తెలంగాణ. కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత



....GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.
సింగరేణి RG1,GDK 11 భూగర్భగనిలో ఈ నెల 7 వ తేదీ పంప్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న సందర్భంలో,గనిలో అదృశ్యమై 11 రోజుల వరకు ఆచూకీ దొరకకుండా పోయి,నిన్న DDMS(మైనింగ్) N బాలసుబ్రహ్మణ్యం విచారణ అనంతరం   ఈ రోజు 17,ఏప్రిల్,2020 న శవం కుళ్ళిపోయిన స్థితిలో ఆచూకీ లభ్యమవడం వెనుక సింగరేణి యాజమాన్యం చిత్తశుద్ధితో రీస్క్యూ టీం మరియు అనుభవజ్ఞులైన కార్మికులతో వెతికించపోవడమే ప్రధాన కారణం. కరోనా నేపథ్యంలో లోక్డౌన్ అమలుజరుగుతున్న ఈ సమయంలో భూగర్భ గనుల్లో లే ఆఫ్ ప్రకటించిన సమయంలో విధులు కేటాయింపులు రక్షణాత్మకంగా లేవు,సింగరేణి ఉన్నత యాజమాన్యం తో పాటు CMD నిర్లక్ష్యంతో వ్యవహరించం ఈ ప్రమాదం మరియు సంజీవ్ మృతి జరిగింది.7 ఏప్రిల్ నాడే సీరియస్ గా సింగరేణి యాజమాన్యం స్పందించి నట్లయితే కనీసం సంజీవ్ దొరికేవాడు.ఇటీవల కాలం లో ఇద్దరు రెస్క్యూ అధికారులు గోదావరిఖని గనిలో మరణించడం తో పూర్తి స్థాయిలో వాళ్ళు వేతకపోవడంలో సింగరేణి ఉన్నత యాజమాన్యం నిర్లిప్తంగా ఉండిపోయింది. నిన్నటినుండి సీరియస్ గా DDMS వచ్చిన తర్వాతనే వెతుకులాట మొదలైనాది.ఈ సంఘటనకు ప్రధాన కారకుడైన సింగరేణి CMD పై క్రిమినల్ కేసు నమోదు చేసి ,హై కోర్ట్ సిట్టింగ్ జడ్జిచే ఈ ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని,సంజీవ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని పౌర హక్కుల సంఘము తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.సింగరేణిలో యాజమాన్యం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో సింగరేణి యాజమాన్యం అవలంబిస్తున్న నిర్బంధ విధానాలతో సింగరేణి గనుల్లో కార్మిక సంఘాలు,కార్మిక నాయకులపై అణిచివేత వలన ప్రశ్నించే నాయకులు, కార్మికులు తీవ్ర నిర్బంధం మరియు ప్రమాదాలకు గురౌతున్నారు. సింగరేణి యాజమాన్యం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్బంధాన్ని సింగరేణిలో తొలగించాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తుంది.

1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ,అధ్యక్షులు పౌరహక్కుల సంఘం,తెలంగాణ.

 2.ఎన్. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి పౌరహక్కుల సంఘం,తెలంగాణ.

3.మాదన కుమారస్వామి, సహాయ కార్యదర్శి
పౌరహక్కుల సంఘం,తెలంగాణ.

4.GAV ప్రసాద్,అధ్యక్షుడు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.

5.ఏనుగు మల్లారెడ్డి,.ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.

6 గంటలు,సాయంత్రం,17ఏప్రిల్,2020.

Comments