కోవూరు గోదావరి నది తీరంలోని ఇసుక పనిచేసే వలస కార్మికులు కి నిత్యావసర సరుకులు పంపిణీ చెయ్యాలి పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో వాడపల్లి లో ఆందోళన చేశారు. వలస కార్మికులు గత 5 రోజులు గా ఆకలి తో అలమ టిస్తున్నారు. ఈ విషయాన్ని పౌర హక్కుల సంఘం ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయిన రేషన్ పంపిణీ చేయక పోవటం తో వలస కార్మికులు ఆందోళన బాట పట్టినారు.ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణ కార్మికులు ని ఉద్దేశించి మాట్లాడారు. లాక్ డౌన్ కాలంలో నిబంధనలు ప్రకారం వలస కార్మికులకు అన్ని వసతులను యజమానులు కల్పించాలని లేకపోతే ప్రభుత్వం మే అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని అన్నారు.కరోనా బాధలు కంటే ఆకలి బాధలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. వలస కార్మికులు, పేదల ఆకలి మరణాలు 75ఏండ్ల భారత స్వతంత్ర పాలన ను ప్రశ్నిస్తున్నాయి అన్నారు. కార్మికుల ఆకలి బాధలు చూస్తుంటే తీవ్ర మనోవేదన కలుగుతుంది అని అన్నారు. పౌర హక్కుల సంఘం గా తమ శక్తీ మేరకు వారి సమస్యల పరిస్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కార్యకర్తలు కృషి చేస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు తో కార్మికులు ని ఆదుకోవడం లో విపలమైనాయి అని అన్నారు. తక్షణం వలస కార్మికులు ని ఆదు కోవాలని భోజనం, వైద్యం సంపూర్ణంగా అందేటట్లు చూడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వలస కార్మిక సంక్షేమ సంఘం నాయకులు కుమార్ పాశ్వాన్, అమరేంద్ర పత్వారి, పౌర హక్కుల సంఘం నాయకులు రత్నం తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment