కల్తీ కల్లుతో పోతున్న ప్రాణాలు



పొద్దంతా కాయాకష్టం చేసే పేదలకు, భవన నిర్మాణ పనులు చేసే కూలీలుకు చౌకగా దొరికే కళ్లు వారు చేసిన శ్రమ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అందుబాటులో ఉండే మత్తు మందులతో తయారు చేసే కృత్రిమ కళ్ళు కు  బానిసలై బతులీడుస్తున్నారు. వారి బలహీనతలను ఆసరా చేసుకుని మద్యం వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.  కృత్రిమ కళ్ళు తయారీకి వ్యాపారులకు ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసింది.అవి ఇప్పుడు బంద్ కావడంతో కళ్ళుకు బానిసలైనవారి గురించి బాధ్యతగా ఆలోచించాలి. 

రాష్ట్రంలో చాలా   చోట్ల కరోన కాటేయక ముందే కల్తీ కల్లు లేమి కాటేస్తుంది. కళ్ళు వ్యాపారం చేసేవారు యథేచ్ఛగా క్లోరోఫామ్, డైజోఫామ్ మత్తు పదార్థాలతో కృత్రిమ కళ్ళు తయారు చేస్తున్నారు. దానికి బానిస అయిన పేద ప్రజలు పిచ్చి పిచ్చి గా ప్రవర్తిసన్నారు,. వింత చేష్టలకు పాల్పడుతున్నారు.  మతి తప్పి రోడ్డు మీదకు పరుగులు తీస్తున్నారు. బట్టలు చింపేసుకుంటున్నారు.  వారిని రక్షించుకుకోవడానికి కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. నిజామాబాద్ జిల్లా కల్తీ కళ్లును వ్యతిరేకిస్తూ పేద ప్రజలు ఆందోళనకు దిగారు. నిజమాబాద్ జిల్లా గాయత్రి నగర్ కు చెందిన శంకర్ మతి కోల్పోయి తన ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు. సాయినగర్ కు చెందిన శకుంతల వింత ప్రవర్తనతో ఫినాయిల్ తాగి చనిపోయింది.  
ఇంకాపలు పలు చోట్ల వ్యాధులకు, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వనపర్తి జిల్లా ఏదుల గ్రామానికి చెందిన బోయల నగేష్ హైదరాబాద్లో వలస కూలి కళ్ళు లభించకపోవడంతో డిసిపి  కార్యాలయం ఎదుట చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. శబాను గ్రామానికి చెందిన చాకలి సత్తెయ్య ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. వికారాబాద్ జిల్లా తోను మామిడికి చెందిన మొగులయ్య వింతగా ప్రవర్తుస్తూ విద్యుత్ తీగ పట్టుకుని చనిపోయాడు. కామారెడ్డి జిల్లా జుక్కల్ కు చెందిన రాజు, పటాక్ చెరువు మండలం ఇంద్రిసం గ్రామానికి చెందిన లక్ష్మయ్య కళ్ళు దొరక్క పోవడంతో మూర్ఛ రోగం వచ్చి  చనిపోయాడు.  మెదక్ జిల్లా చేగుంటకు చెందిన నత్తి మంగమ్మ కల్లు లభించక పిచ్చిదై కిందపడి తీవ్ర గాయలపాలై చనిపోయింది. వెల్దుర్తి మండలం మాసాయి పేటకు చెందిన కాశమైన కిష్టయ్య తన ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకొని చనిపోయాడు. నిజాం పేట మండలం బచ్చురాజు పల్లి గ్రామస్థుడు కిష్టయ్య కుటుంబ సభ్యులు నిద్రపోయిన తర్వాత వేగంగా పరుగెత్తి చెరువులో పడి చనిపోయాడు.

హైదరాబాద్ జగద్గిరిగుట్ట దేవమ్మ బస్తీలో అంజయ్య నగర్ కి చెందిన ప్రకాష్ కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. కల్లు దొరకక పోవడంతో మతిష్ఠిమ్మితం కోల్పోయి కనిపించకుండాపోయి శవమై బయటపడ్డాడు. గోల్నారక ప్రాంతంలోని అన్నపూర్ణ నగర్ కు చెందిన సావిత్రి కళ్ళు లేక గొంతు ఎండకపోయి మృతువాత పడింది. కల్లు దొరకాకపోవడం వల్ల రాష్ట్రంలో దాదాపు 25 మంది చనిపోయారు. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన సాదుల్ల కృష్ణయ్య మానసిక ఆందోళనతో కత్తితో కడుపులో పొడుచుకుని గాయపర్చుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ కు చెందిన వలస కూలి రాజు హైదరాబాద్ చింతల బస్తి పోలీస్ ఔట్ పోస్ట్ ఎదురుగా ఉన్న దుకాణం మెట్లపై కూర్చొని బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు.  ఉస్మానియా హాస్పిటల్లో  చికిత్స పొందుతున్నాడు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయి గూడెంకి చెందిన మర్రివాడ రాంబాబు చాకుతో గొంతు కోసుకున్నాడు.  ఖమ్మం జిల్లా హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు. మెదక్ జిల్లా చిన్నశంకరం పేటకు చెందిన నాగరాజు పఠాన్ చెర్వులోని భవనంపైకెక్కి రెండవ అంతస్తు నుంచి దూకి గాయలపాలయ్యాడు. పఠాన్ చెరువు ప్రభుత్వ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు.


రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుండి మద్యం దొరకాకపోవడంతో వందల సంఖ్యలో ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి చేరుతున్నారు. వచ్చిన వారిలో 60 శాతం మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యలకు పాల్పడకుండా కాపాడడం      కష్టమవుతోంది.   
  
కరోన కల్లోలం వలన ప్రత్యక్షంగానే కాకా పరోక్షంగా కూడా ప్రజలు బలవుతున్నారు.  పరోక్షంగా చనిపోయిన వాళ్లంతా కరోనాను ఈ దేశంలోకి తెచ్చిన వాళ్ళు కాదు. చేయనిపాపానికి బలయ్యారు. నిజానికి కరోన వైరస్ను మన దేశంలోకి  తెచ్చినవారు విమానాల్లో విదేశాలు తిరిగొచ్చిన సంపన్న వర్గాలవారే. లాక్ డౌన్ ప్రకటించడం వల్ల ఇళ్లకు పరిమితమైన సంపన్న వర్గాలు హాయిగా పిల్లా పాపలుతో కులసాగా సంతోషంగా కుదుటగా కాలం గడుపుతున్నారు. చక్కగా యోగాలు, వ్యాయామాలు చేసుకుంటున్నారు. ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు.  టీవీల ఎదురుగా కూర్చొని ఇష్టమైన సినిమాలు, చిరుతిళ్లు తినుకుంటు  ఆనందిస్తున్నారు. ఇంకొంతమంది రాజకీయ నాయకులు చదరంగం అడ్డుకుంటున్నారు. పేదలు మాత్రం రోడ్ల పాలయ్యారు. భారత దేశంలో రెండు లోకాలు. ఒకటి ఉన్నోళ్లది  ఇంకోటి పేద వాళ్ళది. రాష్ట్రంలో 1500 మంది కరోన బారిన పడ్డారని, వారిలో 15 మంది చనిపోయారని మరో 26 వేల మంది క్వారన్ టైన్ లో ఉన్నారని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. లాక్ డౌన్ మూలంగా కల్లు దొరకక రోజూ చనిపోతున్న పేద ప్రజల గురించి ఎందుకు పట్టనట్టుగా వ్యవహరిస్తోంది.  పేద ప్రజల ప్రాణాలు విలువలేనివా. 

తమ దేశం నుండి కరోన వైరస్ను విజయవంతంగా  తరిమికొట్టిన చైనా ఇలాంటి సున్నిత సమస్యలను పరిష్కరించి తమ పౌరులను కాపాడుకుంది. చైనా చొరవను ఆదర్శంగా తీసుకోవాలి. సొంతూర్లకు కాలినడకన బయల్దేరిన వాళ్ళను మార్గ మధ్యలో నిలువరించి క్వారన్ టైన్ లలో బంధించడం అమానుషం. .

ఇప్పటికైనా ఒక భయంకర వ్యాధి పై పోరాటం చేసేటప్పుడు ప్రజలను ఇళ్లలో కట్టిపడేస్తే.  సరిపోదు.  తీవ్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొనే జీవన సంఘర్షణల్లోకి మానవీయ మనసుతో తొంగిచూ డాలి. ఆ సమస్యలను పరిష్కరించనపుడే సాఫల్యత,  సంపూర్ణత ఉంటుంది.

Comments