
కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో, జీనోఫోబియా (విదేశీయులంటే భయం) ప్రపంచంలోని 205 దేశాలకు విస్తరించింది. అనేక దేశాలలో, ఇది వైరస్ వలె అడవి మంటలా వ్యాపించింది. ఆందోళన, భయం, ఆగ్రహంతో పాటు జెనోఫోబియాతో కలిసి వెళ్ళే అన్ని రకాల వివక్షలు చాలా దేశాలలో వాప్తి అయ్యాయి. ఆసియా ఖండంలోని చాలా మంది , ముఖ్యంగా భారతీయిలు, వివిధ రకాలైన జాతి వివక్షకు గురయ్యారు. అయినప్పటికి కొంతమంది ధైర్యవంతులు సృజనాత్మక మార్గాల్లో స్పందించారు. భారతీయులుగా ఉండటం అంటే వైరస్ క్యారియర్‌గా ఉండటం కాదని లాక్ దడోన్‌లో ఉన్నారు. కొంతమంది ధోరణికి భిన్నంగా వీరు ఉండటం వలన వ్యాప్తి తగ్గింది. విదేశీయులను గౌరవిస్తూనే, వారిని క్వారన్‌టైన్‌లకు తరలించడం సత్ఫలితాలను ఇచ్చింది.
సార్స్, కోవిడ్-2, కోవిడ్-19 వైరస్ వలన కలిగే వ్యాధిని గుర్తించి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యుహెచ్‌ఓ) పెరు పెట్టింది. డబ్యుహెచ్‌ఓ శీఘ్ర జోక్యం జాత్యహంకార వివక్షను తగ్గించింది. చైనా దేశం నుండి ఈ వ్యాప్తి ప్రపంచమంతా పాకింది.
దీనివల్ల చైనీయులంటే వ్యతిరేక భావం ప్రపంచ ప్రజల్లో ఎక్కువైంది. మరోవైపు చైనా, అమెరికాలు ఒకరినొకరు దూషించుకుంటున్నాయి. అమెరికా డబ్యుహెచ్‌ఓ వైఖరి చైనాకు మద్దతుగా వుందని, ఆ సంస్థకు అందాల్సిన నిధులను కూడా ఆపేసింది. రెండు సామాఖజ్యదేశాలు ప్రపంచ మార్కెట్‌పై పట్టుకు కరోనా నేపధ్యంలోను గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే కరోనా పెట్టుబదిదారుల సంపదను తల్లకిందుల చేసోంది. కరోనా మరో మహి ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించబోతోంది.
భారత్ లాంటి ఆర్ధికంగా వెనుకబడిన దేశాల్లో ఒక మతం వారి వల్లే వ్యాధి ప్రబలిందనె పుకార్లు వచ్చాయి. దినివెనుక ఉగ్రవాద కోణం దాగుందని వాదనలు వచ్చాయి. అయినా భారత్ ప్రజలు సంయమనంతో వ్యవహరించారు. ఆర్టికల్ 370, సిఎఎ, ఎన్‌ఆర్‌సి లాంటి చట్టాల వల్ల జరిగే విధ్వంసాన్ని మైనారిటీ వర్గాలు, ప్రజస్వామిక వాదులు సంయమనంతో వ్యవహరించి ఆపగలిగాయి. అలాగే కరోనా వల్ల మత విద్వేషాలు చెలరేగకుండా సెక్యులర్ శక్తులు, అన్ని మతాల్లోని ప్రజల సంయమనం ఆపగలిగాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో అత్యంత సంయమనంతో వ్యవహరించాయి.
కరోనా వైరస్లు మానవులకు కొత్త కాదు. యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 229ఇ, ఎన్‌ఎల్-63, ఓసి-48, హెచ్‌కెయు-1 వంటి కరోనావైరస్‌ల బారిన ఇదివరకే పడ్డారు. మరోవైపు, జంతువుల ద్వారా మానవులకు వ్యాపించే కరోనా వైరస్లు చాలా ఉన్నాయి. ఇవి ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తాయి. నాధారణ జలుబు నుండి మిడిల్ ఈస్ట్ రెస్పిరెటరీ సిండ్రోమ్, తీవ్రమైన అక్యూట్ రెస్పిరెటరీ సిండ్రోమ్ వంటి తీవ్రమైన వ్యాధువు ఈ వైరస్‌ల వల్ల వస్తాయి. మానవులలో శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యై కరోనావైరస్ల వ్యాప్తి కూడా కొత్తది కాదు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అవసరమైన ఉమ్మడి ప్రయత్నాలను అన్ని దేశాలు చేశాయి. వైరస్ వ్యాప్తిని అణగదొక్కగల అన్ని అవకాశాలను చాలా దేశాలు వినియోగించుకుంటున్నాయి.
గతంలో కూడా జాతిపరమైన వివక్షను, ఒక దేశానికి కళంకాలను తెచ్చేవిధంగా కాకుండా కరోనావైరస్ వలన కలిగే వ్యాధులకు పేరు పెట్టకుండా డబ్యుహెచ్ ఓ బాధ్యతాయుతంగా వ్యవహరించింది. అంటే చైనాలో పుట్టడం వల్ల దానికి చైనా వైరస్ అని పేరు పెట్టలేదు. గతంలో ఫ్లూకి స్పానిష్ ఫ్లూ అని పెరు పెట్టారు. జాత్యహంకారానికి ఆజ్యం పోయడం మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి ఆటంకం కలిగించడమే అవుతుంది. వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజా శత్రువుగా గుర్తించినప్పటి నుండి కొంతమేరకు జాతివివక్ష తగ్గింది.
ఈ క్లిష్టమైన దశలో జాత్యహంకారం జ్వాలలను మండించేవారు మానవాళిని అనాగరిక సమాజం వైపు తీసుకువెళతారు. వైరస్లు వివక్షత లేనివి, సరిహద్దులను గౌరవించవు. ఏ సమాజానికి, మతానికి, కులానికి, ప్రాంతానికి, వర్గాలకు విధేయులుగా ఉండవు. నోవెల్ కరోనావైరస్ పక్షపాతరహితంగా ఉందని స్పష్టంగా ప్రజలకు అర్ధమైంది. కోవిద్-19ని ఎదుర్కోవడంలో కొంతమంది, ముఖ్యంగా పాశ్చాత్య రాజకీయ నాయకుల వివక్షత వైఖరిని తీసుకున్నారు. ఇది వైరస్ వ్యతిరేక పోరాటంపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ప్రారంభ దశలో, చాలామంది వైరసును చైనా సమస్యగా చూశారు. చైనానే దీనిని ఎదుర్కోవలసి వస్తుందని కినుకు వహించారు. వైరసును ఒక సాధారణ మానవ శత్రువుగా చూడలేదు. తద్వారా దేశాధినేతలు విలువైన సమయాన్ని వృథా చేశారు.
వైరసుకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో సంఘీభావం తగ్గించడానికి ఇది ఉపయోగపడింది. అలాగే, వ్యాప్తి ప్రారంభ దశలో, జాత్యహంకారం, తప్పుడు ఆరోపణలు, నకిలీ వార్తలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రోత్సహించడంలో మీడియా మంచి పాత్రను పోషిస్తుందని భావించారు. చాలా మీడియా సంస్థలు తమ నాయిని దిగజార్భుకున్నాయి. పర్యవసానంగా, చాలా దేశాలు ముందస్తు చర్యలు తీసుకోలెదు. అది ప్రపంచ ప్రజల ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ అంశాన్ని మీడియా సంస్థలు నిదానంగా గుర్తించాయి. గ్లోబల్ మెయిన్ ఫ్రేమ్ మీడియా సంస్థలు క్రమంగా సవాలును స్వీకరించాయి. వ్యాధి వ్యాప్తిని ఎలా నివారించవచ్చనే దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో సహకారం అందించాయి. ఇప్పుడు మీడియా ప్రశంసనీయమైన పాత్రను పోషిస్తోంది.
జాత్యహంకారం, ఒక జాతిపై కళంకానికి వ్యతిరేకంగా వ్రాధన్యత నివ్వడం తగ్గింది. మహమ్మారికి వ్యతిరెకంగా ప్రపంచ పోరాటాన్ని పెంచడానికి మీడియా సైతం చర్యలు తీసుకుంది. అందువల్ల, అన్ని దేశాధినేతలు, ముఖ్యంగా అంతర్జాతీయ, జాతీయ నాయకులు, వారి చర్యలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, వైరస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రపంచ పోరాటానికి వాని కలగకుండా చూసుకోవాలి. దేశాలు పరస్పరం సహాయం చేసుకోవడం వలన వైరస్సుకు వ్యతిరేకంగా జరుగుతున్న పపంచ పోరాటం చాలా దేశాలలో మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ పురోగతిని కోల్పోకుండా చూసుకోవాలి. రాజకీయ నాయకులు, వ్యక్తులు, సంస్థలు, మీడియా సంస్థలు, మేధావులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు జాత్యహంకార, వివక్షత లేని వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి. కోవిడ్-19 వైరస్‌ను తరిమికొట్టడంలో ప్రపంచ మానవాళి విజయం సాధిస్తుంది. అతి త్వరలోనే దీనికి వ్యాక్సిన్ కనుగొనబడుతుంది. అప్పటి వరకు ప్రజల సంయమనంతో, కలిసిమెలిసి తరతమ బేధాలను మర్చి భౌతికదూరాన్ని పాటిస్తూ, మానసిక దూరాన్ని తగ్గించుకోవాలి. అప్పుడే ఇటువంటి
విపత్తులను ధైర్యంగా ఎదుర్మోగలం.
- ఎం.కె.కుమార్
Very nice article
ReplyDelete