ఇంద్రవెల్లి, మరొక జలియన్ వాలా బాగ్


Indravelli People Pay tribute to Leaders - Sakshi
అణచివేత ఉన్న చోట పోరాటం, అన్యాయం ఉన్న దగ్గర ఆందోళన దోపిడి, పీదన ఉన్న చోట ఉద్యమం తప్పదు. ఆదివాసీ రైతుకూలీ సంఘం 1981లో నిరూపించింది. సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాలు పచ్చని అడవిలో నెత్తురు పారించింది. ఆదిలాబాద్‌లో రైతుకూలీ ఉద్యమాలకు దన్నుగా ఒకవైపు కరీంనగర్‌ రైతాంగ పోరాటాలు, మరొకవైపు సింగరేణిలో బలపడ్డున్న కార్మికోద్యమాల ఉద్యమాలు ప్రేరణగా పనిచేసింది. ఆదిలాబాద్‌ తూర్పున కార్మికోద్యమం, పశ్చిమలో రైతాంగ ఉద్యమాలలో ఆదిలాబాద్‌ జిల్లాలో సామ్రాజ్యవాద పెట్టుబడులు రాకుండా ఉందే ఒక భయానక పరిస్థితి కొనసాగింది. 3 దశాబ్దాల తర్వాత ఇప్పుడిప్పుడే పారిశ్రామికీకరణ, పెట్టుబడుల ప్రవేశం మొదలైంది. సామాజిక స్థితిగతులలో బలవంతంగానైనా తీసుకు వచ్చాడు కొనసాగిన ప్రభుత్వాలు. గోండు రైతుకూలీ సంఘం కార్మిక సంఘాలు పూర్తి స్థాయిలో బలహీనపడ్డ స్థితిని జిల్లా వ్యాప్తంగా చూస్తున్నాం. ఒకవైపు రైతుల ఆత్మహత్యలు, మరొకవైపు, సింగరేణి (ప్రైవేటీకరణతో హక్కుల్ని కనుమరుగు చేస్తున్న స్థితి మన కళ్ళ ముందర ఉంది.

1981 ఏప్రిల్‌ 20న ఇంద్రవెల్లి నెత్తుటి గాయం

1981 ఏప్రిల్‌ 20న నోమవారం ఉదయం నాలుగు దిక్కుల నుంది ఆడమగ, చిన్న పెద్ద తేడా లేకుండా గిరిజనులు పెద్ద సంఖ్యలో ఇంద్రవెల్లికి తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఇంద్రవెల్లి ప్రాంతమంతా, ఆదివాసీల, గోండులతో నిండిపోయింది. సభ ప్రాంగణమంతా వందలాది పోలీసులు మోహరించారు. సభ జరగకుండా పోలీసులు విశ్వ ప్రయత్నం చేసారు. వాహనాలు రాకుండా రహదారులను దిగ్పంధించారు. భారీ సంఖ్యలో అక్కడికి చెరుకున్న ఆదివాసీలు సభా స్థలానికి ఊరేగింపుగా వస్తున్న మహిళలతో పోలీసుల అనుచిత అమర్యాద ప్రవర్తనకు ఒక మహిళ కొడవలితో పోలీసులపై దాడికి సిద్ధపడింది. వేలాది మందితో వస్తున్న ఆదివాసీల ర్యాలీని పోలిసులు అడ్డుకున్నారు. ఫలితంగా ఇరువర్గాల మధ్యన ఘర్షణ  ప్రారంభమైంది. పోలీసులు ఎటువంటి హెచ్చరికలు లేకుండా తుపాకి కాల్పులు ప్రారంభించారు. పోలీసు కాల్పుల్లో వందకు పైగా మరణించారు. ఈ కాల్పుల్లో వందలాది మంది గాయపడ్డారు. పోలీసు కాల్పులకు భయపడి ప్రాణాలు దక్కించేందుకు వందలాది మంది చెట్లు, వాగులు, వంకలు దాటుతూ అడవుల్లోకి పరుగులు తీశారు. ఆదివాసీల ఆందోళనలు సియంత్రించడానికి, గాలిలో కాల్పులు జరపాలి. అవతారమైతే నడుం క్రింది భాగంలో కాల్పులు జరపాలి. కాని వందకు పైగా ఆదివాసీల హత్యకు గురయ్యారంటే (ప్రభుత్వం పాలకులు ఈ ఆందోళనను అణచివేయాలనే మారణకాండ సృష్టించాలనే పథకాన్ని అమలుచేశాయి. ఆందోళన విరమింపచిేయడం కన్నా ఆందోళన అనే ఆలోచననే రాకుండా చేయాలని వేలాది తుపాకి తూటాలు వాడారు. కాని అదే ఇంద్రవెల్లి మహాసభ నిరాయుధులైన ఆదివాసీలకు సాయుధ పోలీసులు కాల్చి చంపడంతో ఆదిలాబాద్‌ నెత్తురు మరుగైనరోజు. దున్నెవాడికే భూమి నినాదంగా ఇంద్రవెల్లి చుట్టుప్రక్కల [గ్రామాల నుండి యామికుంట, తోషం, ఖానాపూర్‌, సైదూర్‌,ఖండాలా, ఉట్నూర్‌, పత్తిగుట్ట, తిర్యాణి గ్రామాల నుండి వేలాదిగా ఆదివాసీలు తరలివచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు. ఏప్రిల్‌ 20, 1981న ప్రభుత్వం పోలీసులతో దాడి చేపించింది. ఆదివాసుల శవాలతో గూడేలు నిండిపోయాయి.

చాలాముందుగానే బహిరంగసభకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనం వేలాదిగా కదలగానే చూసి భయపడి ఆ రోజుకారోజు సభకు అనుమతి నిరాకరించింది. సభకు అనుమతి రద్దయిందనే విషయం ఆదివాసీలకు ఎలా చేరుతుందనే అవగాహన ప్రభుత్వానికి లేకుండా పోయింది. గోండు ప్రజలకు సభ లేదనె విషయం తెలియకుండానే ఇంద్రవెల్లికి చేరుకోవడం జరిగింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు గిరిజన రైతుకూలీ సంఘం ప్రాతినిధ్యంలో ఊరేగింపును ప్రారంభిస్తే ఆ ఊరేగింపుపై ప్రభుత్వం కాల్పులకు తెగబడింది. రక్తాన్ని ఏరులై వారించింది.

రైతుకూలీ సంఘం నాయకుడు గంజి రామారావు ఇంద్రవెల్లిలో స్థలం కొని ఆదివాసీల స్థూప నిర్మాణం చేపట్టారు.గిరిజన రైతుకూలీ సంఘం అమరవీరుల స్కృతిచిహ్నంగా 1982లో ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని ప్రజలు తమ కష్టార్దితంతో నిర్మించుకున్న స్థూపం దగ్గర చరిత్రలో ఒక్కసారి మాత్రమే సభ జరిగినట్లుగా ఉంది. ఇప్పటివరకు ప్రతి ఏడాది నిషెదాజ్ఞలతో సభ జరగకుండా వోతుంది. ప్రజలు నిర్మించుకున్న ఈ స్టూవాన్ని ఎన్‌టిఆర్‌ ప్రభుత్వం 1986లో డైనమెట్స్‌తో కూల్చివెసింది. ఈ కూల్చివెతకు నిరసనగా గిరిజనులు ఆందోళన బాటపట్టారు. ఆ ఆందోళనకు భయపడే తెలుగుదేశం ప్రభుత్వం 1987లో అమరుల స్టూవాన్ని పునర్నిర్మించింది. నిర్మించిన స్టూవానికి తమ పార్టి రంగు అయినటువంటి పసుపుపచ్చ రంగును స్టూవానికి రుద్దింది. ఈ విధంగా ఆదివాసీల ఆకాంక్షలు, సమస్యలు పట్టని (ప్రభుత్వం 1989లో జరిగిన ఎల్లం పెల్లి ఘటనతో ఆదిలాబాద్‌ జిల్లాను ఆదర్శ జిల్లాగా ప్రకటించి మూడువందల కోట్లు ప్రకటించింది. యువతకు అందరికి ఉద్యోగావకాశాలు కల్పించిరైతుకూలీ ఉద్యమంపై పాశవిక నిర్బంధాన్ని అమలుచేసింది. అది జిల్లాకు తూర్పున ఉన్న సింగరెణి కార్మిక ఉద్యమం పై అమలై సుమారు 40కి పైగా కార్మికోద్యమకారులు ఎన్‌కౌంటర్‌ పేరుతో హత్య గావించబడ్డారు. నిర్చ్హంధం ఒకవైపు కొనసాగిస్తూనే మరొకవైపు సింగరేణిలో యాంత్రికరణ, (వైవేటీకరణ, భూగర్భ ఉపరితల ఉత్పత్తి విధానాల్ని ప్రారంభించటం బలంగా కొనసాగే సరికి కార్మికోద్యమం కూడా బలహీనపడసాగింది.

తుడుం మోతతో, కలామ్స్‌తో ప్రారంభమైన ఇంద్రవెల్లి ఊరెగింపును నిలువరించటానికి నిశబ్దం చేయటానికి జిల్లా ఎస్పీ, ఎం.వి. కృష్ణారావు విఫల ప్రయత్నం చేశారు. మారణకాండ జరిగిన తర్వాత రాష్ట్ర హోంశాఖామంత్రి 3. ప్రభాకర్‌ రెడ్ది ఎప్రిల్‌ 22న ఇంద్రవెల్లిని సందర్శించాడు. తాను ఒక ప్రకటన చేస్తూ గోండు ఆదివాసీలు తమ చేతులలో ఉన్న కర్రలు, గొడ్డలు ఉన్నాయి కాబట్టి తప్పుని పరిస్థితులలో కాల్పులు జరపవలసి వచ్చిందని ప్రకటన చేశాడు. ఇది గిరిజన రైతుకూలీ సంఘం పోరాటాన్ని ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేయడానికి జరిపిన హత్యాకాండే తప్పు మరొకటి కాదు. గోండు సమస్యల పరివారం కోసం సభ పెట్టబడిందే కాబట్టి ప్రభుత్వం నాయకత్వాన్నైనా చర్చల కోసం పిలవకుండా తూటాలు కురిపిస్తే పోయిన ప్రాణాలు ఎవరు తెసారు? ప్రభుత్వం మారణకాందను సృష్టించి ఉద్యకారుల పట్ల, రైతుకూలీ సంఘం (ప్రజల పట్ల భయాన్ని కలిగించే  కుటిల ప్రయత్నమె ఇది.

ప్రభుత్వాలు రాజ్యాంగబద్దంగా వాలన చేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి బలం చేకూరుతుంది. అది ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది. అడవుల్లోని ఆదివాసీలు తమ ఆకాంక్షల కోసం ఆందోళన చేయడం ఆ ఆందోళన హింసాత్మకంగా మారడం ఆదివాసీలు వందలాది మంది శవాలుగా మారుతారు. 1981 నుండి నేటికీ ఇంద్రవెల్లిలో హత్యకు గురైన ఆదివాసీ గోండుల పెర్లను ప్రభుత్వాలు బయటపెట్టలేకపోయింది. [గ్రామాల నుండి ఆందోళన కోసం బయలుదేరినవారు ప్రభుత్వ తుపాకి వేటలో తమ రక్తంతో ఇంద్రవెల్లిని ఎరుపెక్కించారు. ఆదివాసీల ఏ శాంతియుత ఆందోళన అయినా దానిపై ప్రభుత్వాల ఆయుధాలు ఎక్కుపెట్టబడతాయి. ప్రభుత్వం ఉపయోగిస్తున్న తువాకి తూటాలకు లెక్కలేనట్టుగానే పోయిన ఆదివాసీ ప్రాణాలకు లెక్కలుండడం౦లేదా. నేడు కాళ్ళీరు ఉద్యమకారులను చంపి శవాలను జీలం నదిలో విసిరేసినట్టుగా మధ్య భారతంలో ఆదివాసీల శవాలు వారి వారి బంధువులకు చెందకుండా శవాల పంచనామా కూడా లేకుండానే కనుమరుగుచేస్తున్నారు. ఇదే ఇంద్రవెల్లిలో వందల్లో మరణించినట్టుగా హక్కుల సంఘాలు చెపుతున్నప్పటికీ (ప్రభుత్వం మాత్రం కేవలం 18 మందే మరణంచినట్టుగా లెక్కచూపింది. ఈ ఘటనపై పౌరహక్కుల సంఘానికి చెందిన డా॥ రాజగోపాలన్‌, కెజి కన్నాబిరాన్‌లు నిజనిర్ధారణ చేసి నిర్మల్‌ పట్టణంలో పత్రికా సమావెశం ఏర్పాటుచేస్తే దానిపై కూడా పోలీసులు దాడి చేసి వారి కారును ధ్వంసం చేయడం వారిపై భౌతికదాడికి పోలీసులు పాల్పడడం జరిగింది. నిజాలు తెలుసుకునెందుకు వెళ్లిన హక్కుల కార్యకర్తలపై ప్రభుత్వం ఇలా దాడి చేస్తే నిజాలు దాచేయటానికి (ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేసినట్లు? శవాల లెక్కను కూడా ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందో మనం ఊహించవచ్చు. అణగారిన ఆదివాసీల ప్రజలు (బ్రతికుండగానే కాదు శవాలుగా మారిన కూడా గుర్తింపు నిరాకరణలో ప్రభుత్వం యొక్క అప్రజాస్వామికతను మనందరం ప్రశ్నించాల్సి ఉంది. 1949 అధికార మార్పిడి తర్వాత గడిచిన ప్రభుత్వాల హత్యాకాండను గుర్తుచేస్తూ, నిరసిస్తూ సభలు, సమావెశాలు ఊరేగింపు నిర్వహిస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం లెదు.

1981 ఇంద్రవెల్లి హత్యాకాండ, నేటి 100 వళ్ళ జలియన్‌ వాలాబాగ్‌ ఊచకోతతో పోల్చవలసి వస్తుంది. వలస పాలకుల
ఘటనలపై మాత్రమే సమావేశాలు నిర్వహించుకోగలుగుతున్నాం. (ర్రుజా వ్యతిరెక ప్రభుత్వాల ఐక్యతలు చాలా బలంగా పనిచేస్తున్నాయి. వలస పాలకులకు దేశ పాలకులకు మధ్య వ్యత్యాసం లేకుండా పోతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదెశ్‌, మహారాష్ట్ర చత్తీస్‌గడ్‌, జార్ధండ్‌, ఒడిస్సా లోని ఆదివాసీ ప్రాంతాలే కాదు ఉత్తర ఈశాన్య రామ్రాలలో కూడా ఆదివాసీలు తమ హక్కుల కోసం బలమైన పోరాటాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ ఉద్యమంలో అమరులైన వారి ప్రాణ త్యాగాలను లెక్కించడానికి కూడా జాతీయ నెర వివాదం కూడా సరైన ప్రాతిపదికలు పాటించడం లేదు హత్య చేసిన పోలీసులపైనెే జాతీయ నేర విభాగం ఆధారపదడడంతో సరియైన లెక్కలు రికార్లవడంలేదు. శవాలను సమాధి చేసి ఆదివాసులను పిడికడు మట్టిని బాధిత బంధువులకు ఇస్తున్నారు. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్కా జిల్లా కన్నాయిగూడలో పోలీసులు అరెస్టు చేసిన భర్త కోసం కాళ్ళరిగేలా తిరగగా తిరగగా పోలీస్‌ క్యాంపు పక్కకు తీసుకువెళ్ళి అక్కడ మట్టిని అరచేతిలో పెట్టి ఈ మట్టి క్రింద నీ భర్త పాతిపెట్టబడ్డాడని పోలీసులు చాలా ధైర్యంగా వారి భార్యాపిల్లలకు చెప్పగలుగుతున్నారంటే పరిపాలన ఎంత దౌర్దన్యపూరితంగా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. అక్రమ అరెస్టుల పై స్పందించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కాని పోలీసులు గాని శవాలను మాయం చేయడంలో భాగస్తులై రక్త సంబంధీకులకు శవాలు ఇవ్వడంలో పూర్తి అలసత్వం పాటిస్తున్నాయి. మారుతున్నాయి. నిర్చ్వంధ ఆపరేషన్ల పేర్లు మారుతున్నాయి కానీ ఆదివాసీ జీవితాల్లో మార్పు రావటం లేదు. వారి జీవన విధానం మరొకటి లేకుండానే వారి ఆందోళనలకు పరిష్కారం దొరకడం లేదు. వందల్లో సాగే ఊరేగింపులు వేలాది మందితో కొనసాగుతున్నాయి. కానీ ఆదివాసీల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు రావడం లేదు.

ఇంద్రవెల్లి సాక్షిగా మొదలైన హత్యాకాండ ప్రారంభంలో అణచివేతగా మొదలై పూర్తి స్ధాయి వేటగా మారిపోయింది. నిత్యం ఆదివాసీలను వేటాడుతూనే ఉంది ప్రభుత్వం. భూమిపై పట్టాకోసం, దున్నే వాడికి భూమి కోసం మొదలైన ఇంద్రవెల్లి ఉద్యమం అడవిపై హక్కుకై చాలా పోరాటాలు చేసింది. ఆ పోరాటాల్లో భాగంగానే 2006లో అడవి హక్కుల చట్టం తర్వాత 1996లో పంచాయితీరాజ్‌ ఎక్సటెన్నన్‌ చట్టం (పెనా చట్టం) చట్టాలు వచ్చాయి. గ్రామసభ తీర్మాణమ అంతిమ నిర్ణయంగా చట్టాలు వచ్చాయి. కానీ గ్రామసభ తీర్మాణాలన్నీ కూడా లెక్కలేకుండా పోతున్నాయి. గద్చిరోలీ జిల్లాలో 75 (గ్రామసభ తీర్మానాలు, లాయిడ్స్‌ కంపెనీకి వ్యతిరేకంగా వచ్చినా కలెక్టర్‌ లక్ష్య పెట్టకుండా ఆ కంపెనీ పనులు సాగడానికి అనుమతులు ఇవ్వడం ఆదివాసీ హక్కులను కాలరాయడమే అవుతుంది. అడవి ప్రాంతాల్లో హక్కు ఆదివాసీలకే ఉంటుందని (ప్రభుత్వం కూడా ఆదివాసేతరుడేనని 1997లో సమత వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియాలో సుప్రింకోర్టు తీర్పు స్పష్టంగా చెప్పింది.

కానీ 2009లో ప్రారంభమైన ఆపరేషన్‌ (గ్రీన్‌ హంట్‌ సాయుధ బలగాల క్యాంపులతో సామ్రాజ్యవాద అడవిని ఆక్రమించుకోసాగింది. చాలా విలువైన ఖనిజం కలిగిన అతి ప్రాధాన్యత కలిగిన అడవి ప్రాంతం జార్ధండ్‌ రాష్ట్రంలోని వెస్టిస్‌ సిగ్ఫూమ్‌ జిల్లాలోని సరండా అడవి ప్రాంతం. అతి విలువైన ఆ ఖనిజాలను తరలించాలంటే సుమారు 17 సాయుధ క్యాంపులను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని అప్పటి ప్రధానమంత్రి మన్నోహన్‌ సింగ్‌ ప్రకటించాడు. సరెండా అడవి ప్రాంతంలో  సాయుధ మిలిట్రీ క్యాంపులు ఏర్పాటుచేస్తూనే ఖనిజాలను తరలించటానికి సామ్రాజ్యవాదులతో మిలాఖతైన భారత ప్రభుత్వం 2011లో ఆపరేషన్‌ అనకొండ పేరుతో, సరెండ యాక్షన్‌ షాన్‌ పేరుతో వెలాది సాయుధ బలగాలను దింపి సరెండా అడవి వ్రాంతాలకు తరలించి అక్కడి [గ్రామాల్లో నెలల తరబడి క్యాంపులను ఏర్పాటుచేసి ఆదివాసీల జీవన విధానాన్ని విధ్వంసం చేశాయి. దొరికిన ఆదివాసీలను దొరికినట్టుగానే చెల్‌భనా జైల్లో నిర్బంధించారు. ప్రజలను పారదోలి జైళ్లో నిర్బంధించి మాత్రమె అక్కడ ఇనుప ఖనిజ మైన్స్‌ను ప్రారంభించటం సాధ్యమయ్యింది. ఈ విధంగా ఆదివాసీ గ్రామాల విధ్వంసం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఒరిస్సా రాష్ట్రం కాందమాల్‌ జిల్లా తుమ్హుబందా బ్లాకులోని గుముడుమహ గ్రామంలో మహాత్మాగాంధి జాతీయ ఉపాధి పథకం కింద పనిచేసి వేతనాలు తీసుకుని జులై 8, 2016న ఆటోరిక్షాలో గ్రామానికి వస్తున్న 15 మంది గ్రామస్తులపై పోలీసు బలగాలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపితే 4గురు ఆదివాసీలు అక్కడికక్కడే చనిపోయారు. అందులో 2 సం.రాల జహద్‌బీగాల్‌ కూడా చనిపోయింది.

ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో బలమైన ఆదివాసీ ఉద్యమాన్ని అణచివేయడం కోసం 2005లోనే మహేంద్రఖర్మ ఆధ్వర్యంలో సల్వాజుడుంను ప్రారంభించింది. సల్వాజుడుం దాడులలో సుమారు 614 గ్రామాలు దగ్ధం చేయబడ్డాయి. లక్షా 40వేల మంది ఆదివాసీలు నిర్వాసితులయ్యారు. వందలాదిగా చంపబడ్డారు. మహిళలు పదుల సంఖ్యలో అత్యాచారాలకు గురికాబద్దారు. సల్వాజుడుం పేరుతో నియమించిన ఎస్‌పిఒల విధానాన్ని సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రొఫెసర్‌ నందిని సుందర్‌ ప్రశ్నించింది. ఎస్‌పిఒ విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్ట రద్దుచెసింది. కానీ వారి వల్ల గాయపడ్డ ఆదివాసీ జీవితాలకు నష్టపరిహారం లేదు, నష్టం చేసిన ఎస్‌పిఓలకు శిక్షలూ లేవు. ఇది చత్తీస్‌గడ్‌లో ఆదివాసీల పరిస్థితి. చత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో 2007లో సింగారం, తాడిమెట్ల, మోరుపల్లిలో 18 మంది ఆదివాసీలను అతికిరాతకంగా సల్వాజుడం పోలీసులు కలిసి హత్య చేశారు. 2012లో వీజాపూర్‌ జిల్లా బాసగూడలో వ్యవసాయ భూమిలో పంటల విషయమై గ్రామంలో చర్చించుకుంటున్న ప్రజలపై ఒక్కసారిగా దాడిచేసిన పోలీసు బలగాలు 17 మంది గ్రామస్టులను కాల్చి చంవారు. అందులో 5గురు స్కూలుకు వెళుతున్న పిల్లలు మైనర్ల. ఘటన తరువాత అప్పటి హోంశాఖా మంత్రి చిదంబరం ఆదివాసీలను చంపిన సిఆర్‌పిఎఫ్‌ బలగాలకు అందగా నిలబడి ప్రశంసలు, పదోన్నతులు ఇచ్చాడు. ఆదివాసీల పట్ల అతికిరాతకంగా వ్యవహరించిన వారికే (ప్రభుత్వాలు అవార్దులు ప్రకటిస్తున్నాయి. అది ఆదివాసీ హక్కుల కార్యకర్త సోనిసోరి విషయంలో క్రూరంగా ప్రవర్తించిన అంకిత్‌గార్దేకు గ్యాలంట్రీ అవార్హు ఇచ్చారు. బాసగూడ మారణకాండ తరువాత వందలాది పోలీస్‌ క్యాంపులు పెట్టి లక్షలాది పారా మిలిటరీ బలగాలను దింపి ఆదివాసీ మహిళలపై సామూహిక అత్యాచారకాందడను కొనసాగిస్తున్నారు. ఆంధ్రలో వాకపల్లి, భల్లుగూడ, అత్యాచార ఘటనలు, దండకారణ్య ఆదివాసీ ప్రాంతాలలో పదుల సంఖ్యలో వాకపల్లి ఘటనలు జరిగాయి.

2015 నవంబర్‌లో చత్తీస్‌గడ్‌ రాష్ట్రం, బీజాపూర్‌ జిల్లా పెద్దగెల్లూరులో 8 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు
పోలీసులు చేశారు. ఈ ఘటనపై మహిళా హక్కుల సంస్థ దబ్యూఎస్‌ఎస్‌ మరియు హక్కుల కార్యకర్త భేలా భాటియాలు
బీజాపూర్‌ కలెక్టర్‌తో మాట్లాడి నెరం చేసిన సాయుధ బలగాలపై అత్యాచార కేసులు నమోదు చేశారు. ఇదే స్థితి 2016 జనవరి నెలలో కున్నా గ్రామంలో జరిగింది. సుమారు 15 మంది ఆదివాసీలపై పోలీసులు అత్యాచారాలు చేశారు. అత్యాచారానికి ముందు గ్రామంలోని మగవాళ్ళందరిని తుపాకీ కాల్పులతో బెదిరించి వెళ్ళగొట్టారు. 2 రోజులు గ్రామాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని తల్లుల ముందే పిల్లలపై సామూహిక అత్యాచారాలకు ఒడిగట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయించటానికి ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థకు, అత్యాచార హింసలకు వ్యతిరెకంగా పనిచేస్తున్న డబ్యూఎస్‌ఎస్‌ సంస్థకు సుమారు వారం రోజులు పట్టింది. పోలీసులపై కేసు నమోదు చేయడం వారి మొరాల్టికి సంబంధించిన అంశంగా ప్రభుత్వం (క్రచారం చేస్తున్నది. కానీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడే పోలీసుల యొక్క మొరాల్టి ప్రభుత్వానికి ప్రధానమైతే ప్రజాస్వామ్యానికి బలమైనది రాజ్యాంగం. ఆ రాజ్యాంగమే అమలు చేయని సైనికుడైతేనేమి పోలీసు అయితేనేమి, చివరకు రాష్ట్రపతి అయితేనమీ వారి ఆత్మస్థైర్యం ప్రధానాంశం ఎప్పుడూ కాకూడదు. అధికార ఆయుధాల విశ్చంఖలత్వం ఎప్పటికైనా రాజ్యాంగానికి హాని చేస్తుంది. హంతకుల మొరాల్టి ప్రధానమైతే ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం సన్నగిల్లుతుంది. ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై కేసులు వెస్తే వారికి మద్దతుగా ప్రభుత్వాలు నిలబడుతున్నాయి. ఎన్‌కౌంటర్‌ హత్యలపై ఎవరు కేసులు వెసినా వారికి వ్యతిరేకంగా సాయుధ బలగాలతో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయిస్తున్నారు. ఇలా ప్రశ్నించటం, కేసులు వేయటం న్యాయబద్దం కాదన్నట్లుగా ప్రచారం చేస్తున్నది. బాధితుల న్యాయమైన ఆందోళన ప్రభుత్వాలకు రాజ్యాంగ బద్దం అందించడం లేదు. 

నగ్దల్బరీ ఉద్యమం 50 వసంతాలు దాటినా ఇంద్రవెల్లి మారణకాండకు 40 వసంతాలు వచ్చినా ఆదివాసీల నెత్తురు ఆదిలాబాదు జిల్లా గోదావరి నదినే కాదు, మధ్యభారత్‌లోని అన్ని నదుల్లో ఏరులై పారుతునే ఉన్నాయి. కారుతున్న రక్తాన్ని సిలువరించటానికి ఎందరి మనో స్టైర్యాలు కోల్పోయిన పర్వాలేదనెది ప్రశ్నిస్తున్న మెధావుల ఆలోచన. ఇంద్రవెల్లి మారణకాండలకు ముగింపు పలకాల్సిన పరిస్థితి వచ్చింది. హత్యలకు లెక్కలు చెవ్సాల్సి వస్తుంది, సమాధానాలు ఇవ్వాల్సి వస్తుంది. ప్రజలకు సహనం, ఓపికలు వారి మౌనం కాదు. న్యాయం కోసం జరిగే పోరాటానికి ముందస్తు ఆలోచనలే. ఆదివాసుల పారిన నెత్తుటి సమాధానాల కోసం, తమ హక్కుల కోసం నిత్యం వెతుకుతూనె ఆందోళన బాటలో కొనసాగుతున్నారు. అంతిమంగా ప్రజలే విజయం సాధిసారు.

- ఎన్‌. నారాయణరావు

Comments