భోపాల్ నుండి విశాఖ వరకు



  07/04/2020 న విశాఖ పట్నం శివారు ఆర్.ఆర్.వెంకటాపురం వద్ద  దక్షిణ కొరియా దేశానికి చెందిన బహుళజాతి కంపెనీ అయిన L.G.  పాలిమర్స్ వుంది. ఫాక్టరీ లో తెల్లవారు జామున 2 గంటల మధ్యలో స్టేరైన్ గ్యాస్ లీక్ అయింది. 3    గంటలకు చుట్టుప్రక్కల గ్రామాలకు వ్యాపించింది.  ఘాడ నిద్రలో  ఉన్న ప్రజలు మేల్కొనే లోపే నిద్రలోనే విష వాయువును పీల్చారు. చాలా మందికి కళ్ళు మండడం, కళ్ళు కనపడక పోవడం, విష వాయువు గాలిలొ కలిసి పోవడంతో చుట్టు పక్కల ఉన్న గ్రామాల ప్రజలపై త్రీవ్ర ప్రభావం చూపింది. విష వాయువు ప్రధానంగా కళ్ళు, మెదడు, ఊపిరితిత్తుల  పై ప్రభావం చూపొంది. దిక్కు తోచని ప్రజలు తమను తాము కాపాడుకొనే క్రమములో కండ్లు కనపడక స్పృహ తప్పి రోడ్ల మీద, బావ్వుల్లోనూ, మురికి కాలువలో పడి చనిపోయారు.

అంతే గాక వైద్యం కొరకు విశాఖ ఆసుపత్రులకు తీసుకొచ్చే క్రమంలో యువకులు, యువతులు, చిన్నపిల్లలు స్పృహ తప్పి పడి పోయారు. ఈ స్టేరైన గ్యాస్ లీకేజ్ తో  ఎలుకలు,పిల్లులు, బొద్దింకలు, పాములు , పశువులు మొదలగు మూగ జీవాల పై ప్రభావం చూపడంతో అవి చనిపోయాయి. 

రోడ్లచీేలిపోవడం, చెట్లు, పంట పొలాలు మాడి మసి అయ్యాయు. అయా గ్రామాల ప్రజలు అప్రమత్తమై ప్రభుత్వ యంత్రాంగంకు తెలియజేయడం తో పెను ప్రమాదం తప్పింది. ఈ విషవాయువు తో 12 మంది మృతి చెందారు. వందలాది మంది రకరకాల  ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలు అయ్యారు.  వీరిలో కొందరు  పరిస్థితి ప్రమాదకరం గానే ఉంది.

 ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదకరమైన ఫాక్టరీ లు ఉండడం ప్రజల ప్రాణాలకు ముప్పే.  ప్రభుత్వాలు జనావాసాల మధ్య అనుమతి ఇవ్వడం సరికాదు. ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వం శ్రద్ద చూపడంలేదు. విశాఖ లోని L.G. పాలీమర్స్ ప్లాంట్ లో అత్యధిక ఉష్ణోగ్రత ఉండే బాయిలర్లు లో స్టేరైన్ లిక్వెడ్ గ్యాస్ లోని కార్బన్ అణువులు బాగా వేడెక్కి కొత్త రసాయన బంధనాలు ఏర్పడి పాలి స్టెరైన్ తయారు అవుతుంది. అలాంటి గ్యాస్ లీకైనప్పుడు చాలా ప్రమాదకరం గా ఉంటుంది.

    పేవిస్ట్టిక్ ఎలాగైతే గాలి సోక గానే గడ్డ కట్టి పోతుందో , స్టరైన్ గ్యాస్ పీల్చు కున్నపుడు మనుషుల అవయవాలు కూడా దాదాపు అలాగే అవుతాయని నిపుణులు చెపుతున్నారు. దీన్ని పీల్చిన వెంటనే విపరీతమైన ఇరిటేసన్ వస్తుంది. తలనొప్పి, వినికిడి సమస్య, కళ్ళు మంటలు, కొన్ని సార్లు చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. స్తేరైన్ వాయువును ఎక్కువ సేపు పీలిస్తే కణజాలం పాడవుతుంది. దీనివల్ల 
 క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు వస్తాయని నిపుణులు చెపుతారు. స్టరైనే గ్యాస్ ప్రభావం మనుషులకంటే మూగ జీవాల పై ప్రభావం చూపుతుంది. 

      మధ్య ప్రదేశ్ లోని భోపాల్లో  గ్యాస్ లీక్ జరిగింది. 1969 లో అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ భోపాల్ లో ఎరువుల తయారీ కోసం యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. దీనిలో మీత్త్యెల్ ఐసో సైనైడ్ (M IC) ను ఉపయోగిస్తారు. కాలక్రమేణా, పురుగుల మందు  డిమాండ్ తగ్గడంతో M IC నిల్వలు పెరిగి పోయాయి. వాటిని ప్లాంట్ లో మూడు టాంక్  లలో  భద్రపరిచారు. అయితే నిబంధనల ప్రకారం ఒకొక్క టాంక్ లో 30 టన్నుల వాయువు నింపాలి.   నిబంధనలకు విరుద్ధంగా 42 టన్నులు వాయువును నింపారు. 1984 డిసెంబర్ 2 న మధ్యాహ్నమే ఒక పైపు్ లో గ్యాస్ లీకు అయింది. టాంక్ లోకి నీరు చేరడం అధికారులు గమనించారు. అది ఏం. ఐ.సి.తో రసాయన చర్య జరపడంతో  ఆ టాంక్ ఒత్తిడి పెరిగింది.

1984 డిసెంబర్ 2 వ తేదీ అర్థరాత్రి భోపాల్ నగరంలో జనం ఘాడ నిద్రలో ఉండగా ఒక్క సారిగా గాస్
వ్యాపించి ప్రజలను చుట్టుముట్టింది . ఊపిరాడని ప్రజలు  ప్రాణ భయంతో  బయటికి పరుగులు తీశారు. అప్పటికే జరగరాని నష్టం జరిగి పోయింది. మృత్యువుతో జరిగిన ఈ పోరాటంలో చాలా మంది ఓడిపోయారు. వీరిలో ఎక్కువమంది వృద్దులు, పిల్లలు, వికలాంగులు నోటి వెంట నురుగులు కక్కుతూ ప్రాణాలు కోల్పోయారు. మూగజీవాలు మరణాలకు లెక్కే లేదు. తెల్లారే సరికి భోపాల్ నగరం మరుభూమిగా మారిపోయింది.

  56 వార్డు లున్న భోపాల్ మునిసిపల్ కార్పొరేషన్ లో 36 వార్డు ల్లో విష వాయువు ప్రభావము ఉందని అప్పటి నివేదికలు చెప్పాయు. మొత్తం భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటన లో అధికారికంగా 3000 మంది చనిపోయారు. అనధికారికంగా 25000 మంది చనిపోయి ఉండవచ్చని అంచనా.

వీరి అంతిమ సంస్కారాల కు స్మసానాలు చాల్లేదంటే నాటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొత్తం 6లక్షల మంది ప్రజలు ఈ విష వాయువు ప్రభావానికి గుర్రయారు. నేత్ర, ఉదర, శ్వాస సంబంధ వ్యాధులు ఎదుర్కొన్నారు. నేటికీ ఆ విష ప్రభావంతో ప్రజలు  దీర్ఘ కాలిక వ్యాధులతో పోరాడు తున్నారు.

    ఇంత పెను ప్రమాదం జరిగినా యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ నుండి ప్రజలకు నేటికీ పూర్తి స్థాయిలో నష్ట పరిహారం, న్యాయం జరగలేదు. భారత ప్రభుత్వం అప్పటి కంపెనీ అధికారులను వెంటనే అరెస్టులు చేయడం గాని, కంపెనీ పై కేసులు పెట్టడం గాని చేయలేదు. 1984 డిసెంబర్ చివరి వారంలో కంపెనీ చీఫ్ ఎగ్జక్యూటివ్ ఆఫీసర్ వారే న్ అండర్సన్ ప్రభుత్వానికి దొరికినా, తిరిగి భారత్ వస్తాడనే హామీతో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ వేల మంది ప్రజలు మరణానికి కారకుడైన అండర్సన్ ను గుట్టు చప్పుడు కాకుండా అమెరికాకు పంపించేసాడు. 

తిరిగి అండర్సన్ భారత్ కు రాలేదు. కంపెనీ చీఫ్ ఎగ్జక్యూటివ్ ఆఫీసర్ అండర్సన్ ను 1992 లో కోర్టు పరారీలో ఉన్న వ్యక్తి గా ప్రకటించింది. 2014 లో అండర్సన్ మరణించారు. ఇప్పటికీ నష్ట పరిహారం పెంచాలని కోర్టులో కురేటివే పిటిషన్ వేయగా పెండింగులో ఉంది. నష్ట పరిహారం అందే లోపు ఎంతమంది చనిపోతారో, ఎంత మంది బతికుంటారో తెలీదు. చివరకు నష్టపోయింది, ఓడిపోయింది ప్రజలే.      ఇలాంటి ప్రమాదకరమైన,  ప్రజలకు ఉపయోగం లేని  ప్లాంట్ దేశంలో వున్నాయి.

          తమిళ నాడు తూత్తి కూడి లో వేదాంత కంపెనీకి చెందిన స్టర్ లైట్ కాపర్ ప్లాంట్ వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బ  తిన్నాయి. తూత్తీ కూడి లో 2018 మే 23 న అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాల నేతలు ప్లాంట్ ను మూసి వేయాలని వేలాదిగా పెద్ద ఎత్తున  ఆందోళన చేశారు. ఆందోళన కారుల పై లాట్టీ ఛార్జ్, భాస్ప వాయు గోళాలు, వాటర్ కాన్స్ ప్రయోగించారు. ఆందోళన కారుల వెన్నక్కి తగ్గలేదని ఏకంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 11 మంది అమరులు అయ్యారు.  ప్రజల పోరాట ఫలితంగా  2018 మే 28 తమిళ నాడు ప్రభుత్వం తాత్కాలికంగా ప్లాంట్ ను మూసివేయడం జరిగింది.

       తమిళ నాడు కూడంకులం అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కొరకు1988 లో రష్యా భాగస్వామ్యం తో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ, రష్యా ప్రెసిడెంట్ గోర్బా చేవ్ లు పునాది రాయి వేశారు. 2016  లో  ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ అప్పటి తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత సమక్షంలో జాతికి అంకితం చేశారు.

కూడంకులమ్  అణు విద్యుత్ పవర్ ప్లాంట్ నిర్మాణ ప్రారంభం నుండి అణు విద్యుత్ వల్ల ప్రజలకు ప్రయోజనం లేదు.  దాని వల్ల వాతావరణం కాలుష్యం ఔతుందని, ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని, వాతావరణ సమతుల్యత దెబ్బతినడం తో వాతావరణంలో పెను మార్పులు వచ్చి ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తింటాయి అని ప్రజలనుచైతన్య పరుస్తూ అణు విద్యుత్ వ్యతిరేక ఉద్యమ నాయకుడు ఎస్.పి. ఉదయ్ కుమార్ నాయకత్వంలో సంవత్సరాల పాటు ప్రజలు నిరసన కార్యక్రమాలు చేశారు.

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నిరసనలు లెక్క చెయ్యకుండా, చట్టపరంగా , జీవించే హక్కు లో బాగంగా ఆందోళనలు చేస్తున్న 1800 మందిపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుపాలు చేశారు. కూడంకుళం లో జరిగే ప్రజా వ్యతిరేక విధానాలను బయటి ప్రపంచానికి తెలియ జేయడాని నిజనిర్ధారణ  చేయడానికి వెళ్ళిన బయటి రాష్ట్రాల ప్రజా సంఘాల నాయకులను, ప్రజాస్వామిక వాదులను, హక్కుల కార్యర్తల ను, రచయితల ను మావోయిస్ట్ లని 
 ముద్ర వేసి నెలల తరబడి జైలు పాలు చేశారు.

       ఇలా ప్రజలకు నష్టాలు కలుగ జేసే బహుళ జాతి కంపెనీలకు మేలు చేసే విధంగా అన్ని రకాల రాయితీలు కల్పించి విధాన పరమైన నిర్ణయాలను తుంగలో తొక్కి పాలకుల స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను లెక్కలోకి తీసుకోకుండా  ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు ఇవ్వడం తో  ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

       ఈ కోవలోనే 7/4/2020న విశాఖ రాజారత్నం వెంకటాపురం వద్ద ఉన్న దక్షిణ కొరియాకు చెందిన యల్. జీ. పాలిమర్సలో ప్రమాద ఘటన జరిగింది. లాక్ డౌన్ మూలంగా 40రోజులుగా మూతపడిన ప్లాంట్ ను సడలింపుల సాకుతో ప్రజలకు ప్రయోజనం లేని ప్లాస్టిక్ తయారీ కోసం అనుమతులివ్వడం సరికాదు. అందునా నిపుణులు లేకుండా ప్లాంట్ ను రన్ చేయడానికి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ప్రయంత్నిచడంలో భాగంగానే ఈ ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే వందలాది మంది దీర్ఘ కాలిక వ్యాధులకు గురైయ్యారు. అంతే గాకుండా ఎంతో మానసికంగా వేదన అనుభవించారు.

   ఇలాంటి సంఘటనలు జరిగినపుడు పాలకులు హడాహుడిగా సంఘటన ప్రాంతాన్ని పర్యటించి, ప్రజలను ఓదార్చి ప్రాణాలకు వెలకట్టి లక్షలు, కోట్ల నష్ట పరిహారం ప్రకటించి చేతులు దులుపకుంటున్నారు.  ఇది సమస్యకు ఎంత మాత్రం పరిష్కారం కాదు.

  భోపాల్ సంఘటన జరిగి ఇప్పటికీ 36 ఏళ్ల అయినా,  అక్కడి ప్రజలు ఇప్పటికీ కోలుకోలేదు. విశాఖ బాధితులు కూడా దీర్ఘ కాలిక వ్యాధులకు గురి కాకుండా వారికి మెరుగైన వైద్యం అందించాలి. ఇలాంటి  సంఘటనలను దృష్టిలో ఉంచుకొని మున్ముందు ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ప్లాంట్స్ ను జనావాసాల మధ్య నుండి సుదూర ప్రాంతాలకు తరలించాలి. ఎల్.జీ.పాలిమార్స్ యాజమాన్యం పై హత్యా నేరం కేసులు నమోదు చేయాలి. ప్లాంట్ లైసెన్స్ ను రద్దు చెయ్యాలి.

- చీమలపెంట వెంకటేశ్వర్లు

Comments

  1. రాజ్యం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాను ఎండగడుతూ వచ్చిన చక్కని వ్యాసం. వ్యాసకర్త వెంకటేష్ కు అభినందనలు.

    ReplyDelete
  2. Good massage but not agreed ap cm.what shall we do.మనం nissahayulam కదా..

    ReplyDelete
  3. Nissahaayula my చూస్తూ ఉం డ లేము కదా, ఏదోక రూపంలో పోరాటం చేయాలి...

    ReplyDelete

Post a Comment