నిజామాబాదు జిల్లా 15వ మహాసభలు





నిజామాబాద్ జిల్లా 15వ మహాసభల రిపోర్ట్.పౌర హక్కుల సంఘం ఉమ్మడి నిజామాబాదు జిల్లా మహాసభలు తేదీ 14/03/2020 నాడు నిజామాబాదు నగరంలోని ప్రెస్ క్లబ్ యందు జరిగింది సియల్సి రాష్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ మహాసభలను ప్రారంభిస్తూ ప్రసంగించారు అతను మాట్లాడుతూ యన్ ఆర్ సి యన్ పి ఆర్ సి సి ఏ లకు వ్యతిరేకంగా ఢిల్లీలో విధ్యార్ధులు ప్రజలు చేస్తున్న పోరాటాలను అణచడానికి కేంద్ర ప్రభుత్వం వారి సంఘ్ పరివార్ శక్తులతో పద్ధతి ప్రకారంగా అల్లర్లు సృష్టించి ప్రజల్లో మత విధ్వంసాలు చేసినారని అన్నారు మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు పౌర సత్వ చట్టాన్ని వివాదాలు కలిగించారని అన్నారు బిజెపి ఆధికారంలోనికి రావడానికి చేసిన వాగ్ధానాలు అమలు చేయడంలో వైపల్యాలనుండి ప్రజలను ప్రక్కదోవ పట్టించడానికే మత ఘర్షణలు అని అన్నారు యన్ నారాయణరావు సియాల్సి రాష్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రజల మౌలిక సమస్యలు విద్య వైద్యం ఇతర రంగాలలో యాప్ డి ఐ లను కేంద్ర ప్రభుతం ఆహ్వానించిందని అన్నారు సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ అధ్యక్షులు లతీఫ్ మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ ప్రజల మధ్య మతం చిచ్చు పెడుతూ పీడిత వర్గాల ప్రజలను విభజించేందుకు పౌర సత్వ చట్టంను ప్రభుత్వం సవరించింది అని అన్నారు మనుస్మృతిని అమలు చేయడానికే భారత రాజ్యాంగంలో కలిపించిన హక్కులను ప్రభుత్వం నిరాకరిస్తున్నారని అన్నారు అందుకే ప్రశ్నించే గొంతులను అణచి వేస్తున్నారని పేర్కొన్నారు ఈసభలో వి సంగం అల్గోట్ రవీందర్ ప్రసంగిచారు సభకు జిల్లా అధ్యక్షులు మువ్వా నాగేశ్వర్రావు అధ్యక్షత వహించారు సభకు 100 మంది హాజరైనారు ప్రతినిధుల సభలో కార్యదర్శి నివేదికను జిల్లా ప్రధాన కార్యదర్శి అల్గోట్ రవీందర్ ప్రవేశపెట్టగా సభ్యులు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు అనంతరం నూతన కా�

Comments