
రెండు వ్యాధులు భారతదేశంలో వ్యాప్తి చెందాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త వైరస్ 5 నెలల క్రింతం వచ్చింది. కరోనావైరస్ ఇప్పటివరకు భారతదేశంలో 1,000 కన్నా తక్కువ మంది ప్రాణాలను తీసుకుంది. మరొక వైరస్సుకి 7 దశాబ్దాల వయస్సు వుంది. ద్వేషం, మూర్ధత్వం, మతోన్మాదం ఇవి దాని లక్షణాలు. కానీ ఈ మత విద్వేష వ్యాధి సంవత్సరాలుగా వేలాది మందిని చంపింది.
కోవిడ్ -19 వ్యాప్తి కన్నా వేగంగా ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్ వ్యాప్తి చెందుతోంది. విషపూరిత టెలివిజన్ ఛానెళ్లచే ఒక మీడియా రక్తి కట్టించే కథనాన్ని అల్లింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్మాజ్ మసీదు, మార్చిలో తబ్లిఘి జమాత్ సమావేశానికి వేదికగా వుంది. భారతదేశం అంతటా కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి పూర్తిగా, ఏకైక బాధ్యత దానిదేనని సదరు మీడియా కథనం. ఢిల్లీలో ఒక ముస్లిం వ్యక్తిని ఒక గుంపు కొట్టింది. ఒక ముస్లిం తల్లిని, కుమార్తెను కిరాణా దుకాణ యజమాని
దుర్భాషలాడాడు. ఉత్తర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో ముస్లిం కూరగాయల విక్రేతలు, ప్రజలు తమను తనబ్లిగిస్ అని పిలిచారని, అలాగే కూరగాయలు కొనడానికి నిరాకరించారని ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్ ఆసుపత్రి కఠోనా రోగులను మతప్రాతిపదికన వేరు చేసి, చికిత్సను అందించిందని స్టానిక మైనారిటీలు పేర్కొన్నారు. ముస్లింలపై డజన్ల కొద్దీ నకిలీ వీడియోలు, వాట్సాప్ సందేశాలు, ముస్లింలను సామాజికంగా దూరం చేసే ప్రయత్నం సోషల్ మీడియాలో నిర్విఘ్నంగా సాగుతోంది.
తబ్లిఘి జమాత్ సమావేశం అజ్ఞాన పార బాధ్యతారాహిత్యానికి ఒక ఉదాహరణ. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఢిల్లీ పోలీసులు దీనిని అనుమతించకూడదు. ఢిల్లి తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రామ్రాలలో తబ్లిగిస్ ఈ వైరస్సును వ్వాప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు వున్న కోవిడ్ కేసుల్లో 55 శాతం ఢిల్లీ వెళ్లివచ్చిన వారివేనని ఆర్‌ఎస్‌ఎస్ ఆరోపణ. ఆర్‌ఎస్‌ఎస్‌లోని చాలమంది పేద కార్మికులకు అన్నం పెట్టడం, క్వారంటైన్‌లో వున్న వారికి సేవాభారతి తరుపున కావలిసిన ఏర్పాట్లు చేయడం రెండు తెలుగు రాహఘ్రైలలోను జరుగుతున్నాయి. నిజానికి తెలుగు రాహ్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో వుండబద్దె మత వైరస్సు వాకడం లేదని చెప్పవచ్చు. భారతదేశంలో ప్రతి రాష్ట్రం, పట్టణంలో అన్ని కేసులకు తబ్లిఘీకి సంబంధం లేదు. కరోనావైరస్ మతం, కులం, వర్గాలను పట్టించుకోవడం లేదు. మధ్యతరగతి ఎక్కువుగా వుందే పట్టణాలను, నిరుపేదలు నివసించే ధారావి లాంటి మురికివాడలను, ధనవంతులు నివసించే గేటెడ్ కమ్యూనిటీలను కరోనా వదల్లేదు.
ముస్లిం డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు అధిక సంఖ్యలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో ముందున్నారు. ఇండోర్‌లో ఒక గుంపుచే దాడులకు గురైన ఇద్దరు వైద్యులలో ఒకరు ముస్లిం డాక్టర్ జాకియా. కేరళలో గణనీయమైన ముస్లిం జనాభా ఉంది. కేరళలో కోవిడ్‌ను అరికట్టే ప్రయత్నాలు విజయవంతం అవడానికి మత సామరస్యం ఒక కారణంగా వుంది.
కరోనాకు వ్యతిరేకంగా పోరాటానికి అతిపెద్ద కార్పొరేట్ సంస్థ అధిపతి అజీమ్ (ప్రేమ్‌జీ ముస్తీమే. ఇతను రు. 1000 కోట్ల రూపాయలను కోవిడ్‌ని అరికట్టడానికి భారత ప్రభుత్వానికి ఇచ్చాడు. 2001 లో, ్రమ్‌జీ అజీమ్ (ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ను ప్రారంభించాడు. నెడు, ఫౌండేషన్ భారత్‌లోని 7 రామ్రాల్లో 3,50,000 పాఠశాలలలో ఉచిత విద్యను భోదిస్తోంది. సిష్హా, వోక్‌హార్ట్ లు భారతదేశపు అతి పెద్ద ఫార్మా కంపెనీలు. ఈ కంపెనీ మందులను కోవీడ్‌ను తగ్గించడానికి వాడుతున్నారు. ఇవి ముస్లీంలకు చెందినవే. ముంబైకి చెందిన దావూడి బోహ్రాస్ ఉచిత వంటశాలల ద్వారా వేలాది మందికి ఆహారం ఇస్తున్నారు. ఇందోర్లో, ముస్లిం పొరుగువారు ఒక హిందూ మహిళ మృతదేహాన్ని ఆమె అంత్యక్రియలకు తీసుకువెళ్లారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హిందూ ఆధ్యాత్మిక సంస్ధ తిరుమలలో వుంది. ముస్లిం భక్తుడు అబ్బుల్ ఘని విరాళంగా ఇచ్చిన ఇ ట్రాక్టర్ మౌంటిెడ్ సిస్టమ్ తిరుమల ఆలయ వీధులలో కోవిడ్ వ్యాప్తి నిరోధానికి రసాయనిక మందులను పిచికారీ చేస్తోంది.
పాకిస్తాన్‌తో సహా పలు దేశాలలో సమ్మేళనాలను కొనసాగించడం ద్వారా తభ్లిఘీ జమాత్ నాయకులు బాధ్యతా రహితంగా వ్యవహరించారనడంలో సందేహం లేదు. భారతదేశం ఆధీనంలో ఉన్న కాళ్ళీర్‌పై అణిచివేత నుండి, ముస్లింలను నిర్లక్ష్యంగా లక్ష్యంగా చేసుకునే పక్షవాత పౌరసత్వ చట్టం వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా భారతదేశంలో వివక్షకు గురౌతున్నారు. ఈ సంక్షోభ సమయంలో, ఒక జాతిని, మతాన్ని నిందించడానీకి ప్రయత్నించడం ప్రమాదకరం. ఇప్పటికే దెబ్బతిన్న సమాజాన్నిఇది అంచుకు నెట్టివెస్తుంది.
కరోనావైరసును “చైనీస్ వైరస్? గా రూపొందించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేసిన ప్రయత్నాల ఫలితంగా ఆసియా వర్తాలపై జాత్యహంకార దాడులు గణనీయంగా పెరిగాయి. అదేవిధంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముస్లింలను క్రమపద్ధతిలో లక్ష్యంగా చేసుకోవడం, అతని ప్రభుత్వం వారిపై బహిరంగంగా దాడి చేసే తీవ్ర పరిణామాలకు ఆజ్యం పోసింది. బిజెపి నాయకులు తన్లిఘీ నాయకులపై “తాలిబానీ నేరస్థులు” అని ముద్రవేశారు. “కరోనా జిహాద్” అనే పదాన్ని వారికి కట్టబెట్టన తరువాత, ముస్లిం వ్యతిరెక దాడులు భారతదేశంలో ఎలా జరగకుండా వుంటాయి. ముస్లిం యాజమాన్యంలోని వ్యాపారాలను ఎలా బహిష్మరించారో, ముస్తీం కార్మికులు ఆహారంలో ఉమ్మివేశారని, వైరస్ కారియర్లుగా వాళ్లు వున్నారనె వదంతులను భారత్‌లో ప్రచారం చేస్తున్నారని ది గార్జియన్‌లోని ఒక నివేదిక వివరించింది.
ముస్లింలను కరోనావైరస్ నెరస్టులు గా ఉద్దేశపూర్వకంగా చిత్రీకరించడం జరుగుతోంది. మీడియా వ్యాఖ్యాతలు ఉద్దేశపూర్వకంగా మదర్సా హాట్‌స్పాట్‌లను వెతకడం ప్రారంభించారు. ఇది ప్రభుత్వ విధాన వైఫల్యాల నుండి పౌరులను మరల్చటానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల రెండు అనర్జాలు జరుగుతాయి. కరోనా వ్యతిరేక ప్రచారం కోసం పనిచేసే మెజారిటీ బాధ్యతాయిత ప్రజలు ఈ వ్యాధికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి నిరుత్సాహ పడతారు. రెండోది సామాజిక గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఇది కేంద్ర, రాష్ట ప్రభుత్వ నిర్ణయాలను బలహీనపరుస్తుంది. ఆశ్చర్యంగా సిక్కు మతంలోని నిహాంగ్ శాఖ సభ్యుడు ఒక పోలీసు చేతిని నరికినప్పుడు, ఆ సంఘటనకు ప్రతి సిక్కు బాధ్యత వహించడు. కొంతమంది గో సంరక్షకులు గొడ్డు మాంసం తిన్నారనే నెపంతో తగ్గిఖ్ అనే ముస్లింను హత్య చేసినప్పుడు, ప్రతి హిందువు నిందించబడలేదు. ఇప్పుడు ప్రతి ముస్లింను కోవిడ్ సంక్రమణ వ్యాప్తి చేస్తున్న తబ్లిఘిగా ముద్ర వేస్తున్నారు.
భారత్‌లోని ముస్లీం పెద్దలు చాలమంది తన్లిఘీ పెద్దలను తప్పు పట్టారు. ఢిల్లీలోని మర్శజ్ మసీదుకు హాజరైన వారందరూ స్వచ్చందంగా ప్రభుత్వ ఆసుపత్రులకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి విరుద్ధంగా, కర్ణాటక బిజెపి ఎమ్మెల్యే ఎమ్. జయరామ్ ఎ(పైల్ 11న ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. దీనికి 200 మంది హాజరయ్యారు. ముంబై విఐపిలు పిక్నిక్ కు కాన్వాయ్ లో ప్రయాణించారు. అంతేకాకుండా ఈ వారం వేలాది మంది కర్ణాటక రాష్ట్రంలోని కలుబుర్దిలో రథోత్సవం జరుపుకోవడానికి లాక్షాన్ నిబంధనలను ఉల్లంఘించారు. దీనిబట్టి సమస్య మతం కాదని (గ్రహించాలి. మతంతో సంబంధం లేకుండా భారతీయులందరిలోను బాధ్యతారాహిత్యం వుంది. దీని వ్యతిరేకిద్దాం. లాక్‌దౌన్ ఉల్లఘించన సంస్థలు, పౌరులపై చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలి. దీనికి వలస కార్మికులను మినహాయించాలి.
భారతదేశంలో సామాజిక దూరం కరోనా వైరస్సుకు ముందే ఉంది. అనేక నగరాలు మత విభజన, మత విద్వేషాలతో రగిలిపోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా ముస్లీం ప్రజానీకంలో గూడుకట్టుకుంటున్న అభద్రతా భావం వారిని భయబ్రాంతులకు గురిచేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో, కోవిద్ రోగులు ప్రభుత్వ వైద్యులపైన అపనమ్మకంతో, అవిశ్వాసంతో దుర్భాషలాడటం, చేయిచేసుకోవడం జరిగాయి. దీనికి వారిపై చట్టపరమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకున్నాయి.
కరోనాకు మతం రంగు పులమడమే గాక, ద్వేషపు రంగును పులుముతున్నారు. విద్వేషం వైరస్ కన్నా ప్రమాదకరమైన అంటువ్యాధి. కరోనా చనిపోయినా ఇది మానవ హృదయాల్లో సజీవంగా వుంటుంది. ద్వేషం, అనుమానం ఇతర సమూహాలపైన కూడా ఉన్నాయి. కోవిడ్ వార్దులలో పనిచేసే వైద్యులు, వెంటనే అద్దె ఇళ్లను ఖాలీ చేయాలని కొంతమంది యజమానులు హకుం జారీచేశారు. చాలాచోట్ల వైద్యులపై దాడి జరిగింది. వారు సామాజిక బహిష్కరణకు గురయ్యారు. సాక్షాత్తు భారత ప్రధానమంత్రి వైద్యులను గౌరవించాలని, ఇళ్లనుంది వారిని ఖాళీ చేయద్దని విజ్ఞప్తి చేసినా ఉపయోగం లేకపోయింది. గ్రామాలు తమకు తామే దేశం లోపలే సరిహద్దులు గీసుకుని, కంచెలు వేసుకున్నాయి. వలస కార్మికులు వారి సొంత గ్రామాలకు తిరిగి రాకుండా నిషేధించబడింది. ప్రతి వ్యక్తి, అపరిచతుడుని అనుమానంతో చూడటం యధాలాపంగా జరిగిపోతోంది. సరిహద్దులు తెలియని ప్రపంచ మహమ్మారికి కూడా మత విద్వేషాన్ని అంటిస్తే, మానవత్వానికి చిరునామా ఎక్కడ వెతకాలి.
భారతదేశంలోని కొంతమంది పోలీసులు ఎప్పుడైనా హాని కలిగించే వారిపై క్రూరమైన శక్తిని ఉపయోగించటానికి సిద్ధంగా ఉంటారు. చట్టబద్ధతను వాళ్లు పట్టించుకోవడం లేదు. దశాబ్దాలుగా, ప్రభుత్వాలు పోలీసులపై, భద్రతా దళాలపై ఆధాపపడటం వల్ల వారిపై నియంత్రణను ప్రభుత్వాలు కోల్పోయాయి.
(ప్రభుత్వాలు మావోయిస్టులను సంఘ విద్రోహశక్తులుగా పేర్కొంటాయి. అదే మావోయిస్టులు, 50 సంవత్సరాల తమ కార్యకలాపాలలో, ఏ మత సమూహంపైన, హిందుత్వ, క్రిస్టియన్, ఇన్లామిస్టుల పైనా దాడి చేయటానికి కనీసం వారి వాక్తాతుర్యాన్ని కూడా ఉపయోగించలేదు. చారిత్రాత్మకంగా, రాజకీయ నాయకులు చాలామంది సత్యంతో, వాస్తవంతో కూడిన ప్రకటనలను
చేయడం లేదు. కార్పొరేట్ శక్తులకు బానిసైన కొన్ని మీడియా సంస్థల ద్వారా తప్పుడు, విద్వేష వార్తలు ప్రోత్సహించబడుతున్నాయి. కనీసం హిందూమతంలోని మెజారిటీ ప్రజలకున్న మత సహనం కూడా మీడియాకు వుండటం లేదు. నిజమైన ప్రజాస్వామ్యంలో, డోనాల్డ్ (ట్రంప్ వంటి సుస్థిర ప్రపంచ నాయకుడు సైతం (పెస్ నుండి ప్రశ్నలను ఎదుర్మోకుండా వుండలేరు. భారతదేశంలో, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడిపించే ప్రధానమంత్రి ఒక్కసారి కూడా కనీసం సాధారణ ప్రశ్నలను సైతం విలేకరుల నుండి ఎదుర్శొనలేదు. అతను ఆనందించే వన్-వే సంభాషణలలో, అలంకారిక పదజాలంతో, కవితాత్మక వ్యాఖ్యానాలతో అసంఖ్యాక ప్రజానీకంచే చప్పట్లు కొట్టంచుకుంటారు.
ఈ వాతావరణంలో, పారుడు అన్ని సమయాలలో ప్రశ్నలు అదగడాన్ని గుర్తుంచుకోవాలి. సత్యం కోసం వెతకడం, నిజాల్ని తెలిసుకోవడం, మతసామరస్యాన్ని కాపాడుకోవడం, ప్రజాస్వామ్యాన్ని నిలుపుకోవడం ప్రతి పౌరుడి హక్కు దీనిని కరోనా వంటి విపత్మర పరిస్థితులలో అత్యంత ఆవశ్యకమైన అంశంగా పౌరులు గుర్తించాలి.
- అమన్
Good my dear
ReplyDelete