నెల్లూరు పారిశుద్ధ్య కార్మికుని మృతి




పారిశుద్ధ కార్మికుని మృతిపై పౌరహక్కుల సంఘం విచారణ

ఈనెల 19 వ తేదీ ఆదివారం ఉదయం నెల్లూరు నగరం , పొదలకూరు రోడ్డులో ఉన్న ESI ఆసుపత్రి ఆవరణలో చనిపోయిన పంది ని పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్ లో ఎక్కించి అక్కడ నుంచి తొలగించినారు. ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన ఫినాయిల్ తో చేతులు శుబ్రం చేసుకోగా చేతులు మంటపెట్టి కొద్ది సేపటకే నల్లగా కాలిపోయినవి. శేషగిరి అనే కార్మికుడు కళ్ళుతిరిగి పడిపోయినాడు. ఆకార్మికుణ్ణి వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుక పోగా అప్పటికే చనిపోయినాడు. దీనిపై పౌరహక్కుల సంఘం నెల్లూరు జిల్లా కమిటీ,విచారణచేసి ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టింది. మృతుని కుటుంబ సభ్యులను , తోటి కార్మికులను విచారించి వారికి అండగా ఉంటామనే ధైర్యాన్ని చ్చింది.
డిమాండ్లు:  ESI ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన శేషగిరి కుటుంభానికి కరోనా ఇన్సూరెన్స్ పధకం కింద 50 లక్షలు ఇప్పించాలి. కుటుంభం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. నిర్లక్ష్యం గా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది పై IPC.304-A సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ జరిపించాలి.
చేతులు కాలిన కార్మికులు
కొండలరావు, ప్రసాదు లకు ఒక్కొక్కరికి  లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి.
ఈ కార్యక్రమంలో బ్రమ్హం, వెంకటేశ్వర్లు, శీనయ్య పాల్గొన్నారు.

Comments