కార్మిక చట్టాలను 1000 రోజుల వరకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాలు (మూడు సంవత్సరాలు) నిలిపి వేస్తూ చేసిన ఆర్డినెన్స్ ఉపసంహరించు కోవాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తుంది.
7 & 8 మే 2020 తేదీలలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మరియు గుజరాత్ రాష్ట్రం కార్మిక చట్టాలను సుమారు మూడు సంవత్సరాల వరకు( వెయ్యి రోజులు) నిలిపి వేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే. భారతదేశంలో సంక్షోభం తలెత్తుతుందని కార్పొరేట్లు బహుళజాతి సంస్థలకు లాభం చేకూర్చడానికి BJP పార్టీ కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలోనే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాలు , 35 కార్మిక చట్టాలను సుమారు మూడు సంవత్సరాల వరకు (1000 రోజులు) నిలిపివేస్తూ 7&8 మే,2020 న ఆర్డినెన్స్ తీసుకువచ్చినారు.
యుద్ధ సమయాల్లోనూ లేదా అత్యవసర విపత్కర పరిస్థితుల్లో కూడా కార్మిక చట్టాల నిలిపి వేయడం లేదా రద్దు చేయడానికి సాహసం చేయరు.కానీ గత మూడు నెలలుగా ప్రపంచం కరోనా వైరస్ కారణంగా ఒక భయానక స్థితిలో లక్షల సంఖ్యలో మరణాలతో మానవాళి ఒక గడ్డు స్థితిని ఎదుర్కొంటున్న ఈ ఆపత్కాల డిజాస్టర్స్ పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు కార్మికుల పట్ల, ప్రజల పట్ల సహాయపడే విధంగా ఉండి సంక్షేమాలను, బ్రతుకు తెరువును పట్టించుకోవాల్సి ఉండే. మరింత బాధ్యతతో మానవీయంగా మెదలాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి పేరున అకస్మాత్తుగా లోక్డౌన్ ప్రకటించి కోట్లాది వలస కార్మికుల బ్రతుకులు చిదిమేసినారు.
అసమాన పోరాటలతో సాధించుకున్న కార్మిక చట్టాల వలన ఈ దేశంలోఅమలౌతున్నా కార్మిక చట్టాలతో కొద్దిపాటిగానైన రక్షణతో,మెరుగైన సౌకర్యాలతో సంఘటిత రంగం కార్మికులు ఈ కార్మిక చట్టాల వలన లబ్ది పొందుతున్నారు.కానీ కోట్లాది మంది అసంఘటిత రంగంలో కార్మికులకు ఎలాంటి రక్షణ, వేతన భద్రత లేకుండా సామాజిక భద్రత కొరవడి బ్రతుకుతున్నారు.ఈ సంక్షోభ సమయంలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారిశ్రామిక రంగ సంక్షోభాన్ని నివారించడానికి,కార్పొరేట్లు, బహుళ జాతి కంపెనీలకు లబ్ది చేకూరడానికి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని బలి చేయడానికే లక్ష్యంగా ఈ కార్మిక చట్టాలను 1000 రోజుల వరకు(3సంవత్సరాలు) 35 కార్మిక చట్టాలను నిలిపివేత మరియు 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా మార్చడం నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్మిక చట్టాల మార్పు రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం మరియు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ILO) మౌలిక సూత్రాలకు విరుద్ధం.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ILO) ఒప్పందాలను బేఖాతరు చేయడమే. ఈ రద్దు చేయబడిన 35 కార్మిక చట్టాలలో ప్రధానంగా పారి శ్రామిక వివాదాల చట్టం, కార్మికవర్గం రక్షణ ,వైద్యం, కాంట్రాక్ట్ లేబర్ చట్టం, వలస కూలీల చట్టం,కార్మిక భద్రత, వేతనాల చట్టాలను మరియు 8 గంటల నుంచి 12 గంటల వరకు కార్మికుడు పనిచేస్తే,పని గంటలనకు ఎలాంటి వేతనాలు మరియు అదనపు వేతనం ఇవ్వకపోవడం ఉన్నాయి. 49 మంది వరకు పనిచేసే కార్మికులు ఉన్న సంస్థ లో యాజమాన్యాలు ఎవరినైనా ఉద్యోగంలో నియమించు కోవచ్చు తొలగించుకోవచ్చు. ఎలాంటి లైసెన్సులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా కార్మిక చట్టాలు మార్పులు చేసినారు. కార్మికుల రక్షణపై భద్రతపై చట్టాల అమలు లోపాలను ఎవరు ఏ హక్కుల సంఘం, కార్మిక సంఘాలు ప్రశ్నించకుండా ఒక నల్ల చట్టం( draconian చట్టాన్ని) బిజెపి కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఉత్తర ప్రదేశ్ మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాలు 7, 8 మే,2020 తేదీలలో తీసుకు వచ్చాయి. ఇప్పటికే అసంఘటిత రంగం,ఇతర కాంట్రాక్ట్ రంగంలోని కార్మికులు సేవరంగం లాంటి IT లలో,8 గంటల పనివిధానం నుండి 12 గంటల పని విధానం అమలులో ఉంది. కరోనా సంక్షోభాన్ని గట్టెక్కించడానికి చట్టాలను నిలిపివేత అని చెప్పడం పరిపాలన అసమర్థత అవుతుంది. ఇప్పుడు 12 గంటల పనివిధానం అమలు చేయడమంటే,అది చట్టబద్దత చేయడం కోసమే గత ఆరు సంవత్సరాల నుండి కార్పొరేట్ల, బహుళజాతి కంపెనీలకు మెప్పుల కోసమే BJP కేంద్ర ప్రభుత్వం తీక్షణంగా ఎదురుచూస్తుంది.నిజానికి రాజ్యాంగం ప్రకారం, చట్టప్రకారం పరిపాలన సాగిస్తామని చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి బేఖాతరు చేసి కార్పొరేటు పెట్టుబడిదారులకు లబ్ధి చేకూరే విధంగా 125 సంవత్సరాల చరిత్ర గలిగిన కార్మిక చట్టాలను రద్దు చేయడం తమ పరిపాలన డొల్లతనాన్ని తెలియజేస్తుంది. ఈ అసమర్ధత నుంచి తాము తొలగిపోయి వేరే ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వాలి.ఇది అత్యాశే. కానీ అబద్ధాలతో వక్రీకరణలతో కరోనాలాంటి సంక్షుభిత సమయంలో లాక్డౌన్ పేరునా తీసుకున్న ఈ నిర్ణయంతో కార్మికులు బానిసత్వంలోకి పోతారు.కార్మిక సంఘాల ఉనికి ప్రశ్నార్ధకం అవుతుంది.

ఈ విధంగా కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకురావడం మన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన జీవించే హక్కును హరించి వేయడమే అవుతుంది.ఈ కార్మిక చట్టాలను తిరిగి ఉపసంహరించు కొనేవరకు కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు, ప్రజాస్వామికవాదులు కార్మికవర్గానికి అండగా ఉండాలని, పోరాడదామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరియురాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల మార్పిడిని ఉపసంహరించుకోవాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.
1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షులు,
పౌరహక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శి,పౌరహక్కుల సంఘం తెలంగాణ.
3.మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ,పౌరహక్కుల సంఘం తెలంగాణ.
Comments
Post a Comment