ప్రపంచ మానవాళిని గడ గడ లాడిస్థున్న కరోనా వైరస్ చైనా లోని వ్యూహాన్ లో పుట్టింది. ప్రపచవ్యాప్తంగా 210 దేశాలకు వ్యాప్తి చెందింది. మనదేశంలో జనవరి, 2020 లో కేరళలో మొదటి కేసు నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వైరస్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రపంచ దేశాలను చాలా ఆలస్యంగా హెచ్చరించింది. భారత దేశం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనకు ప్రాధాన్యత ఇచ్చింది. ట్రంప్ పర్యటన ఫిబ్రవరి 22నుండి 25 వరకు సాగింది. దేశ ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వాలు నిర్లక్షం చేశాయి. అప్పటికే కరోనా మెల్లగా విదేశాలనుండి మనదేశానికి వ్యాప్తి చెందింది. మోడీ ఆలస్యంగా మేల్కొన్నాడు. మార్చి 22 న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రకటించారు.
ఒక్కరోజే కదా అని దేశ ప్రజలంతా భావించారు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా 2016 లో "deemanitisation" నిర్ణయాన్ని మోడీ తీసుకున్నారు. అలాగే చెప్పచేయకుండా మార్చ్ 24 నుండి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ మోడి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 14 కోట్ల వలస కార్మికుల జీవితాలు మహా విషాదంగా మారాయు. ఒక ఆర్థిక సర్వే ప్రకారం దేశ జనాభా లో 20 శాతం మంది వలస కార్మికులు భారత్ లో ఉన్నారు.
దేశ వ్యాప్తంగా 13.90 కోట్ల మంది స్థానికంగా ఉపాధి లేక వలసలు పోయారు. మనదేశంలో అత్యధికంగా బీహార్ నుండిి
మహరాస్ట్రా, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి జీవనోపాధి కొరకు ఇతర రాష్ట్రాలకు, నగరాలకు వలస వెళ్తుంటారు. వీరంతా భవన నిర్మాణం రంగంలో వస్త్ర పరిశ్రమల్లో, కర్మాగారాల్లో, మార్కెట్ల లో, షిప్ యార్డ్ లలో, ఇతర రంగాలలో రోజు వారి కూలీలుగా పనిచేస్తుంటారు. వీరికి పని చేసే ప్రాంతాలలో శాశ్వత నివాసాలు ఉండవు. ప్రభుత్వ పరంగా వర్తించే సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రమాణ పత్రాలుండవు. పని చేసే చోట చిన్న, చిన్న గుడేశలు వేసుకొని జీవిస్తుంటారు. వీరికి వేతనాలు కూడా న్యాయ బద్దంగా ఉండవు.
గుజరాత్ లోని సూరత్ లోని వస్త్ర పరిశ్రమలో 6నుండి 8లక్షల వలస కార్మికులు పనిచేస్తున్నారు. లాక్ డౌన్ మూలంగా వారు నివసిస్తున్న మురికి వాడ ల్లో ఇరుక్క పోయారు. ఏప్రిల్ 14న వేలాది మంది కార్మికులు తమ సొంత వూర్లకు తిరిగి వెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లు చెయ్యాలని డిమాండ్ చేశారు. "వరచ్చా" అనే ప్రాంతంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వారికి రావలసిన జీతాలు చెల్లించాలని,తమ వూళ్లకు వెళ్ళిపోవడానికి అనుమతించాలని ఏప్రిల్10న లాక్ డౌన్ ను దిక్కరిస్తూ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.
అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించి రవాణా వ్యవస్థ లను ఆపేసేటప్పటికి అత్యధిక కార్మికులు తిరిగి తమ సొంతూర్లకు వెళ్ళలేకపోయారు.ఇరుకైన గదుల్లో ఉంటూ ఆహారం, డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులకు గురి అయినారు. అంత వరకు పని చేయించుకున్న యాజమాన్యాలు వారి పట్ల క్రూరంగా ప్రవర్తించాయు. వేతనాలు ఇవ్వకుండా వారిని బయటికి గెంటేశారు.
ప్రభుత్వం నుండీ ఏదైనా సహాయం పొందడానికి వీరి వద్ద ఏ విధమైన ప్రమాణ పత్రాలు లేవు. వీరంతా దారిద్ర్య రేఖకు దిగువన వున్నవారే. రేషన్ కార్డులు వీరికి వుండవు. వీరికి సంక్షేమ పథకాలు వర్తించవు.
సూరత్ వస్త్ర పరిశ్రమలో విద్యుత్ మగ్గాలు, ముద్రణ, రంగులు వేసే మిల్లులు, నేత, ఎంబ్రాయిడరీ, కుట్టు పని వారు, మార్కెట్టు ఉద్యోగస్తులు ఉన్నారు. వీరి సంఖ్య దాదాపు12లక్షల వుంటుంది. కార్మికులు సూరత్ లోని పాండే సెర, సచిన్, బెస్తాన్, దిందోలి, కందోదర తదితర ప్రాంతాలలో నివసిస్తున్నారు. ముంబాయి లో దారవి అనే మురికి వాడ ప్రపంచంలోనే అతి పెద్దది. 2.5 చ/కి మీ విస్తరించి ఉన్న ఈ మురికి లో దాదాపు 250లక్షల మంది నిరుపేదలు నివసిస్తున్నారు.
ఇరుకు గదుల్లో 8నుండి 10మంది వరకు నివసిస్తుంటారు. ఒక్కొక సామూహిక సౌ చాలయలయాన్ని 250 నుండి 300మంది ఉపయోగించుకుంటారు. వీరి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ద చూపడంలేదు.
ముంబాయి లోని వలస కార్మికులంతా భవన నిర్మాణం రంగంలో, కర్మాగారాల్లో, కుట్టు పరిశ్రమల్లో, తోలు వ్యాపార రంగంలో, రవాణా రంగంలో, హార్బర్లో తదితర రంగాల్లో పనిచేస్తుంటారు. వీరంతా బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుండి జీవనోపాధి కొరకు బాంబేకి వచ్చిన వారే. ఏప్రిల్14న లాక్ డౌన్ ఎత్తి వేస్తారనే ప్రచారం జరిగింది. బాంద్రా రైల్వే స్టేషన్, బాంద్రా సబ్ అర్బన్ బస్సు టెర్మినల్ లో వేలాది మంది గుమికూడారు. తమ వూర్లకూ పంపడానికి ఏర్పాట్లు చెయ్యాలని ఆందోళన చేశారు.
లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు, తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. అన్ని ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్, సూరత్, అహమాదాబాద్, చెన్నై, కలకత్తా, ముంబాయి తదితర నగరాల నుండి లక్షలాది వలస కార్మికులు తమ సొంత వూల్లకు బయలుదేరారు. వేలాది కిలో మీటర్ల భార్య బిడ్డలతో, తినడానికి తిండి లేక, ఉండడానికి వసతి లేక ఎర్రటి ఎండకు నడుసు కుంటూ వెళ్తుండడం మీడియాలో ప్రజలు చూశారు.
భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ గౌరవ ప్రదంగా జీవించడానికి ప్రభుత్వాలు అవకాశాలు కల్పించాలి. ధనవంతులకు ఒకరంగంగా, పేదవారికి ఒకరకంగా వివక్ష చూపకుడదు. ఏమాత్రం వలస కార్మికుల పట్ల భాద్యత చూపకుండా, వారివారి గమ్యస్థానాలకు చేర్చ కుండా, వారి జీవనాన్ని, భద్రతను ప్రభుత్వాలు
పట్టించుకోలేదు.
హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించి ,అన్ని రంగాల ను స్తంభింప జేసీ, వలస కార్మికుల జీవనోపాధి పై దెబ్బ కొట్టారు. వారి ఆకలి కేకలకు మోడీ కారకు అయినాడు. భారత ప్రధాని మోడీ మీడియాలో మాట్లాడుతూ వలస కార్మికులు నా కుటుంబ సభ్యులు అని చెప్పాడు. వారికి ఏమాత్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించలేదు. అంతేగాకుండా ఏప్రిల్ 20న లాక్ డౌన్ సడలింపు ఉంటుంది అని చెప్పాడు. కార్మికులను మళ్లీ మోసగించి , నిర్మాణ రంగాలకు, ఉత్పత్తి రంగాలకు సడలింపు ఇచ్చి వారిని తిరిగి పనులకు పంపడానికి కుట్ర చేస్తున్నారు.
లాక్ డౌన్ కంటే ముందు ఇతర దేశాల్లో ఉన్న భారతీయ దనికులను, పలుకుబడి కలవారిని ప్రత్యేక విమానాల ద్వారా భారత్ కు తీసుకువచ్చారు. కాని దేశంలోని వలస కార్మికులను వారి ప్రాంతాలకు చేర్చలేక పోయింది. ఇప్పటికైనా పాలకులు వలస కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి, వారికి అన్ని సౌకర్యాలు కల్పించి వారి గమ్యస్థానాలకు చేర్చాలి.
- చీమల పెంట వెంకటేశ్వర్లు
Comments
Post a Comment