై ట్యాంకర్ పేలిపోయి 19 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఫార్మా కంపెనీలలో ప్రమాదాలు నిత్యకృత్యం.
విశాఖ నగరానిది ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపం. ఒకవైపు సముద్రం... మూడు వైపుల కొండలతో నగరం ‘గిన్నె’ను పోలి ఉంటుంది. దీనివల్ల పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం అంతా బయటకు వెళ్లదు. నగరంలోనే ఉంటుంది. విష వాయువులు, బొగ్గు ధూళి వంటివి గాలిలోకి వచ్చినప్పుడు... సముద్రం మీదుగా వీచే గాలిలోని తేమ వాటితో జత కలిసి బరువుగా మారి తిరిగి నేలపైకి చేరుతుంది. ఏ కాలుష్యమైనా సరే నగరంపైనే తచ్చాడుతూ, కిందికి దిగుతుంది. దీనివల్ల ఇక్కడి ప్రజలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ కాలుష్యం ఎక్కువైందని గుర్తించిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కొన్నాళ్లు విశాఖపట్నంలో కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇవ్వబోమని నిషేధం కూడా విధించింది.
ముగింపు
ఏటా 1700 కోట్ల టర్నోవర్ తో, 600 మంది ఉద్యోగులతో ఎల్ జి పాలిమర్స్ కంపెనీ విశాపట్నంలో 250 ఎకరాల విస్తీర్ణంలో వుంది. ఈ కంపెనీ నిర్లక్ష్యం వల్ల స్టెరైన్
రూపంలో విషవాయువు విడుదల అయింది. అదే టాంకర్ పేలిఉంటే ప్రాణ నష్టం ఎక్కువుగా వుండేది. స్థానికులు ఈ కంపెనీని మూసేయాలని కోరుకోవడం లేదు. తరలించాలని మాత్రమే అందరు
కోరు కుంటున్నారు. అభివృద్ధి తీసుకొచ్చిన విధ్వంసపు భావజాలం అది. పరిశ్రమలు లేకపోతే అభివృద్ధి వుండదని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. అదే రాజధాని కోసం వేల ఎకరాల పచ్చని పంట పొలాలు విధ్వంసం అయినా పర్లేదని ప్రజలు భావిస్తున్నారు.
ప్రభుత్వం కోటి రూపాయలు చనిపోయిన వారికి ప్రకటించి కంపెనీకి మద్దతుగా నిలిచింది. జగన్ కంపెనీ ముఖ్యులతో ఎయిర్ పోర్టులో నే సానుకూలంగా మాట్లాడారు. స్థానికులను అక్కడి నుండి తరలించాలని కుట్ర పన్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. మే 1వ తేదీనే స్టరైన్ లీకు అయుందని, ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసి అక్కడినుండి తరమాలని ప్రభుత్వమే కుట్ర పన్నింది అని ప్రజల ఆరోపణ. ఈ కంపెనీ ప్లాస్టిక్ మద్యం సీసాలను సరఫరా చేయడానికే కంపెనీని తెరిచిందని, ప్రభుత్వ పెద్దలకు చెందిన కంపెనీకి నిధులు కూడా ఇచ్చిందని తెదేపా అరూపిస్తోంది. అక్కడ నీళ్ళు, గాలి కలుషి తమయ్యాయు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 50 కోట్లు ప్రాథమిక నష్టానికి భాద్యతగా డిపాజిట్ చేయమంది. న్యాయస్థానం, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ సంఘటనను సుమోట గా స్వీకరించాయు. కంపెనీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. సెక్షన్ 299 కింద కేసు కట్టాలని తెదేపా డిమాండ్ చేస్తోంది. ఇటువంటి పరిశ్రమల గుర్తింపు ను రద్దు చేయాలి. యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి. కంపెనీ ఆస్తులను జాతీయం చేయాలి. అప్పుడే కంపెనీలు ప్రజల ప్రాణం పట్ల శ్రద్ద వహిస్తారు. ఊర్లకు దూరంగా ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు.
Comments
Post a Comment