దీనస్థితిలో రైతులు



రైతే రాజు రైతు లేనిదే రాజ్యం లేదని అంటాం. నేడు రైతుల పరిస్థితి రోజరోజుకు దినదిన గండంగా మారింది. ఒక వైపు ప్రకృతి కల్గించే వైపరీత్యాలు మరోవైపు ప్రభుత్వాలనుండి పంటలకు కనీస మద్ధతు ధర కల్పించడంలో తగిన శ్రద్ధ కలిగి లేవు. స్వామినాథన్ కమిటీ సిపార్సు చేసిన వాటిని అమలుకు పూనుకోవడం లేవు. దళారులదే రాజ్యమేలుతుంది. వ్యవసాయ మార్కెట్లు రాజకీయ నిరుద్యోగులకు పదవుల పంపకంగా మారింది. వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారులదే రాజ్యం. వారు చెప్పిందే ధర. 2019-20 రబీ సీజన్లో వరి పంటకు కనీస మద్ధతు ధరను క్వింటాల్ కు ఏ గ్రేడ్ కు 1835/- సాధారణ రకంకు 1815/- నిర్ణయం చేసింది. రైతుల నుండి ధాన్యం సేకరించడం కోసం నిబంధనలు జారీ చేసింది.

 ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. రెవిన్యూ వ్యవసాయ సివిల్ సప్లై శాఖలు సమన్వయంతో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తాయి. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకారం 16 శాతం మినహాయంపు ఉంది. 84 శాతం నాణ్యత కలిగిన ధాన్యం 100 కిలోలకు ఉండాలి. 16 శాతంలో రాళ్ళూ మట్టి పూర్తిగా పక్వానికిరాని గింజలు కొంత పక్వానికి వచ్చినవి(తర్ర)ఇతర గడ్డి విత్తనాలు రంగు మారిన వరి గింజలు ఇతర వరి గింజలు వర్షానికి తడిసిన వరి గింజలు ఉన్నాయి. గతంలో రైతులు కూలీలు వరి కాడలను కోడవాండ్లతో క్రింది నుండి కోయడం వలన మట్టి ఇసుక వరి ధాన్యం లో వచ్ఛేది. ప్రస్తుతం వరి కొత్త మిషన్ లతో వరి నూర్పిడి చేస్తున్నారు. దీంతో ధాన్యం లో రాళ్ళూ మట్టి ఉండడంలేదు. కొన్ని చోట్ల వరి కి రోగాలు వఛ్చిన చోట తాలు గింజలు ఉంటాయి కానీ ఇవి కూడా వరి కొత మిషన్ తో వరి నూర్పిడి చేసే సమయంలో బయటకు వెళ్లి పోతుంది

 ఎక్కడైన ఉంటె దాన్ని రైతులు సామరస్యంగా అర్థం చేసుకోగలరు. రైతులు నిజాయితీ పరులు మోసం చేసి డబ్బులు సంపాదించాలనే అత్యాశ రైతులకు ఉండదు. తాను పండించిన పంటకు కనీస ధర పలికితే సరిపోతుందని భావిస్తారు. కానీ రైతు వరి నూర్పిడి చేసి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకవచ్ఛే సమయానికి వరి ధాన్యంలో తేమ 17 శాతం మించి ఉండదు. ప్రభుత్వ మార్గదర్శల ప్రకారం తేమ 17 శాతం ఉండాలి. ఇది వేసవి కాలం అయినందున తేమ శాతం 9 నుండి 10 శాతం మించడం లేదు. రైతులు ధాన్యం ను కొనుగోలు కేంద్రానికి తీసుక వఛ్చిన వెంటనే 17 శాతం తేమ ఉన్నప్పుడు తూకం వేస్తే వఛ్చిన బరువుకు రైతులకు రసీదు ఇవ్వాలి. సాంపిల్స్ తీయాలి. వాటిల్లో నుండి రైతులకు ఒక్కటి ఇవ్వాలి. కానీ ప్రభుత అధికారులు రైస్ మిల్లర్లు లాలూచి పడి రైతులు రసీదు మరియు సాంపిల్స్ ఇవ్వడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యం తీసుక వఛ్చిన 7 నుండి 15 రోజులకు ధాన్యం తూకం వేయడం వలన దాదాపు 2 నుండి 3 కిలోల బరువు తగ్గుతుంది. ఇది రైతే నష్టపోతున్నాడు.

 వరి ధాన్యంను కొనుగోలు కేంద్రము నుంచి రైస్ మిల్లుకు తీసుకెళ్లే సమయంలో ధర్మ కంట వద్ద రైతుల పరోక్షంలో తూకం వేస్తున్నారు. రైతు ఎంత మొత్తంలో వరి అమ్ముకున్నాడో రైతుకు తెలువదు. ధాన్యం కొనుగోలు కేంద్రము వారు చెప్పింది మాత్రమే వినాలి. కనీసం ధర్మకంట రసీదు కూడా రైతుకు ఇవ్వరు. ఇకా రైస్ మిల్లుకు ధాన్యం వెళ్లిన తరువాత తాలు ఉన్నదని 4 నుండి 6 కిలోలు తరుగు తీయాలని లేనిచో లారీని ధాన్యం తో వాపస్ పంపిస్తామని బెదిరిస్తారు. అధికారులు కూడా రైస్ మిల్లర్లు వంతా పాడుతారు. 

లారీని వాపస్ పంపిస్తే లారీ కిరాయిని 6 నుండి 8 వేలు హమాలీ 16/- చొప్పున 40 కిలోల బస్తా ఒక్కదాని మొత్తం నష్టాన్ని రైతులు భరించాలి. కనుక రైతులు దిక్కులేక నష్టానికి ధాన్యం అమ్ముకొంటున్నారు. రైస్ మిల్లర్లు అధికారులు దళారులకు మించిన దళారులు అనధికారులైతే వీరు అధికారికంగా రైతులను మోసం చేసి అధికారికంగా దోచుకొంటున్నారు. ఇది కాకుండా రైతుల నుండి తరుగు పేరుతో వాసులు చేసిన ధాన్యం బస్తాలలో నింపడానికి బస్తా ఒక్కంటికి 70/- రూపాయలు వాసులు చేస్తున్నారు. రైతులు కస్టపడి పంట పండిస్తే రైతులు 100/- కిలోలకు 100/- నుండి 150/- సరాసరి నష్ట పోతున్నారు. ఇలాంటి శ్రమ లేకుండా రైస్ మిల్లర్లు 100/- నుండి 150/- లభ పడుతున్నారు. రైస్ మిల్లర్లు మెజార్టీ ఉన్నత వర్గాలే రైతుల ప్రభుత్వాలని చెప్పుకునే వీరు వీరి అధికారులు రైస్ మిల్లర్లు వత్తాసు పలుకుతున్నారు. ప్రశ్నిస్తున్న రైతుల ధాన్యం కొనుగోలు చేయమని అధికారులు బెదిరిస్తున్నారు. ఓ ప్రక్కన కోవిద్ 19 కరోనా బయపెట్టిస్తున్నది. మరో ప్రక్కన ప్రకృతి భేదిరిస్తున్నది. అధికారులు రైస్ మిల్లర్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. 

ప్రభుతం వరి కొనుగోలు కోసం మార్గదర్శకాలు రైతుల సంక్షేమం కొరకు జారీ చేస్తే క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన అధికారులు వ్యవసాయ సహకార సంఘం ప్రజా పతినిధులు రైతుల పక్షాన కాకుండా రైస్ మిల్లర్ల పక్షాన వారికీ లబ్ది చేయడం కోసం పని చేస్తున్నారు. రైస్ మిల్లర్లు లబ్ది చేకూరిస్తే అధికారులకు వ్యయసాయ సహకార సంఘం ప్రజా ప్రతినిధులకు లబ్ది చేకూరుతుంది. వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో లక్షలు ఖర్చు పెట్టి వాటిని తిరిగి రైతుల నుండి వాసులు చేసుకుంటే తప్పేముంది అని వరి భావన అన్నట్లు ఉంది. ఒక్కొక్క రైతు నుంచి 100 కిలోలకు 100/- నుండి 150/- రూపాయలు వాసులు చేస్తే 10000 క్వింటాళ్లు ఒక్క సొసైటీ అమ్మితే 10 లక్షల నుండి 15 లక్షలు ఇలా జిల్లాలో తెలంగాణ రాష్ట్రములో కోట్లాది రూపాయలు రైతులు నష్టపోతున్నారు. 

కనుక ఇప్పటికైనా కనీసం ప్రభుతం జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం ధాన్యం కొనుగోలు చేసిన రైతులు నష్ట పోకుండా ఉంట్టారు. స్వామినాథన్ కమిటీ చేసిన సిపార్షులను అమలు చేయడం కోసం పోరాటాలు తప్ప వేరే మార్గం లేదు. ఇది ఒక్క వరి పంట పండించే రైతుల పరిస్థితే కాదు. దేశంలో రైతుల అందరి పరిస్థితి ఇలానే ఉంది. భారత దేశంలో ఇప్పటికి మెజార్టీ ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇదే ప్రధాన ఉపాధి రంగం. మరో ప్రక్కన వ్యవసాయంలో యాంత్రికంగా పెరిగి ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. వ్యవసాయం గిట్టు బాటు కాక గ్రామీణ నిరుద్యోగుకు పట్టణాలకు వలస వెళ్ళుతున్నారు. కట్టు బానిసలుగా ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 నుండి 11 గంటల వరకు చాలీ చాలని వేతనాలతో కనీసం ఇంటి అద్దె చెల్లించు కోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి స్థితిలో తీరిగి గ్రామాలకు వెళ్లలేక పట్టణాల్లో జీవించలేక నిరుద్యగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కరోనా పరిస్థితుల్లో కోట్లాది ప్రజల వలసలు వీటిని నిరూపిస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరచి వ్యవసాయాన్ని లాభాల బాట పట్టిస్తేనే వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. 


- ఆల్గొట్ రవీందర్

Comments