నెల్లూరు.పారిశుద్ధ్య కార్మికుల కు వెంటనే మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను అందచేయాలి.







*నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ పారిశుద్ధ్య కార్మికుల కు వెంటనే "మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను అందచేయాలి.*" 
*పౌరహక్కుల సంఘం  'నిజనిర్ధారణ కమిటీ* డిమాండ్.

నెల్లూరు నగర పాలక సంస్థ లోని 20 డివిజన్ లలో దాదాపు  1500 మంది కి పైగా పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు.వీరిలో 90 శాతం మంది *దళితులు, గిరిజనులు.*
   కరోనా మహమ్మారి పై జరుగుతున్న పోరులో వారు ముందు వరుసలో ఉన్న సైనికులు. వీరి కనీస రక్షణ అవసరాలైన *మాస్కులు, గ్లౌజులను* కూడా కార్పొరేషన్ అందించలేదు.వారి కోసమని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాస్కులను, గ్లౌజులను మంత్రులో,ఎమ్మెల్యేలో వచ్చినప్పుడు వారికి ధరింప చేసి వారు వెళ్లిన మరుక్షణం , సంబంధిత అధికారులు వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. పర్యవసానం కార్మికులు తీవ్ర భయాందోళనకు గురై *భయంనీడలో ప్రమాదపుటంచున* పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు.
   ఈ విషయం పై *పౌరహక్కుల సంఘం* ముగ్గురు సభ్యుల *నిజనిర్ధారణ కమిటీ* ఈరోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటలవరకు నగరంలోని *రెడ్ జోన్* ప్రాతాలలో పనులు చేస్తున్న  అనేక మంది పారిశుద్ధ్య కార్మికుల ను కలసి విచారించింది. ఈ కమిటీ లో పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు, జిల్లా సహాయ కార్యదర్శి కె.సుబ్బారావు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్  (IAL.) జిల్లా కార్యదర్శి యం. బ్రహ్మం. పాల్గొన్నారు.
    పారిశుద్ధ్య కార్మికులంద రికి రక్షణ ఏర్పాట్లు చేసి, వారికవసరమైన సబ్బులు,శానిటైజర్లు,మాస్కులు, గ్లౌజులు, కొబ్బరి నూనె, వెంటనే కార్పొరేషన్ అధికారులు సప్లై చెయ్యలని *నిజనిర్ధారణ కమిటీ* డిమాండ్ చేస్తోంది.
   
     

Comments