పత్రికా ప్రకటన
14 ఏప్రిల్, 2020
ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలపై ఫాసిస్ట్ దాడులకు మరియు ప్రజాస్వామ్యాన్ని అరికట్టే ప్రయత్నానికి వ్యతిరేకంగా నిరసన !
ఏప్రిల్ 14, 2020న, ఆనంద్ తేల్తుమ్బడె మరియు గౌతమ్ నవలఖా లొంగిపోయారు మరియు మధ్యంతర రక్షణను తిరస్కరించిన సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల మేరకు ఎన్ఐఏ (NIA) అరెస్ట్ చేసారు। ఈ ఉత్తర్వు స్వేచ్చా వాక్కు మరియు అసమ్మతి హక్కును వినియోగించుకున్నందుకు మరో ఇద్దరు స్కాలర్లను క్రూరమైన చట్టాల క్రింద అరెస్ట్ చేయడానికి మార్గం సుగమం చేసింది। ఈ ఇద్దరు మేధావుల అరెస్ట్ వారి రాజ్యాంగబద్ధ రక్షణ హక్కులను ఉల్లంఘించడమేకాక, దేశంలోని రాజకీయ, సామాజిక మరియు ప్రజాస్వామిక విలువలు కుదించుకు పోతున్నవనే విషయాన్నీ ప్రతిబింబిస్తుంది।
ఎన్డీయే (NDA) యొక్క మొదటి ఐదేళ్ల పాలనలో రాజ్యాంగేతర శక్తులు (Non-state actors) విభజన అజెండాను హింసాత్మక పద్దతులలో ముందుకు నడిపించారు, శిక్షలనుంచి మినహాయింపులు పొందుతూ బహిరంగంగా ఖండించనివ్వకుండా (ఖండించినవారిపై దాడులకు పూనుకోవడం), ఇట్టి అఘాయిత్య చర్యలపై చట్టపరమైన చర్యలు లేనందున వీటన్నిటి వెనుక ప్రభుత్వ నిశ్శబ్ద మద్దత్తు కనిపిస్తుంది। అయితే, దినికి విరుద్దంగా రెండవ సారి ఎన్డీయే (NDA) ప్రభుత్వం ఎర్పడ్డాక ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలఫై మరింత ప్రత్యక్ష తీక్షణ దాడులను చవిచూసాము । భారి ఎన్నికల వియజ ధైర్యంతో బిజెపి (BJP) నేతృత్వంలోని ప్రభుత్వం పౌరులు, మైనార్టీలు, విద్యార్థులు, న్యాయవాదులు మరియు కార్యకర్తలపై క్రూరమైన దాడులకు పాల్పడింది।
భీమా-కోరెగావ్ కేసును పరిశీలించినపుడు, ప్రస్తుత పాలకులు దౌర్జన్య పూరిత మరియు హానికరమైనట్టి ప్రాసిక్యూటోరియల్ అధికారాలను అమలుపర్చిన తీరు స్పష్టమయింది। ఇదే విషయం తేల్తుమ్బడె మరియు నవలఖాల బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి దారితీసింది। అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడానికి చేసే ఏ ప్రయత్నానికైనా ప్రశ్నించినందుకు మరియు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తేల్తుమ్బడె మరియు నవలఖాలతో పటు తొమ్మిది మంది ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలు మరియు ప్రజా మేధావులపై తప్పుడు కేసులు బనాయించి, మావోయిస్టులతో సంబంధాల నేపంతో హిందుత్వవాదుల బృందం దళితులతో ఘర్షణ పడిన కేసులో ఇరికించారు। అరుణ్ ఫెర్రెరా, మహేష్ రౌత్, రొనా విల్సన్, షోమా సెన్, సుధా భరద్వాజ్, సుధీర్ ధావలె, సురేందర్ ఘాడ్లింగ్, వరవర రావు మరియు వెర్నాన్ గొంసాల్వేస్ అనే తొమ్మిది మంది కార్యకర్తల, న్యాయవాదుల మరియు మేధావుల బెయిల్స్ మరియు విజ్ఞప్తులు రహస్య ఆధారాల ఆధారంగా నిరంతరం తిరస్కరించబడుతున్నాయి। నిందలు మోపి ఆధారాలు చూపెట్టకుండా, కనీసం చూసుకునే అవకాశం కల్పించక సీల్డ్ కవర్ సాకుతో కోర్టులు రిమాండ్ పొడగిస్తున్నాయి।
కాని భీమా కోరెగావ్ అల్లర్లకు పాల్పడినట్టి మిలింద్ ఎకబోతే మరియు మనోహర్ భిడేలను కేసులనుంచి మినాయించడం జరిగింది। వీరిరువురు ఇప్పటికి నిర్భయంగా తిరుగుతున్నారు। కాని, మేధావులపై మోపిన అభియోగాలు మాత్రం చాల విచిత్రంగా, ఫీల్మ్సిగ ఉన్నవి, సహా ముద్దాయి రొనా విల్సన్ యొక్క జప్తు చేయబడ్డ కంప్యూటర్లో ఉన్నఒక ఫైల్ ఆధారంగా మోపబడ్డ ఆరోపణలపై వీరు అరెస్ట్ చేయబడ్డారు। అయితే ఈ కంప్యూటరుకు హానికరమైనట్టి ప్రోగ్రాం ఉందని అది సిస్టమును బయటి నుంచి నియంత్రించడానికి అనుమతిస్తుంది నిర్దారించడమైనది।
రాజ్యం యొక్క ప్రజాస్వామిక వ్యతిరేక చర్యలు కొత్త స్థాయికి చేరుకున్నాయి। మానవ మరియు ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలు మరియు న్యాయవాదులపై ఇజ్రాయెల్ స్పైవేర్ (పెగాసస్)ను ఉపయోగించి ప్రభుత్వం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినది। ప్రభుత్వం ఎంపిక చేసిన లక్ష్యం పెద్దలు మరియు అట్టడుగున ఉన్నవారి కోసం మాట్లాడడం కొనసాగించేవారిని మాట్లాడనీకుండా చేసే మరో ప్రయత్నం। అంతేకాకుండా, ఈ మేధావులపై, న్యాయవాదులపై, రచయితలపై గత ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని, కేసులను ఉపసంహరించాలని మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం పరిశీలిస్తున్నప్పుడు కేసులను రాష్ట్ర పోలిసుల పరిధినుండి సరా-సరి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కు ఆకస్మిక బదలీ చేయడం ద్వారా ప్రభుత్వం తన దిగజారుడు దమన నీతిని మరియు అధికార దుర్వినియోగాన్ని చాటుకుంది।
ఇది దేశానికి పరీక్షా సమయం లాంటిది । స్థాపించిన నాటినుంచే ప్రజాస్వామిక హక్కుల సమన్వయ సంస్థ (CDRO) ప్రజాస్వామ్య విలువలను సమర్థించడానికి, ప్రజాస్వామ్యాన్ని బలపర్చడానికి మరియు అప్రజాస్వామిక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడటానికి కట్టుబడి ఉంది। మా సంకల్పం కొనసాగించడంలో మేము నిస్సందేహంగా కార్యకర్తలపై, మేధావులపై, రచయితులఫై, న్యాయవాదులపై ప్రభుత్వం యొక్క ప్రజాస్వామిక హక్కుల అణచివేత, చట్టవిరుద్ధమైనట్టి స్నూపింగ్ మరియు నిఘా చర్యలను ఖండిస్తున్నాము। మానవ మరియు పౌర హక్కుల కార్యకర్తలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన సమిష్టి మరియు దైహిక హింసా వేధింపుల ప్రయత్నాల గురించి తెలుసుకోవాలని చట్ట పాలనా మరియు ప్రజాస్వామ్య హక్కులకు కట్టుబడి ఉన్న పౌరులందరికీ మేము కోరుతున్నాము। మేము తేల్తుమ్బడె మరియు నవలఖా అరెస్టుకు వ్యతిరేకంగా నిలబడతాము। భీమా కోరేగావ్ హింస కేసులో ఇరికించబడ్డ పదకొండు మంది న్యాయవాదులు, స్కాలర్లు మరియు కార్యకర్తలను విడుదల చేయాలనీ మరియు రాజకీయ ఖైదీలందరికి విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము।
వి. రఘునాథ్ (CLC, తెలంగాణ), క్రాంతి చైతన్య (CLC, ఆంధ్రప్రదేశ్), ప్రీత్ పాల సింగ్ (AFDR, పంజాబ్), తపస్ చక్రవర్తి (APDR, వెస్ట్ బెంగాల్), : CDRO కో-ఆర్డినేటర్లు।
రాజ్యాంగ నియమ ప్రకారం స్థాపించబడ్డ సంస్థలు : అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ (AFDR, పంజాబ్), అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ అఫ్ డెమోక్రాటిక్ రైట్స్ (APDR, వెస్ట్ బెంగాల్), అస్సన్సోల్ సివిల్ రైట్స్ అసోసియేషన్, వెస్ట్ బెంగాల్, బంది ముక్తి కమిటీ (వెస్ట్ బెంగాల్ ), సివిల్ లిబర్టీస్ కమిటీ (CLC, ఆంధ్రప్రదేశ్), సివిల్ లిబర్టీస్ కమిటీ (CLC, తెలంగాణ), కమిటీ ఫర్ ప్రొటెక్షన్ అఫ్ డెమోక్రాటిక్ రైట్స్ (CPDR, మహారాష్ట్ర), కమిటీ ఫర్ ప్రొటెక్షన్ అఫ్ డెమోక్రాటిక్ రైట్స్ (CPDR, తమిళనాడు), కో-ఆర్డినేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ (COHR, మణిపూర్), మానబ్ అధికార సంగ్రామ్ సమితి (MASS, అస్సాం), నాగ ప్యూపిల్స్ మూవ్మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్ (NPMHR), ప్యూపిల్స్ కమిటీ ఫర్ హ్యూమన్ రైట్స్ (PCHR, జమ్మూ & కాశ్మీర్), ప్యూపిల్స్ డెమోక్రాటిక్ ఫోరమ్ (PDF, కర్ణాటక), ఝార్ఖండ్ కౌన్సిల్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ (JCDR, ఝార్ఖండ్), ప్యూపిల్స్ యూనియన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ (PUDR, ఢిల్లీ), ప్యూపిల్స్ యూనియన్ ఫర్ సివిల్ రైట్స్ (PUCR, హర్యానా), క్యాంపైన్ ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ ఇన్ మణిపూర్ (CPDM, ఢిల్లీ), జనహస్తక్షేప (ఢిల్లీ)।
We will be happy if the organization should fight for the Justice of the voiceless people.
ReplyDelete